NTR - YSR - CBN - KCR లలో ఎవరు బెస్ట్ ?
వీరిలోని పోలికలు, మంచి-చెడులపై మీ అభిప్రాయం చెప్పండి?
ఈ నలుగురిలో ఎవరిని మంచినాయకుడిగా ఎంపిక చేస్తారు? ఎందుకు?
- పల్లా కొండలరావు
--------------------------------------------------------

ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

 1. మంచితనంలో ఎన్ టీ ఆర్ బెస్ట్
  మూర్ఖుల్లో కేసీఆర్ బెస్ట్ !

  ReplyDelete
  Replies
  1. కె.సి.ఆర్ ని మూర్ఖుడు అనుకుంటే పప్పులో కాలేసిట్లే నీహారిక గారు.

   Delete
  2. మూర్ఖుడు కాకపోతే తెలివితక్కువవాడు అనుకుందాం. ఎవరూ గొడవ చెయ్యకపోయి ఉంటే సచివాలయానికి నిజంగానే వాస్తు మార్పులు చేసి ఉండేవాడు.

   Delete
  3. వాస్థు ని వదిలేసారనుకుంటున్నారా ? లోక్ సభ ఎన్నికలు అయిపోయాక మొదట అడిగేది బైసన్ గురించే !

   Delete
  4. < మూర్ఖుడు కాకపోతే తెలివితక్కువవాడు అనుకుందాం. >
   Good Joke.

   Delete
  5. నే జెప్పిన... వాస్తునొదుల్తనని.... బరాబర్ వాస్తు ప్రకారమే నడుస్తది.

   Delete
 2. >>>ఈ నలుగురిలో ఎవరిని మంచినాయకుడిగా ఎంపిక చేస్తారు? ఎందుకు?>>>

  మనది ప్రజాస్వామ్యమయితే చంద్రబాబుగారు మంచి నాయకుడు.నియంతృత్వమయితే కేసీఆర్ మంచి నాయకుడు.
  చంద్రబాబుగారు పరుషంగా లేబర్ లాంగ్వేజ్ వాడలేరు. తను అనుకున్న పనికోసం కేసీఆర్ ఎంతకైనా దిగజారతారు. ఒక నియంత లక్షణం తిట్టడమే !ఎంతబాగా తిడితే అంత మంచి నాయకుడవుతారు.

  ReplyDelete
 3. < లేబర్ లాంగ్వేజ్ >
  Is it good?

  ReplyDelete
  Replies
  1. లేబర్ లాంగ్వేజ్ అంటే మనకి ఎవరిమీదయినా కోపం ఉంటే వాళ్ళనే డైరెక్ట్ గా తిట్టకుండా మీ అమ్మ ల..., మీ నానమ్మ ల....వగైరా తిట్ట్లు తిడతారే వాళ్ళందరూ పుట్టుకతో సంబంధం లేకుండా లేబరే...సహవాస దోషం కనుక లేబర్ లాంగ్వేజ్ అందరం వాడేస్తుంటాం.

   కేసీఆర్ కి కోపం ఉంటే చంద్రబాబు గారిని తిట్టాలి,తనకి ద్రోహం చేసినవాళ్ళని తిట్టాలి మొత్తం ఆంధ్రావాళ్ళని తిట్టేసాడు...మూర్ఖుడు కాక మరేవిటీ ? చండాలుడా ?

   Delete
  2. ఆంధ్రావాళ్ళని మొత్తం తిట్టడం అధికారదాహం కోసం, ఉద్యమ సమయంలో అయితే కాసులు రాలడం కోసం కక్కుర్తి కోసం తిట్టి ఉంటాడు. కె.సి.ఆర్ కున్నన్ని చావు తెలివితేటలు ఏ నాయకుడికీ ఉండవని నా అంచనా.

   Delete
  3. కే.సీ.యార్ కోపం వస్తే తిట్టడు. లాభం ఉంటే తిడతడు.

   Delete
 4. మంచితనం అంటే రాజకీయాల్లో మంచితనమా?

  ఎన్.టి.ఆర్. 300 పైగా చిత్రాల్లో నటించాడు.
  ఎం.జి.ఆర్ 136 సినిమాల్లో మాత్రమే నటించాడు.
  ఎం.జి.ఆర్. సినిమాల్లో సిగరెట్లు, మద్యం, సెక్స్ సన్నివేశాలు లేవు.

  ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సినిమాల్లో నటించడం పరువు తక్కువ అనుకుని ఎన్.టి.ఆర్. సినిమాల్లో నటించడం మానేసాడు.
  ఎం.జి.ఆర్. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో పని చేసాడు.

  ReplyDelete
  Replies
  1. < ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సినిమాల్లో నటించడం పరువు తక్కువ అనుకుని ఎన్.టి.ఆర్. సినిమాల్లో నటించడం మానేసాడు. >
   NTR ముఖ్యమంత్రి అయ్యాక కూడా నటించాడు. సమ్రాట్ అశోక లో ఎబ్బెట్టుగా కూడా నటించాడు.
   మంచితనం అంటే వ్యక్తిగత విషయాలలో కాదు. ప్రజలకు మేలు చేసే లేదా ప్రభావితం చేసే అంశాలలో అని నా ఉద్దేశం ప్రవీణ్ గారు.

   Delete

  2. వీటన్నింటి కంటే బుద్ధి అనేది చాలా డేంజరస్. మానవస్వభావంలో బుద్ధి ఏర్పాటు అనేది కీలక అంశం. బహుశా మార్క్సిజం సక్సెస్ కాకపోవడానికి లేదా అంతరాయానికి , అంతరంగిక పోరాటంలో చేర్చాల్సిన కీలక అంశమిదని నా అభిప్రాయం.

