చిత్రం : కుబుసం , గానం : వందేమాతరం శ్రీనివాస్
*** *** *** మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి. *** *** *** 
Reactions:

Post a Comment

 1. ఇది once-in-a-lifetime స్థాయి సాహిత్యం. చక్కని పల్లె పదాలతో లోతయిన విశ్లేషణ చేయడం ఒక మహోన్నత ప్రయోగం. గోరేటి వెంకన్న నిజంగా ధన్యుడు.

  మచ్చుకు ఒక చరణం తీసుకుందాం:

  "తొలకరి జల్లుకు తడిసిన నెల మట్టి పరిమళాలేమైపాయెర
  వానపాములు నత్తగుల్లలు భూమిలొ ఎందుకు బతుకతలేవు?
  ఆ పత్తి మందులా కత్తర వాసనరా నా పంట పొలాలల
  ఆ మిత్తికి తెచ్చిన అప్పే కత్తాయె నా రైతు కుత్తుకెపై"

  నత్తగుల్లలకు రైతు ఆత్మహత్యలకు సంబంధం ఏమిటని ఆలోచిస్తే ఘంటల కొద్దీ చర్చించగలము. Seed licensing, genetic engineering, IPR, traditional Indian agriculture, agrarian distress, Bretton Woods, trickle down economics etc.

  ఇది "పదండి ముందుకు పడండి తోసుకు" తరహా ideological rhetoric కాదు, "కల వరించి కలవరించి" లాంటి linguistic gymnastics కూడా కాదు. భాష & భావం సమతుల్యతతో ఉండడమే ఒక ప్రత్యేకత.

  Hats off to the poet!

  ReplyDelete
  Replies
  1. జై గారు చెప్పడం మరచాను, సారీ.మీ కమెంటుకు వందనాలు.

   Delete
 2. < నత్తగుల్లలకు రైతు ఆత్మహత్యలకు సంబంధం ఏమిటని ఆలోచిస్తే ఘంటల కొద్దీ చర్చించగలము. >
  చర్చించగలము. ఎందరు? చాలా కొద్దిమంది మాత్రమే ఆ దిశగా ఆలోచిస్తున్నరు.
  ఇప్పటి యూత్ ఆలోచనలు కానీ, పిల్లల పెంపకం కానీ ఆ దిశగా సాగడం లేదు.
  ప్రక్రుతి సహజ వనరుల పవర్ ని కంపెనీలు తమ లాభాలకోసం ఎలా నాశనం చేస్తున్నదీ, దానిలో భాగంగా సంస్క్రతీ, సాంప్రదాయాలు, మానవసంబంధాలు, విలువలు పతనం ఎలా సాగుతోందీ మంచి పదాలతో గోరటి వెంకన్న అద్భుతంగా వివరించారు. ఛిత్రీకరణ కూడా ఫర్వాలేదు.

  పదండి ముందుకు ..... అవసరమైనపుడు ఆవేశాన్ని రగిలించడడానికి, కలవరించి సాహితీశోభను ఆస్వాదించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అవి అనవసరం అనలేము. కానీ ఈ పాట ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది. అలా ఆలోచింపజేయగలిగిన రచయితకు వందనాలు. పల్లె పదాలతో సూటిగా క్లిష్టమైన సమస్యలను అవగతమయ్యేలా , ఆలోచించేలా పాట సాగింది.

  ReplyDelete
  Replies
  1. రసాయనాలు వాడకపోతే పని అవ్వదు. ఒకసారి నా పొలంలో యూరియా కలిసిన నీరులో ఈది బురద పాము చచ్చింది. అలాగని యూరియాని నిషేధించలేము కదా.

   Delete
  2. - రసాయనాలు వాడకపోతే పని అవ్వదు. ఒకసారి నా పొలంలో యూరియా కలిసిన నీరులో ఈది బురద పాము చచ్చింది. అలాగని యూరియాని నిషేధించలేము కదా -

   ఎందుకో! ప్రక్రుతిని, పర్యావరణాన్ని నాశనం చేసేదానిని ఏదైనా నిషేధించి తీరాల్సిందే.

   Delete
  3. యూరియా, పొటాష్, అమోనియం ఫాస్ఫేట్‌లు వాడితే ఎకరానికి నలభై బస్తాలు ధాన్యం వాడితే ఎకరానికి 40 బస్తాలు వస్తాయి. అవి వాడకపోతే 15 బస్తాలు కూడా రావు. జనాభా పెరిగి భూమి పెరగకపోతే వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ఎరువులు వాడకపోతే ఏమి చేస్తాం?

   Delete
  4. అవి తినే కదా కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటున్నం. వైద్యుల సంఖ్యా, ఆసుపత్రుల సంఖ్యా పెరుగుతున్న కొద్దీ రోగాలు, రోగుల సంఖ్యా పెరుగుతోందీ అందుకే కదా? ఇది అభివ్రుద్ధి కాదు. అరాచకం.

   Delete
  5. సాంప్రదాయం ప్రత్యామ్నయం గుర్తించాలి తప్ప, కంపెనీల కుట్రకు బలి కాకూడదు. సైన్సు అంటే అభివ్రుద్ధిని కాంక్షించేది కావాలి కానీ, అరాచకాన్ని పెంచేది పెట్టుబడిదారులకు మాత్రమే లాభాలు తెచ్చిపెట్టి సామాన్యులను క్రుంగదీసేదిగా ఉండకూడదు.

