----------------------------------------------
ప్రశ్న పంపినవారు : hari.S.babu.
------------------------------------------------
Name:hari.S.babu 
E-Mail:deleted  
Subject:saamaajikam 
Message:ప్రశ్న; హిందూ వివాహ చట్తంలో హిందూ ధర్మ శాస్త్రాలకి విరుధ్ధమయిన అన్యాయ పూరితమయిన నియమాలు యెలా వచ్చాయి?వీటిని ఇలాగే కొనసాగించ వలసిందేనా?

1.విడాకులు: చాణక్యుడు స్త్రీ వైపు నుంచి విడాకులకు అబ్యర్ధన వస్తే వెంఠనే ఇచ్చెయ్య మన్నాడు!కారణం కూడా తనే చెప్పాడు.విడాకులు తిరస్కరించ బడినా, వాయిదా పడినా - తన నుంచి వేరు పదాలనుకున్నది అనే కోపంతో శారీరకంగా బలవంతుడు కావదం చేత ఆమేకి హాని కలిగించ వచ్చు.ఈ మాత్రం లోకజ్ఞానం కూడా ఆధినికులకి లేకపోయినదా - విడిపోవాలని కోరుకున్న తర్వాత కూడా ఆరు నెల్లు కలిసుండి అప్పుడు కూడా విడిపోవాలనే అనుకుంతే తప్ప ఇవ్వరాదనే నియమం పెట్టింది?

2.వారసత్వం:ఆశ్చర్యం యేమిటంటే - అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా వుంటూ సమానంగా కష్టనష్టాలని భరిస్తూ జీవిత కాలం పాటు తను కూడా సహధర్మచారిణి గా వున్నా పురుషుడి ఆస్తి మీద భార్యకు హక్కు లేదు ఆధునిక న్యాయసూత్రాల ప్రకారం!పిల్లలు వుంటే ఆ పిల్లలకి సంరక్షకురాలిగా తప్ప పిల్లలు లేకుందా వైధవ్యం వస్తే ఆ భార్యకు చిప్పే గతి?పిల్లలు వున్నా కూడా ఆ పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఆస్తిని వాళ్లకి అప్పజెప్పే కాపలా మనిషి గానే తప్ప ఆమెకు యే హక్కూ ఇవ్వలేదు.కానీ చాణక్యుడు తన అర్ధశాస్త్రంలో ఇంతకన్నా నిజాయితీగా చెప్పాడు.ఒక ప్రస్తావన నాకు బలంగా గుర్తున్నది - భర్త చనిపోయిన స్త్రీ తన భర్త ఆస్తిని అనుభవిస్తూ దాన్ని అజమాయిషీ చెయ్యదం గురించి చాలా మామూలుగా జరిగే విషయం లాగా ప్రస్తావించాడు.

3.లైంగిక హక్కు:వివాహంలోని అసలయిన అర్ధం నాతి చరామి శ్లోకంలో వుంటుంది - ధర్మ అర్ధ కామ మోక్ష సంబంధమయిన నా అన్ని కోరికల్నీ నా భాగస్వామినే ఆలంబనగా చేసుకుని తీర్చుకుంటాను, దాన్ని అతిక్రమించి మరొకరితో ఈ పురుషార్ధాలలో దేనినీ నేను అనుభవించను - అనే ఒక వాగ్దానం అది. ఇద్దరికీ ఆ వాగ్దానం పట్ల సమానమయిన బాధ్యత ఇచ్చారు.అయితే మనకి సంస్కృతం అర్ధం కాదు, కనీసం పలకలేము అనే వుద్దేశంతో మన పంతుళ్ళు వాళ్లే చదివేసి మనల్ని \"మమ\" అనుకోమనడం, మనం కూడా \"మమ\" అనేసి ఇవతలి కొచ్చేస్తున్నాం!కానీ ఈ వాగ్దానానికి సంబంధించిన స్పూర్తిని ఆధునిక న్యాయసూత్రాలు పట్టించుకుని వుంటే వివాహతర సంబంధాలు అనే అనైతికమయిన వాటిని చట్తప్రకారం శిక్షించదగిన నేరాలుగా మార్చవచ్చు.ఇవ్వాళ ఒక స్త్రీ తన భర్త మరొక స్త్రీ తో గడపటం ఆమెకి యెంత అవమానం అనిపించినా చట్టప్రకారం యేమీ చెయ్యలేదు.తనభర్త ఆ స్త్రీతో కలిసి తన మీద హత్యాప్రయత్నం చేస్తున్నాడనో మరోవిధంగానో దొంగకేసు పెట్టాల్సిందే! మిగతా అన్ని వ్యవహారాల్లో బ్రీచ్ ఒఫ్ ప్రామిస్ అనేది నేరము అని నిర్ధారించారు కానీ అసలు పెళ్లిలో వుండే మౌలిక వాగ్దానాన్ని భంగం చేసినా అది చట్టప్రకారం నేరం కాకుండా పోతున్నది?

