- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

వినదగునెవ్వరుచెప్పిన

Post a Comment

 1. ఆర్థికంగా ముందున్నవాళ్ళ పిల్లలైతే బి.ఎ.లు, ఎం.బి.ఎ.లు చదువుతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ లేకపోయినా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం దొరికే అవకాశం ఏమాత్రం లేని కూలీవాళ్ళ పిల్లలు ఎమ్మార్పీఎస్ మీటింగ్‌లకి వెళ్ళడం తాను చూసానని తెలుగువార్తలు బ్లాగర్ విశేఖర్ గారు ఓ సారి వ్రాసారు. అదే నిజమైతే రిజర్వేషన్ పేరుతో జనాన్ని ఫూల్ చెయ్యడంలో పాలలవర్గం సఫలమయ్యిందనే అనుకోవాలి.

  ReplyDelete
 2. By the way, Visekhar is not against the policy of reservation though he is aware that children of daily wage workers are not benefited by reservation. రిజర్వేషన్‌ని పూర్తిగా వ్యతిరేకించేది నేను. రిజర్వేషన్ ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. ఇదేమీ కుల వ్యవస్థ కంటే గొప్ప సంప్రదాయం కాదు.

  ReplyDelete
 3. కులసమస్యలు ఎప్పటినుండో అనగా రిజర్వేషన్లు రాకముందే ఉన్నాయి. పాత సమస్యకు కొత్త కారణం ఆపాదించడం సబబేనా?

  ReplyDelete
  Replies
  1. పాత సమస్యకు కొత్త కారణం కాదు. కులం ఆధారంగా రిజర్వేషన్ వలన కుల సమస్య ఉంటోంది. రిజర్వేషన్ అనేది కులం ఆధారంగా ఎంతకాలం ఇవ్వాలి? ఆర్ధిక పరమైన రిజర్వేషన్ ఉండాలి కదా? ఇప్పుడున్న కుల ఆధారిత రిజర్వేషన్ లలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం లేదా? అన్నది సమస్య.

   Delete
  2. దళితవాదులది కక్కలేని మింగలేని సమస్య. కులం ఉండాలి అని ఒప్పుకుంటే దళితులు శారీరక శ్రమలే చెయ్యడానికి పుట్టారనే కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాల్సి వస్తుంది, అప్పుడు వీళ్ళు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు చెయ్యడానికి అవ్వదు. కులం ఉండకూడదు అనుకుంటే ఇంకో సమస్య. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం దొరికే అవకాశం ఏమాత్రం లేని లేబర్ జనం చాలా మంది ఉన్నారు. రిజర్వేషన్ ఇచ్చే కొద్దిపాటి అవకాశాలు ఆర్థికంగా ముందున్న దళితులకే అందుతాయి. ఆ ఆర్థికంగా ముందున్న దళితులు తమకి అవసరం లేకపోయినా కేవలం రిజర్వేషన్ కోసం కులం పేరు చెప్పుకుంటారు. కులం ఉండకూడదు అనుకున్నా రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాల్సి వస్తుందని ఇంకో భయం. అలాగని కులం ఉండాలని కోరుకుని కర్మ సిద్ధాంతాన్ని తిరిగి తెచ్చుకోలేరు.

   Delete
  3. పైదంతా చదివాక మీకు చాతగానిదాన్ని వ్యవస్త మీదకి నెట్టేసే ఒక మానసిక వ్యాధి మీకున్నదని తెలుస్తోంది. మీరెంత త్వరగా డాక్టరుక్కు చూపించుకుంటే అంత మంచిది. ఒక ఎస్టీ అయ్యుండీ జాబు సంపాదించుకోవడం చాత కాకపోవడంవాల్ల మీలోవచ్చిన మార్పు అది.. దానికి తోడు మీ ఫ్రెండు ఎవరో కూడా జాబు కొట్టడం చాతగాక ఆటో నడుపుకుంటున్నాడు. వ్యవాసాయం చేసుకునే మీకు, ఆటో నడుపుకున్నే మీ ఫ్రెండుకి కనీసం ప్రైవేటు జాబు సంపాదించుకోవడం కూడా చాతకాలేదంటే, మీ నాలెడ్జి అర్ధమౌతోంది. అందుకే నేనెన్నిసార్లు "రిజర్వ్వేషన్ గౌరవం కోసం" అని చెప్పినా.. దాన్ని స్కిప్ చేసి... ఉధ్యోగం.. ఉధ్యోగం.. అని కలవరిస్తున్నారు..

   మిమ్మల్నిఎగతాళి చెయ్యట్ళేదు.మీమంచికే చెబుతున్నాననీ అర్ధం చేసుకోండి..

   ఇక ఆ కర్మ సిద్దాంతం.. మట్టి.. మశానం.. ఇవన్ని మీదగ్గర విషయం ఐపొయిందని నిరూపిస్తున్నాయ్..

   Delete
  4. ఒరిస్సాలోని మీరాబలి గ్రామంలో ఒక లైసెన్స్ లేని సారా వ్యాపారిని అడిగాను "పోలీసులు మీ వ్యాపారాన్ని బంద్ చెయ్యిస్తే మీరు కూలీ పనులకి వెళ్ళడానికి సిద్ధమేనా?" అని. ఆయన సమాధానం చెప్పాడు "వ్యవసాయ కూలీ పనులకి వెళ్తే సంవత్సరానికి రెండు నెలలో పనులు ఉంటాయి, రోడ్ నిర్మాణ పనులకి వెళ్తే కాంట్రాక్టర్ డబ్బులు తొందరగా ఇవ్వడు, మాకు ఉన్న వ్యవసాయ భూమి నుంచి ఐదారు బస్తాలు ధాన్యం వస్తుంది, అది మాకు సరిపోదు" అని. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువ ఇస్తుంది కానీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి బిల్లులు ఆలస్యంగా ఇస్తుంది, కాంట్రాక్టర్లు కూలీలకి డబ్బులు ఆలస్యంగా ఇస్తారు. ప్రభుత్వం ఇలాంటి తుగ్లక్ పనులు చేస్తే కూలీవాళ్ళ పిల్లలు కూడా తమకి ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి అనుకోరా? !

   Delete
 4. >>ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఖరీదైన ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లలో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు.>>
  ఇది కూడా తప్పుడు వ్యాఖ్యే...ముత్యాల రాజు ప్రభుత్వ ఉద్యోగి కొడుకా ?

  ReplyDelete
  Replies
  1. బ్రిటిష్ జమానాలో మన దేశ అక్షరాద్యత 12% కంటే ఎక్కువ లేదు. అప్పట్లో కేవలం చదవడం వ్రాయడం వచ్చినవాడికే పట్వారీ (కరణం) ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఆ కరణం రిటైర్ అయ్యేటప్పుడు తన కొడుక్కే కరణం ఉద్యోగం ఇప్పించి రిటైర్ అయ్యేవాడు. ఇప్పుడు ఎం.బి.ఎ. చదివినవాళ్ళే మేనేజర్ ఉద్యోగాలు దొరక్క గుమాస్తా ఉద్యోగాలు చేస్తున్నారు. కూలీవాళ్ళ పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం అనేది ఇప్పుడు ఏమాత్రం సాధ్యం కాదు.

