విజయవాడ బుక్ ఫెయిర్‌లో స్కైబాబాని కొట్టినవాళ్ళలో ఒక అభ్యుదయ రచయిత కూడా ఉన్నాడు. స్కైబాబా ఒక ముస్లిం కానీ ఆయన ఎస్.సి. వర్గీకరణని సపోర్ట్ చేస్తుంటాడు. ఆయన్ని కొట్టిన అభ్యుదయ రచయిత ఎస్.సి. వర్గీకరణని వ్యతిరేకించే కులానికి చెందినవాడు. ఆ విషయం స్కైబాబా గారే ఫేస్‌బుక్‌లో వ్రాసారు. తెలంగాణా ఉద్యమ సమయంలో స్కైబాబా ఆంధ్రావాళ్ళ అమ్మలక్కలని బూతులు తిడుతూ కవితలు వ్రాసిన మాట వాస్తవమే. వీళ్ళు కూడా స్కైబాబాని అమ్మ పేరుతోనూ, అక్క పేరుతోనూ బూతులు తిడుతూ కొట్టారు. వీళ్ళకి కూడా స్త్రీల మీద గౌరవం లేదు. ఇలాంటివాళ్ళతో ఒక అభ్యుదయ రచయిత ఎలా కలిసాడు?  

రిజర్వేషన్ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాల్లో & మెడికల్ కాలేజ్ సీట్లలో మాత్రమే. ఈ అభ్యుదయవాదులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగాలకి పంపాలనుకుంటున్నారు లేదా ఎన్.ఆర్.ఐ. డాక్టర్లని చెయ్యాలనుకుంటున్నారు. తమ పిల్లల్ని పరిశ్రమల్లోకి లేదా వ్యవసాయంలోకి పంపడం వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు & మెడికల్ కాలేజ్ సీట్ల మీద క్రేజ్ ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నంత వరకు కులం పేరుతో కొట్టుకునేవాళ్ళు ఉంటారు. మన దేశంలో 2000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసమో, మెడికల్ కాలేజ్ సీట్ల కోసమో మరో 2000 సంవత్సరాలు కులం పేరుతో కొట్టుకుంటూ బతుకుదామా?


- Praveen the freethinker

-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. _ తెలంగాణా ఉద్యమ సమయంలో స్కైబాబా ఆంధ్రావాళ్ళ అమ్మలక్కలని బూతులు తిడుతూ కవితలు వ్రాసిన మాట వాస్తవమే _
  మరి అలాంటోడు అభ్యుదయవాది ఎలా అవుతాడు?
  కమ్యూనిష్టులతో సహా కులాన్ని రాజకీయాలలో ఓటుబ్యాంకిగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కులపరమైన రిజర్వేషన్లను సంపూర్ణంగా రద్దు చేసి గ్రామం యూనిట్ గా క్రిమిలేయర్ పాటిస్తూ పదేండ్లు ఆర్ధికపరమైన రిజర్వేషన్లు పెడితే ఇండియా బాగుపడుతుంది.

  ReplyDelete
 2. ఉన్నట్టుండి కమ్యూనిష్టులకు ఏమైంది ? దళితుల మీద కక్ష కట్టారు ?
  క్రీమీ లేయర్ అనేది ఒక వ్యర్థ వాదన కదా ? ఎందుకంటే .. ప్రతీ కులములో కొంత మంది బలిసినోళ్ళు ఉండాలి. ఆ బలిసినోడే ఇతర కులాలలోని బలిసినోళ్ళతో కొట్లాడగలడు, తమ ప్రయోజనాలను రక్షించ గలడు.

  ReplyDelete
  Replies
  1. - ప్రతీ కులములో కొంత మంది బలిసినోళ్ళు ఉండాలి. ఆ బలిసినోడే ఇతర కులాలలోని బలిసినోళ్ళతో కొట్లాడగలడు, తమ ప్రయోజనాలను రక్షించ గలడు. -

   ఇదో బరితెగింపు వాదన. ఎవడాడు తమవారి తరపున పోరాడేది? అగ్రవర్ణ అధికార కేంద్రీకరణకు, దొరలకు సలామ్ చేయడం, ఊడిగం చేయడం తప్ప రిజర్వేషన్లను ఉపయోగించుకుని తమతోటి వారికి ఉపయోగపడుతున్న మహాత్ములెందరో లెక్కతీయండి. వేళ్ళమీదకూడా లెక్కబెట్టలేమేమో?