ముక్తాయింపు:ఇవన్నీ న్యాయశాస్త్రానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలు.కానీ యెంత పామరత్వంతో ఆలోచించినా అన్యాయం అనిపించే విషయాలు.అదీ ఆధునికులమని చెప్పుకునేవాళ్లు తయారు చేసిన న్యాయసూత్రాలు ప్రాచీనుల కన్నా అన్యాయంగా వుండటానికి కారనం యేమిటో తెలుసుకోవలని ఈ ప్రశ్న వేస్తున్నాను.

*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. ముందుగా మీరు తెలుసుకోవాల్సినవి భారతీయ చట్టాలు.
  తరువాత తెలుసుకోవాల్సిన అంశం పురుషులకు కూడా హక్కులున్నాయని.
  తరువాత తెలుసుకోవాల్సిన అంశం, పత్రికలలో స్త్రీవాదులు రాసే ఏకపక్షరాతలను నమ్మడం వలన సగం విషయాలు మాత్రమే తెలుస్తాయని.

  చాణక్యుడు ఈ విషయాలని ఎప్పుడు చెప్పాడూ? వాటిని మనం ఇప్పుడున్న సమాజములో లేవని ఎందుకు ఫీలవుతున్నాం? ఆ అవసరం ఏమిటి? స్త్రీ పురుషులు సమానం అని చెప్పుకుంటున్న సమాజములో ఇంకా రక్షణ, పోషన అనే బాధ్యతలు మగవాడివే కావడం ఎంతవరకూ న్యాయం అనే విషయాలు ఆలోచిస్తే ఇలాంటి సందేహాలు రావని నాకనిపిస్తుంది.

  భారత దేశములో ఉన్న అడల్టరీ చట్టాలు స్త్రీల పక్షపాతముతో కూడుకున్నవి. భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటే అది స్త్రీని హింసించడం కింద వస్తుంది కాబట్టి, 498A లేదా గృహహింసకింద అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అదే స్త్రీ మరో మగవాడితో వైవాహిక సంబంధం పెట్టుకుంటే పురుషుడి గతి? ఏమీ లేదు, విడాకులు తీసుకోవడం మినహా ఏమీ చేయాలేడు. అలా విడాకులు తీసుకున్నా, బోలెడంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు IrBM అనే చట్టం గురించి బొత్తిగా అవగాహన లేనట్టుంది. ఒకసారి IrBM - Irretrievable Breakdown of Marriage అన్న క్లాజును, హిందూ వివాహ చట్టములో ఇటీవల వచ్చిన సవరణనూ చదివి ఈ విషయం మీద ఒక అవగాహనకు రండి. ఇప్పుడు బాధ పడవలసింది స్త్రీల్ అగురించి కాదు, పురుషుల గురించి అని మీకే అర్థమవుతుంది.

  ReplyDelete
  Replies
  1. నేను అలాంటి విషయాల్ని కొత్తగా తెలుసుకోవాలనే ఈ ప్రశ్న వేశాను.చాణక్యుడి అర్ధశాస్త్రానికి రెంటాల గారు చాలా కుదించి అనువదించిన పుస్తకాన్నే చదివాను.అందులో ప్రస్తావన మాత్రమె వుంది.

   చట్టాలు కొన్ని చోట్ల స్తీకీ కొన్ని చోట్ల పురుషుడికీ అనుకూలంగా వున్నాయి.సమానంగా న్యాయం చెయ్యాల్సిన న్యాయసూత్రాల్లో ఈ అసమానతలు వుండకూడదు అనేది నా అభిప్రాయం.

   Delete
  2. "మన చట్టాలన్నీ తల్లక్రిందులుగా ఉన్నాయి. ఇద్దరు పెళ్ళిచేసుకొనేముందు 'మీరిద్దరూ కనీసం ఒక్క సంవత్సరమైనా కలిసున్నారా?' అని ఆలోచించాలి. అదే విడిపోవడానికైతే విడిపోవాలని ఏ ఒక్కరికి అనిపించినా చాలు" అని ఓషో అంటారు. అది గుర్తొచ్చింది మీప్రశ్న చదివాక.