   Delete
  2. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగం అసాధ్యం.

   Delete
 5. ఇదివరకు ప్రధాన ఆదాయ వనరులు ఆలయాల్లోనే ఉండేవి కాబట్టి అగ్రవర్ణం, హీన వర్ణం అని వేరుచేసారు. ఇపుడు ఆదాయమార్గాలు పెరిగిపోయాయి. భవిష్యత్తులో కులాలు మతాలూ ఎవరూ పట్టించుకోరు.ఏ ఒక్క దళిత రాజకీయనాయుకుడైనా రిజర్వేషన్లు అవసరం లేదని ప్రకటించిన మరుక్షణం ఇవన్నీ పోతాయి.

  ReplyDelete
 6. రిజర్వేషన్లు తీసేస్తే కులం పోతుందంట. ఇది ఎలా ఉందంటే ఇచ్ గార్డ్ కంపెనీ మూసేస్తే గజ్జితగ్గుతుంది అన్నట్టు ఉంది.....

  ReplyDelete
  Replies
  1. రిజర్వేషన్లు తీసేస్తే కులం సమస్య పోదు. కులం పేరుతొ మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం సరైనదా? అలా చేయడం వలన కులం సమస్య మరింత జటిలం అవుతోందా? అన్నది ప్రశ్న. రిజర్వేషన్లు తీసేస్తే కులం పోతుందని పైన ఎవరూ కామెంట్ చేసినట్లు లేదు. మరోసారి గమనించగలరు.

   Delete
  2. అస్సలు రిజర్వేషన్ ఎందుకు రాజ్యాంగంలో పెట్టారు అన్నదానికి సమాధానం ఎంతమందికి తెలుసు?

   Delete
  3. ప్రవీణ్, వీలయితే " రిజర్వేషన్ ఎందుకు రాజ్యాంగంలో పెట్టారు?!" అనే అంశంపై ఒక ఆర్టికల్ పంపించగలవా?

   Delete
  4. ఇచ్ గార్డ్ కంపెనీ మూసేస్తే గజ్జితగ్గుతుంది అన్నట్టు ఉంది.... =)) =)) =))

   Delete
  5. రిజర్వేషన్ అనేది అసలు మందే కాదు. తెలుగు బ్లాగుల్లో రిజర్వేషన్‌ని బలంగా సమర్థించే మందార ప్రభాకర్ అనే ఆయనే చెప్పుకున్నాడు "రిజర్వేషన్ యొక్క ఆబ్జెక్టివ్ పేదరిక నిర్మూలన కాదు, పేదరిక నిర్మూలనకి వేరే దారి ఉంది" అని. రిజర్వేషన్ వల్ల కులం పోదు అని దాన్ని బలంగా సమర్థించేవాళ్ళకే తెలిసినపుడు దాని మీద నమ్మకం లేనివాళ్ళు మాత్రం దాని మీద ఆశ పెట్టుకుంటారా?

   Delete
  6. రిజర్వేషన్లు మందో కాదో పక్కన పెడితే అసలు రోగం ఏమిటి? రోగనిర్ధారణ తప్పయితే వైద్యం కుదరదు.

   రిజర్వేషన్లు మానేస్తే కులాలు పోతాయని అనడం మందులు వాడడం రోగి హాయిగా లేచితిరిగుతాడని అన్నట్టు.

   రిజర్వేషన్లు ఎందుకు రాజ్యాంగంలో పెట్టారు అన్న ప్రశ్నకు జవాబు ఇంపాదిగా కాస్త పొడవయిన వ్యాఖ్యలో రాస్తాను.

   Delete
  7. Praveen! రిజర్వేషన్ కులాలు పోవడానికి, పేదరిక నిర్మూలనకీ అని మీకెవరు చెప్పారు?

   రిజర్వేషన్ మీద అవగాహన లేకుండా ఎవ్వరూ కామెంట్లు చెయ్యకండి..

   Delete
  8. రిజర్వేషన్ అనేది సామాజికంగా వెనుకబడిన కులాలలోని ఆర్థికంగా ముందున్న కొంత మందికి అవకాశాలు కల్పించడానికే కదా. కుల నిర్మూలన, పేదరిక నిర్మూలన దాని ఆబ్జెక్టివ్స్ కావని అందరికీ తెలుసు. రిజర్వేషన్ వల్ల ఏమాత్రం లాభం పొందలేని కూలీవాళ్ళు కూడా ఎమ్మార్పీఎస్ మీటింగ్‌లకి ఎలా వెళ్తున్నారనే ఇక్కడి ప్రశ్న. ఆబ్జెక్టివిజమ్‌ని కాకుండా సబ్జెక్టివిజమ్‌ని నమ్ముకునేవాళ్ళు ఎవరూ బాగుపడరు.

   Delete
 7. సామాజికంగా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండికూడా కులం పేరిట అవసరం లేకపోయియినా నిస్సిగ్గుగా రిజర్వేషన్లు పొందుతున్నవారిని ఎంతోమందిని చూస్తున్నాము.

  ReplyDelete
  Replies
  1. >>నిస్సిగ్గుగా రిజర్వేషన్లు పొందుతున్నవారిని
   అగ్రవర్ణ దురహంకారానికి ఈ మాటలే ఉదాహరణ.. రిజర్వేషన్ అంటే "ఉద్యొగం" అని తప్ప వేరే ఆలోచనలేని(రాని) ఇలాంటివారు మొదట స్కూలుకెల్లి రాజ్యాంగం మీద కాస్త జ్ఞానం సంపాదించుకోని అప్పుడు రోడ్డెక్కాలి.

   Delete
  2. >>రిజర్వేషన్ వల్ల ఏమాత్రం లాభం పొందలేని కూలీవాళ్ళు కూడా ఎమ్మార్పీఎస్ మీటింగ్‌లకి ఎలా వెళ్తున్నారనే ఇక్కడి ప్రశ్న.

   ఆ కూలివాల్లకి తెలిసింది కూడా మీకు తెలియలేదు.. వెనకబడిన జాతులు, కులాలు కోరుకునేది సంఘంలో మిగితావాల్లలాగే గౌరవంగా బతకడానికి హక్కు.

   హైదరాబాదులో నాకు తెలిసిన కార్పోరేటర్ బాగానే సంపాదించుకున్నాడు. అతను దళితుడు. తెలంగాణాలో పుణ్యక్షేత్రాలు దర్శించుకునేటప్పుడు... "చాలాచోట్ల" ఎక్కడైనానీళ్ళు తాగాలన్నా, తినాలన్నా.. అతనికి రెండో చెంబు, కంచం పెడతారు. అతను తిరిగే ఇన్నోవా కారుని చూసికూడా రెస్పెక్ట్ ఉండదు. అతను దళితుడు అంతే.. ఏం చదివినా.. ఎంత సంపాదించినా వాళ్ళకి అనవసరం.

   Delete
  3. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య జనాభాలో 1% కంటే ఎక్కువ ఉండదు. దళితుల సంఖ్య జనాభాలో 15%. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల దళితుల జీవితాలు ఎలా మారుతాయి?

