ఏ.పీ లో కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందా?  బాబు పై జగన్ కక్ష సాధిస్తున్నారా? నదీ పరివాహక ప్రాంతాన్ని రక్షించుకునే మంచి చర్య అయితే కరకట్టపై మిగతా ప్రముఖుల భవనాలను కూల్చివేస్తారా? ఇదే కాదు రాష్ట్రవ్యాపితంగా ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామంటున్న వై.కా.పా నేతల మాటలు ఆచరణ సాధ్యమేనా? ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే దమ్ము, ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా? బి.జె.పి నేతల ఒత్తిడికి తలొగ్గుతారా?  ప్రజావేదిక కూల్చివేతపై మీ అభిప్రాయం ఏమిటి? 
- పల్లా కొండలరావు.

-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. - A man who desires revenge should dig two graves.

  Sir, I knew there were 100s of Thousands of Flat/building built in the past 2 decades across AP and HYD including nagarjuna Convention center etc. and 1800+ churchs built in government premises including one next to my home in Vizag during YSR legacy.

  Also, why people divide into parties and support? This so called building is not CBN Home or built with his money. There are many things to do in AP state and need huge money, intead investing time and additional money to demolish things to take revenge is like "చెట్టు కొమ్మ మీద కూర్చుని అదే కొమ్మని నరుక్కోవడమె :( "

  ReplyDelete
  Replies
  1. There is a major difference between the two categories. The "normal" violations pertain to zonal regulations or title disputes. The current controversy is much more serious as it relates to unauthorized constructions that threaten the flood dykes. I trust a Netherlands resident like yourself can appreciate this.

   ముఖ్యమంత్రి ఇదెక్కటే పనిగా పెట్టుకుంటే సరికాదు కానీ ఆయన అనేక ఇనీషియేటివులు తీసుకుంటున్నారు. మచ్చుకు ఆర్టీసీ సమ్మె నివారణ, (కిందటి ప్రభుత్వం హామీ ఇచ్చే ఐదేళ్లలో చేయని) డ్వాక్రా రుణమాఫీ, బాక్సయిట్ తవ్వకాలపై ఉక్కుపాదం, పర్మిట్ రూముల రద్దు. He has started working in the earnest instead of previous administration style propaganda.

   Delete
 2. కరకట్ట మీదనున్న అన్ని ... అన్నీ ... అక్రమ కట్టడాలనూ తొలగించగలిగితే .... అది "ఉక్కుసంకల్పం" అవుతుంది. "ప్రజావేదిక" కూల్చివేత తరువాత తతిమ్మా భవనాల విషయంలో చతికిలపడితే ... అప్పుడు "ప్రజావేదిక" కూల్చివేతను "కక్ష సాధింపు" అంటారేమో ప్రజలు?

  ReplyDelete
  Replies
  1. ప్రయివేట్ కట్టడాలు కూల్చాలంటే నోటీసులు, కోర్టు స్టే & లిటిగేషన్లు అంటూ లంబా చౌడా తతంగాలు ఉంటుంది. ఇప్పుడు కూలుస్తున్న స్ట్రక్చర్ ప్రభుత్వానిది కనుక ఇబ్బంది రాలేదు.

   ప్రజలు జగన్ గారికి ఐదేళ్లు ఇచ్చారు. ఈ గడువు లోపల కొన్ని కట్టడాలయినా కూల్చగలిగితే సంతోషం. మందిసొమ్ముతో దగ్గరుండి మరీ అక్రమ కట్టడాలు కట్టించిన బడాబాబుల ముక్కు పిండి ఆ డబ్బులు కక్కిస్తే ఇంకా మహదానందం. ఏదేమయినా ఇది శుభారంభం.

