కుల వన భోజనాలపై మీ అభిప్రాయం!?


ఇటీవల ఖమ్మం లో ఓ అగ్ర కులం పేరుతో వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలలో ఉన్న ఆ కులం నేతలు వచ్చి వెళ్లారు. సీ.పీ.ఎం వారు తామా కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించారు. పైగా ఈ నెల ఆరున అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సాంఘిక సమానత్వ జనభోజనం అంటూ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కులాల పేరుతో కార్యక్రమాలు చేయడం మంచిదేనా? వాటికి వ్యతిరేకంగా చేసే ఈ కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఎంత?

- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. Kulam peruto chala jarugutunnappudu, kulam peruto vana bhojanalu tappu ela avutayi...

  ReplyDelete
  Replies
  1. కులమే తప్పు. అలాంటప్పుడు కులం పేరుతో ఏది చేసినా ఏమి చేసినా తప్పే అవుతాయని నా అభిప్రాయం.

   Delete
  2. అందరు చెప్పేవారే ? కులం తప్పు అని నిజంగా ఎంత మంది ఒప్పుకుంటున్నారు?గతం లో సంఘసంస్కర్తలు గా పేరుపొందిన వారే వారి వ్యక్తి గత జీవితాలలో సంస్కరణలు ఎందుకు తీసుకురాలేదు ?ఇలాంటి లెక్క లేనన్ని ప్రశ్నలు చిన్నప్పటి నుండి ఉన్నా కాని జవాబులు తెలియడం లేదు

   Delete
  3. శ్రీనినివాస్ గారు, మంచి ప్రశ్న. వ్యక్తులుగా మంచిగా ఉంటేనే వ్యవస్థ మార్పు గురించి మాట్లాడాలంటే మహాత్ముడితో సహా ఏ ఒక్కరూ అర్హులు కారు. అయితే నేతలు సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఎప్పటికప్పుడు విలువలు పాటిస్తేనే మంచిది. వ్యక్తిగత విలువలను సాపేక్షంగా మాత్రమే చూడాలి. మొత్తం సమాజంలో మార్పుకోసం అనేక దొంతరలు దాటాలి. వ్యక్తిగత జీవితం అనేక విషయాలతో ముడిపడి ఉంటుంది. తప్పు చేసేవాడూ తప్పు చేయొద్దని చెప్పే హక్కును కోల్పోడు. సిగరెట్ త్రాగడం అలవాటైన డాక్టర్ పేషెంటుకు సిగరెట్ త్రాగొద్దని చెప్పాలా? వద్దా? ఆలోచించండి. మార్పు అనేది వ్యక్తులుగా వస్తే వారు ఇతరులకు ఆదర్శవంతులవుతారు. సమాజంలోనే మార్పు తేవాలంటే సమిష్టిగా పోరాడాలి. భావజాలం లో మార్పు తేవాలి. ఒకేసారి ఏదీ మారదు. అనేక సంఘర్షణలు ఎత్తుగడలు పోరాటాలు అవసరమవుతాయి. ఈ విషయం పై మరింత వివరంగా వీలు చూసుకుని ఓ పోస్టు వ్రాస్తాను. వ్యక్తికి ఆలోచన ఎలా వస్తుంది? అలవాటు ఎలా ఏర్పడుతుంది? అలవాటుని మార్చుకోవడానికి ఏమి కావాలి? ఈ ప్రశ్నలు సరిగా వేసుకుంటే సమాధానం మీకూ దొరుకుతుంది. ఒకప్పటితో పోల్చుకుంటే కుల దుహంకారం తగ్గింది తప్ప సమసి పోలేదు.

   Delete
  4. నా ఉద్దేశ్యం మార్పు మన నుండే రావాలి అని ,కాని సమాజం లో మార్పు కోరే వ్యక్తి తనను తాను మార్చుకోకుండా ,మారాలి అని చెప్పకూడదు అని కాదు, అతను చెప్పొచ్చు అది అతని హక్కు,కాని జనాలు అతను చెప్పే భావ జాలాన్ని కనీసం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు, అని నా అభిప్రాయం,ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఆధర్శంగాఉండాలి ,ఎందుకంటే అతని విద్యార్థులు అతనిని అనుసరిస్తారు ,కాని పేషెంట్ ,డాక్టర్ ని అనుసరించక పోవచ్చు!ఇది కేవలం నా అభిప్రాయం...

   Delete
  5. కొందల రావు గారు,
   మీ డాక్టరు సిగిరెట్టూ ఉదాహరణ కీ, ఇక్కడి కేసుకీ కొంచెం తేడా ఉంది.
   సిగిరెట్ తాగటం వలన డాక్టర్ కి వ్యక్త్ గతం గా నష్టం . ఆరోగ్యం చెడుతుంది.
   అదే, కుల గజ్జి మనిషికి దానివలన వ్యక్తిగతం గా లాభం,రికమండేషన్లూ, గట్రా చేయించుకోవచ్చు.ఫేవర్లు పొందవచ్చు (కులగజ్జి మనిషి కూడా నైతికం గా దిగజారటం వలన, అతనికి కూడా నైతిక పరమైన వ్యక్తిగత నష్తం ఉంది. కానీ ఆ వ్యక్తికి అది నష్టం గా కనిపించనంత కాలం అది నష్టం కాదు. ఎందుకంటే ఇది వ్యక్తి గత విషయం కనుక.
   చాలా మంది పెద్ద మనుషులు తమ నైతిక బ్రష్టత్వాన్ని ఎంజాయ్ చేస్తూ (వ్యక్తి గత లాభం కనుక), మిగిలిన వారికి లెక్చర్ లు దంచుతారు. ఎదుటి వారికి చెప్పెటందుకె నీతులు ఉన్నాయి అని ఊరికినే అనలేదు, మరి. అలాంటి వారు మీరు చెప్పిన డాక్టర్ లాజిక్ ని వాడి ఎదుటి వారిని డబాయించి, తాము మాత్రం హాయిగా వ్యక్తి గత లాభాన్వేషణ లో మునగ గల సమర్ధులు.