   Delete
  4. >>>అతను దళితుడు అంతే.. ఏం చదివినా.. ఎంత సంపాదించినా వాళ్ళకి అనవసరం>>>>

   కేసీఆర్ గారు దళితుడిని సీ ఎం చేస్తానన్నారు కదా ? ఒకవేళ దళితుడు సీ ఎం అయితే భద్రాచలానికి పట్టువస్త్రాలు,తలంబ్రాలు పట్టుకెళ్ళనిస్తారంటారా ?

   Delete
  5. ముస్లిం అయిన కుతుబ్‌షాకి సీతమ్మ వారి పట్టు వస్త్రాలు పట్టనిచ్చారు కానీ దళితుడికి అలా పట్టనివ్వరు.

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. Deleted earlier comment due to typo, posting after correction: Jai

   @प्रवीण:

   "ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య జనాభాలో 1% కంటే ఎక్కువ ఉండదు"

   నిజమే కాకపొతే ఇంకో రెండు విషయాలను కూడా పరిగణనలో తీసుకుందాం:

   1. రిజర్వేషన్లు లేకపోతె ప్రభుత్వ ఉద్యోగాలలో దళితుల శాతం 1% కూడా వచ్చేది కాదు, ఇప్పుడు 15% దాకా చేరింది. 15% of government jobs is much more than 1% of government jobs.
   2. ప్రభుత్వ ఉద్యోగులు కొంతలో కొంతయినా పాలనా పరమయిన కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలరు. It is better to be inside the system even if it is tokenism.

   Delete
  8. అప్పటిదాకా హిందూ మతంలో ఎస్ సీ రిజర్వేషన్ అనుభవించిన దళితుడు... క్రిస్టియానిటీలోకి మారగానే బిసిగా ఎలా మారతాడు? అంటే తప్పు మతంలోనే ఉంది అని ఒప్పుకున్నట్లేకదా? నీకు హిందూ మతంలో గౌరవం ఉండదు.. క్రిస్టీయానిటీలోకి వెల్లాక అక్కడ నీకు గౌరవం ఉంది కాబట్టి రిజర్వేషన్ తగ్గిస్తున్నాం అని తీర్మానించినట్టేకదా?

   కాబట్టి మారాల్సింది మనిషికంటే ముందు మతం. హిందూ మతం ఇవ్వలేని గౌరవం ఇంకో మతం ఇస్తున్నప్పుడు.. అక్కడికి వెల్లే వాల్లందర్నీ... "డబ్బుకోసం వెల్లారు" అని నిందలేసేవాల్లని ఏమనాలి?

   దీనికి హిందూమతంలో "సైకోలకి నచ్చని పరిష్కారం" ఒకటుంది.. గుల్లల్లో పూజారులుగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చి నియమించగలిగితే.. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలలోనే కులాంతరాలన్ని తగ్గిపోతాయి.. ఆ డొంకలో, ఈ అడవిలో పూజారిగా దళితున్నాడు అని సొల్లు కబుర్లు చెప్పకుండా.. తిరుమల, భద్రాధ్రి.. లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఇది జరగాలి.

   Delete
  9. మందు వేరు, ప్లసీబొ వేరు. ప్లసీబొని నిషేధిస్తే వచ్చే నష్టం లేదు. నేను ఎస్.టి. అయినా నాకు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం దొరకలేదు. గ్లోబలైజేషన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించేస్తున్న ప్రభుత్వం మీద రిజర్వేషన్ అనుకూల వర్గం వాళ్ళకి కూడా కోపం లేదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ విఫలమై ఐ.టి. కంపెనీలు కూడా మూతపడుతున్నాయి.

   Delete
  10. >>నేను ఎస్.టి. అయినా నాకు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం దొరకలేదు.

   అదేంటీ? ఏమాత్రం విషయం లేకపొయినాగానీ ఈజీగా ఉద్యోగాలు కొట్టేస్తున్నారనేకదా ఆరోపణ.. ఐనాగానీ మీకు ఉద్యోగం రాలేదా??

   Delete
  11. నాకు తెలిసిన ఒక ఎస్.టి. టీచర్ కొడుకే ఆటో నడుపుతున్నాడు.

   Delete
 8. "బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది." - పరిపూర్ణానద స్వామీ

  ఇలా అబద్దాలతో ప్రజల్ని అజ్ఞానులని చేసి తప్పుదోవ పట్టించేవారికి.. ఏ శిక్ష ఉంటే బాగుంటుంది?

  ReplyDelete
 9. గజ్జి ఉన్నవారికి ఇచ్ గార్డ్ వ్రాసినా పోదు.కొన్ని రోజులు ఉపశమనం కలుగుతుందంతే !
  ఇచ్ గార్డ్ మూసేస్తే పతంజలి బాం వస్తుంది. గజ్జి పోవాలంటే మాత్రం చచ్చి మళ్ళీ పుట్టాలి.

  ReplyDelete
  Replies
  1. మందార ప్రభాకర్ గారి ఉవాచ నా కంటే మీకే బాగా గుర్తున్నట్టు ఉంది. రిజర్వేషన్ అనేది అణగారిన కులాలకి కొంత నష్ట పరిహారం మాత్రమే అని మందార ప్రభాకర్ వ్రాసినట్టు నాకు గుర్తుంది.

   Delete
 10. భారత న్యాయ వ్యవస్థలో (రాజ్యాంగం మాత్రమే కాదు) మూడు రకాల వెనుకబడిన తరగతులను (తరగతులంటే కులమే కానక్కరలేదు) గుర్తించారు:

  1. షెద్యూలుడు కులాలు (SC), వాడుక భాషలో షెకు/దళితులు/హరిజనులు
  2. షెద్యూలుడు తెగలు (ST), వాడుక భాషలో షెత/గిరిజనులు/ఆదివాసీలు
  3. ఇతర వెనుకబడిన తరగతులు (OBC= Other Backward *Classes*), వాడుక భాషలో బీసీలు

  ఇటువంటి వర్గాలకు చెందిన వారికి అనేక (దాదాపు అన్నీ) పారామీటర్లలో తగినంత ప్రాతినిధ్యం (adequate representation) లేదని నిర్ధారించడం జరిగింది. మన పెద్దలు దీన్ని వ్యక్తిగత సామర్త్యంతో సంబంధం లేని వ్యవస్తీకృత లోపాలుగా భావించారు. ఈ కారణాల వలన ఆయా వర్గాలకు ప్రత్యేక "రాయితీలు" (ఇంగిలీషులో special provisions అంటారు, తెలుగు అనువాదం "రాయితీ" సరిపోతుందో లేదో?) ఇవ్వాల్సిన అవసరం గుర్తించారు. Just for info, "రాయితీ" అంటే రిజర్వేషన్ మాత్రమే కాదు.

  సదరు "రాయితీలు" మూడు రకాలుగా చెప్పుకోవొచ్చు:

  1. ప్రభుత్వ రంగ & ప్రజాధనం సహాయంతో (aided) నడిచే విద్యాలయాలు
  2. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు
  3. లోక్సభ, శాసనసభ & పంచాయితీ రాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు

  రాజ్యాంగంలో షెకు/షెతలకు ఎన్నికలలో రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రతి పదేళ్లకు ఒకసారి పార్లమెంటులో రాజ్యాంగం సవరించి ఇంకో పదేళ్లు పెంచడం, ఈ సవరణకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇందులో వివాదాలు ఏమీ లేవు.

