గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్‌ చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు?
పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు పేద ప్రజలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది?
పేద ప్రజల జీవితాల్లో సమూల మార్పు తీసుకురాగల ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్‌ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన అమలు చేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచుతూనే ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తారని సీఎం తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి దాదాపు ఏడు నెలలకు ముందే ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇది హడావుడిగా తీసుకున్న చర్య కాదు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఇది తెలీని విషయమూ కాదు. ఇది వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన నవరత్నాల్లో ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయకపోతే అదే ఒక సమస్యగా మారి జగన్‌ ప్రభుత్వాన్ని మనమే తప్పు పడతాం. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు. కానీ ప్రభుత్వం చేపట్టిన ఈ విద్యాసంస్కరణలను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాతృభాషా పరిరక్షణ ముసుగులో ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేటు పాఠశాలలకు చెందిన దళాలను రోడ్లపైకి ఎందుకు పంపుతున్నారు?

ఆయన మనవడు దేవాన్ష్‌ మాతృభాష ఏది? అతని తల్లిదండ్రులు లోకేష్, బ్రాహ్మణి తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా బోధించని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదివారు. పైగా వారు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి అక్కడి ఉచ్ఛారణరీతిని ఒంటబట్టించుకున్నారు. మరి వారిద్దరినీ ఆంధ్రదేశంలోని ప్రపంచశ్రేణి తెలుగు బోధనా కేంద్రానికి చంద్రబాబు ఎందుకు పంపలేకపోయారు.

మాతృభాష అనేది ఎన్నటికీ మారని ఒక స్థిరమైన వస్తువా లేక పిల్లల తల్లి కొత్త భాషలను నేర్చుకుంటూ, వివిధ భాషల్లో పిల్లలతో మాట్లాడుతూ మార్పు చెందుతూ ఉండదా? ఇంగ్లిష్‌ భాష అనేది కేవలం మనోభావాలను ప్రేరేపించే సాధనమా లేక ఒక వ్యక్తిని, కుటుంబాన్ని, ప్రాంతాన్ని, జాతిని అభివృద్ధి పరచే సాధనమా? ఇంగ్లిష్‌ జాతి వ్యతిరేకమైనదీ, లేక భారతీయ వ్యతిరేకమైనదీ లేక తెలుగుతల్లికి వ్యతిరేకమైనదీ అయితే మన జాతి నిర్మాతలు ఆ భాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్న కులీన వర్గాలలో మాత్రమే ఇంగ్లిష్‌ ఎందుకు మనగలిగి ఉంటోంది? భారతదేశంలోని  యువతరం పాలకులు ఇంగ్లిష్‌ మీడి యంలో మాత్రమే ఎందుకు చదువు నేర్చుకుంటున్నారు? 

భారతీయ గ్రామాల్లోని నిరుపేద, దిగువ తరగతి కులాలు ఇంగ్లిష్‌లో విద్య నేర్చుకున్న బ్రాండ్‌ నూతన పాలకుల భారతీయ క్లబ్‌లో చేరకూడదా? ఈ సంవత్సరం నవంబర్‌ 9 నాటి ఈనాడు పత్రిక సంపాదకీయం కేసి చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్‌ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేట్‌ స్కూళ్లలో మాత్రమే చదివిన,  చదువుతున్న పిల్లలను కలిగిన సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో మాత్రమే చదవడం ద్వారా వీరు దేశానికి, రాష్ట్రాలకు పాలకులుగా ఎలా  మారారు? జగన్‌ మోహన్‌రెడ్డి నుంచి అఖిలేష్‌ యాదవ్‌ వరకు,  రాహుల్‌ గాంధీ నుంచి నిర్మలా సీతారామన్‌ వరకు నారాలోకేష్‌ నుంచి కేటీ రామారావు వరకు సచిన్‌ పైలట్‌ నుంచి జ్యోతిరాదిత్య  సింధియా, ఆదిత్య థాక్రేల వరకు యువతరం పాలకులందరూ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న నేతలే కదా. మరి గ్రామీణ నిరుపేదలు, దిగువ కులాలకు చెందిన యువత వీరిలాగా రూపొందకూడదా? ప్రభుత్వ పాఠశాలల్లో తప్పితే వీరు ఏ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోగలరు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన పాలసీలో తప్పేముంది?  

జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేస్తోందన్న  వాదన పరమ హాస్యాస్పదమైనది. ఈనాడు అభిప్రాయం ప్రకారం మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య ద్వారా లబ్ధి పొందుతున్నవారు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని  వ్యతిరేకించాలట. ఇది నిజంగానే ఉద్వేగపూరితమైన, మనోభావాలను రెచ్చగొట్టే వాదన తప్ప మరేమీ కాదు. 

తన జీవితం తొలినాళ్లలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూసిన రామోజీరావు చిన్న కుమారుడు సుమన్‌  నిజాం కాలేజీలో నా విద్యార్థిగా బీఏ చదువుకున్నాడు. తాను ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యా నేపథ్యం నుంచి వచ్చాడు. తన తెలుగు ఏమంత బాగుండేది కాదు. కానీ ఇంగ్లిష్‌లో మంచి వక్త. నేర్చుకోవడం పట్ల నిజాయితీతో, చిత్తశుద్ధితో కూడిన అతడి వైఖరిని నేను అభినందించేవాడిని. తన క్లాసులో నేను అంతర్జాతీయ సంబంధాల గురించిన సబ్జెక్టును  బోధించేవాడిని కాబట్టి తరచుగా నా వద్దకు వచ్చి ఆ సబ్జెక్టుపై చర్చించేవాడు. ఈ సందర్భంగా నాలో రేగుతున్న ప్రశ్నలు ఏవంటే..  అంత భారీ స్థాయి తెలుగు మీడియా పరిశ్రమను నిర్వహిస్తున్న రామోజీరావు తన కుమారుడిని మాత్రం ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఎందుకు చేర్పించారు? తన కుమారుడిని అతడి మాతృభాష అయిన తెలుగు బోధించే పాఠశాలలో ఎందుకు చేర్పించలేదు? 

గ్రామీణ ప్రాంతాల్లోని పేదతల్లుల పిల్లలు తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే దాంట్లో తప్పేముంది? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్‌ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు, పేద ప్రజలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది? రామోజీరావు కూడా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో తన భార్య పేరిట రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ అనే ఇంగ్లిష్‌ మీడియం పబ్లిక్‌ స్కూల్‌ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ  ఇంగ్లిష్‌ మీడియం స్కూలు తన సేవలను ఎలా అందించింది, ఇప్పటికీ ఎలా అందిస్తోంది? తన వినోదాత్మక చానల్స్‌ను నడుపుతున్న ప్రధాన యాంకర్ల స్కూల్‌ విద్యా నేపథ్యం గురించి సర్వే చేయడానికి రామోజీరావు అనుమతించగలరా? వీరిలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యా నేపథ్యం నుంచి వచ్చినవారు కనుకనే వీరు చాలా తరచుగా ఇంగ్లిష్‌ మాట్లాడుతుండటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 

రామోజీరావు అనుబంధం కలిగి ఉన్న చిత్రపరిశ్రమలో సర్వే నిర్వహిద్దాం. యువ హీరోలు, హీరోయిన్లు మొత్తంగా  ఇంగ్లిష్‌ మీడియంలో చదివినవారే కానీ వీరంతా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు మరి. 

రామోజీరావు, చంద్రబాబు కుటుంబ నెట్‌వర్క్‌లతో సంబంధమున్న ఈ శక్తులతో సమాన శ్రేణిలో నిరుపేద దళితులు, బీసీలు, ఆదివాసీలకు చెందిన పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా కుట్ర ఏదైనా జరుగుతోందా? 
దేశంలో బాంబే ప్రావిన్స్‌లో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగా ధర తిలక్‌తో పాటు ఇంగ్లిష్‌ విద్య నేర్చుకున్న తొలి శూద్రుడు మహా త్మా జ్యోతిరావు పూలే. అంటే ఇంగ్లిష్‌ విద్యతో ఆనాటి నుంచే దిగువ కులాల విముక్తి ప్రారంభమైంది. 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పట్టుపట్టినప్పటికీ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఇంగ్లిష్‌ బోధనను ప్రైవేట్‌ స్కూల్‌ విద్యకు పరిమితం చేసింది. ప్రాంతీయ భాషలను ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా భాషలుగా స్వీకరించారు. ఈ విధానం విద్యా వ్యవస్థలో సమానహక్కులను తిరస్కరించింది. పాలక వర్గ భాషను నిరుపేదలు, నిమ్న కులాల వారికి నిరాకరించడంలో భాషే ప్రధాన పాత్ర పోషించింది. 