   Delete
  6. శ్రీనివాస్ గారు, బొందలపాటి గారు, మీరిరువురూ ఇచ్చిన ఉదాహరణలు విలువైనవే. అలాంటి సమస్య ఉన్నది. కానీ అదో ప్రాసెస్ గా వస్తుంది. ఒక వ్యక్తిలో మార్పు వస్తే సరిపోదు. వ్యవస్థలో రావాలి. కులమే లేని వ్యవస్థ రావాలి. అది సుదీర్ఘ ప్రయాణం. అది మారాలంటే ఇలాంటివాటిని కులంపేరుతో వనభోజనాలు లేదా కులం పేరుతో ఇతర కార్యక్రమాలు పై ప్రభుత్వం బేన్ విధించాలి. రిజర్వేషన్లు చట్టం చేస్తేనే అమలు చేయబడుతున్నాయి. ఇలాంటి చర్చలు కూడా మీరన్నట్లు వ్యక్తులు మారడానికి ఉపయోగిస్తాయి. అయితే ఓ వ్యక్తి ఈ సమాజంలో ఏదో ఒక కులంలో ఉంటాడు. తప్పక. మరి అతనికి కులంతోనే అంటగడుతున్నప్పుడు, కొన్ని సహాయాలు పొందడానికి కుల ధృవీకరణలు అవసరమవుతున్నప్పుడు వ్యక్తుల మార్పే సమాజాన్ని మార్చివేయలేదు. పుచ్చలపల్లి సుందరయ్యలాంటివారు పేరులోని రెడ్డి ని తొలగించుకుంటే , మన బ్లాగర్ ప్రవీణ్ తన ఇంటిపేరు తీసేసి కేవలం తన పేరు మాత్రమే ప్రకటించాలని నన్ను కోరాడు. మంద కృష్ణ వచ్చాక మాదిగ అనే తోక తగిలించుకోవడం ఫేషన్ అయింది. అంత క్రితం మాదిగ అనడం నేరం. ఇలాంటివన్నీ ఒక్కరోజులో మారేవి కావు. అసలు మారకుండాకూడా లేరు. ఆయా వ్యక్తుల చైతన్యం ఆదర్శవంతంగా ఉంటే మీరన్న్నట్లు ఎక్కువ ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. అదే సందర్భంలో వ్యక్తుల చైతన్యం - సామాజిక చైతన్యం అనేవి రెండూ పరస్పరాధారితాలుగా ఉంటాయనేది గుర్తించాలి.

   Delete
  7. కొండల రావు గారు!"ఈ విషయం పై మరింత వివరంగా వీలు చూసుకుని ఓ పోస్టు వ్రాస్తాను. "అని మీరు చెప్పినందుకు ధన్యవాదములు.చిన్న మనవి : మీరు పోస్ట్ రాసే ముందు జ్యోతిబా పులే గారి "గులాం గిరి "పుస్తకాన్ని చదివి వ్రాస్తే మీరు అందరికి కుల విముక్తి కలిగించే ఉపాయాన్ని తెలియజేస్తారేమోనని భావిస్తున్నాను

   Delete
  8. శ్రీనివాస్ గారు, మీరన్న జ్యోతిబా పులే గారి "గులాం గిరి " పుస్తకం కినిగే లో దొరుకుతున్నదా?

   Delete
  9. కొండల రావు గారు! https://archive.org/details/Slavery-Gulamgiri నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగలరు...తెలుగు లోదోరకడం లేదు

   Delete
  10. ధన్యవాదములు శ్రీనివాస్ గారు. కానీ నాకు ఇంగ్లీషు రాదండీ.

   Delete
  11. అయ్యో మీరు అపార్ధం చేసుకున్నారా?ఏమి?నేను తెలుగు లో ఉంటె చదవడం తేలిక అనే ఉద్దేశ్యం లో అలాగా చెప్పను ,క్షమించగలరు

   Delete
  12. అపార్ధమేమీ లేదండీ. అందుకే అసలు క్షమాపణ అనే సమస్యే లేదు.మీరిచ్చిన లింకు ఓపెన్ చేశాను. అది ఇంగ్లీషు - హిందీలలో ఉన్నట్లున్నది. లింకు ఇచ్చినందుకు ధన్యవాదములు.

   Delete
 2. మనం ఇంకా ఇంటిపేరు ని తొలగించుకొలెదు. కులమే తప్పు అనడం అందుకే పొసగదు. కులం పరంగా ఇప్పుడు జరుగుతున్నవి తర్వాత తగ్గిపోవచ్చు , అది తప్పోప్పులకి సంబంధించిది గా మాత్రమె చూడటం కరెక్ట్ కాదు. అలా చేస్తే కుటుంబం, దేశం ఇల్లా అన్నీ ఆ కోవలోకే వస్తాయి.

  నా వ్యాఖ్య కేవలం పై వ్యాఖ్యకి సమాధానం గా మాత్రమె. వనభోజనాలు కులం పేరుతొ చేసినా ఇంకో పేరుతొ చెసినా.పెద్ద తేడా ఏంటి? ..చర్చిస్తె వనభోజనాల గురించి చర్చించాలి కాని ఎవరు వెళ్లి తింటున్నారు అన్నది చిన్న విషయం

  ReplyDelete
  Replies
  1. మౌళి గారు, కులానికి ఇంటి పేరుకి లింకు ఏమిటో, మీరు ఏమి చెప్పదలచుకున్నారో నాకు సరిగా అర్ధం కానందుకు క్షమించాలి.

   మా ఊరిలో ఒకే ఇంటి పేరుతో రెండు కులాలున్నాయి. మా ఇంటి పేరుతోనే కమ్మ, పెరిక కులానికి సంబంధించిన 2 కుటుంబాలు నేనుడే ఊరిలోనే ఉన్నాయి. మా స్వంత ఊరిలో బండి అనే ఇంటి పేరుతో గౌడ, కమ్మ కులాలలో వ్యక్తులు ఉన్నారు. అసలు ఇంటి పేరే లేని వారూ ఉంటారు. వారికి తండ్రిపేరు ఇంటిపేరుగా వస్తుంది.

   ఇక ఏమి చర్చించాలి అనేది? తరువాత చూద్దాం. అందరికీ ఏమి చర్చించాలి అనేదానిలో అంత జ్ఞానం ఉండకపోవచ్చు. ఎవరి జ్ఞానం మేరకు వారు చర్చలు చేస్తారు. కొందరికి చిన్న విషయం అనిపించింది కొందరికి పెద్ద విషయమనిపించవచ్చు. అది పక్కన బెట్టి ఈ ప్రశ్న సబ్జెక్టుపై ఏమైనా చర్చించదలచుకుంటే కామెంట్ చేయండి. చర్చ అనవసరం అనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేయండి.