   ఐతే చాణక్యుడు చాలా practicalగా ఆలోచించారన్నమాట. I like such rationality. We need more of this kind.

   Delete
 2. సూరనేని గారు,

  హిందూ చట్టం ప్రథమంగా బ్రిటిష్ వారు అభివృద్ధి చేశారు. దాన్నే కొన్ని మార్పు చేర్పులతో భారత ప్రభుత్వం స్వీకరించింది. అది ఏవిధంగా అభివృద్ధి చెందిందో క్రింది వికీపీడియా లింకుల ద్వారా తెలుసుకోగలరు.

  http://en.wikipedia.org/wiki/Hindu_Personal_Law
  http://en.wikipedia.org/wiki/Anglo-Hindu_Law


  నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం, న్యాయ శాస్త్రం మతాల వారీగా కాకుండా (Common Civil Code) ఉండాలని మాత్రమే.

  ReplyDelete
  Replies
  1. అవును, ఈ కామన్ సివిల్ కోడ్ గురించి నేనూ విన్నాను, కానీ అది కుదరదేమో?యెందుకంతే పెళ్ళి అనగానే అది మతాచారాల ప్రకారమే జరుగుతుంది, ప్రతి మతం లోనూ యెక్కువ నీతిసూత్రాలన్నీ పెళ్ళి చుట్టూరానే వున్నాయి.

   Delete
 3. కామన్ సివిల్ కోద్ పేరుతో హిందూ సంప్రదాయాల్ని కామన్ చెయ్యాలని బిజెపి ప్లాన్. హిందువులు ఆడపిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వరు. కామన్ సివిల్ కోద్ ఉంటే క్రైస్తవులలో కూడా ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వడానికి అవ్వదు. ఇలా మనుధర్మ శాస్త్రాన్ని అందరికీ వర్తింపచెయ్యడానికి కుట్ర జరుగుతోందనే చాలా మంది కామన్ సివిల్ కోద్‌ని వ్యతిరేకిస్తున్నారు.

  ReplyDelete
 4. *మనుధర్మ శాస్త్రాన్ని అందరికీ వర్తింపచెయ్యడానికి కుట్ర జరుగుతోందనే చాలా మంది కామన్ సివిల్ కోద్‌ని వ్యతిరేకిస్తున్నారు*

  అలాగా ప్రవీణ్! మా తాతలు హిందువులు, కనుక మమ్మల్ని హిందువులు గా పరిగణిస్తూ ఆస్థిలో వాట పంచండి అని ప్రభుత్వానికి, కోర్టుకు విన్నవించుకొన్న ముస్లిం మహిళల సంగతేమిటి?

  ReplyDelete
 5. కామన్ సివిల్ కోడ్ అంటే హిందు సివిల్ కోడ్ అనే ఎందుకు అనుకోవాలి?

  ReplyDelete
  Replies
  1. ఈ దేశవాసులయందు నూటికి తొంబదిశాతము వరకు ప్రజలు హిందువులుగా నున్నది యదార్థము. పోనిండు, దాదాపుగా నైదుశాతము మంది దానియందు కొఱత యుండవచ్చును. ఈ దేశ మంతటకును వర్తించు నట్లుగా నొక రోజున నుమ్మడి సివిల్ కోడ్ అనునది యేర్పడు నేని దానియందు నూటికి తొంబది మందికి సమ్మతమై యుండు నట్టి విధముగా నేల నుండవలెనను వారికెట్లు బోధపఱచ వలెనో తెలియకున్నది. ఇతరమతముల యొక్క ప్రాధాన్యమున్న దేశముల యందు గల విధానములను చూచువారికి నెక్కడైనను అల్పసంఖ్యాకమతస్థుల అభిప్రాయములకు పెద్దపీట వేసి యేర్పరుచబడిన పౌరచట్టమున్నదేమో ఆలోచించుడు. మనదేశములో మూర్ఖులకు మేథావులుగా మహద్గౌరవము చేయు దురాచారము కారణముగా వికృతమైన ఆలోచనలు రాజ్యమేలుచున్న వన్నది పచ్చినిజము. దేవుడు రక్షించి యట్లు జరుగకుండును కాక, కాని ఈ‌ దేశము నందు విమతీయులు యేబదియొక్క శాతమునకు చేరినచో వెంటనే తన్మతమునకు చెందిన చట్టమే నాటి నలుబదితొమ్మిది శాతము మంది హిందువులకును సంపూర్ణముగా నిస్సంకోచముగా నిర్బంధముగా వర్తింపజేయుట జరుగును కాదా? ఆ నాడీ‌మూర్ఖమేథావులు కూడా అధికసంఖ్యాకమతమువారి మాట చెల్లుటయే న్యాయమని వ్యాసములు ప్రభుత్వానుమతముతో విజృంభించి వ్రాసి యూదరగొట్టరా? ఏమి చిత్రమైన దేశ మీ భారత దేశము.