   Delete
 3. కూల్చివేత, కరకట్ట, వరద dyke, కూల్చివేత పనుల గురించి కాదు నా ఈ ప్రశ్న 👇.
  నేను ethical angle నుండి అడుగుతున్నాను .... ఆ భవనాన్ని అక్రమ కట్టడం అని తాము డిక్లేర్ చేసిన తరువాత కూడా తామే కలెక్టర్ల సదస్సు లాంటి అధికారిక కార్యక్రమాలు అదే భవనంలో ఎందుకు నిర్వహించారు? వేరే చోటే దొరకలేదా? అక్రమ కట్టడాన్ని ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? కూల్చివేత మొదలెట్టే దాకా ఎందుకు తాళం వేసెయ్యలేదు? అంటే .. అక్రమ భవనం అయినా అంత వరకు వాడుకోవడానికి అయితే ఫరవాలేదని వారి అభిప్రాయమా? ఇది నైతికంగా కరక్ట్ కాదు గదా. A principle is a principle is a principle.

  ReplyDelete
  Replies
  1. ఆయన ఆ సదస్సు ఏదో హోటల్లో పెడితే "కోట్ల రూపాయలు తగలేసి లంచగొండి దేవుని బిడ్డ" తరహా కథనాలు వండి వార్చే వారు కదండీ. "మనవాళ్ల" గురించి మీకు తెలుసును, ఇఫ్తార్ విందు మీద ఎంత గగ్గోలు పెట్టారో చూసాం కదా.

   అక్రమ కట్టడంలో కాపురం ఉంటూ ఇంకో అక్రమ కొంపను తనకు ఇవ్వమని "తొలి సంతకం" చేసినోడిని వదిలేసి అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించిన వ్యక్తిని నిలదీయడం ఆ తిరుమల వెంకన్నకే (ఆయన అసమదీయుడేనట) తెలియాలి!

   Delete
  2. http://muchata.com/%E0%B0%86-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%A5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF/

   Delete
  3. పాదయాత్రలో ఇసుక మాఫియా గురించి మాట్లాడాడా ? వనజాక్షి గురించి మాట్లాడేటపుడు తనకోసం తన్నులుతిన్న శ్రీలక్ష్మి గుర్తుకురాలేదా ? ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ బ్రతుకు వీధిపాలు చేసింది కాక సిగ్గులేకుండా మాట్లాడుతున్నది మీరు కాదా ?

   Delete
  4. మీరు చూసే టీవీలలో పాదయాత్ర వార్తలు చూపించారా మేడం?

   Delete
  5. ఆ బుగ్గ నిమురుళ్ళూ,ముద్దులు పెట్టడాలూ, ఎడంచేతి హావభావాలూ, ఓదార్పులూ చూ'షి"తీరాల్సిందే అంటారా ? ఖర్మ !

   Delete
 4. ప్రజావేదికను కడుతున్నప్పుడే అక్రమ నిర్మాణం అనిపించలేదా? మరి ప్రతిపక్షంగా ప్రశ్నించడమో, ప్రజాప్రయోజనాల దృష్ట్యా కోర్టు నుండి స్టే తీసుకురావడమో చేశారా? లేదా అసెంబ్లీనొదిలేసి పాదయాత్రలతో కాలం గడిపేశారా?

  ReplyDelete
  Replies
  1. చాలా గొడవలు చేసారు గురువు గారూ, ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారు. సాక్షి తప్ప ఈ వార్తలను వేరే పేపర్లు కవర్ చేయలేదు.

   జగన్ అసెంబ్లీకి రాలేదంటూ దెప్పి పొడిచే వాళ్లకు పాదయాత్రలో ఆయన ఏమేమి అంశాలు (ఉ. ఇసుక మాఫియా) లేవనెత్తాడో తెలీదనుకుంటా. టైముపాసుగా కాలం గడపలేదు, జనం మధ్య తిరిగి వాళ్ళ గోసలు విన్నాడు.

   Delete
  2. అసెంబ్లీలో ఉండి పోరాడితే మంచిదే. కానీ అసెంబ్లీలో అడిగితేనే సమస్యపై పోరాడినట్లు కాదు. చట్టసభలలో ఉండి వందిమాగధులుగానూ, నిద్రపోతులుగానూ ఉండే వెధవలకంటే బయట వ్యవస్థల ద్వారా, ప్రజాపోరాటాలు చేస్తున్నవారు మేలు కదా? విషయం ను బట్టి, ప్రస్తుత పరిస్తితులను బట్టి, ప్రజాప్రయోజనాలను బట్టి చూడాలి. రాజకీయకోణాలు ఎలాగూ ఉంటాయి. అది వేరు.