  షెకు/షెతల నిర్వచనం గురించి ఎటువంటి వివాదాలు రాలేదు. ఓబీసీ జాబితా గురించి కమిషన్ వేసే సదుపాయం ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు తొందరగానే దీన్ని పూర్తి చేసాయి కానీ కేంద్రం ఒక పట్టాన తేల్చలేదు. కాకా కాలేకర్ కమిషన్ నివేదిక వివాదాల కారణంగా బుట్ట దాఖలు అన్నంత పని అయింది. ఎట్టకేలకు మండల్ కమిషన్ నివేదిక, మండల్ వ్యతిరేక ఉద్యమం & కోర్టు కేసులు అన్నీ ముగిసాక పరిస్థితి (ప్రస్తుతానికి) సద్దు మణిగింది.

  ఎన్నెన్నో వివాదాలు సహజంగానే వచ్చాయి. వాటిలో కొన్ని కోర్టులలో తేలాయి కూడా: వాటి గురించి కింద ఇంకో వ్యాఖ్య రాస్తాను.

  ReplyDelete
  Replies
  1. వివాదాలు & వాటికి తేలిన జవాబులు. ఇవి కోర్టులు చెప్పిన సమాధానాలు, నా సొంత జవాబు కాదని గమనించాలి..

   ప్ర: వెనుకబడిన తరగతి/వర్గం అంటే కులమేనా?
   స: కాదు. కాకపొతే కులం *కూడా* తరగతి/వర్గం కావొచ్చును

   ప్ర: ఆర్ధికంగా వెనుకబడిన వారి సంగతి ఏమిటి?
   స: ఆర్ధిక అసమానత తరగతి/వర్గం నిర్వచనం కానేరదు

   ప్ర: శూద్రులు (లేదా ద్విజులు కానీ వారు) అందరూ బీసీలా?
   స: కాదు. తగు ప్రాతినిధ్యం కలిగిన వర్గాలు శూద్రులు *అయినా* వెతగా పరిగణన చేయకూడదు

   ప్ర: తగు ప్రాతినిధ్యత అంటే దామాషా పద్దతా?
   స: కాదు. ఉ. జనాభాలో 10% ఉన్న వర్గానికి ఉన్నత విద్యలో 6% ఉన్నంత మాత్రాన వారికి తగు ప్రాతినిధ్యం లేదనడం కుదరదు.

   ప్ర: రిజర్వేషన్లు దామాషా ప్రకారమే ఉండాలా?
   స: కాదు. రాజ్యాంగంలో పొందు పరచిన షెకు/షెతల రిజర్వేషన్లు మినహా తత్తిమావి దామాషా తక్కువ ఉండవచ్చు (కానీ దాటకూడదు)

   ప్ర: క్రైస్తవం & ఇస్లాం మతాలలో కులం లేదు. వాటిని పాటించే వారికి కులం పేరుతొ రిజర్వేషన్ ఇవ్వవచ్చా?
   స: ఇవ్వవొచ్చు (షెకు హోదా ఇవ్వలేరు). ఆయా మతాలు కులాలను గురిస్తాయా లేదా కాదు: ఆ *వర్గాల* వ్యక్తులు వర్గం కారణంతో వెనుక బడ్డారా అన్నది అసలు ప్రశ్న.

   ప్ర: మత పరంగా రిజర్వేషన్లు ఇవ్వవచ్చా?
   స: ఇవ్వకూడదు. ఆయా మతాలలో వెనుకబడిన *వర్గాలకు* (ఉ. దూదేకుల) ఇవ్వడం తప్పు లేదు.

   ప్ర: మేము ఫలానా రిజర్వేషన్ హామీ ఇచ్చాము కాబట్టి అమలు చేసేయొచ్చా?
   స: లేదు. శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేసి వెనుకబాటుతనం నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం తేలితేనే ఆ నివేదిక ఆధారంగా మాత్రమే చట్టం చేయవచ్చు.

   ప్ర: ఓబీసీ నిర్వచనకు ఏ ప్రాతిపదిక వాడాలి?
   స: పారదర్శికత కలిగిన ఎటువంటి ఫార్ములా అయినా ఫరవాలేదు. ఉ. మండల్ కమిషన్ నమూనా శాస్త్రీయత కోర్టులు ఒప్పుకున్నాయి. Any method that is consistent, reasonable & fair is OK.

   ఇంకా తేలని వివాదాలు ఎన్నెన్నో ఉన్నాయని & అలాగే పై సూచీ సంపూర్ణం కాకపోవొచ్చునని మనవి.

   ప్రశ్నలు అడగదలిచిన వారు ముందు ఈ వ్యాఖ్యలు పూర్తిగా చదివి ఆ తరువాత వ్యాఖ్య రాయాలని సద్వినయంగా మనవి.

   Delete
  2. మీ ప్రశ్నలూ వాటి సమాధానాలూ జిలేబీ పద్యాల్లా అర్ధం కావడం లేదు. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు ? బొందలపాటివారు దేవుడున్నాడా? అని మొదలుపెట్టి దాన్ని వదిలేసి గెలాక్సీలోకి వెళ్ళినట్లు మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా రిజర్వేషన్ల వలన కుల సమస్య పెరుగుతుందా అన్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి.

   Delete
  3. "రిజర్వేషన్ల వలన కుల సమస్య పెరుగుతుందా" అన్న వ్యాఖ్యకు Jai Gottimukkala September 26, 2018 at 10:08:00 AM GMT+5:30 దగ్గర నా ఉద్దేశ్యం రాసాను:

   "రిజర్వేషన్లు మానేస్తే కులాలు పోతాయని అనడం మందులు వాడడం రోగి హాయిగా లేచితిరిగుతాడని అన్నట్టు"

   ఇక్కడి ఈ రెండు వ్యాఖ్యలు కొండల రావు గారు అడిగిన "రిజర్వేషన్ ఎందుకు రాజ్యాంగంలో పెట్టారు?" ప్రశ్నకు నాకు తెలిసిన మేరకు న్యాయవ్యవస్థ సంబంధిత వివరాలు. ఇది నా సొంత అభిప్రాయం కాదు, కోర్టులలో తేల్చబడిన న్యాయసూత్రాలు.

   Delete
 11. @ నీహారిక September 26, 2018 at 2:49:00 PM GMT+5:30
  >>> ..... ఒకవేళ దళితుడు సీ ఎం అయితే భద్రాచలానికి పట్టువస్త్రాలు,తలంబ్రాలు పట్టుకెళ్ళనిస్తారంటారా ?
  ------------------
  Good question నీహారిక గారూ. మరి చరిత్ర ఏం చెబుతోంది? దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకువెళ్ళారా లేదా?

  ReplyDelete
  Replies
  1. పైన నా వాక్యనిర్మాణంలో ఏమన్నా లోపం ఉందేమో? తీసుకువెళ్ళారా లేదా అని నేను ప్రశ్న అడిగాను ... నాకు సమాచారం తెలియదు కాబట్టి. తీసుకువెళ్ళారు అని నేనేమీ confirm చెయ్యడంలేదు. Evidence ఉందా అని మీరు నన్ను తిరిగి అడిగితే ఎలా?