   Delete
  2. ఇతర కులాల వాల్లను చూసుకోండి మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాట.
   సినీ పరిశ్రమలో కొన్ని కులాలు ఏ విధంగా లాభ పడ్డాయి. రాజకీయాలలో కొన్ని కులాలు ఏవిధంగా లాభ పడ్డాయి అనేది. రిజర్వేషన్ల వలన సమర్ధత తగ్గిపోతుంది అనేది నేను ఒప్పుకోను. అదే నిజమైతే తర తరాలుగా "అప్రకఠిత రిజర్వేషన్లు" అనుభవిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మన కులపోడు అయితే "పని" దొరికే ఫీల్డులు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. మరి వీరంతా అసమర్ధులుగా మిగిలి పోయారా.. అవకాశం అంది పుచ్చుకుని, తమ సత్తాను నిరూపించుకుంచుకున్నారు. దళితులు కూడా ప్రస్తుతం ఆ దారిలోనే ఉన్నారు. కొంత కాలం క్రితముతో పోలిస్తే ప్రస్తుతం బాగుపడ్డ దళితుల సంఖ్య బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే కొంత మంది మంచి వ్యాపార వేత్తలుగా కూడా ఎదుగుతున్నారు. మరో రెండు మూడు జనరేషన్లు పోతే, మీరు చెప్పినటువంటి వాల్లు కళ్ళ ముందర బాగానే కనపడతారు దళితుల్లో కూడా. ఆ నమ్మకం నాకైతే ఉంది.

   అగ్రకులాలకు ఊడిగం చేయడం చేయడం అనే మాట కూడా నేను ఒప్పుకోను. ఎక్కడ పని చేసినా ప్రతీ ఒక్కరికీ "పై అధికారో" లేకపోతే మరొకరో ఎప్పుడూ ఉండనే ఉంటారు. కొన్ని పరిమితులకు లోబడి నిబద్దతతో పని చేసుకునే వాన్ని "గులాములు" అని అనలేం, కదండీ !

   క్యాపిటలిజం, ప్రపంచీ కరణ పుణ్యమా అని.. అనేక మంది దళితులు ప్రస్తుతం కార్పొరేట్ ల్యాడర్లు ఎక్కుతున్నారు. వారి వాయిస్ ప్రస్తుతం బలంగానే వినిపిస్తోంది. వాల్లెవరూ బాంచెన్ కాల్మొక్త అనేలా లేరు. అఫ్ కోర్స్, కొన్ని పరిమితులు ఇంకా ఉన్నాయి కాదన్ను, కాకపోతే అందులో చాలా భాగం మిగిలిన కులాల వారికి కూడా ఉండేవే !

   ఇప్పుడంతా సాఫ్టువేరు సాఫ్టువేరు అని కొట్టుకుంటున్నారు. ఇది వరకటితో పోలిస్తే కాస్త తగ్గినా ఇప్పటికీ ఆ క్రేజు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలూ, డాక్టర్ సీట్లూ ప్రస్తుతం మూడో స్థానములోనో , నాలుగో స్థానములోనే ఉంటాయేమో. ఇప్పడంతా కార్పొరేట్ మయం, నిజానికి అదే దళితులకు "ఈ కాలములో" దొరికిన అద్భుత వరం. కులాలు ఇంటర్నలుగా ఉన్నా.. పెద్దగా పట్టించుకోని ఫీల్డులు ఇవి.

   Delete
  3. అప్రకఠిత, అనధికారిక రిజర్వేషన్లూ అని చదువుకోగలరు.

   Delete
  4. పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్న దళితుల గురించి, ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ అనేది దళితులకి ఏవిధంగా వరంగా మారింది అనేది తెలియ జెప్పే ఒక చిన్న ఆర్టికల్.