   Delete
  2. దేశానికి కావలసింది '' కామన్‌ సివిల్‌ కోడ్‌ '' కాదు కాదు కావల్సింది. లౌకీకత్వానికి సరైన నిర్వచణం. ఇక్కడ హిందువులు ముస్లింలు , క్రిస్టియన్‌ లు మాత్రమేకాదు ఉన్నది. ఇతర మైనార్టి మతాల వాళ్లు, హెతు వాదులు లౌకీక వాదు ఉన్నారన్న సంగతి గమనలో ఉంచు కొంటే ఈ లాంటి నిర్ణయానికి ఎవరూ రారని మనవి.

   Delete
  3. లౌకీకత్వమంటే ఏ మతానికి పెద్ద పీఠ వేయక పోవడం అని అర్ధం. ఇదే మన రాజ్య్యంగ నిర్వచణం. ఈ అర్ధాన్ని వదిలేసి ఎవరికి అనుకూలమైనది వారు తీసుకుంటున్నారు.

   Delete
 6. లౌకికవాదమంటే హిందూ వ్యతిరేక వాదమని గౌరవ కాంగ్రెస్ పెద్దలు, ఇతర మైనారిటీస్, సో కాల్డ్ హేతువాదులు, లౌకికవాదులు తేల్చేసారు కదా. మైనారిటీస్ కి ఒక న్యాయం, మెజారిటీస్ కి ఒక న్యాయం చెప్పే లౌకిక వాదం కంటే దేశం లో 80% ఉన్న హిందువుల గౌరవం కాపాడడం కోసం అందరికీ ఒకటే న్యాయం అని తేల్చి చెప్పే కామన్ కోడ్ ఉండడం మంచిదే.

  ReplyDelete
  Replies
  1. Should India have a Uniform Civil Code? NDTV discussion

   https://www.youtube.com/watch?v=qWJlS04PYlE

   Delete
 7. విషయం కొంచెం పక్కదారి పట్తి కామన్ సివిల్ కోద్ దగ్గిర ఆగింది.అయినా ఫర్వాలేదు గానీ, శ్రీకాంత్ చారి గారు చెప్పిన విషయం ఇదివరకు కర్ణాకర్ణిగా విన్నది ఇప్పుడు రూఢి అయింది.ముస్లిములు పెళ్ళి, విడాకులూ లాంటి వ్యవహారాలకి కోర్టులకి రారు.ముల్లాల ద్వారా షరియత్ నిబంధనల ద్వారా తేల్చుకుంటారు.అయితే ఇంగ్లీషు వాల్ళు పాటించే ఆంగ్లోసాక్సాన్ న్యాయసూత్రాలకి హిందూ వివాహ చట్టం అనే లేబుల్ అతికించి మన ముఖాన కొడితే మన మేధావులు యేం చేస్తున్నట్టు?వాణ్ణి తన్ని తగలేసాక కూడా వాడి న్యాయసూఒత్రాలని పాటించటం అంటే మనం యెంత బధ్ధకస్తులమో తెలియటం లేదా?!

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారూ, 1955 హిందూ వివాహ చట్టం మీరు చదివారా? అందులో మీకు ఎవన్నా అభ్యంతరాలు ఉన్నాయి? మనం ఇంగ్లీష్ కామన్ లా వాడడానికి దీనికి అసలు సంబంధం ఉందా?

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. @jai
   న్యాయసూత్రాలు అన్యాయపూరితంగా యెందుకున్నాయో తెలుసుకోవాలని ఈ ప్రశ్న వేసాను.నాకు సరిగ్గా అనిపించని విషయాల్ని ప్రస్తావించాను.విదాకులకి సంబంధించి, వివాహేతర సంబంధాల గురించి వున్న గందరగోళాన్ని పైన శ్రె కాంథ్ గారు తెలియజేసారు, సంతోషం.