   Delete
  3. అసెంబ్లీ సరే వెళ్ళడం మానేశాడు. కానీ మీరంటున్న "బయట వ్యవస్థల" ద్వారానైనా ఏమన్నా చేసే ప్రయత్నం చేశాడా పోనీ?

   Delete
  4. జగన్ బయట వ్యవస్థలద్వారా తిరిగి చేసింది ఆరోపణలు మాత్రమే...అవినీతి ఎక్కడ జరిగిందో తేల్చమని కమిటీలు ఈరోజున వేసారు. చంద్రబాబుగారు చేసిన అవినీతి గురించి ఆయన చేప్పినవన్నీ ఊహాగానాలే అని ఆయనే అంగీకరిస్తున్నట్లు కాదా ?

   Delete
  5. విన్నకోట వారూ, ఈ ఖరీఫ్ పంట నుండి రైతులకు పగటి పూటే కరెంట్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం feedback వల్లనే కదండీ. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.

   QMSలో customer feedback & customer satisfaction అత్యంత కీలకం. ప్రజాస్వామ్యంలో ప్రజలే కస్టమర్లు అనుకుంటే ISO 9001 certificate ఇచ్చేయొచ్చు. పొద్దట్నుంచి రాత్రి పొద్దు పొయ్యేదాకా MRM చేసేవారు clause 9.3.2 c(1) మరిచిపోతే ఎలా?

   Delete
  6. అబ్బా....మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ కనిపిస్తున్నాయా ? మాకు జైలులో ఉండి గీసిన రాజనాల టైపు రాజకీయ స్కెచ్ లు కనిపిస్తున్నాయి. (ఈరోజు ఈనాడులో ప్రచురించిన ఒక ఖైదీ గీసిన స్కెచ్ లు అనుకునేరు.)
   మనపని మనం చూసుకోవాలి కానీ ప్రక్కోడు నాశనం అయిపోవాలని అనుకునేవాడు ఎప్పటికీ విజయవంతం కాలేడు.

   Delete
 5. ఆళ్ళ రామకృష్ణా రెడ్డి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు సర్. గోకరాజు గంగరాజు లాబీయింగ్ తో బి.జె.పి అండతో, తెలుగుదేశం సహకారంతో ఇక్కడ అక్రమ కట్టడాలు వర్ధిల్లుతున్నాయి. వాటిని కూల్చడానికి న్యాయపరమైన ఇబ్బందులుంటాయి. వాటిని సాకుగా చూపి ఆపకుండా, బి.జె.పి కి భయపడకుండా జగన్ ఉండగలుగుతారా? అన్నది చూడాల్సి ఉంది. అలా నిలబడగలిగితే ఈ విషయంలో జగన్ ఇమేజ్ పెరుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. కొండలరావుగారూ,
   మీ గురువుగారు మంతెనగారి ఆశ్రమం కూడా కూల్చాలి...ప్రకృతి ఆశ్రమం అని పేరుకే గానీ నెలరోజులు ఉండడానికి రేట్లు 25 వేలకి పైమాటే...గోకరాజు గారి పుణ్యం అట !

   Delete
  2. ప్రకృతి జీవన విధానం లో కొన్ని విషయాలు (నీళ్లు, ఉప్పు వంటివి) మినహాయిస్తే ఆయన పద్ధతిని నేను సపోర్ట్ చేస్తాను. ఫీజుల విషయం ఇష్టమొచ్చినవాళ్ళు, కట్టగలిగిన వాళ్లు ఆశ్రమంలో చేరతారు. లేకుంటే ఇంటి దగ్గరే ఉండి మనం ఆచరించవచ్చు. అది వేరే చర్చ.