   [...]"Thanks to the economic liberalisation of 1991, there is a steep rise in the condition of Dalits, the study suggests. Besides improved grooming, eating, and ceremonial consumption patterns, there is a phenomenal rise in entrepreneurship among Dalits. In eastern UP, percentage of Dalits owning their own business has gone up from 4.2 percent to 11 percent. In western UP, the rise is from 9.3 percent to 36.7 percent. Similarly, the proportion of Dalits working locally as mason, tailor master, driver etc has risen from 14 percent to 37 percent in the East, and from 9.3 percent to 42 percent in the West"[...]

   [...]"This is a golden period for Dalits... Because of the new market economy, material markers are replacing social markers. Dalits can buy rank in the market economy. India is moving from a caste-based to a class-based society, where if you have all the goodies in life and your bank account is booming, you are acceptable."[...]

   https://yourstory.com/2018/01/dalit-entrepreneurs

   Delete
 3. "మన దేశంలో 2000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది"

  2,000 ఏళ్ల పద్దతిని పదేండ్లలో కూల్చేయడం కుదిరేనా?

  క్రీమీ లేయర్ వాదన అగ్రవర్ణాల అంబులపొదిలో ఒక బాణమే తప్ప బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం లేదు.

  ReplyDelete
  Replies
  1. అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తేలా, బాంచన్ దొరా అనేలా ఉంది కాబట్టే వాళ్ళ ఆటలకు అడ్డులేదు కాబట్టే రిజర్వేషన్లను పెద్దమనసుతో సపోర్టు చేస్తున్నారు. దళితులలో పోరాట పటిమ తగ్గడానికి రిజర్వేషనూ ఓ కారణమే. రిజర్వేషన్ల వలన కులం సమస్య సమసిపోదు.

   Delete
  2. "కులం సమస్య" అంటే ఏమిటి? ఈ విషయాన్నీ నిర్ధారించకుండా సదరు సమస్యను సమిసిపుచ్చటం కుదరదు.

   Delete
  3. - "కులం సమస్య" అంటే ఏమిటి? ఈ విషయాన్నీ నిర్ధారించకుండా సదరు సమస్యను సమిసిపుచ్చటం కుదరదు. -

   Exactly. 100% agree with u jai ji.

   Delete
 4. కులం సమస్య చాలా లోతైనది. ఇది పరిష్కారం కావడం అంటే కూడా చాలా ఏండ్లు పడుతుంది. కులపరమైన రిజర్వేషన్లు మాత్రం కులం సమస్యను పెంచుతుంది తప్ప తగ్గించదు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని కూసిన కే.సీ.యార్ తరువాత ఏంచేసిండు? కె.రాజయ్యను సభామర్యాద కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు దొర అహంబావంతో అవమానిస్తే ఏం పీకిండ్రు? దమ్ముంటే పీ.ఎం, సి.ఎం పదవులకు దళితులలో బుద్ధిమంతులకు ఇచ్చేలా అగ్రవర్ణాల నేతలను ఒప్పించండి చూద్దాం. సన్నాయి నొక్కులు, సందు నొక్కులు చెప్పేవాడెవడూ ముందుకు రాలేడు. వెనుక నుండి మందుతోనో, మరో గమ్మత్తుతోనో ఈ వీరులని కొనేస్తాడు. దళితులకోసం లేదా అణగారిన వర్గాలకోసం పోరాడినవారిలో దళితులే ఉన్నారా? అగ్రవర్ణాలు లేరా? ఓ సమస్యపై పోరాడాలంటే కులాలలో కొందరు మాత్రమే బలుపెక్కిపోవాలా? ఏం వాదన జై గారు?

  ReplyDelete
 5. "కులపరమైన రిజర్వేషన్లు మాత్రం కులం సమస్యను పెంచుతుంది తప్ప తగ్గించదు"

  కాస్సేపు వాదన కోసం (మాత్రమే) ఒప్పుకున్నా ఇది side effects లాంటిది. మూల కారణాన్ని వదిలేసి side effectsని over analyze చేయడం వలన ప్రయోజనం ఉంటుందా? రోగ నివారణ కోసం వాడుతున్న మందుల వలన అప్పుడప్పుడూ వచ్చే దగ్గు మూలాన అసలు మందులే మానేసినట్టుంది.