   వారసత్వ హక్కు అనేది మరీ అన్యాయంగా వుంది కదా.న్యాయం కోసం కోర్టుకు వెళ్ళేది సామాన్యులే అంబానీ కుటుంబం చూడండి, కోట్లకి పదగెత్తిన చోట కొడుకు లిద్దరూ తల్లి మాటకి కట్టుబడ్డారు, అంటే ఆవిడ ముందు నుంచే తన హక్కుని నిలబెట్టుకుందన్న మాట!.కానీ అక్కడక్కడా ఆస్తి మొత్తాన్ని కొడుకులు స్వాధీనం చేసుకుని ముసలి తల్లిని వెళ్ళగొట్టే వార్తల్ని చూస్తున్నాం. దరిద్రానికి ఆకలెక్కువ అని ద్రవ్యం యెక్కువగా వుంటే సరే, అది తక్కువ అయినప్పుడే ఆ తక్కువనే యెవేరు కిట్టించుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడే అన్యాయాలు జరుగుతాయి.ఆ అన్యాయాల్ని పరిష్కరించాల్సిన న్యాయసూత్రాలు కూడా అన్యాయంగా వుంటే యెలా అనేది నా ప్రశ్న.

   Delete
  4. హరిబాబు గారూ, సమస్యలు ఉన్న మాట వాస్తవం. వీటికి చట్టం/న్యాయ వ్యవస్తలో ఉన్న అవకతవకలు *కొంత* వరకు కారణమన్నది కూడా సత్యం.

   అయితే *సింహభాగం* సమస్యలకు మూల కారణం చట్టం/న్యాయ వ్యవస్థ కాదు. మిడిమిడి జ్ఞానం & డబ్బు కక్కుర్తి సమపాళ్ళలో ఉన్న ప్లీడర్లు, వారి మాటలను గుడ్డిగా నమ్మి డబ్బు తగిలేసుకొనే ప్రజలు, కింది స్థాయిలో విపరీతమయిన అవినీతి ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు చట్టాలు ఏమిటో ప్రజలకు అర్ధం అయ్యే భాషలో తెలియచెప్పే ప్రభుత్వాలు చేయలేదు. దీనికి తోడుగా తమకు అన్నీ తెలుసునని అనుకునే "మేధావులు" మీడియాలో పెట్రేగి పోయి ప్రజల మధ్య ఆందోళన, అపార్తాలు లేవనెత్తుతున్నారు.

   ఉ. వ్యక్తిగత న్యాయ సూత్రాలు చాలా మటుకు సంప్రదాయ న్యాయం లేదా ఆచారాల ఆధారంగానే ఉంది. కొన్ని సాంఘిక దురాచారాలను పారద్రోలడానికి గట్టి ప్రయత్నమే జరిగింది, కొంతవరకు సఫలం అయ్యింది కూడా. ఇంకాస్త సంస్కరణలకు (ఉ. ముసాయిదా నికానామా) తావుంది కానీ సాదించింది తక్కువేమీ కాదు.

   దురదృష్ట వశాత్తు జనబాహుళ్యానికి ఈ విషయాల గురించి తెలీదు. చట్టంలో నిజంగా ఏముందో అందరికీ తెలిస్తే నష్టపడే వారు బాగానే జాగ్రత్త పడ్డారు.

   సామాన్యులు, ముఖ్యంగా బీదా బిక్కీ & బడుగు వర్గాలు కోర్టు (లేదా పోలీసు స్టేషన్) గడప ఎక్కే పరిస్తితులు లేవన్నది పూర్తి యదార్ధం. ఇందుకు కారణం చట్టాలు కావు, చుట్టూ ఉన్న సమాజం అన్న విషయం కూడా అంతే సత్యం.

   మీరిచ్చిన రెండు ఉదాహరణలు చూద్దాం. అంబానీ వారసత్వం సమస్యలకు మూల కారణం క్రాస్ హోల్డింగ్. దీనికి అనేక కారణాలు ఉన్నాయి (ఒక్కోసారి తమ ఆస్తుల మూలాలను దాచిపెట్టడానికి కూడా ఇలా చేస్తుంటారు). అంచేత ఈ ఉదాహరణ మన చర్చకు సరిపోదేమే?