   Delete
  3. >>>మంచితనం అంటే వ్యక్తిగత విషయాలలో కాదు. ప్రజలకు మేలు చేసే లేదా ప్రభావితం చేసే అంశాలలో అని నా ఉద్దేశం ప్రవీణ్ గారు.>>>
   రాజకీయాలలో మంచితనం అవసరం లేదా కొండలరావు గారు ?
   మంచితనం అనేది లేకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది ?
   వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం వేరు వేరుగా ఉండాలా ?

   Delete
  4. వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం వేరు వేరుగా ఉండాలా ?

   వ్యక్తిగత జీవితంలో పొరపాట్లు ఉన్నా, తప్పులున్నా రాజకీయజీవితంలో ఉండకూడదు. వ్యక్తిగతంగా కూడా ఉత్తమంగా ఉంటే మరీ మంచిది. అలా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.

   Delete
 5. All of them were destined to play a role. They did it. The leader who accepts that his date of expiry has come and quits gracefully can be called great. Or else he will be dumped unceremoniously into the history's Tussaud museum.

  ReplyDelete
  Replies
  1. 100% correct.

   (జనం దురదృష్టం కొద్ది) నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పీ, జనార్ధన రెడ్డి & గాలి ముద్దుకృష్ణమ నాయుడు లాంటి నిఖార్సయిన నాయకులకు సరైన అవకాశాలు రాలేదు.

   Delete
  2. పీ, జనార్ధన రెడ్డి కి పి.సి.పి ప్రెసిడెంట్ గానో.... ప్రతిపక్ష నాయకుడిగానో చేశారు. అధికార పదవిలో లేరు. మంచి నాయకుడు అతను.

   Delete
 6. ఎన్టీఆర్ - జనాకర్షక నేత. కులరాజకీయాలకు తండ్రి. పరిపాలన తెలియదు. అల్లుళ్ళ రాజ్యం అది.
  చంద్రన్న - పరమ చెత్త రాజకీయ వేత్త. పరమ అవినీతి పరుడు, కుల గజ్జి పరుడు.
  రాజశేఖర్ - మహా నాయకుడు, అవినీతి పరుడు. ఆశ్రీత పక్ష పాతి.
  కేసీర్ - మాటకారి, ముఖ్య మైన విలువలు ఎప్పుడు దిగ జారలేదు (never compromised on తెలంగాణ ). పై వాళ్ళ బాల హీనతలు ఇతనికి లేవు.

  p.s: నేను ఆంధ్రా వాడిని

  ReplyDelete
  Replies
  1. కె.సి.ఆర్ కుటుంబరాజకీయాలకు దూరమా?! రాపాల గారు. ప్రాంతీయ తత్త్వం రెచ్చగొట్టడానికి మీ ప్రాంతం ప్రజలను సైతం బూతులు తిట్టడం విలువలను దిగజారకుండడమా? ఎం.ఎల్.ఏ లను కొనుగోలు చేయడం లేదా? మాటలు మార్చడం లేదా? ప్రజలను ఏమార్చడం లేదా? ఉద్యమకారులకు ద్రోహం చేయడం లేదా? పాలనలో అవినీతికి కొదువా? అభిప్రాయం చెప్పడానికి ఆంధ్ర-తెలంగాణ నో, ఆంధ్రలో జగన్ వర్గమనో .... ఇంకోటనో చెప్పుకోనవసరం లేదు రాపాల గారు.

   Delete
  2. వీళ్ళ నలుగురిలో పాజిటివ్ అంశాలును తీసుకోవాల్సిందే. ఓవరాల్ గా నేను వై.ఎస్.ఆర్ కు ఎక్కువ మార్కులు వేస్తాను.

   Delete
  3. నేను ఆంధ్రా వాడిని అయినా కెసిఆర్ ని మెచ్చుఁకుంటా అని చెప్పాను. :)
   అవినీతి 0 అని కాదు, పై వాళ్ళ కన్నా చాల తక్కువ.

   నేను కూడా వైస్సార్ కి చాల మంచి మార్కులు వేస్తాను. కెసిఆర్ కి ఇంకా రెండు ఎక్కువ మార్కులు వేశా :)

   Delete
  4. ఆంధ్రావాళ్ళు అయితే ఇతరులను మెచ్చుకోరా? మెచ్చుకోకూడదా?

   Delete
  5. నేను ఆంధ్రాకి చెందినదాన్నే, అందరిలోకి వై ఎస్ ఆర్ అధ్వానం, ఉచిత స్కీములు మొదలుపెట్టిందే ఆయన...కాంగ్రెస్ పార్టీ వద్దన్నా వినకుండా ఇచ్చారు. మనం ఎవరికైనా ఉచితంగా ఇవ్వాలి అంటే పొదుపు చేయాలి లేదా దోచుకురావాలి. రెండోదే చేసాడు.

   Delete
 7. నేను ఆంధ్రాకి చెందినదాన్నే ....
  అయితే.....?

  ReplyDelete
  Replies
  1. బ్లాగుల్లో..తెలంగాణా వాడిని నేను.. బలిజను నేను...ఆంధ్రా వాడిని నేను అని చెప్పుకుంటుంటే నేనూ చెప్పాలేమో అనీ చెప్పాను.

   Delete
 8. పోయినోళ్లు మంచోళ్ళు. ఉన్నోళ్లు పోయేదాకా చెడ్డోళ్లు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top