  ReplyDelete
  Replies
  1. నేననేది మూల కారణాలను తొలగించమనే. ప్రతి హిందూ దేవాలయంలో వేదాలు, మంత్రాలు నేర్పి దళితులను , బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించే ఏర్పాట్లు ప్రభుత్వపరంగా చేయండి. ప్రతి ఊరిలోనూ దళితవాడలు వేరుగా లేని ఏర్పాట్లు చేయండి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకు కొన్ని అర్హతలు పెట్టి దళితులనే ఆ పదవులలో ఉండేలా చేయండి. మరి అక్కడ అలాంటి చోట్ల రిజర్వేషన్లు అవసరం లేదా? ఆర్ధికపరంగా, గ్రామం యూనిట్ గా కులంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. భూసంస్కరణలు సక్రమంగా అమలు చేసి అందరికీ భూమిపై హక్కు ఉండేలా చేయండి. భూమిని వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేలా చేయాలి.

   Delete
  2. భూసంస్కరణలు అమలు చెయ్యడం ప్రభుత్వానికి మొదటి నుంచి ఇష్టం లేదు. ఒక వైపు ఎన్నికల్లో పోటీ చేస్తూ మరో వైపు సాయుధ పోరాటం చేసిన జనశక్తి లాంటి పార్టీల కార్యకర్తల్ని కూడా బూటకపు ఎంకౌంటర్లలో చంపింది తమ భూములు వదులుకోవడం ఇష్టం లేకే కదా. మరో వైపు బతకడానికి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మార్గం అని నమ్మే మంద ఉంది. వాళ్ళు భూస్వాముల భూములనే కాదు, దేవదాయ భూముల్ని కూడా తమ కులంవాళ్ళకి పంచాలని డిమాండ్ చెయ్యరు. కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి దేవదాయ & ఈనాం భూముల్ని పేదలకి పంచడం గురుంచి పార్టీ అనుబంధ సంఘం కార్యకర్తలతో చర్చిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకుని కాల్చి చంపారు. రిజర్వేషన్ కోసం రైలు రోకో చేసి, రైల్వే ఆస్తులని ధ్వంసం కూడా చేసేవాళ్ళపై అంత సీరియస్ ఏక్షన్ ఉండదు.

   Delete
 6. ఇండియాలో వ్యవసాయంలోనూ, చిన్న పరిశ్రమల్లోనూ మెషీన్‌లని కాకుండా మనుషులని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాకు ఉన్నది మూడెకరాల భూమి (ఏడు మడులు). అందులో రెండు మడుల్లో బురద ఎక్కువ. బురద ఎక్కువ ఉన్న చోట మెషీన్‌లు దిగవు. అక్కడ మనుషులు దొరక్కపోతే నేనే బురదలోకి దిగి పారతో దమ్ము చేస్తాను. ఆ లెక్క ప్రకారమైతే చీప్ లేబర్ కోసం నేనే కుల వ్యవస్థని సమర్థించాలి. నా లాంటివాళ్ళు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు & మెడికల్ కాలేజ్ సీట్ల కోసం కొట్టుకునేవాళ్ళు కులాన్ని బలంగా నమ్ముతున్నారు.

  ReplyDelete
 7. స్కైబాబా ఒక తురక (మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన సంతటికి చెందిన ముస్లిం). అతని భార్య మాత్రం దూదేకుల (హిందు మతం నుంచి ఇస్లాంలోకి మారిన ఒక కులం). తురకలకి రిజర్వేషన్ లేదు. అయినా స్కైబాబా రిజర్వేషన్‌ని సమర్థిస్తాడు. తెలంగాణలో తెలంగాణావాదులే ఎక్కువగా ఉంటారు. అక్కడ సమైక్యవాదులంటే బోర్డర్‌లో ఉన్న నాగార్జునసాగర్‌లోనో, హుజూర్‌నగర్‌లోనో, సత్తుపల్లిలోనో ఉంటారు. ఈయన ఎస్.సి. వర్గీకరణని సమర్థించడం వల్లే మాల, ఆది ఆంధ్ర లాంటి కులాలవాళ్ళు ఈయనకి శత్రువులుగా మారారు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top