   రెండో రకం కేసులలో సాధారణంగా తండ్రి వీలునామాలో ఆస్తులను కొడుకులకు పంచి ఉంటారు. ఆస్తి స్వార్జితం అయితే ఆయనకు ఆ హక్కు ఉంది. కానీ తను పోయాక కొడుకులు భార్యను చూసుకుంటారనే గుడ్డి నమ్మకం ఉండడంచే ఆయన ఆవిడకు వాటా ఇవ్వడు. ఎక్కువ మంది భర్తలు ఆస్తుల విషయాలు భార్యతో చెప్పను కూడా చెప్పరు. ఇక్కడ సమస్య కారణాలు చనిపోయిన వ్యక్తికి ఉన్న అధిక పుత్ర వాత్సల్యం, ఇల్లాలి బేలతనం కానీ చట్టం కాదు కదా.

   I realize I am generalizing but this is in the interest of brevity only.

   Delete
  5. జైగారు. తెలుగులో చాలా బాగా వ్రాస్తున్నారు. చాలా సంతోషం. ఈ మీ వ్యాఖ్య విషయపరంగా కూడా బాగుంది. సాధారణవిద్యలో భాగంగా చెప్పనివి చాలానే ఉన్నాయి. వీటిలో న్యయసంబంధమైన అవగాహనలూ ఉన్నాయి. అలాగే అరోగ్యసంబంధమైన అవగాహనల వంటివీ, నిత్యజీవితంలో ఉపయుక్తమైన అనేక విషయాలూ చదువులో భాగంగా ఉండటం లేదు. అందువల్ల అవగాహనలోకి సామాన్యంగా రావటం లేదు.

   Delete
  6. థాంక్సండీ.

   ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. మనం సాధారణంగా గుర్తించని సత్యం ఏమిటంటే న్యాయం/చట్టం, చరిత్ర, ఆర్ధిక అంశాలు లాంటివి కూడా శాస్త్రాలే. వీటిలోనూ ఎంతో లోతుతో కూడుకున్న పరిజ్ఞానం ఉంది. ఎంతోకొంత పరిశోధన చేస్తే తప్ప ఒకపట్టాన అర్ధం కావు.

   అవతలి వైపు వీటి మీద "సామాన్యులకు" ఆసక్తి ఉన్నందున అందరికీ కొన్ని పైపై జ్ఞానంతో "నేర్చుకున్న" అభిప్రాయాలు ఉంటాయి. ఎటువంటి సాధన చేయకుండానే ఒక నిర్ణయానికి రావడం పరిపాటి అయ్యింది. ఇవి కరెంట్ అఫైర్స్ కావు మొర్రో ఆంటే ఒప్పుకోరు.

   మనలో మాట: ఈ మధ్య ఇదే జబ్బు ఆరోగ్య వైద్య రంగాలకూ సోకింది. టీవీ కార్యక్రమాలు చూసి చూసి ఎందరో తామూ డాక్టర్లమన్న లెవెలులొ బిల్డప్పులు ఇస్తారు. నాలుగు కార్యక్రమాలు చూడగానే వచ్చే దానికి ఆరేళ్ళ చదువు & ఏళ్ల తరబడి శ్రమ చేసాక సంపాదించిన అనుభవంతో పోలికలు లేవని వీరికి తెలీదు.

   Delete
  7. కాబట్టి చట్టాలు సమగ్రంగానే వున్నా యంటారు.కాకపోతే అందరికీ తెలియకపోవదం చేతనే అనర్ధాలు జరుగుతున్నాయి కాబోలు!కనీసం అతి ముఖ్యమయిన విషయాల గురించి అయినా తెలియాలి.మన పాఠ్య పుస్తకాల్లోకి యెక్కించి ఒక మాదిరిగా చదువుకున్న ప్రతి వ్యక్తికీ బేసిక్స్ అయినా తెలిసేలాగ ప్రభుత్వం వారు ప్రణాళిక వేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు.

   Delete
  8. చట్టవ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని నేను అనుకోను అయితే అందరూ ఊహించేంత ఘోరమయిన పరిస్తితిలో లేదు. విపరీతమయిన అవగాహనా రాహిత్యం (సామాన్యుల లోనే కాదు, లాయర్లలో కూడా) వల్ల అపోహలు పెరుగుతున్నాయి. ఇవి తగ్గాలంటే మీరు చెప్పినట్టు కనీసం బేసిక్స్ తెలిసేటట్టు చర్యలు చేపట్టాలి. కొంతవరకు ఈ ప్రక్రియ (ఉ. 8-9 తరగతులలో రాజ్యాంగం గురించి పాఠాలు) మొదలయింది ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top