   అక్రమ కట్టడం విషయంలో ఆయన ప్రభుత్వ అనుమతులతో కట్టానని ఆధారాలు చూపుతూ గతంలో మీడియాకు వివరించారు. అయితే అవి సవరించిన మేరకే అన్నది నా అభిప్రాయం. కరకట్ట పక్కన ఉన్న కట్టడాలన్ని నాకున్న నాలెజ్ ప్రకారం గోకరాజు గంగరాజు అండ్ కంపెనీ వారివి. వీరికి బి.జె.పి, తె.దె.పాతో పాటు వై.ఎస్ అండ కూడా ఉన్నదన్నది నాకున్న సమాచారం. వీటన్నింటినీ కూల్చగలిగితేనే జగన్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. లేకుంటే కక్ష సాధింపే. అయితే ఇక్కడ బాబు అండ్ కంపెనీ దాసరి కుటుంబాన్ని బెదిరించి ప్రైయివేటు ఆస్థిలో ప్రజా ధనంతో ప్రభుత్వ కట్టడం కట్టడం ముమ్మాటికీ సమర్ధనీయం కాదు కదా?

   Delete
 6. అసలు చంద్ర‌బాబు నాయుడు గారు మరీ నిర్లక్షంగా ప్రవర్తించారేమొ అనిపిస్తుంది!! ఎలాగూ తిరిగ్ తనే ముఖ్యమంత్రి అవుతారనే గట్టి నమ్మకంతో మరీ అనాలోచితంగా ఈ నిర్మాణాలు చేపట్టి ఉంటారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి చంద్ర‌బాబు నివాసం పైన ఆరోప‌ణ‌లు చేస్తున్న జ‌గ‌న్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డల ద్వారా నేరుగా చంద్ర‌బాబును లక్ష్యంగా చేసుకోలేనట్లు కనిపిస్తూ పొగ పెట్టారు.ఇప్పుడు చంద్ర‌బాబు తప్పనిసరిగా క‌ర‌క‌ట్ట ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి తీసుకొచ్చారు.

  జై గారు, AMTERDAM పరిస్తితులు వేరండి. మన ఆర్దిక పరిస్తితులను గుర్తిస్తూ ఈ అక్రమ కట్టడాలు అన్ని ఒకేసారి కూల్చెసి ఉంటే బాగుండేధి.. కాని ఈ ఒక్క కట్టడం కూల్చడం కోసం హుటాహుటిన సుమారుగా అర కోటి రూపాయలు ఖర్చు పెట్టడం లో కొంచెం పంతం, ప్రతీకారం కూడ కనిపిస్తుంది!!

  Any I wish all the un-authorised or occupied constructions are removed properly without additional burden to the Givernment!!

  :)

  ReplyDelete
  Replies
  1. @విసుకి వాడి మనస్సె ఒక విశ్వం:

   I understand the Dutch situation is totally different. The point I wanted to stress was that the present case is centered around levee impact rather than (or in addition to) the more common flood plains conservation.

   1952 లో అప్పటి కృష్ణ ఆయకట్టు వరద ముంపుకు గురయింది. దాని స్థానంలో ప్రస్తుత బారేజీ నిర్మించడానికి షుమారు పదేళ్లు పట్టింది. నూతన బారేజీకి శంఖుస్థాపన చేసిన టంగుటూరి ప్రకాశం గారు ఈలోపల పరమపదించారు: వారికి నివాళిగా ఆయన పేరే బారేజీకి పెట్టడం జరిగింది. కరకట్ట నిర్మాణం తరువాత కృష్ణ డెల్టాలో వరద ప్రమాదం గణనీయంగా తగ్గడం శుభపరిణామం.

   KWDT Report Volume I:
   There was a breach in the Krishna Anicut in the year 1952 and in its place construction of the Krishna (Prakasam) Barrage was sanctioned. The construction of the Krishna (Prakasam) Barrage started in the year 1953 and was completed in the year 1962.

   Delete
 7. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చేయడం రూల్ ప్రకారం కరెక్టే. అయితే రూల్స్ పాటించడం లో అత్యుత్సాహం చూపించినపుడే అనుమానాలు కలుగుతాయి. ఒకవేళ అదే ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాలు గూడారాలు వేసుకుంటే రూల్ ప్రకారం టైం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి కూల్చేస్తారా? అప్పుడు మాత్రం రూల్స్ కంటే ముందు ఓట్లు కనిపిస్తాయి ఏ పార్టీకైనా!