   Delete
  2. ఏదో ఒకటి రెండు కులాల్లో ఒకే ఇంటిపేరు ఉండడం వలన కులానికి ఇంటిపేరుకి సంబంధం లేకుండా పోదు. ఒక ఇంటి పేరు తో ఒకటి కాకపొతే రెండుకులాలు లెక్కలోకి వస్తాయి కాని ప్రతీ కులం లోను ప్రతి ఇంటిపేరు లేదు. అలాగే నేను ఏమి చర్చించాలి అన్న చర్చను మొదలుపెట్టలేదు. మీరు నావ్యాఖ్యని సరిగా చదవలేదో, అర్ధం చేసికోలేదో తెలియదు. పూర్తిగా అపార్ధం చేసికోన్నారని మాత్రం తెలుస్తుంది.


   మీరడిగినట్లే నా కామెంట్ లో చర్చ ఉంది . విమర్శ లేదు. మీకేదయినా అర్ధం కాకుంటే చెప్పండి మళ్ళీ వివరిస్తాను. తొందరపడి 'జ్ఞానం' అనే పెద్ద పెద్ద మాటలు అనకండి

   Delete
  3. ఇంటి పేర్లకి కులంతో సంబంధం లేదు. నాకు ఒక matrimonial websiteలో ఒక అమ్మాయి పరిచయమైంది. వాళ్ళది జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ముండా జాతి. మాది ఒక ద్రవిడ జాతి. కానీ మా ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావడం వల్ల ఆమె నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదు.

   దగ్గర బంధువుల్లో అయినా ఇంటి పేరు ఆధారంగా ఎవరు ఎవరికి ఏ వరస అవుతారో కూడా చెప్పలేము. కొండగొఱ్ఱె అనే ఇంటి పేరు ఉన్న స్త్రీలలో నాకు కొందరు వదిన వరస అయితే కొందరు పిన్ని వరస. హిందూ కుటుంబాలలో ఒక స్త్రీ ఒక పురుషునికి పిన్ని వరస అయితే వాళ్ళిద్దరి మధ్య వయసులో పెద్ద తేడా లేకపోయినా వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోరు. ఈ వరసల విధానమే అశాస్త్రీయం. ఇక ఇంటి పేర్లు గురించి పట్టించుకోవడం అనవసరమే.

   Delete
  4. మౌలి గారు, మీరేమి చెప్పదలచుకున్నారో నాకు అర్ధం కాలేదన్నది నిజం. అపార్ధం చేసుకున్నానని నిర్ధారించారా? ఏమో నాకలా అనిపించలేదు.

   కులం, ఇంటి పేరుకు ఉండే సంబంధంపై మీరు పొరపాటుబడుతున్నారని అభిప్రాయపడుతున్నాను. కులానికీ ఇంటిపేరుకీ సంబంధం ఉంటుందని మీదగ్గర ఆధారాలు ఉంటే తెలియజేస్తే అందరికీ ఉపయోగమే. అలా కాక సంబంధం ఉండకుండా పోదంటూ బెనిఫిట్ ఆఫ్ డవుట్ గా చెప్తే సరి కాదు.

   జ్ఞానం అనేది పెద్ద మాటా? అంటే ఏమిటి? మీ ఉద్దేశం అర్ధం కాలా? అదేమన్నా తప్పుడు మాటా ఏమిటి? మీరు చర్చపై ఉపచర్చను కామెంట్ చేశారు. దానికి నేను చెప్పినది ఎవరి జ్ఞానం మేరకు వారు చర్చిస్తారని. నేనిప్పటికీ నా వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నాను. అందులో తప్పు లేదు. తొందరపాటు అంతకన్నా లేదు. ఏ తెలుగు భాషావేత్తనైనా లేదా కనీస పరిజ్ఞానం ఉన్నవారెవరైనా అది తొందరపాటు లేదా ఎద్దేవా చేసేలా ఉన్న సమాధానం అని మీరు నిరూపిస్తే వెనుకకు తీసుకుని సారీ చెప్తాను. మీకు మీరే తొందరపాటని నిర్ధారించడమే తొందరపాటు అవుతుంది. మీ పై కామెంటుని దానికి సమాధానంగా నేను చెప్పినదీ మరోసారి సరిచూసి అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా తప్పు లేకుండా, నాకా ఉద్దేశం కూడా లేకుండా తెలుగు పదాలు వాడడమే తప్పన్నట్లు మీరు తొందరపడవద్దండీ.

   Delete
  5. ikkadi naa samaadhaanam raaledu kondalaravu gaaru.

   Delete
  6. కుల భోజనాలు, వనం లో జరిగితే అభ్యంతరం ఉంది మరి ఇంకెక్కడైనా జరగా అచ్చా ? ఎవరు ఎవరితో కలిసి వెళ్లి తింటున్నారు అన్నది అసలు సమస్య ఎందుకు అయ్యిమ్ది. కమ్మవారితో కలిసి తినము అనే వారు కూడా ఉన్నారు. వనభోజనాలు తినడం సరి అయితే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కలిసి తినొచ్చు

   ఇక కులానికి ఇంటిపేరుకి మధ్య సంబంధం మీకు వివరించెంట జ్ఞానం నాకు లేదండీ . కాబట్టి వదిలేస్తున్నాను.

   Delete
  7. మౌళి గారు నేను కమ్మ అనే పదం ఉపయోగించలేదు. ఏ కులానికైనా ఇది వర్తిస్తుంది.

   అగ్రకులమే కాదు నిమ్న కులం వారు చేసినా తప్పే. కులం తప్పయినప్పుడు అగ్ర ఐక్యత అయినా , నిమ్న ఐక్యత అయినా ఆ పేరుతో చేసుకుంటే తప్పే.

   అగ్రకుల దురహంకారమూ , నిమ్న కుల దుర్గంధమూ రెండూ తప్పే. ఈ రెండింటికీ వ్యతిరేకంగా ఆలోచించే చైతన్యం ఉన్నవారు రెండుచోట్లా ఉన్నారు. వ్యక్తులుగా ఉన్నవారి చైతన్యం వ్యవస్థీకృతమై కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాసెస్ సక్సెస్ కావడానికి చాలా సమయం పడుతుంది. ప్రాసెస్ ఏ వైపు ఉన్నది అనేదానిని అంచనా వేసి మనం ఎక్కడ ఏ కార్యక్రమానికి ఎంతమేరకు మద్దతు ఇవ్వాలి? అనేది తేల్చుకోవచ్చు.