   Delete
  6. ప్రక్రుతి సహజ వనరులతోనే ప్రక్రుతిలో జీవుల జవనం గడిచే స్థితి ఉన్నంత వరకూ సరుకుల అవసరం రాదు. నిజంగా అలా లేనపుడు అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త వస్తువుల స్రుష్టిని ఆహ్వానించేందుకు మాత్రమే సైన్సు అవసరపడాలి.

   Delete
  7. యూరియా కలిసిన నీటిలో ఈది పాము చచ్చిందని చెప్పాను కానీ యూరియాతో పండించిన ఆహారం తింటే రోగాలు వస్తాయనలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ధాన్యం రైతులందరూ యూరియా, అమ్మ్మోనియం ఫాస్ఫేట్ తప్పకుండా వాడుతారు. మరి ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నం తినేవాళ్ళకి రోగాలు వచ్చినట్టు వార్తలు లేవే. ఏస్టరాయిడ్ గుద్దుతుందనే భయంతో రోడ్ మీద హెల్మెట్ పెట్టుకుని నడవడం ఎలాంటిదో, రోగాలు వస్తాయనే భయంతో రసాయన ఎరువులు వాడకం మానెయ్యడం అలాంటిది.

   Delete
 3. Jai Garu. Gorati venkanna is a natural poet with genuine rustic expression. Still I feel there is an overdose of self pity in Telangana movement songs. How long can you accuse and blame others.

  ReplyDelete
  Replies
  1. Just for info. This is not a Telangana movement song.

   Delete
  2. ఆ సినిమాలో వామపక్ష తీవ్రవాదులు సర్పంచ్‌ని చంపడానికి వచ్చిన సందర్భంలో ఆ పాట ఉంటుంది. ఆ సినిమా తెలంగాణా ఉద్యమం గురించి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో పని చెయ్యని ప్రభుత్వం, పార్టీలోని వీక్ ఎలిమెంట్స్ సహాయంతో పార్టీ నాయకులని పట్టుకోవడానికి పోలీసులు వేసే ఎత్తులు ఆ సినిమాలోని ప్రధాన కథాంశాలు.

   ఆ సినిమాలో నేను గుర్తించిన ఒక లోపం ఏమిటంటే దాని రచయిత ప్రజల్లోని చైతన్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చెయ్యడం. "మీరు ఇచ్చే రూపాయి బియ్యం తినడానికి ప్రజలు ఏమైనా బిచ్చగాళ్ళా?" అని శివరాం (శ్రీహరి) పోలీస్ ఆఫీసర్‌ని అడుగుతాడు. రూపాయి బియ్యం కోసం ప్రభుత్వాన్ని సమర్థించేవాళ్ళు నిజజీవితంలో ఉన్నారు. అలాంటివాళ్ళని కళ్ళతో చూసాను.

   Delete
  3. పాట సినిమా కోసం రాసింది కాదు. అప్పటికే జనబాహుళ్యంలో పాపులర్ అయిఉన్న పాటను సినిమాలో (కాస్త కుదించి) వాడారు.

   "ఏమున్నదక్కో" నుండి "ఆ గట్టునుంటావా" వరకు ఎన్నెన్నో పాటలు కూడా ఇదే కోవకు చెందినవి.

   Delete
 4. @buchiki

  If there is emptiness these expressions will come out. Ignore them

  ReplyDelete
 5. నేను ఆ సినిమాని యూట్యూబ్‌లో చూసాను. ఆ సినిమా మా జిల్లాలో విడుదల అవ్వలేదు. పోలీసులు పార్టీలోని వీక్ ఎలిమెంట్స్‌ని ఇన్‌ఫార్మర్‌లుగా ఎలా వాడుకుంటారో చూపించడం వల్ల ఆ సినిమాని విడుదల చెయ్యడానికి చాలా మంది థియేటర్ యజమానులు ఒప్పుకోలేదు. ఆ సినిమాలో ఒక డాక్టర్ కార్పొరేట్ హాస్పిటల్‌లో ఆఫర్‌ని వదులుకుని పల్లెటూరిలోని పి.హెచ్.సి.లో పని చెయ్యడానికి వెళ్తాడు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ డ్యూటీకి హాజరు అవ్వరు. వాళ్ళు రాజకీయ నాయకులతోనూ, ప్రెస్ రిపోర్టర్‌లతోనూ సంబంధాలు పెట్టుకుని తమ వ్యవహారం బయటపడకుండా చూసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే. ఒరిస్సాలో నేను ఉండే ప్రాంతంలోని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ వారానికి ఒక సారి మాత్రమే ఆఫీస్‌కి వస్తాడు. అమీన్ & సూపర్‌వైజర్ అయితే నెలకి ఒక సారి కనిపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ మీద ఎవరూ కంప్లెయింట్‌లు ఇవ్వాలనుకోవడం లేదు. అందరూ తమకి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలనుకుంటున్నారు.

  ReplyDelete
 6. ఆ సినిమా తీసిన టైమ్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌లో డాక్టర్ జీతం నలభై వేలు, ప్రభుత్వ డాక్టర్ జీతం ఇరవై వేలు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బాగా పెరిగాయి. కుబుసం సినిమా తీసిన రోజుల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు పల్లెటూర్లలో పని చెయ్యడానికి ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ పల్లెటూరిలో ఉండడానికి ఇష్టపడరు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top