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని స్కూల్‌ విద్యను సమాన స్థాయికి తీసుకువచ్చే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండే మీడియా నెట్‌వర్క్‌ దీన్ని వ్యతిరేకిస్తే అందులోని అంతరార్ధాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలవారూ, పేద ప్రజానీకం గమనించలేకపోరు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగల అత్యంత నిర్ణయాత్మకమైన ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మున్ముందు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్‌ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది.

- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ ,వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త
-----------------------------------------

- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. ఇద్దరు సన్నాసులు కొట్టుకుంటే బూడిద రాలుతుంది. అసలు విషయం తెలుసుకోకుండా వాదించినా జరిగేది ఇదే. పోయిన ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో ఐ.ఐ.టి. కట్టాలనుకున్నాడు. ఐ.ఐ.టి.కి విద్యార్థులని రాబట్టడానికి గవర్నమెంట్ స్కూల్‌లని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలనుకున్నాడు. ఆ విషయం చంద్రబాబు నాయుడే చెప్పుకున్నాడు. ఇప్పుడు జగన్ కూడా అదే యోచనలో ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ దాన్ని అడ్డుకుంటున్నాడు. ఒకప్పుడు పల్లెటూరివాళ్ళు చదువుకోకుండా అడ్డుకున్న కరణం, మునసబ్‌లలో కమ్మవాళ్ళు, రెడ్లు, వెలమ దొరలు, బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి పల్లెటూరివాళ్ళ మీద ఇంగ్లిష్ నేర్పించేంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మాలా? ఇలా సందేహించకుండా మనం ఇంగ్లిష్, తెలుగు అని భాష పేరుతో వాదించుకుంటున్నాం.

  నాకు తెలిసిన కొంత మంది కోమటోళ్ళ పిల్లలు ఐ.టి.ఐ.లో చదివి ఔరబిందొ ఫార్మాలో ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ కంపెనీలో పని చెయ్యడానికి ఇంగ్లిష్ ప్రనన్సియేషన్ సరిగా వస్తే చాలు. గ్రామర్ అనేది అక్కడ మేనేజర్ స్థాయి ఉద్యోగులకే అవసరం. ఆ కంపెనీ హెచ్.ఆర్. మేనేజర్ ఆ యువకులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తే కట్నం రాదని, వాళ్ళే ఆ ఉద్యోగాలు వద్దని వెళ్ళిపోయారు. లాంగ్వెజ్ స్కిల్స్ పెద్దగా అవసరం లేని ఉద్యోగాలు ఇండియాలోనే చాలా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. "నాకు తెలిసిన కొంత మంది కోమటోళ్ళ పిల్లలు ఐ.టి.ఐ.లో చదివి ఔరబిందొ ఫార్మాలో ఇంటర్వ్యూకి వెళ్ళారు."

   "ప్రైవేట్ ఉద్యోగం చేస్తే కట్నం రాదని, వాళ్ళే ఆ ఉద్యోగాలు వద్దని వెళ్ళిపోయారు."

   "బాగా ఆడారు కదు మాష్టారూ!" మన్మధుడు లో బ్రహమానందం స్తైల్లో...