   కులభోజనం ఎక్కడ చేసినా తప్పే. కుల భోజనం స్థానంలో జనభోజనం రావాలి. వన భోజనం వేరు. వనభోజనాలు ప్రకృతి ఆరాధన కోరకు ఏర్పడ్డాయని నాకు తెలిసిన జ్ఞానం. ప్రక్రుతి మనకు అన్నీ ఇస్తుంది కనుక ముఖ్యంగా వృక్షో రక్షతి రక్షిత: అంటారు కదా? అలాంటి మెసేజ్ ను పాస్ చేయడానికి వనభోజన సంస్కృతి ఏర్పడిందనుకుంటాను. నాకు పూర్తి జ్ఞానం లేదా విషయంలో. తెలిసినవారు చెప్పాలి. అలా చూస్తే వనభోజనం కాన్సెప్ట్ ను తప్పు పట్టలేము.

   ప్రక్రుతికి కులంతో పనిలేదు. దానిని బాగు చేసే చైతన్యం మనుషులందరికీ సమానంగా రావాలనే కోరుకుంటుంది. కనుక వనభోజనాలను వ్యతిరేకించాల్సిన పనిలేదు. కులభోజనాలు ఎలా ఎక్కడ జరిగినా వ్యతిరేకించాలనేదే నా అభిప్రాయం. కులం లేకుండా ప్రక్రుతిని రక్షించే ప్రోగ్రాములతో వనభోజనాలను జనభోజనాలుగా ఎంకరేజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. పల్లెప్రపంచం విజన్ లో ఉన్న నా పర్సనల్ కాన్సెప్ట్ కూడా అదే.

   ఫలానా కులాన్ని ప్రత్యేకంగా విమర్శించే పిచ్చి వాదనలు చేసేవారు మన బ్లాగు లోకంలోనూ ఉన్నారు. నేను దానికి కూడా వ్యతిరేకం. ప్రతి ఒక్కరు తమ ప్రమేయం లేకుండానే ఏదో ఒక కులంతో పెరుగుతున్నారు మరి. దానిని తొలగించకుండా వెకిలి మాటలు మాట్లాడే ప్రబుద్ధులకు వింతవాదులకు సమాధానం చెప్పలేము.

   Delete
  8. వన భోజనాలు ఆటవిడుపు కోసమే కాని ప్రక్రుతి ఆరాధనా వ్యవహారాలకోసం కాదు . జనభోజనాలో , కుల భోజనాలో అని మనం నిర్ణయించడానికి మన చేతుల్లో ఉండదు. ఎవరు కలిసి ఉంటె వాళ్ళు వెళ్తారు.
   మీరు చెప్పేవి ప్రభుత్వమే నిర్వహించాలి. ఇక మిగిలన గుంపులను నిషేధించాలి . అప్పుడు ఆగిపోఎవి కులభోజనాలు కావు వనభోజనాలు. కులాలుగా కలిసి వెళ్లి ఎక్కడ తిన్నా తప్పే అనడం నవ్వు తెప్పిస్తున్ది. అసలు తిండి గురించి స్వతంత్రత లేకపోవడం ప్రజాస్వామ్యం అవ్వదు.

   Delete
  9. వన భోజనం కాన్సెప్ట్ ఎందుకు? ఎలా ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? గురించి మీకు పూర్తిగా తెలుసా?

   Delete
  10. వనభోజనాలు మనం రోజు చూస్తూ ఉండే, మనచుట్టూ ఎప్పుడు ఉండే ప్రకృతిలోనే జరుగుతాయి. అది ఒక ఆటవిడుపు . ప్రకృతి ఆరాధన కాదు. కాస్త విశాలమైన స్థలం ఆటపాటలకి ఇబ్బంది లేని వాతావరణం. ఇంకాస్త చెట్టు నీడ . ముఖ్యం గా వర్షాలు బాగా నెమ్మదించిన తరుణం. మండే ఎండలకి దూరం గా వుండే సమయం.

   Delete
 3. ఇంటి పేరుకీ, కులానికీ సంబంధం లేదు. కృష్ణా జిల్లాలోనే "మేకా" అనే ఇంటి పేరు ఉన్నవాళ్ళలో వెలమ దొరలూ ఉన్నారు, కమ్మవాళ్ళూ ఉన్నారు. ఇంటి పేరుకి పురుషాధిక్యతతో మాత్రం సంబంధం ఉంది. అందుకే నాకు నా తండ్రి నుంచి సంక్రమించిన ఇంటి పేరుని తొలిగించుకున్నాను.

  ReplyDelete
  Replies
  1. ఇంటిపేరుతో పురుషాధిక్యం ఉంటుంది. ఎలా? ప్రవీణ్ గారు? తెలుసుకోవడానికి అడిగాను.

   Delete
  2. Surname is acquired from father but not from mother.

   Delete
  3. ప్రవీణ్
   ఇంటిపెరయినా ,బదులుగా పేరులో తండ్రిపెరయినా రెండు పురుషాదిక్యతనే సూచిస్తాయి. రెంటిలో ఏది ఉత్తమం? అలా కాకుంటే కులాన్ని, పురుషాదిక్యత లు రెండూ మనిషిపెరునుండి తొలగించడం ఎలా ?

   Delete
  4. మౌళి గారడిగిన ప్రశ్నకు మీవద్ద సమాధానం ఉన్నదా ప్రవీణ్? ఇదే ప్రశ్న గూగుల్ ప్లస్ లో మిమ్ములను నేను అడిగాను గుర్తుందా? నాకైతే మీరు ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. మనిషి పుట్టుకతోనే ఏదో ఒక కులంలోనూ, వంటిపేరుతో పాటు ఇంటిపేరును తనకు ఊహ తెలీకుండానే, తన ప్రమేయం లేకుండానే వస్తున్నది. అయినా ఇవి మనిషి ఏర్పాటుచేసుకున్నవే. ఈ ఏర్పాటు లేనప్పుడు ఎలా ఉండింది? ఆ తరువాత ఎందుకు వచ్చింది? ఎలా తీసేయాలి? ఏమి తీసేయాలి? ఉదాహరణకు మీరు ఇంటిపేరు తీసేసి మీ పేరు పబ్లిష్ చేయమన్నది నాకు నచ్చింది. జనవిజయంలో మీ ఆర్టికల్స్ అలాగే పబ్లిష్ చేస్తున్నాను. కానీ మొత్తం సమాజంలో కులం - ఇంటిపేరు అనేవి లేకుండా ఉండాలంటే ఇదీ మార్గం అనే పరిష్కారం మీరు చెప్పగలరా?