  ReplyDelete
 8. లేబర్ ఇళ్ళు కూల్చేసి డబల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తున్నారు. చంద్రబాబుగారికి కూడా కట్టిస్తారా ? అవి కూడా అక్రమ కట్టడాలే కదా ? లేబర్ కి ఒక న్యాయం ముఖ్యమంత్రికి ఒక న్యాయం ఉండకూడదు.

  ReplyDelete
  Replies
  1. ఆ భవనం యజమాని లింగమనేని రమేష్, పరిహారమంటూ ఇస్తే ఆయనే పుచ్చుకుంటారు.

   Delete
  2. అసలు నాకు అర్థం కాని విషయం ... ఇంతకాలం చంద్రబాబు గారు అమరావతిలో (లేదా చుట్టు పక్కల ఎక్కడన్నా) తన స్వంత ఇల్లు కట్టించుకోకపోవడం ఏమిటి? జగన్ కట్టించుకున్నాడు, పవన్ కట్టించుకున్నాడు. ఈయనకేమొచ్చింది? ముఖ్యమంత్రి అధికారిక నివాసం అన్నా కట్టించుండాల్సింది (కరకట్ట మీద కాకుండా వేరే చేట 🙂).

   Delete
  3. ప్రజావేదిక ప్రక్కది చంద్రబాబుగారి నివాసం. దానిని కూడా కూల్చేస్తారని అద్దె ఇల్లు వెతుకుతున్నారు. ప్రగతి భవన్ లాగా అధికారిక నివాసం కట్టించుకోడానికి మన మాజీ ముఖ్యమంత్రిగారికి ఉమ్మడి ఆదాయం ఎక్కడ వస్తుందండీ ?

   Delete
  4. "ముఖ్యమంత్రి అధికారిక నివాసం అన్నా కట్టించుండాల్సింది"

   విన్నకోట వారూ, ముఖ్యమంత్రి అధికారిక నివాసం అంటూ కట్టించుకున్నా అది ఆ ఖుర్చీతో పాటే ex-officio residence పోతుంది కదండీ. అసెంబ్లీ & కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు ఇద్దరికీ కాబినెట్ హోదా కనుక ప్రభుత్వం ఇల్లు కేటాయించాలి కాకపొతే కొంచం సమయం పట్టవచ్చు.

   స్టాఫ్ క్వార్ట్రర్స్ అలొకేషన్ చేసేటప్పుడు ఇల్లే లేని అధికారులకు ప్రయారిటీ ఇవ్వడం ఆనవాయితీ. మాజీ మంత్రులు ఖాళీ చేయాలి. అది ఒక పట్టాన జరగదు ఉ. ఢిల్లీలో దశాబ్దాల బైఠాయింపులు చూస్తూనే ఉన్నాం. ఖాలీలు అవుతున్న ఇళ్లను కొత్త వారికి క్రమపరంగా కేటాయించాలి. This is a time consuming headache process.

   టీడీపీ బెజవాడ కార్యాలయం అసౌకర్యంగా ఉందని, కొత్త ఆఫీసు ఎంపిక విషయంలో దేవినేని ఉమతో తేడా వచ్చినందుకు కేశినేని నాని అలిగారని అంటారు.

   Delete
 9. జై గారు,
  ex-officio residence అనేది ఆనవాయితీగా స్థిరపడాలన్నదే నా భావం. White House, 10 Downing Street, మన స్వదేశీ ఉదాహరణయిన రాష్ట్రపతి భవన్ .... వాటిలాగే తతిమ్మావి కూడా అధికారిక నివాసాలు అనే సంప్రదాయాన్ని గౌరవించడం మన నాయకులకు ఎప్పుడొస్తుందో ఏమిటో? మన వాళ్ళది gross behaviour కదా, రావడం కష్టం. మీరు మాజీ మంత్రులు ఖాళీ చెయ్యడం గురించి చెబుతున్నారు. మాజీ MLA ల చేత MLA Quarters ఖాళీ చేయించడమే కష్టంగా తయారవుతుంటుంది. మేరా భారత్ మహాన్.

