ఓ వాదన ఎలా ఉండాలి?

మనం పుట్టి పెరిగిన దానిని బట్టి మన మనసులో కొన్ని అభిప్రాయాలు, భావనలు ఏర్పడతాయి.

కొంత అలోచించి ఓ నిర్ధారణ కు వస్తాం. కొన్నింటి పట్ల నమ్మకాలూ ఏర్పరచుకుంటాం.

మన నిర్ధారణలు లేదా నమ్మకాలూ నిజం కావచ్చు. కాక పొవచ్చు.

వాదనకు లేదా చర్చకు దిగిన వ్యక్తి ఈ రెండు ధోరణులకు గురయ్యే అవకాశం ఉంది. 

1) స్వీయ మానసిక ధోరణి              2)  వస్తుగత విధానం 

ఇందులో మొదటిది మన నమ్మకాలూ విశ్వాసాలు ఆధారంగా వాదించడం. కాగా రెండోది కార్య కారణ సంబంధాలను ఆలోచిస్తూ భౌతిక పరిస్తితులను బట్టి వాదించేది.

మొదటి రకం వారు నేను నమ్ముతున్నాను కాబట్టి అదే రైటంటారు. రెండో రకం వారు నేను రైట్ అని నిర్ధారించుకున్నాను కాబట్టి వాదిస్తున్నానంటారు. 

ఈ రెండింటిలో ఏ వాదన పధ్ధతి సరయినది ?
 పల్లా కొండల రావు.


--------------------------------------------------------

ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.


*republished
Reactions:

Post a Comment

  1. >>నేను రైట్ అని నిర్ధారించుకున్నాను కాబట్టి వాదిస్తున్నానంటారు.

    నేను ఆ రకం .

    ReplyDelete
  2. ఎవరైనా తమకి తెలిసినదే చెపుతారు. కొంత మందికి నిజం తెలిసిన తరువాత కూడా ఏవో కారణాల వల్ల అది ఒప్పుకోరు. ఉదాహరణకి భారతీయ జ్యోతిషులు ఇప్పటికీ భూకేంద్రక సిద్ధాంతాన్నే నమ్ముతారు. వాళ్ళకి సూర్యకేంద్రక సిద్ధాంతం తెలిసినా వాళ్ళు తమ శాస్త్రంలో మార్పులు చేసుకోలేక అడ్డమైన వాదనలు చేస్తారు. ఒక టివి చానెల్‌లో ఒక జ్యోతిషుడు ఇలాగే వాదించాడు "భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని మాకు తెలుసు, మేము నమూనా కోసమే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెపుతున్నాం" అని. ఆ జ్యోతిషుణ్ణి ఇన్నయ్య గారు ఎంత అడిగినా అతను ఇదే సమాధానం చెప్పాడు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top