ఇందులో psychiatry (మానసిక వైద్యం)పై వ్రాసిన విమర్శలు చదివాను. నాకు తెలిసినంత వరకు ఏ MBBS వైద్యుడైనా ఒక మందు ఎలా పని చేస్తుందో తెలిస్తేనే ఆ మందు వ్రాస్తాడు. మానసిక వైద్యుడైనా సరే ఒక మందు ఎలా పని చేస్తుందో తెలియకుండా అది వ్రాయడు. మానసిక వైద్యంలో alzheimers, parkinsons లాంటి identifiable brain diseasesకి మాత్రమే మందులు ఉంటాయి. ప్రవర్తన సమస్యలకి మందులు ఉండవు. 

నేను హార్ద్‌వేర్ సర్వీస్‌మేన్‌ని. ఒక కంప్యూతర్ పాడైతే అందులో ఏదో ఒక విడి భాగం మార్చడం తప్ప అందులో బాగు చెయ్యడానికి ఏదీ ఉండదు. అలాగే కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్నవాళ్ళకి తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చే antidepression agents, stimulants, tranquilizers, mood stabilisers లాంటివి ఇస్తారు తప్ప ప్రవర్తనని మార్చడం అనేది psychiatryలో ఉండదు. 

ఈ విషయం మానసిక వైద్యులందరికీ తెలిసినదే. కానీ వాళ్ళు ఇచ్చే మందులు ఎంత వరకు పని చేస్తాయనే దాని మీద వివాదం నడుస్తోంది. Psychiatric drugs వల్ల side effects కూడా ఉన్నాయి అనేది విమర్శకుల వాదన. నాకు తెలిసినంత వరకు side effect లేని మందు అనేది ఉండదు. మందులు కేవలం రసాయనాలతో తయారు చేసేవి. ప్రకృతి నుంచి పుట్టిన ఆయుర్వేదంలో కూడా మొక్కలలో ఉండే రసాయనాలే మందులుగా పని చేస్తాయి. కనుక ఆయుర్వేదంలో కూడా side effects ఉంటాయి. మందు ఆన్న తరువాత side effect లేకుండా ఉండదు.

ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమిటంటే alzheimers, parkinsons లాంటి identifiable brain diseases తప్ప మిగితా మానసిక వ్యాధులు నిజమైన వ్యాధులు కావు. వాటి చికిత్స కోసం side effect రిస్క్ తీసుకుని మందులు ఇవ్వడం అవసరమా?
Praveen kumar
-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top