  దీనికి నాకు తోచిన పరిష్కారం చెప్పనా? అధికారిక నివాసం ఖాళీ చేసినట్లు సంబంధిత డిపార్టుమెంటు నుండి సర్టిఫికేట్ జతపరిస్తేనే ఎన్నికల నామినేషన్ తీసుకోబడుతుంది ... అనే రూల్ గనక తీసుకొస్తే చూరు పట్టుకు వేళ్ళాడే ఈ జాడ్యం తగ్గుతుంది. ఎన్నిక గెలిచి, మళ్ళీ పదవిలోకి గానీ వస్తే అప్పుడు తిరిగి ఫ్రెష్ గా బంగళా కేటాయించవచ్చు, సమస్యేముంది. ఎలా ఉంది 'అవుడియా' 😎?
  (నా ఈ ఐడియాకు ప్రేరణ ... ఇప్పుడుందో లేదే తెలియదు గానీ ఒకప్పుడు ప్రభుత్వోద్యోగులు ఎన్నికలలో పోటీ చెయ్యదలిస్తే ముందు తమ ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి అనే రూల్ ఉండేది. తరువాత ఎన్నికలలో ఓడిపోతే ఆ మాజీ ఉద్యోగి పరిస్థితి ఏదో ముతక సామెత చెప్పినట్లు తయారవుతుంది. బైదివే, అందుకే నేనెప్పుడూ ఎన్నికలలోకి దూకలేదు 😀😀😀😀😀)

  ReplyDelete
  Replies
  1. "అధికారిక నివాసం ఖాళీ చేసినట్లు సంబంధిత డిపార్టుమెంటు నుండి సర్టిఫికేట్ జతపరిస్తేనే ఎన్నికల నామినేషన్ తీసుకోబడుతుంది"

   ఐడియా బాగుంది సార్. మీది భలే ప్రాసెస్ ఓరియెంటెడ్ థింకింగ్.

   "ఎన్నికలలో పోటీ చెయ్యదలిస్తే ముందు తమ ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి అనే రూల్ ఉండేది"

   ఇప్పుడూ ఉందండి. హిందూపురం లోక్సభ సీటుకు గోరంట్ల మాధవ్ నామినేషన్ ఆపడానికి ఆయన వీర్యేస్ అర్జీ ఆమోదించకుండా తిప్పలు పెడితే ఆయన కోర్టుకెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు.

   మీరు చెప్పిన ఇండియాకు కూడా ఎదో ఒక లొసుగు/jugad పెడతారు లెండి, మనవాళ్ళు ఘటికులు.

   "తరువాత ఎన్నికలలో ఓడిపోతే ఆ మాజీ ఉద్యోగి పరిస్థితి ఏదో ముతక సామెత"

   గాలివాటంగా వచ్చేవాళ్లకే ఇబ్బంది కానీ సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు ఫరవాలేదనుకుంటా. ఇప్పుడు కాకపొతే వచ్చేసారి గెలుస్తాం అనుకొని జనంలో మమేకం అయ్యేవాడే మనగలడు. అఫ్కోర్స్ ఏ ఫీల్డ్ అయినా ఇంతే: మొదటి టెస్టులో డకౌట్ అయినా పట్టుదలతో నిలబడి సెంచరీలు రికార్డులు చేసిన ఆటగాళ్లు ఉన్నారు కదా.

   Delete
 10. Thank you Jai గారు 🙂.
  ఇక .. మనవాళ్ళు ఘటికులనడంలో నాకు కూడా ఎంత మాత్రమూ సంశయం లేదు. మనవి devious minds కదా.

  ReplyDelete
 11. జై గారు,

  ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే ఆ వ్యక్తిని పాత ఉద్యోగంలోకి తిరిగి తీసుకుంటుందా ప్రభుత్వం?
  ఇక మీరన్నట్లు ఓడిన మాజీ ప్రభుత్వోద్యోగి పదేపదే ఎన్నికలలో పట్టుదలగా నిలబడాలంటే ... అంతవరకు భుక్తి ఎలా స్వామీ? ఒకవేళ భుక్తి సమస్య లేనివాడే తట్టుకోగలడు అంటారా ... అయితే ... ఎన్నికలు rich man's game అన్నట్లేగా?