   బ్లాగ్ లోకంలో ఈవిషయం గురించి సమాచారం ఉన్న వారు ఎవరైనా సందేహనివృత్తి చెయ్యగలిగితే బాగుంటుంది. గొట్టిముక్కల గారికేమన్నా తెలుసునా?

   Delete
  2. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియకపోతే సమాచార హక్కు ద్వారా తెలుసుకుందాం.

   Delete
  3. VNR Sir,
   I asked a question about the future. You asked the same about the past.I confused.

   Delete
  4. Confusion ఎక్కడుంది నీహారిక గారూ? సి.ఎమ్. దళితుడైతే పట్టువస్త్రాలు సమర్పించడానికి అనుమతిస్తారా అని మీరడిగారు. ఆ ప్రశ్న భవిష్యత్తుకు సంబంధించినది అని మీరంటున్నారు.

   గతంలో ఒక దళిత సి.ఎమ్. ఉన్నారు కదా (ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో), వారి రెండేళ్ళ హయాంలో శ్రీరామనవమి ఓ రెండు సార్లయినా వచ్చుంటుంది కదా, మరి ఆ దళిత సి.ఎమ్. గారు భద్రాచలానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్ళుండాలి కదా (తీసుకువెళ్ళకపోయీ ఉండచ్చు. ఉప సి.ఎమ్. గారినో, దేవాదాయ శాఖ మంత్రి గారినో, మరెవరినన్నానో పంపించీ ఉండచ్చు. వాస్తవాలు నాకు తెలియదు. అందుకనే ప్రశ్నలాగా అడిగానన్నమాట .. ఎవరైనా సందేహాన్ని తీరుస్తారేమోనని).

   నా పాయింట్ ఏమిటంటే గతంలో జరిగిన దాఖలాలుంటే భవిష్యత్తులో కూడా జరగడానికి ఏం అభ్యంతరం ఉంటుందని.

   బ్లాగ్ లోకంలో ఎవరూ సందేహనివృత్తి చెయ్యకపోతే పైన మీరన్నట్లుగా గతంలో జరిగిందా లేదా అనే వివరాలు సమాచారహక్కు ద్వారా తెలుసుకోవచ్చమో 🤔?

   🦁

   Delete
  5. @విన్నకోట నరసింహా రావు:

   "Dog bites man" is not news. "Man bites dog" is a news story that will be remembered for a long time.

   ప్రెస్ అకాడెమీ క్లిప్పింగ్స్ వెబ్ సైటు చెడిపోయిందనుకుంటా. I am therefore unable to check what happened.

   తరతరాలుగా వస్తున్న సంప్రదాయం మానేసి ఏదో ఒక వంకతో దామోదరం సంజీవయ్య గారికి ఆ ఘనత దక్కకుండా చేసి ఉండుంటే, ఆ ఘటన తప్పక ఇప్పటికీ మారు మోగుతూ ఉండేది.

   Absence of evidence is not evidence of absence. However it would have been an extraordinary breach of tradition had Damodaram been denied the privilege and the resulting outrage would have lingered.

   బెనిఫిట్ అఫ్ డౌట్ ప్రకారం దామోదరం గారి స్వహస్తాలతోనే ఆ పుణ్యకార్యం జరిగిందని అనుకోవాలి.

   Delete
  6. ఆయన ఆ మందిరానికి వెళ్ళి ఉండొచ్చు. ఆయన వెళ్ళిపోయిన తరువాత భ్రాహ్మణులు విగ్రహాలని పసుపు నీటితో గడిగి ఉండొచ్చు. ఇలాంటి వ్యవహారాలు దేవాలయ ఉద్యోగులు బయటపడనివ్వరు.

   Delete
  7. సాధారణంగా సౌమ్యులైన వ్యక్తులు వివాదాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు. సంజీవయ్యగారు ఆలయానికి వెళ్ళడానికి నిరాకరించి ఉండవచ్చు అని నా డౌటు.
   ఒకసారి అబ్దుల్ కలాం గారిని ఒక ప్రశ్న వేసాను. రాష్ట్రపతిగా మీరు ఇండో పాక్ సంబంధాల గురించి ఏమి చేసారు ? అని అడిగాను.ఆయన కూడా వివాదాల జోలికి పోవడం నాకు సమ్మతం కాదు అనే చెప్పారు.

   Delete
  8. "హిందూ మతం ఉనికిలో ఉండగా దళిత ముఖ్యమంత్రి చేత భద్రాద్రి సీతారాములకి పట్టు వస్త్రాలు ఇప్పించడం సాధ్యం" అనే భ్రమ ఒక దళితవాదికీ లేదా ఒక నాస్తికునికీ అవసరమా? జై గారు ఒక నాస్తికుడు. ఆయనకి హిందూ మతంలో సంస్కరణ సాధ్యమనే భ్రమ ఎప్పుడు కలిగింది? నీహారిక గారు నాస్తికురాలు కాదు, దళితురాలు కూడా కాదు. అయినా ఆవిడ ఈ విషయంలో హిందూ మతాన్ని డిఫెండ్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. ఎవరైనా ఇలా సూటిగా మాట్లాడితేనే నాకు ఆ ఆర్గ్యుమెంట్ నచ్చుతుంది.

   Delete
  9. ప్రవీణ్ గారూ, నా పై వ్యాఖ్యకు కారణం extraordinary claims need extraordinary proof అన్న సూత్రం. దీని మూలం శాస్త్రీయ పద్దతి (scientific method) & సాక్ష్యాల నియమాలు (rules of evidence). This (skeptical?) approach is not inconsistent with my atheism.

   నీలం సంజీవరెడ్డి మీద అనేక కులాహంకార ఆరోపణలు ఉన్నాయి. దామోదరం సంజీవయ్య గారిది పార్టీలో నీలం వ్యతిరేక (అనగా కాసు) వర్గం. ఒకవేళ దామోదరం గారికి అవమానం జరిగి ఉంటే కాసు వర్గీయులు రాద్ధాంతం చేస్తారు కదా? అంజయ్యను రాజీవ్ గాంధీ ఏమన్నాడో గానీ అది ఎంతటి ప్రచారానికి దారి తీసిందో తెలీనది కాదు.

   Delete
  10. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి భట్టి విక్రమార్క సీఎం అయితే మీ కుతూహలం తీరిపోతుంది!

   Delete
  11. Caste system can be practiced either covertly. సంజీవయ్య భద్రాద్రి రాముని దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు, ఆయన వెళ్ళిపోయిన తరువాత బ్రాహ్మణులు విగ్రహాలని పసుపు నీరుతో కడిగి ఉండొచ్చు. అది రొటీన్ శుద్ధి అనుకుని పాత్రికేయులు పట్టించుకోకపోయి ఉండొచ్చు. హిందూ మతం కుల వృత్తులనైతే వదులుకుంది కానీ కులాన్ని వదులుకోవడం మాత్రం ఎప్పటికీ జరగదు.

   Delete
  12. >>>అంజయ్యను రాజీవ్ గాంధీ ఏమన్నాడో గానీ అది ఎంతటి ప్రచారానికి దారి తీసిందో తెలీనది కాదు.>>>>

   ఏమన్నారు ?