   Delete
 2. ఇంగ్లిష్ మీడియమ్‌ని వ్యతిరేకించేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియమ్‌కి పంపగలరా అని ఇంగ్లిష్ మీడియం సమర్థకులు అడుగుతున్నారు. నేను ఇంగ్లిష్ మీడియంలోనే చదివాను కానీ చివరికి నేను చేస్తున్నది 3 ఎకరాల వ్యవసాయం. ఇంగ్లిష్ మీడియం చదువుల వల్ల అవకాశాలు పెరగడం అనేది ఒక భ్రమ మాత్రమే. ఇంగ్లిష్ మీడియం విద్యని సమర్థించేవాళ్ళు తమ పిల్లల్ని గవర్నమెంట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లకి పంపగలరా? గవర్నమెంట్ స్కూల్‌లో లేబర్‌వాళ్ళ పిల్లలు ఉంటారనీ, వాళ్ళ పక్కన ఉంటే తమ పిల్లలు చదవరనీ వాదించినవాళ్ళని నిజజీవితంలో చూసాను. నిజజీవితంలో స్త్రీవాదం గురించి కూడా ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకోవడం చూడలేదు కానీ బ్లాగులు & ఫెస్‌బుక్‌లలో ఆడ, మగ అందరూ కలిసి స్త్రీవాదం గురించి మాట్లాడుకోవడం చూసాను. ఈ స్త్రీవాదం కబుర్లు చెప్పే స్త్రీలకైనా, అవే కబుర్లు చెప్పే పురుషులకైనా మైదానం రాజేశ్వరి ఒక ఆదర్శ మహిళ. కానీ ఈ స్త్రీలకి భర్తని వదిలేసి ఇంకో పురుషుడితో లేచిపొమ్మంటే లైఫ్‌లో సెటిల్ అయిన వ్యక్తితో కలిసే వెళ్తామంటారు, పురుషులకి పెళ్ళైన స్త్రీతో లేచిపొమ్మంటే అందుకు తమ తల్లితండ్రులు ఒప్పుకోరంటారు. అమీర్ లైఫ్‌లో సెటిల్ అవ్వలేదని రాజేశ్వరికి తెలుసు. అతను అడవిలో కట్టెలు కొట్టుకుని బతుకుతాడని తెలిసే అతనితో కలిసి వెళ్ళింది. అమీర్ కూడా తన తల్లితండ్రులకి చెప్పకుండానే రాజేశ్వరితో లేచిపోయాడు. హిందు స్త్రీతో లేచిపోయే ముస్లిం తన తల్లితండ్రులకి చెప్పి ఆ పని చెయ్యాలని రూల్ లేదు. మార్క్సిజం కబుర్లు చెపుతూ దెయ్యాల సాహిత్యం ప్రచురించే విరసం, స్త్రీవాదం కబుర్లు చెపుతూ తమ కంటే వయసులో పెద్దైన మగవాణ్ణే సెలెక్ట్ చేసుకునే స్త్రీలు, హేతువాదం కబుర్లు చెపుతూ తమ కొడుకు పెళ్ళికి హిందు జ్యోతిషుడి చేత ముహూర్తం పెట్టించే నాస్తికులు ఉన్నట్టే ప్రభుత్వ స్కూల్‌లలో ఇంగ్లిష్ మీడియమ్‌ని సమర్థించి తమ పిల్లల్ని ప్రభుత్వ ఇంగ్లిష్ పాఠశాలకి పంపలేని ఇంగ్లిష్‌వాదులు కూడా ఉంటారు.

  ReplyDelete
  Replies
  1. అమీర్ సెటిల్ అవ్వలేదని ఎవరన్నారు? అతను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ హద్దులు లేని జీవితంలో హాయిగా సెటిల్ అయ్యాడు కనుకే రాజేశ్వరి కూడా అతనితో వెళ్ళిపోయింది. ఇకపోతే ఆ అడవిలో నక్సలైట్లు లేరుగనుక రాజేశ్వరి వెళ్ళింది. వాళ్లే ఉంటే ఈమె వెళ్ళేది కాదు.

   Delete
  2. ప్రవీణ్ గారు ఏం చెప్పాలనుకుంటూన్నారో నాకు ఒక్క ముక్కా అర్ధం కాలేదు. ఈ ప్రాబ్లం నా ఒక్కడికేనా?

   Delete
  3. This comment has been removed by a blog administrator.

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. This comment has been removed by a blog administrator.

   Delete
 3. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కి ఎందుకు పంపించడం లేదని కొంత మందిని అడిగాను. గవర్నమెంట్ స్కూల్‌లో లేబర్‌వాళ్ళ పిల్లలు ఉంటారనీ, వాళ్ళకి చదువు అంత ఇంపార్టెంట్ కాదనీ, వాళ్ళ పక్కన ఉంటే తమ పిల్లలు చదువు ఎగ్గొట్టి క్రికెట్ ఆడుతారనీ వాళ్ళు సమాధానం చెప్పారు. గవర్నమెంట్ స్కూల్‌లలో బెంచిలు లేవని ఒక వ్యక్తి మాత్రమే నాకు సమాధానం చెప్పాడు. గవర్నమెంట్ స్కూల్‌లలో బెంచిలు ఏర్పాటు చేసినా అక్కడ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. కేవలం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినంతమాత్రాన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లకి పంపరు.