  ReplyDelete
 12. నీహారిక గారు,

  నా పాయింట్ చంద్రబాబు గారు స్వంత ఇల్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు అని. రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రముఖుడు ఆ రాష్ట్ర రాజధానిలో స్వంత ఇల్లు కట్టుకోకపోవడమేమిటి? అసలు చాలా విషయాల్లో సాధారణంగా చాలా ముందుచూపు కలిగిన సామాజికవర్గం కదా వారిది.

  సరే, ఇప్పుడు చంద్రబాబు గారేమీ రోడ్డున పడడు లెండి. ఆయనకు అద్దె ఇల్లు దొరకడం సమస్యే కాదు. లింగమనేని భవనం పోతే మరో ఇంకో నేని గారో మరొకరో తన భవనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ముందుకొస్తారు. ఆ ప్రాంతాల్లో వాళ్ళకు కొఱతేముంది గనక. అయితే ఈ సారి తీసుకునే అద్దె ఇల్లు కరకట్ట చుట్టుపక్కల లేనిది చూసుకోవడం మంచిది 😀😀.

  లేదా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రభుత్వం అధికారిక నివాసాన్ని కేటాయిస్తుందేమో చూడాలి (ఆ కేటాయింపేదో అఘమేఘాల మీద జరుగుతుందనయితే నాకు నమ్మకం లేదు).

  ఏమైనా, Fall of the Giants అనే మాట గుర్తొస్తోంది.

  ReplyDelete
  Replies
  1. కొత్త ఇల్లు దొరికేవరకూ ఏ బిగ్ బాస్ ప్రోగ్రాం లోనో జాయిన్ అయితే ఎలా ఉంటుందంటారు?

   Delete
  2. Good idea. తనే గెలుస్తాడు కూడా 😀.

   Delete
  3. గాయకులనెవ్వరినీ ఆయన పరిశ్రమకి రానివ్వడం లేదు అని ఇదివరకు బాలసుబ్రహ్మణ్యం గారిమీద ఒక ఆరోపణ వచ్చింది. ఆ తరువాత ఆయన పాడుతాతీయగా కార్యక్రమం చేస్తూ ఎంతోమంది గాయనీగాయకులను పరిచయం చేసారు చేస్తున్నారు.
   ఎందుకు చెప్తున్ననంటే చంద్రబాబుగారి మీద కూడా అటువంటి ఆరోపణే ఉంది. హైటెక్ సిటీ దగ్గర ఆయనకు ఆస్థులున్నాయి కాబట్టి అభివృద్ధి చేసారు అని ఆరోపించారు. అందుకే ఆయన రాజధానిని చిత్తూరు వైపు కాకుండా గుంటూరు వైపు తీసుకున్నారు. ఆ ఆరోపణల కారణంగా ఆయన నివాసం గురించి కూడా ఆలోచించలేదు.
   కొంతమంది వెధవలు ఎన్ని వెధవపనులు చేసినా జనం భయం వల్ల నోరుమెదపరు. మంచివాళ్ళనైతే ఎవరన్నా ఏమైనా అనవచ్చు.

   Delete
 13. జై గారు,
  // "ఆయన ఆ సదస్సు ఏదో హోటల్లో పెడితే ......" //

  ఇక ఈ అంశాన్ని మరీ సాగదియ్యడం నా ఉద్దేశం కాదు. ఫలితమూ ఉండదు ... "ప్రజావేదిక" పోయి ఇవాళ్టికి రెండో రోజు. అయితే చివరగా ఒక్క సందేహం మాత్రం వెలిబుచ్చదలుచుకున్నాను. పైన నేను ప్రస్తావించిన ethical angle / principle సందర్భంగా అడుగుతున్నాను ... హోటల్లో ఎందుకు పెట్టాలి, ఏం అమరావతిలోని సెక్రటేరియట్ లో కాన్ఫరెన్స్ హాలే లేదా? పోనీ అది తాత్కాలిక నిర్మాణం అంటారా (అయినప్పటికీ కాన్ఫరెన్స్ హాల్ లేకుండానే కట్టారా?), సరే దగ్గరలోనే ఉన్న నాగార్జున యూనివర్శిటీలోని హాలు వాడుకునుండచ్చుగా? సాయంత్రం కల్లా కూలగొట్టబోయే "అక్రమ" భవనంలోనే ఎందుకు నిర్వహించాలి ... అన్నదే నా పాయింట్. దాని మూలాన ... "అక్రమ", "అక్రమ" అంటున్న వారి వాదనలోని ఫోర్స్ (moral force) దెబ్బ తినలా?