   Delete
  13. @నీహారిక:

   I don't know what Rajeev said to T. Anjaiah but NTR exploited the incident like anything in his campaign.

   Delete
  14. జై గారు, సంశయం ఉండొచ్చు కానీ మతంలో అంతర్గత సంస్కరణ తేవడం నాస్తికుని పని కాదు కదా.

   Delete
  15. ప్రవీణ్ గారూ, ఇక్కడ ప్రశ్న వాస్తవాలను ఎలా అంచనా వేయాలన్నది తప్ప మతంలో సంస్కరణలు గురించి కాదు.

   నేను నాస్తికుడిని కనుక ఇరవై నాలుగు ఘంటలూ ప్రతి దాన్నీ కొట్లాడితే వచ్చేది తలనొప్పి తప్ప ఇంకోటి కాదు. In a long battle, stamina is very important. Therefore it is better to be selective based on sustainability & likely impact instead of spreading too thin.

   Delete
  16. ఇక్కడ సమస్య కులం కాదు, అవకాశాలని కాపాడుకోవాలనే తపన. విజయవాడ బుక్ ఫెయిర్‌లో తెలంగాణావాద-ముస్లింవాద కవి స్కైబాబాని కొట్టినవాళ్ళలో ఒకడు దళితవాది. అతను విప్లవ కవి అని స్కైబాబా గారు అన్నారు కానీ మార్క్సిజంకి విరుద్ధంగా వ్యవహరించే అతన్ని విప్లవకారుడు అనకూడదు కనుక అతను దళితవాది అనే నేను ఇక్కడ వ్రాస్తున్నాను. స్కైబాబా గారు ఎస్.సి. వర్గీకరణకి అనుకూలంగా కవితలు వ్రాసేవారు. ఆ దళితవాది ఎస్.సి. వర్గీకరణని వ్యతిరేకించే కులానికి చెందిన వ్యక్తి. ఆ దళితవాది పేరుకి విప్లవ కవి కావచ్చు కానీ అతను కూడా టిపికల్ మధ్యతరగతివాడే. అందరు మధ్యతరగతి తల్లితండ్రులలాగే అతను కూడా తన పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమే పంపాలనే ఆశతో ఉన్నాడు. ఎస్.సి. రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే తన పిల్లలకి రావలసిన ఉద్యోగాల్ని మాదిగోళ్ళూ, రెల్లోళ్ళూ లాక్కుపోతారని అతని భయం.

   ఒక అస్తిత్వవాదిని కొట్టడం ఒక విప్లవకారుడు చేసే పని కాదు, అది విప్లవ వ్యతిరేకవర్గంవాళ్ళకి సరిపోయే పని. అతను రిజర్వేషన్ కోసం విప్లవాన్ని వదులుకోవడానికి సిద్ధపడే ఆ అస్తిత్వవాదిని కొట్టాడు.

   Delete
 12. Indira Gandhi was denied to enter Puri Jagannath temple because she married a Parsi. However, the Muslim Qutubshah was allowed to offer silk cloth to the Deities in Bhadrachalam. It was because of Hindu-Muslim unity under the Qutubshah's rule. I don't think that a dalit leader would be allowed to offer silk cloth to the deities in Bhadrachalam.

  ReplyDelete
 13. interesting topic i wanted to join congress so i taken application. Now let see what will happen

  ReplyDelete
 14. @నీహారిక
  // "ఏమన్నారు ?" //
  --------
  ఇలా అన్నారు(ట). లింక్ చూడండి 👇.

  అంజయ్య vs రాజీవ్ గాంధీ :: 1982

  ------
  అయినా కాంగ్రెస్ కు వీరాభిమాని అయిన మీకు ఈ ఉదంతం గురించి తెలియకపోవడమేమిటి?

  ReplyDelete
 15. నేను మావో సేతుంగ్ అభిమానిని కానీ నాకు మావో పుట్టిన రోజు గుర్తు లేదు. మనవి ఆఫ్టర్ ఆల్ బుర్రలే కానీ కంప్యూటర్లు కాదు కదా.

  ReplyDelete
 16. హిందూ సైకోలు అనేవారికి హైందవం పట్ల ఆవగింజంతయినా అవగాహన అభిమానం గౌరవం లేనివారికి మతసంబంధమైన పూజారి పనులెందుకు బయ్యా.

  ReplyDelete
  Replies
  1. మీరు అస్సలు నా మాటలు ఫాలో అవుతున్నట్టు లేరు.. సైకోలు ప్రతి మతంలో ఉన్నారు.. మనదేశంలో
   ఉన్న హిందూ మతంలోని "కొందరు సైకోగాల్లు" అని కరెక్ట్ చేసుకోండి..

   అవగాహన, అభిమానం లేకుండా.. మూర్ఖత్వం, దురభిమానం చూపించే సైకోలేనా మతానికి ప్రతినిధులు? నేను కులాల మధ్య అంతరాలు తొలగాలంటే, అత్యంత గౌరవప్రధమైనదిగా భావించబడుతున్న పూజారి వర్గంలోకి దళితులని తీసుకోవాలి అని సలహా ఇచ్చాను.

   హిందూ, క్రిస్టియానిటీల మధ్యలో పక్కవాడికి గౌరవమిచ్చే విషయంలో తేడా చూపించాను. అలాంటప్పుడు హిందువులు తమనితాము సంస్కరించుకోకుండా.. "పూజారి పనులు మీకెందుకు" అని మాట్లాడేవాల్లకి ఏమాత్రం వాళ్ళపట్ల అవగాహన, అభిమానం ఉంది?

   Delete
 17. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ నాకు హిందూ మతం మీద నమ్మకం లేదు. దళితులందరూ క్రైస్తవ మతంలోకి మారిపోతే నాకు అభ్యంతరం లేదు కానీ పూజారి పోస్టుల్లో రిజర్వేషన్ పెట్టాలనే ఐడియా నాకు హాస్యాస్పదంగా తోస్తుంది. కుల నిర్మూలన పోరాట సంఘంవాళ్ళు బహుజన బతుకమ్మ ఆట ఆడడం ఎలాంటిదో భద్రాద్రి రామాలయంలోని పూజారి పోస్ట్ దళితునికి ఇవ్వాలనడం అలాంటిది.

  ReplyDelete
  Replies
  1. This is only the practical solution as of now..

   మీరు.... ఉద్యోగాలు.. ఉద్యోగాలు... అని కొట్టుకోకుండా, రెస్పెక్ట్ గురించి ఆలోచించండి..

   Delete
  2. పూజారి పోస్టుల సంగతి తరువాత చూద్దాం. నాకు తెలిసిన ఒక కమ్మవాడు ఉన్నాడు. దళితులందరూ క్రైస్తవ మతంలోకి మారినా తనకి అభ్యంతరం లేదనీ, రిజర్వేషన్ పేరుతో తమ అవకాశాలని మాత్రం దళితుల కోసం వదులుకోమనీ అతను బహిరంగంగానే చెప్పుకున్నాడు. ఇక్కడ కులం మిథ్యా, మతం మిథ్యా, డబ్బు మాత్రం పరమసత్యమైపోయింది.

