నా పుట్టినరోజు సందర్భంగా నిన్న (23-8-2019) ఐదు మొక్కలు నాటాము. నా స్వగ్రామం చొప్పకట్లపాలెం గ్రామం లో పల్లెప్రపంచం కార్యాలయం వద్ద నాలుగు గానుగ మొక్కలు, ఒక వేప మొక్క నాటడం జరిగింది. " మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి " అనేది నా విజన్ లో భాగంగా ఈ పని చేశాను. కోటి మొక్కలు పెంచాలని నిర్ణయించుకుని గతంలో కొన్ని మొక్కలు నాటాము. మధ్యలో ఆర్ధిక కారణాలతో ఈ కార్యక్రమం కుంటుపడింది. అందుకే ఈసారి సింపుల్ గా ఈ కార్యక్రమం చేశాను. నేను, మా పెద్దక్క (మండెపుడి విజయలక్ష్మి), ప్రస్తుతం నేను కొత్తగా కొన్న ఇల్లు మాజీ యజమాని, గ్రామ సి.పి.ఎం నాయకుడు బొప్పాల అజయ్ కుమార్, ప్రస్తుతం ఇంటి రిపేరు పనులు చేస్తున్నసుతారు మేస్త్రీ షేక్ రఫీ, కార్పెంటర్ మేస్త్రీ వజ్రాల రాధాకృష్ణ లు ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది. ఐదు తో మొదలైన ఈ మొక్కల పెంపకం కోటి వరకు కొనసాగించేందుకు ప్లాన్ చేసుకున్నాను. వ్యక్తి గా కంటే శక్తి(సమూహం)గా ఈ పని చేయడం తేలిక కనుక సామూహికంగా ఈ పని కొనసాగుతుంది.


Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top