   Delete
  5. సమాధానం లేకపోలేదు కొండలావు గారు . చాలామందిని చూసాము. తమ పిల్లలకి ఇంటిపేరు లేకుండా పేరు పెట్ట డం . ఇక తండ్రిపేరు పెట్టడం పురుషాధిక్యత లోకి ఇంకా రాలెదు. ప్రేమ తోనే తండ్రి పేరు చేర్చుతున్నారు . ఇంటి పేరుకు బదులుగా తండ్రిపేరు పెట్టుకొనే సంస్కృతీ లో ఉన్నది మాత్రం పురుషాధిక్యతే.

   Delete
  6. @ Mauli గారు, కొందరు ఇంటిపేర్లు తొలగించుకుంటే అదెలా సమాధానం అవుతుందండీ. మొత్తం సమాజానికి ఇదీ పద్ధతీ! అంటూ ఒక మార్గదర్శకంగా చెపితే అది పరిష్కారం అవుతుంది. ప్రవీణ్ తన పేరులో మందంగి తీసేసి ఉంచాలని నన్ను కోరినప్పుడు తనని అభినందిస్తూ అలాగే చేశాను. ఇప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ అనే పేరుతోనే పల్లె ప్రపంచంలో ఆర్టికల్స్ ఉన్నాయి. కొన్ని రీ పబ్లిష్ చేయాల్సినవీ ఉన్నాయి. అవీ అదే పేరుతో వస్తాయి. అందుకు ప్రవీణ్ ని అభినందిస్తున్నాను. కానీ కేవలం కొందరు వ్యక్తులు ఇంటిపేరు లేకుండా చేసుకుంటే ఇంటిపేరు అవసరం లేని సమాజం ఏర్పడినట్లా?

   Delete
  7. ఝార్ఖండ్‌లో కొంత మందికి ఇంటిపేర్లు ఉండవు కానీ కులాలు ఉంటాయి. మా అమ్మగారి బ్యాంక్‌లో ఇద్దరు ఝార్ఖండీయులు ఉన్నారు. వాళ్ళకి ఇంటి పేర్లు లేవు కానీ కులాలు ఉన్నాయి.

   Delete
  8. కేరళ వారికి కూడా కొందరికి తండ్రిపేరే ఇంటిపేరుగా వస్తుంది తప్ప ఇంటిపేరు ప్రత్యేకంగా ఉండదు.

   Delete
  9. Those Jharkhandis don't even use fathers' names.

   Delete
  10. ఇంటిపేర్లు లేకుండానే (ఒం)వంటిపేర్లు ఉన్నాయంటారు.

   Delete
  11. సమాజానికి మార్గదర్సకము చెప్పేవాల్లకి, వినే వాళ్లకి అంత తీరిక లేదండీ . ఇంటి పేరు తీసివెయ్యడం అంటే కుటుంబ వ్యవస్థనే ఎదిరించడం. ఇవి మార్గదర్శకాలతో సాధించేవి కావు. ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోనేవి మాత్రమె.

   Delete
  12. మనమంతా తీరికగా ఉన్నప్పుడే ఈ కామెంట్స్ చేస్తున్నాము. మనమూ సమాజంలో భాగమే.

   Delete
  13. తీరికగా ఉన్నప్పుడే నా? కాదే ?

   Delete
  14. అబద్దాలు కూడా ఒక పరిమితిని దాటి చెప్పడం సాధ్యం కాదు. కొంత మంది అంటుంటారు "ఈ రోజుల్లో కులాలూ & మతాలూ లేవనీ, కులమతాలకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదనీ". కానీ "ఈ రోజుల్లో ఇంటి పేర్లూ, వరసలూ ఎవరూ పట్టించుకోవడం లేదు" అని మాత్రం ఎవరూ అనలేరు. హిందూ కుటుంబాలలో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పిన్ని వరస అయితే వాళ్ళు దూరపు బంధువులైనా వాళ్ళ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. ఇంటి పేర్ల విషయానికి వద్దాం. కృష్ణా జిల్లాలో మేకా అనే ఇంటి పేరు ఉన్న కమ్మవాళ్ళు అదే ఇంటి పేరు ఉన్న వెలమదొరలని కులాంతర వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మా ఉత్తరాంధ్రలో మాత్రం అలా ఒప్పుకోరు. ఇక్కడ కులం గురించి పట్టించుకోకపోయినా ఇంటి పేర్లని మాత్రం పట్టించుకుంటారు.

   Delete
 4. కులం పేరుతో రాజకీయ నాయకుల్నీ, సినిమా నటుల్నీ ఆరాధించడంతో పోలిస్తే ఈ వన భోజనాలు అనేది చిన్న సమస్య. "తాండ్ర పాపారాయుడు పుట్టిన కులంలోనే ఝండా ఎగరెయ్యడానికి భయపడినవాడు కూడా పుట్టాడు" అని కె.సి.ఆర్.ని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఎవరో వ్రాసారు. ఇద్దరు పద్మనాయకుల్లో ఒకడు పిల్లి, ఒకడు సింహం. కానీ పిల్లికే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది.

  ReplyDelete
 5. నా ఉద్దేశ్యంలో కులాలు, జాతులు, వర్గాలు అనేవి కేవలం ఒకరికొకరు పరిచయం కొరకే గాని ఎక్కువ,తక్కువ చూపించుకోవడానికి కారణం కాదని నా నిశ్చితాభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. Then why castes even have sub-divisions? In Coastal Andhra itself, Adi Velamas do not marry Padmanayaka Velamas.

   Delete
  2. చౌదరి గారు, మీరు చెప్పినట్లే ఉంటున్నాయా? మీరే చెప్పండి.