   Delete
  3. ఇప్ప్పటికి ఎన్నోసార్లు చెప్పాను.. నీకు ఉధ్యోగం సంపాదించుకోవడం చాతకాలేదని.. రిజర్వేషన్ అంటే "ఉధ్యొగం కొరకు మాత్రమే" అని ఇంకా ఎందుకు వాగుతున్నావ్?.. ఒక మానసిక వైద్యుడికి బాగా చూపించుకో.. వీలైతే ఓ 10-20 స..లు హాస్పిటల్లోనే అడ్మిట్ కా.. ఖర్చుల గురించి నువ్వేం బెంగ పడకు.. కేసీఆర్ చూసుకుంటాడు..

   నీ దగ్గర విషయం అల్రెడీ ఐపోయిందని చెప్పాను. ఐనా గుడ్డెద్దు చేలోపడ్డట్టు వెల్లడం నువ్వు మానుకోవట్లేదు.. చూస్తంటే.. నువ్వు "బాగా..." ఖాలీగా ఉన్నావని తెలుస్తోంది..

   Delete
  4. రిజర్వేషన్ వల్ల కొద్ది మందికి ఉద్యోగాలు వస్తాయి, మిగిలినవాళ్ళు అది చూసి ఆత్మగౌరవం అంటూ గుడ్డు మీద ఈకలు ఏరుకోవాలి! అదే కదా నువ్వు చెప్పేది.

   Delete
 18. కులం చిచ్చు రగల్చడానికి సరిపడా నూనె నా దగ్గర కూడా ఉంది. మాది కోంద్ (జాతాపు దొర) కులం. ఉత్తరాంధ్రలో కోంద్‌లకి రావలసిన ఉద్యోగాలు వాల్మీకులు లాక్కుపోతున్నారు. ఎస్.టి. రిజర్వేషన్‌ని కూడా వర్గీకరించాలని నేను మా కులంవాళ్ళని కూడా రెచ్చగొట్టగలను. మా తాతయ్య (అమ్మగారి తండ్రి) ఇలాంటి పనే చేసాడు. ఉత్తరాంధ్రలో బెంతు ఒరియాలని ఎస్.టి.లో చేర్చాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు మా తాతయ్య కూడాబెంతు ఒరియాలకి వ్యతిరేకంగా సవర, జాతపు దొర కులాలని రెచ్చగొట్టాడు. I can do the same against Valmiki, Erukala, Lambada, Banjara, Bhil and Sugali in AP and Telangana.

  ReplyDelete
  Replies
  1. >>I can do the same against Valmiki, Erukala, Lambada, Banjara, Bhil and Sugali in AP and Telangana.

   When you are saying "I CAN".. that is what exactly you are..

   Delete
  2. >>రిజర్వేషన్ వల్ల కొద్ది మందికి ఉద్యోగాలు వస్తాయి, మిగిలినవాళ్ళు అది చూసి ఆత్మగౌరవం అంటూ గుడ్డు మీద ఈకలు ఏరుకోవాలి! అదే కదా నువ్వు చెప్పేది

   ఆత్మ గౌరవం నీకు ఈకతో సమానమైతే ఎవడేం చెయ్యలేడు. ఇక ఉధ్యొగాల సంగతంటావా... అనే ముందు కాస్త బుర్ర వాడితే... "రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా... చదువుకున్న ప్రతివాడికీ దేశంలో ఉద్యోగం రాదు"..అని అర్ధమౌతుంది..

   మీ ఇంట్లో నిన్ను ఎందుకు చదివించారో నాకు తెలియదుగానీ.. అందరిల్లల్లో... పిల్లలకి సమాజంలో గౌరవం చదువువల్లే వస్తుందని చదివించుకుంటారు..

   Delete
  3. My parents were bank employess but not daily wage workers. Do you think that a daily wage worker find something need in English education?

   Delete
  4. ఆత్మగౌరవం అనేది జీవితాలని మార్చదు. రిక్షా తొక్కేవాడి కూతురు ఎం.బి.ఎ. చదివినంతమాత్రాన ఒక ధనవంతుడికి కొడుకు ఆమెని పెళ్ళి చేసుకోడు. ఆమె ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే, ఆమె కొలీగ్ అయిన బ్రాహ్మణుడో, కోమటివాడో ఆమెతో ప్రేమలో పడితే, అప్పుడు కులాంతర వివాహం జరుగుతుంది. ఉద్యోగాల సంఖ్య లక్షల్లో, చదువుకున్నవాళ్ళ సంఖ్య కోట్లలో ఉన్నప్పుడు చదువు వల్ల జీవితాలు మారవు.

   Delete
 19. 1.రిజర్వేషన్లకీ కులాల మధ్య గొడవలకీ ఏ సంబంధమూ లేదు:కులాల మధ్య గొడవలు రిజర్వేషన్లు పెట్టకముందు కూడా ఉన్నాయి.అయితే,రిజర్వేషన్లకి ముందు కులాల మధ్యన జరిగిన కొట్లాటలు సంస్కృతుల మధ్య తేడా వల్ల జరిగేవి.ఇప్పుడు ఉపాధి కోసం పోటీ కూడా కలిసింది.ఈ ఉపాధి కోసం పోటీలో మాత్రమే అడ్డు వచ్చే రిజర్వేషన్లు మొత్తం విభేదాలని తొలగించలేవు.

  2.రిజర్వేషన్లలో ఆర్ధిక ప్రాతిపదిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు.పైన జై గారు సేకరించి చూపించిన వివరాలను బట్టి సామాజికమైన వెనుజబాటు,అది కూడా అస్పృశ్యత వంటి అజ్ఞానంతో కూడిన వెనుకబాటుతనం ఉన్న కులాలకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి.ఆర్ధికపరమయిన విషయాల్ని కూడా పరిగణించాలి అనే తెలివితక్కువ ఆలోచనని వెనువెంటనే ఎవరూ వ్యతిరేకించకపోవడం వల్లనే అగ్రకులమైన కాపులు కూడా పళ్ళేల మోతల వెర్రి చేష్టలతో లేని వెనుకబాటు తనం చూపించి రిజర్వేషన్లకి ఆశపడటం జరిగింది.బహుశా పై స్థాయిలో లోపాయికారీ ఒప్పందాలు కుదరటం వల్లనో పరిశీలనకు పంపించిన నివేదికలు మొహమాటం లేకుండా కాపులకి ఇవ్వడం కుదరదని చెప్పడం వల్లానో కాపు కార్పొరేషన్ అనే తలబరువు అదనపు ఖర్చుతో కూడిన ఏర్పాటు జరిగింది.ఈ మధ్యనే వెలమలు కూడా అదే దారి పట్టారు - అది నెరవేరితే రెడ్లు కూడా మొదలుపెడతారు.కాబట్టి ఆర్ధికం అనేది రిజర్వేషన్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదిక కాకూడదు.