  ReplyDelete
  Replies
  1. ఇంతకీ పాదయాత్రల్లో ఓదార్పు యాత్రల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు సక్రమ కట్టడాలేనా?అనుమతులున్నాయా?అనుమానమే!!

   Delete
  2. మంచి ప్రశ్న సూర్య గారు.

   Delete
  3. ఇతర విగ్రహాలు ఎంత ఆ(స)క్రమమో ఇవీ అంతే. కాకి విగ్రహం కాకి పిల్లకు ముద్దు అన్నట్టు ప్రతీ పార్టీ/కులం వాళ్ళు తమ నాయకుడి ఆ(స)క్రమ విగ్రహంపై ఈగ వాలినా సహించరు
   కానీ ఎగస్పార్టీ ఆ(స)క్రమ విగ్రహాలను ప్రశ్నిస్తారు.

   Delete
  4. 400 ఏళ్ళ చరిత్ర కల చార్మినార్ లో భాగ్యలక్శ్మి ఆలయం కూల్చేయాలని నేను 10 ఏళ్ళక్రితం ప్రశ్నించా ...కూల్చే దమ్ము మీ కాకి ముక్కు పంతులుకి ఉందా ?

   Delete
  5. https://books.google.co.in/books?id=uqvpZutXN7cC&lpg=PA42&pg=PA42&hl=en#v=onepage&q&f=false

   చార్మినార్ భాగ్యలక్ష్మి (గుడి, లాటరీ కాదు) వందలాది ఏళ్ల ముందే కట్టారని అయిదు నక్షత్రాల హోటళ్లలో (మొదటి మంది సొమ్ముతో ఉన్నా ఆ తరువాత సొంత డబ్బులతోనేలెండి, ఈ విషయంలో బాబోరి కంటే ఈయనే బెటర్) నివాసముండే కేరళ ఎంపీ ఒకాయన రాసారు.

   ఆయన 1871 సెన్సస్ నివేదిక చదివారో లేక స్థానిక వర్తకులను అడిగి తెల్సుకున్నారో ఆయన్నే అడగాలి కాకపొతే ఆయన భాష & యాస అర్ధం చేసుకోవడం కొంచం కష్టం.

   Delete
  6. నువ్వు మనిసివి కాదు సామీ..
   ఏంటీ బాబు సాఫ్ట్‌వేర్ లోడ్ చేసిన రోబోవి.
   ఎంతమంది తిట్టీనా ఎప్పుడూ అదే గోస...

   Delete
  7. 🙂 దాన్నే సాఫ్టువేర్ పరిభాషలో "లూప్" అంటారనుకుంటానే 🙂?

   Delete
  8. విన్నకోటవారికి తెలియని విషయం లేదు టక్కున పదాలు తెచ్చిస్తారు. కంప్యూటర్ కోడింగ్ లూ లాంగ్వేజ్ లూ అన్నీ తెచ్చిపడేస్తున్నారే 👏👌

   Delete
  9. థాంక్యూ థాంక్యూ నీహారిక గారూ. నేను పనిచేసిన సంస్ధలో కంప్యూటర్ డిపార్టుమెంటులో కొంతకాలం వెలగబెట్టాను లెండి, దాని మూలాన కాస్త అంటుకున్న గోరోజనం అన్నమాట. jack of all trades అంటారు చూశారా, ఆ బాపతన్నమాట కొంతవరకు. అంతే కానీ మీరు తారీఫ్ చేసినంత లేదు. థాంక్స్ ఎనీవే 🙂.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top