   Delete
 6. అభిప్రాయ భేదాలు కులాలుగా మారాయి, ఒకప్పుడు తక్కువ మంది ఉండే వారు కాబట్టి కులాలు ఏర్పడ్డాయి, ఇప్పుడు చాలా ఎక్కువమంది అయ్యాము కాబట్టి వేరుకుంపట్లు ఏర్పడ్డాయి, కొత్త కులాలు పుట్టుకు రాలేక పోతున్నాయి!
  ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా విడిపోవద్దు అన్నదమ్ములారా అన్నాడా? లేదు కేవలం కులం అన్నదాన్ని వీడండి అన్నాడు!
  అది వీదలేము ఎందుకంటే పడవను నడిపే వాడిని ఓడను నడపమంటే నడప గలడా లేదా ఓడను నడిపే వాడిని పడవ నడపమంటే నడప గలడా?
  ఇక ఈ కుల భోజనాల సంగతికి వస్తే, కొంతమందికి ఆవు పూజనీయం, కానీ ఇంకొంతమంది కి ఆవు ఆహారం ఇద్దరినీ ఒకే తాట మీదకు తీసుకు రాగాలరా? లేదు, కానీ ఆవుని ఆహారం లాగా చూడమని చెప్పే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు! మరి ఉమ్మడి విందు ఎలా అవుతుంది?
  ఇంకొంత మంది ఇలా ఉమ్మడి భోజనాలకు వచ్చేది తానూ కొనలేనివి తినొచ్చు అని, ఇంకొంతమంది ఇది ఏర్పాటు చేసేది అందుకే!
  ఇక దీనికి పెళ్ళికి సంభందం ఏమిటో అర్ధం కాదు, ఎప్పుడో విడిపోయిన జన్యు సంభందాలు ఇప్పుడు కలపాలి అంటే జన్యు క్రమం తీసుకుని కలపాలి, అది అతి తెలివైన వాళ్లకు ఎలా అర్ధం అవుతుందో నాకు తెలియదు!

  ReplyDelete
 7. మొన్నా మద్య ఒక ఆదివారం విజయవాడ వెళ్ళాను. పాత కళాశాల మిత్రులందరం కలుసుకోవాలనికూడా తీర్మానించుకునివెళితే ఆ రోజు ఒక్కరు అందుబాటులో వుంటే ఒట్టు. ఎక్కడికెళ్ళారని ఫోనులు చేస్తూనేఉన్నం. అందరూ ఎవరి కులభోజనాలాలో వారు మునిగిపోయి మావి వనభోజనాలున్నాయి నెక్స్ట్ వీక్ కలుద్దాం అన్నారు. నేను మైలవరం దగ్గరనుండీ మొదలుపెడితే విజయవాడదాకా ఇవేఫ్లెక్జీలు. ఫలానా కులభోజనాలు అని వాటి సారాంశం. ఒక్క క్షణం నాకనిపించింది ముందుకెళుతున్నామా?వెనక్కి వెళుతున్నామా? అని. మరునాడు మా స్స్నేహితులకి కాల్ చేసి అడిగేశాకూడా. దాని మీద ఒక వ్యాసం కూడా వ్రాసా. దాని శీర్షిక పేరు మాత్రం చెప్తున్నా,"మనవైన కులభోజనాలు,మరుగైన వన(సహపంక్తి)భోజనాలు". అవునా?కాదాండీ?.

  ReplyDelete
  Replies
  1. స్వరాజ్యలక్ష్మి గారు, " మనవైన కులభోజనాలు - కరవైన వన భోజనాలు " బాగుందండీ మీ శీర్షిక. వనభోజనాల ఉద్దేశం లో ప్రక్రుతిని ఆరాధించడం పర్యావరణ పరిరక్షణ అనే మెసేజ్ ఉన్నది. కుల భోజనాలలో వెనుకబాటుతనమే ఉంటుంది. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కామెంటుకు ధన్యవాదములు.

   Delete
  2. స్వరాజ్యలక్ష్మి గారు, మీరు వ్రాసిన ఆర్టికల్ లింకు ఇవ్వగలరా?

   Delete
  3. కొండలరావుగారు,త్వరలో నాలక్ష్మీస్ మయూఖ బ్లాగులో ఆ ఆర్టికల్ వుంచుతాను. స్పందించినందుకు ధన్యవాదాలు.

   Delete
  4. అలాగే స్వరాజ్యలక్ష్మి గారు. మీ బ్లాగు యూ.ఆర్.ఎల్ ఇవ్వగలరు.

   Delete
 8. కొందల రావు గారు,
  మీ డాక్టరు సిగిరెట్టూ ఉదాహరణ కీ, ఇక్కడి కేసుకీ కొంచెం తేడా ఉంది.
  సిగిరెట్ తాగటం వలన డాక్టర్ కి వ్యక్త్ గతం గా నష్టం . ఆరోగ్యం చెడుతుంది.
  అదే, కుల గజ్జి మనిషికి దానివలన వ్యక్తిగతం గా లాభం,రికమండేషన్లూ, గట్రా చేయించుకోవచ్చు.ఫేవర్లు పొందవచ్చు (కులగజ్జి మనిషి కూడా నైతికం గా దిగజారటం వలన, అతనికి కూడా నైతిక పరమైన వ్యక్తిగత నష్తం ఉంది. కానీ ఆ వ్యక్తికి అది నష్టం గా కనిపించనంత కాలం అది నష్టం కాదు. ఎందుకంటే ఇది వ్యక్తి గత విషయం కనుక.
  చాలా మంది పెద్ద మనుషులు తమ నైతిక బ్రష్టత్వాన్ని ఎంజాయ్ చేస్తూ (వ్యక్తి గత లాభం కనుక), మిగిలిన వారికి లెక్చర్ లు దంచుతారు. ఎదుటి వారికి చెప్పెటందుకె నీతులు ఉన్నాయి అని ఊరికినే అనలేదు, మరి. అలాంటి వారు మీరు చెప్పిన డాక్టర్ లాజిక్ ని వాడి ఎదుటి వారిని డబాయించి, తాము మాత్రం హాయిగా వ్యక్తి గత లాభాన్వేషణ లో మునగ గల సమర్ధులు.