  ReplyDelete
  Replies
  1. మీకు ఎవరెవరు ఏమి చెప్పారన్నది ఓ భాగం. మీరు ఈ విషయం గురించి ఏం చెప్పదలచుకున్నది ముఖ్యం. అది స్పష్టంగా చెప్పండి.

   Delete
  2. ఐలయ్య గారు ఎక్కడో 1947 దాకా వెళ్ళిపోయారు కానీ1990 వరకు ఇండియాలో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లు తక్కువగా ఉండేవనీ, అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లల్ని స్థానిక భాషల్లోనే చదివించేవాళ్ళనీ మర్చిపోతున్నారు. 30 ఏళ్ళ క్రితం ఇంగ్లిష్ మీడియమ్‌కి ప్రోత్సాహన మొదలు పెట్టి, ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం లేకపోతే బతకలేమని ఎలా నిర్ణయిస్తారు?

   Delete
  3. గవర్నమెంట్ స్కూల్‌లలో బెంచిలు, లైబ్రరీలు, లేబరేటరీలు ఏర్పాటు చెయ్యాలని దళిత సంఘాలు డిమాండ్ చెయ్యడం లేదు. వీళ్ళు వాటిని కేవలం ఇంగ్లిష్ మీడియంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దళిత నాయకులు కూడా తమ పిల్లలని గవర్నమెంట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లకి పంపరు. వాళ్ళు తమ పిల్లల్ని గౌతం మోడల్ స్కూల్‌కో, రవీంద్ర భారతి స్కూల్‌కో పంపుకుంటారు.

   Delete
  4. ప్రభుత్వ స్కూల్స్ ఉధ్దరణ దళితనాయకులు మాత్రమే చెయ్యాలా? అక్కడ దళితులు మాత్రమే చదువుతున్నారా?

   Delete
  5. ఫేస్‌బుక్‌లో ఇంగ్లిష్ మీడియంకి వ్యతిరేకంగా అరుస్తున్నవాళ్ళలో ఎక్కువ మంది దళితులు. వాళ్ళలో కొందరు నాస్తికహేతువాదులు కూడా ఉన్నారు. తెలుగు మీడియం పాఠాలలో హిందు మత సంబంధిత కథలు ఉన్నాయనీ, వాటి వల్ల కుల వివక్ష & లింగ వివక్ష పెరుగుతాయనీ ఆ నాస్తికహేతువాదుల అభిప్రాయం.

   Delete
  6. Unable to delete the previous comment. ఫేస్‌బుక్‌లో తెలుగు మీడియంకి వ్యతిరేకంగా అరుస్తున్నవాళ్ళలో ఎక్కువ మంది దళితులు. వాళ్ళలో కొందరు నాస్తికహేతువాదులు కూడా ఉన్నారు. తెలుగు మీడియం పాఠాలలో హిందు మత సంబంధిత కథలు ఉన్నాయనీ, వాటి వల్ల కుల వివక్ష & లింగ వివక్ష పెరుగుతాయనీ ఆ నాస్తికహేతువాదుల అభిప్రాయం.

   Delete

  7. మరి ఇక్కడ కామెంటినవాళ్ళంతా కూడా దళితులేనా?

   https://timesofindia.indiatimes.com/city/vijayawada/english-medium-schools-are-not-exclusive-preserve-of-elite-cm/articleshow/72012860.cms


   అస్సలు నేనడిగిన ప్రశ్న మీకర్ధమైందా? ఎక్కడా నేను దళితులు వ్యతిరేకిస్తున్నారు అనలేదే... మరి దళితులు మాత్రమే సప్పోర్ట్ చెస్తున్నారు అనడంలో అర్ధమేమిటి? మిగితా కులాలవాళ్ళంతా గంగుత్తగా వ్యతిరేకిస్తున్నారు అని ఏ ఆధారాలతో చెబుతారు? మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివి వ్యవసాయం చెస్తున్నానని బాధపడూతున్నారే.. మరి మీతో చదివినవాళ్ళంతా అదే పని చేస్తునారా? మీరన్నకోమటోల్ల విషయం ఎంత కామెడీగా ఉందో నేనేసిన సెటైర్ చూశాక కూడా అర్ధం కాలేదా? ఉద్యోగం చేస్తే కట్నం రాదనుకునేవాడు అస్సలు ఇంటర్యూకి ఎందుకెల్లాడు? ఒక వేళ అర్ధమైతే, మీరింకా అనాలోచితంగా కమెంట్లేందుకు పెడుతున్నారు? మీరేసే కామెంట్లన్నీ మీచుట్టూ, మీ పొలం చుట్టూ తిరుగుతుంటే, ఇక మిగితా ప్రపంచం ఎప్పుడు చూస్తారు? ఎప్పుడర్ధం చేసుకుంటారు?

