శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణ సమీపంలో ఒక గ్రామం ఉంది. అందులోని ప్రభుత్వ పాఠశాలలో ఏడెనిమిది మందే విద్యార్థులు ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆ పాఠశాలని మూసివెయ్యాలనుకుంటోంది. ఆ గ్రామంలో అందరూ ఆర్థికంగా ముందున్నవాళ్ళు. ఓ ఏడెనిమిది కుటుంబాలు తప్ప అందరూ తమ పిల్లల్ని పట్టణంలోని ప్రైవేట్ స్కూల్‌కి పంపుతున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలకి పంపడానికి ఇష్టపడడం లేదు. అదే జిల్లాలోని ఇంకో గ్రామంలో అందరూ కూలీవాళ్ళు. ఆ కూలీలు వలసపోయినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఊరు వదిలి వెళ్తారు. తత్ఫలితంగా ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆర్థికంగా ముందున్నవాళ్ళు తమకి ప్రభుత్వ పాఠశాలలో చదువు వద్దంటున్నారు, కూలీవాళ్ళు తమ పిల్లల్ని చదివించాలనుకున్నా చదివించలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల్నిమూసి వెయ్యాలనుకునే యోచన ప్రభుత్వానికి రావడం విచిత్రం కాదు. 

మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి ఎందుకు పంపించడం లేదని తల్లితండ్రుల్ని అడిగితే వాళ్ళు ఇలా సమాధానం చెపుతారు "గవర్నమెంట్ స్కూల్‌లో లేబర్‌వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పక్కన ఉంటే మా పిల్లలు చదవరు" అని. మన రాష్ట్రంలోనే చాలా ఇంజనీరింగ్ కాలేజ్‌లు కేవలం ఫీజ్ రీఇంబర్స్మెంట్ డబ్బుతో నడుస్తున్నాయి. ఆ కాలేజ్‌లలో తహసీల్దార్ పిల్లలైనా లేబర్‌వాళ్ళ పిల్లల పక్కన కూర్చుని చదవాల్సిందే. మరి ప్రభుత్వ అధికారులు కూడా తమ పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజ్‌లకి ఎలా పంపుతున్నారు? 

మన దేశంలో ఆర్థికంగా ముందున్నవాడెవడూ తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపడు, తాను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చెయ్యించుకోడు. ఉద్యోగం విషయానికి వచ్చేసరికి తమకి ప్రభుత్వ ఉద్యోగాలే కావాలంటాడు. ప్రభుత్వ సేవలు బాగుండవనిపిస్తే వాటిని బంద్ చేసెయ్యొచ్చు కదా! కొంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఫ్రీగా పోషించడం ఎందుకు?
Praveen

--------------------------------------------------------


ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top