  ReplyDelete
  Replies
  1. మీ ఉదాహరణను నేను అంగీకరిస్తాను. పైన శ్రీనివాస్ గారికి ఇచ్చిన సమాధానంలో ఈ అంశంపై వివరంగా వ్రాస్తానని చెప్పాను. పుట్టుకతో ప్రతి ఒక్కడికీ ఏదో ఒక కులమ వివిధ కారణాలరీత్యా అంటగడుతున్నారు. దానిని వదిలించుకోవాలనుకునేవారు కూడా ఒంటరి ఆదర్శాలతో పెద్దగా సాధించేదేమీ ఉండదు. అలా ఉండేవారి సంఖ్య పెరిగి అది సమూహమై మొత్తం సమాజంలో విప్లవాత్మక మార్పు జరిగినప్పుడే కుల నిర్మూలన జరుగుతుంది. అందులో వ్యక్తి పాత్ర చాలా స్వల్పం. ఆచరించేవాడు అన్నీ చేసి చూపేవాడే కులనిర్మూలన గురించి మాట్లాడాలనడం కులనిర్మూలనా ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తాయి. అదే సందర్భంలో ఓ వ్యక్తి కులం రద్దు చేసుకోవడం ఇతర కులాలతో కలసి ఉండడం చేస్తూ కులనిర్మూలన గురించి చెపితే మీరన్నట్లు డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఆ వ్యక్తి వరకు. ఆ వ్యక్తికి ఇమేజ్ వస్తే చాలదు. మొత్తం సమాజంలొనే మూలంలొనే కులాన్ని దుంపనాశనం చేస్తే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. సుదీర్ఘమైన ఈ ప్రాసెస్ లో కులభోజనాల స్థానంలో జనభోజనాలు పెట్టడమే కాదు. వన భోజనాల ప్రాధాన్యతను అసలు ఉద్దేశాన్ని వివరించాలి.

   Delete
  2. కొండలరావు గారు మీ పై వ్యాఖ్యాక్ ఇసమాధానమ్ ముందే ఇచ్చి ఉన్నాను . అవి కుల వనభోజనాలు కాబట్టి కులాన్ని వ్యతిరేకించే వారంతా వ్యతిరేకిన్చాలనుకోవడం లో మాత్రమె నాకు అంగీకారం లేదు. కారణం మీరు చెప్పిన 'కమ్మ వనభోజనాల ' ప్లేసులో అదే స్థాయిలో ఉన్న ఇంకే కులం పేరయినా ఉండొచ్చు . కాని అది వారితో మొదలవలేదు . వారు కూడా ఇంకొకచోట ఇంకొకరి భోజనాల్లోకి అనుమతించబడని వాళ్ళే . పై స్థాయిలోనూ, క్రింది స్థాయిలోనూ వచ్చే మార్పు మధ్య స్థాయిలోకి అనివార్యంగా ప్రవేశిస్తుంది కాని మధ్యనుండి పైకి, క్రిందకి పూర్తిగా సాధ్యం కాదు. వన భోజనాలు ని మనం అంగీ కరిస్తే అక్కడికి ఎవరు వెళ్లి కలిసి తింటున్నారన్నది నాకు అభ్యంతరం ఉండబోదు. బొందలపాటి గారు కూడా వ్రాస్తున్నారు కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఉంచుతున్నాను.

   వనభోజనాలను అందరికి ఆమోదం గా ఉండాలంటే ఎలా ఉండాలి . అక్కడ ఏం తినాలి , ఏం తినకూడదు . ఎందుకు ? ఒక కులం వనభోజనాలకు వెళ్తే ఎవరెవరు నొచ్చుకుంటారు ? ఎందుకు? కులాలుగా వెళ్ళ కూడదు అంటే మరి ఒక కంపెని నుండి లేదా ఒక వీధి నుండి గుంపుగా వెళ్ళినా ఈ వ్యత్యాసాలు రావా?

   నేను ఈ పోస్టులో వ్యాఖ్యలు ఉంచుతున్నది కేవలం నాకు ఇది సమస్య ఎందుకు అయ్యింది అన్నది అర్ధం చేసుకోవడానికి మాత్రమె.

   Delete
  3. మౌళి గారు పోస్టులో ఎక్కడా నేను ఉపయోగించని కమ్మ పదాన్ని మీరెందుకు ప్రత్యేకంగా లాగుతున్నారో అర్ధం కాలా? కులం పిచ్చి కమ్మవారికే ఉన్నదా ఏమిటి? నిమ్న కులాల వారికి , కమ్మ కంటే ఎక్కువైన కులాలవారికీ లేదా? కులం అంటే ఎక్కడైనా తప్పే. ఇందులో అగ్ర అనే అహంతో నిమ్నను అణచాలనుకుంటే ఉండే సహజ పక్షపాతం ఏదో ఒక కులాన్ని సమర్ధించినట్లవుతుందా? నిమ్నలో ఉండే చైతన్య రాహిత్యాన్ని ఎండగట్టడం తొలగించాలనుకోవడం కులాన్ని సమర్ధించినట్లు అవుతుందా? కాదనే నా అభిప్రాయం.

   కుల భోజనం వేరు. వన భఒజనం వేరు. ఆ రెండింటిమధ్య తేడాను ఇదే పోస్టులో మీకు చెప్పిన సమాధానంలోనే నాకు తెలిసిన మేరకు చెప్పాను గమనించగలరు.

   ఏ కులభోజనాన్నైనా వ్యతిరేకించాలని, ప్రక్రుతిని, పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో మన సంస్కృతిలో వస్తున్న వన భోజనాలను జన భోజనాలుగా కొనసాగిద్దామని, ఎకాడైనా ఏ కుల భోజనాలనైనా వ్యతిరేకించి ఎవరు చేసినా జన భోజనాలను స్వాగతిద్దామని నా అభిప్రాయం.

   Delete
  4. ఒక అగ్రకులం అన్న తర్వాత ఏ కులం పేరు చెబితే ఏముంది లెన్ది. నేను ఒకే స్థాయి లో ఉన్న అన్ని కులాలు గురించి కూడా చెప్పాను కదా. ఇక కుల వన భోజనాల గురించి నాకు పెద్దగా అభ్యంతరం లేకపోవడానికి కారణాలు ఉన్నాయి . పండుగలకి అన్ని కులాలు కి కలిపి ఏర్పాటు చేస్తున్న భోజనాలలో విన్న విమర్శలు తినేవారిని వేధిస్తాయి . దానికన్నా ఎవడికి నచ్చిన తిండి వాళ్ళు కలిసి తింటే తప్పేంటి. తినే చోట తిండికి విలువివ్వాలి కాని కులానికి కాదు. కాని అన్ని కులాలు కల్సి తినేచోట జరిగేది ఇదే !