  3.పైన జైగారే ప్రతి పదేళ్ళకీ ఇంకో పదేళ్ళు కొనసాగిస్తూ పోతున్నట్టు చెప్పారు.ఆ సమయంలో పాత కులాల పరిస్థితిని మదింపు చేసి వాటి వెనుకబాటుతనం పోయిందని తేలితే లిస్టునుంచి తొలగించే ఏర్పాటు ఉంటే బాగుంటుంది.అసలు అంబేద్కర్ పెట్టినపుడు నిజాయితీగా అమలు చేసి పది సంవత్సరాల తర్వాత ఎత్తెయ్యమన్నాడు.ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకే కాకుండా వాటిని ఉపయోంచుకుని పైకి రావలసిన SC, ST, BC కార్పొరేషన్ల నాయకులకి కూడా నికాయితీ లేకపోవటం వల్లనే ఆ కులాలు ముందుకి రాలేకపోయాయనేది నా అభిప్రాయం.ఇప్పటికీ SC, ST, BC కార్పొరేషన్ల నాయకులకి రిజర్వేషన్ల పేరుతో లాబీయింగులూ పాలిటిక్సులూ చెయ్యటం స్వంతానికి వెనకేసుకోవటం తప్ప తమ కులం పట్ల నిజాయితీ లేదు!పదేళ్ళ కొకసారి "మదింపు - తొలగింపు" ఏర్పాటు చేస్తే తప్ప వాళ్ళలో చురుకు పుట్టదు.

  4.బీదరికానికీ ఆత్మన్యూనతకీ సంబంధం లేదు.ఐశ్వర్యానికీ ఆత్మగౌరవానికీ సంబంధం లేదు.కారులో వెళ్ళినా కడగా పెట్టెయ్యటం అనే ఉదాహరణ దాన్నే సూచిస్తుంది కదా!

  P.S:రిజర్చేషన్ల ప్రమేయం లేకుండా అందరికీ సమానావకాశాలు కల్పించటమనేది ప్రభుత్వం యొక్క మొదటి,ఆఖరి బాధ్యత!ప్రజల వోట్లతో అధికారంలోకి వెళ్తున్నవాళ్ళకి అది తెలియకపోవటమే అసలు సమస్య జటిలం కావడానికి మూలకారణం!నిరంతరం విస్తరించే ఆర్ధికనిర్మితిలో ఎలాంటి సమస్యలూ ఉండవు - ఒకావెళ సమస్య వచ్చినా పరిష్కారం త్వరగానే దొరుకుతుంది.ఆర్ధిక పురోగతి ఆగిపోయినప్పుడు ఒక్క కులమే కాదు అన్నీ సమస్యలే అవుతాయి!

  పుట్టిన ప్రతి మనిషికీ శ్రమకి తగ్గ ఆదాయం తెచ్చిపెట్టే ఉపాధిని ప్రభుత్వాలు చూపించగలిగినప్పుడే అన్ని సమస్యలూ సమసిపోతాయి.లేని పక్షంలో ఒక క్లర్కు పోష్టుకి ఇవ్వాళ వేల సంఖ్యలో పోటీ పడితే రేపు లక్షల సంఖ్యలో పోటీ పడతారు - తప్పదు,ఉద్యోగం రానివాడిదీ వచ్చినవాడిదీ వేరే వేరే కులాలు అయితే రానివాడు తెచ్చుకున్నవాణ్ణి కులంపేరుతో ఈర్ష్యపడతాడు,అది అంతే!

  ReplyDelete
 20. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు మరీ ఎక్కువ ఇవ్వడం వల్లే కూలీవాళ్ళ పిల్లలు కూడా తమకి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలంటున్నారు. గుమాస్తా ఉద్యోగం చేసేవాడికి కూడా జీతం మరీ ఎక్కువ ఇచ్చి దానికి ఇంగ్లిష్ మీడియం చదువునే మాండేట్ చేస్తే ఒక్క గుమాస్తా ఉద్యోగానికే 100 మంది ఇంగ్లిష్ మీడియం కాండిడేట్లు అప్లై చేస్తారు. రావు రమేశ్ లాంటివాళ్ళకి రోజుకి లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్లే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు సినిమాల్లో ఆఫర్ల కోసం బట్టలు విప్పుతున్నారు అని వ్రాయడం వల్ల ఫేస్‌బుక్‌లో రమా సుందరి గారు నన్ను బ్లాక్ చేసారు. రాం గోపాల్ వర్మ పార్న్‌ని సమర్థించినప్పుడు రమా సుందరి గారే అతన్ని విమర్శించారు. శ్రామిక వర్గ మహిళలు ఎవరూ పార్న్ లేదా వేశ్యావృత్తిని కోరుకోవడం లేదు అని రమా సుందరిగారే అన్నారు. ఇంతా తెలిసిన ఆవిడ శ్రీరెడ్డికి సపోర్టర్‌గా మారారు, శ్రీరెడ్డి శ్రామిక వర్గ మహిళ కాదని తెలిసి కూడా. పల్లెటూరిలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడికి రోజుకి 200 రూపాయలే ఇస్తారు. తెలుగు బాగా వచ్చిన పల్లెటూరివాడికి రోజుకి రెండు వేలు ఇచ్చినా అతను సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడు కనుక రావు రమేశ్ లాంటివాళ్ళని ప్రోత్సహించక్కరలేదని చెప్పాను. శ్రీరెడ్డి సినిమా నిర్మాతలతో పడుకుని మోసపోయిందనే రమా సుందరి గారు ఆమె మీద సానుభూతి చూపారు. "ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవిడెన్స్ ఉంటే పోలీసులు ఆ వసూళ్ళ రాకెట్‌ని అరెస్ట్ చేస్తారు. దాని అర్థం ఆ రాకెట్‌కి పైసలు ఇచ్చినవాళ్ళు అమాయకులని కాదు, అలాగే శ్రీరెడ్డి కూడా అమాయకురాలు కాదు" అని వ్రాసాను. రమా సుందరి గారిది ఏ కులమో నాకు తెలియదు కానీ ఆవిడ కూడా ప్రభుత్వ ఉద్యోగే కావడం వల్ల ఆవిడ నా మీద కోపమైపోయారు. ఈ దేశంలో ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ప్రభుత్వ స్కూల్‌లో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. ఈ ట్రెండ్ ఉన్నప్పుడు రిజర్వేషన్ పేరుతో జనం ఒకరినొకరు ఎందుకు కొట్టుకోరు?

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. శ్రీరెడ్డిపై సానుభూతి చూపింది రమా సుందరి, సంధ్య గార్లు కానీ నేను కాదు. ఇద్దరూ సి.పి.ఐ.(ఎం.ఎల్.)న్యూ డెమోక్రసీ సానుభూతిపరులే. రమా సుందరి గారు మాత్రమే నన్ను బ్లాక్ చేసారు. సంధ్య గారు నన్ను బ్లాక్ చెయ్యలేదు.

   Delete
 21. ఈ కామెంట్ ఎవరు వ్రాసారో గుర్తుపట్టగలరా?

  "What do yo mean by "double benefits"?ప్రభుత్వ విద్యాసంస్థలూ, ఉద్యోగాలూ చర్చ్ నడపడం లేదే! మరి రెండుసార్లు దళితులు ఎలా లబ్ధిపొందుతున్నారు? నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?చర్చ్ మంచి విద్యనిస్త్రే తీసుకుంటాం. వైద్యాన్ని అందిస్తే సంతోషిస్తాం. ఆర్థిక వనరులు కల్పిస్త్రే అందుకుంటాం. దానికీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకూ లంకెకలిపి double benefit అనడం మీ తెలియనితనానికి ఒక ఉదాహరణగా మాత్రమే అనిపిస్తోంది."

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top