   Delete
  5. వన భొజనాలకి వెళ్ళే మనుషుల పరిణితి ని బట్టి ఉంటుంది.వారికి కుల స్పృహ లేక పోతే కుల రహిత వన భోజనాలు బాగుంటాయి. అదే కుల స్పృహ ఉన్నవారు వెళ్తే, తమ కుల భోజనాలలో ఉన్నంత ఫ్రీగా ఉండలేరు. ఎందుకంటే వీరు తమ కుల భోజనాలలో స్వేచ్చ గా మిగిలిన కులాల పై జోకులూ విమర్శలూ గట్రా చేస్తారు. తమ కులం వారి తో ఫ్రీ గా మిక్స్ అవుతారు.(నేను పని చేసే కంపెనీ లో అందరూ పాల్గొనే పార్టీ ల లో తమిళులూ, తెలుగులూ, హిందీ లూ వేర్వేరు గుంపులు గా తయారయి మాట్లాడుకొంటారు..అలానే కులాల విషయం లో కూడా ఇది సహజం) అదే అందరి భోజనాలలో అలాంటి వీలు ఉండదు నోటినీ మన్సునీ అదుపు లో పెట్టుకోవాలి. అలా అదుపు లో పెట్టుకోలేనివారు పక్క వారి కి బాధ కలిగించ వచ్చు. హైదరాబాదు లాంటి ఊర్ల లో అందరి భోజనాల లో పెద్ద గొడవలు జరగవు, కానీ,చిన్న ఊర్ల లో కొట్లాటలు కూడా జరగవచ్చ్హు.
   ఇక ఆహారం (వెజ్, నాన్ వెజ్, బీఫ్) వల్ల వచ్చే తేడాలు ఉండనే ఉన్నాయి.
   నేను బెంగళూరు లో నా ఫ్రెండ్ వెంట అతని కులానికి(నా కులం కాదు) సంబంధించిన ఓ పార్టీ కి వెళ్ళవలసి వచ్చింది. ఆ పార్టీ లో నా కులనికి సంబంధించిన ఓ యాక్టర్ పైన జోకులు పేలాయి. నేను కూడ ఆ జోకులు ఎంజాయ్ చేశాను..ఎందుకంటే ఆ జోకుల్లో ఎంతో కొంత నిజముంది కాబట్టీ.. కాసేపటికి సబ్జెక్ట్ రాజకీయాలపైకి మళ్ళింది..అప్పుడు ఆ యాక్టర్ రాజకీయాలలోకి వెళ్ళటం, అతను ఒకప్పుడు జరిపిన కాల్పులూ..దాని తరువాత..ఆ యాక్టర్ కులం వారంతా అలాంటి సన్నాసులే అనె అర్ధం లో జోకులూ..ఇవన్నీ వినవలసి వచ్చింది. దానితో మళ్ళీ అలాంటి భోజనాలకి వెళ్ళకూడదని తీర్మానించుకొన్నాను.

   Delete
  6. కమ్మ వ్యతిరేకత కావచ్చు, ఇంకో అగ్ర కుల ప్రత్యేక వ్యతిరేకత కావచ్చు, వాటి వ్యతిరేక కుళ్లు జోకులు కావచ్చు అలాంటివారు కూడా తామూ ఆదర్శవంతులమే అని చెప్పుకుంటుంటారు. ఏ కుల వ్యతిరేకత అయినా తప్పే. కుల వ్యతిరేకతకు ఫలానా కుల వ్యతిరేకతకీ చాలా తేడా ఉన్నది. మంచి చెడు అనే వ్యక్తులు అన్ని కులాలలో ఉంటారు. బ్లాగు లోకంలోనూ ఇలాంటి వారు నాకు తగిలారు.

   Delete
  7. జనభోజనాలు దేవుడి పెరుతో మాత్రమె జరుగుతాయి. అదీ పుణ్యం వస్తుంది తింటే అన్న భ్రమ తో వెళ్లి అలా తినేసి రావడం వరకు పర్లేదు వాళ్ళకి .ఇక ఆ జనభోజనాల్లో పొందే ప్రయోజనం చెప్పుకోదగ్గది కాదు. కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ జరుపుకొనే ఈ వనభోజనాల జోలికి వెళ్ళకపోవడమే బెటర్ . ఒకే కులం వాళ్ళు ఒకే చోట ఎంతో కాలం ఇలాంటివి జరుపుకోలేరు. వాటంతట అవి అంతమయి పోతాయి లేదా మారిపోతాయి . ఆలోగా బీ పీ తెచ్చుకోవడం వృధా !

   Delete
  8. జన భోజనాలు దేవుడి పేరుమీద మాత్రమే జరుగుతాయనేది తప్పు. BP వేరు. సమాజంలో మార్పుకోసం ప్రయత్నించడం వేరు. ఇవి రెండూ ఒకటే అనుకోవడం వేరే రోగం అవుతుందని నా అభిప్రాయం.

   Delete
  9. నాకు తెలిసి ఇప్పటి వరకు దేవుడి పేరుతోనే జరిగాయి. ఇప్పుడు పార్టీలు , సంఘాలు కూడా పెడుతున్నాయి. మంచిదే నలుగురికి అన్నం పెట్టడానికి ప్రోత్సహిస్తున్న వనభోజనాలు కులానివయినా మతానివయినా ..:)

   మార్పు కోసము అందరూ ప్రయత్నిచొచ్చు . ఉన్నది అర్ధం అయితేనే మార్పు కోసం ప్రయత్నం వ్యర్ధం కాదు

   Delete
 9. అయినా ఇప్పుడు వన భోజనాలు ఎక్కడ ఉన్నాయి?
  కనీసం తోట భోజనాలు కూడ లేవు.
  అన్నీ పార్క్ భోజనాలే.

  ReplyDelete
  Replies
  1. ఇందాకే హైదరాబాద్‌లో "బ్రాహ్మణ వనభోజనం" ఫ్లెక్సీ చూసాను. నాదొక సందేహం. పద్మనాయక వెలమల వనభోజనానికి కొప్పుల వెలమల్ని పిలుస్తారా? వై.ఎస్.రాజశేఖరరెడ్డి కొరిదెకాపు (రెడ్లలోనే అంటరాని శాఖ)కి చెందినవాడు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top