   Delete
  8. >>తెలుగు మీడియం పాఠాలలో హిందు మత సంబంధిత కథలు ఉన్నాయనీ, వాటి వల్ల కుల వివక్ష & లింగ వివక్ష పెరుగుతాయనీ ఆ నాస్తికహేతువాదుల అభిప్రాయం.

   I asked for the proof on this

   Delete
  9. వాళ్ళు నాకు చెప్పే శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ఔరబిందొ ఫార్మ ప్లాంట్‌లో పని చెయ్యడానికి వెళ్ళారు. హెచ్.ఆర్. మేనేజర్ వాళ్ళకి 13,000 జీతం + రెసిడెన్స్ ఇస్తామన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే అంత కంటే ఎక్కువ జీతం & కట్నం వస్తాయనే వాళ్ళు ఆ ఆఫర్‌ని వదులుకున్నారు. ఇండియాలో ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వ స్కూల్‌లో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. ఇలాంటివాళ్ళని ఎంటర్టెయిన్ చెయ్యడానికి కొత్తగా ఇంగ్లిష్ మీడియం ఎర ఒకటి. ప్రభుత్వ స్కూల్‌లలో ఇంగ్లిష్ మీడియం పెట్టినంతమాత్రాన ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లకి పంపరు. ఆ విషయం అందరికీ తెలుసు కానీ దేవతా వస్త్రాలు కథలాగ అందరూ నోరు మూసుకుంటున్నారు.

   Delete
  10. @చిరు, తెలుగు స్కూల్ పాఠాలలో ఆధిపత్యవాద సాహిత్యం ఉందని ఏడ్చినది యడవల్లి రమణ గారే. కావలంటే ఫేస్‌బుక్‌లోకి రా.

   Delete
  11. "హెచ్.ఆర్. మేనేజర్ వాళ్ళకి 13,000 జీతం + రెసిడెన్స్ ఇస్తామన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే అంత కంటే ఎక్కువ జీతం & కట్నం వస్తాయనే వాళ్ళు ఆ ఆఫర్‌ని వదులుకున్నారు."

   వాళ్ళు అలా చెప్పారు... మీరు నోట్లో ఏలేసుకోని విన్నారు. అంతేగానీ "గవ్ర్నమెంట్ ఉద్యోగం కావాలసినోల్లు, అరబిందో కెందుకెల్లార్రా?" అని అడగాలని అనిపించలేదు.

   >>తెలుగు స్కూల్ పాఠాలలో ఆధిపత్యవాద సాహిత్యం ఉందని ఏడ్చినది యడవల్లి రమణ గారే. కావలంటే ఫేస్‌బుక్‌లోకి రా.

   మీరిచ్చిన లంకె పట్టుకోని అక్కడ కొంతవరకూ చదివాను. అంతేగానీ, "అక్కడుంది, అన్నిపోష్టులూ చదువుకో.. అప్పుడే తెలుస్తుందీ" అని చెప్తే, అతన్ని మీరు ప్రమోట్ చెసినట్టే ఉంది.

   Delete
  12. గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యాలనుకునేవాళ్ళు ఐ.టి.ఐ.లో ఎందుకు చదివారు అని నేనే వాళ్ళని అడిగాను. ఐ.టి.ఐ.లు ఉన్నది పారిశ్రామిక శిక్షణ కోసమే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తాలకి ట్రెయినింగ్ ఇవ్వడానికి కాదు.

   Delete
  13. ??????
   "గవ్ర్నమెంట్ ఉద్యోగం కావాలసినోల్లు, అరబిందో కెందుకెల్లార్రా?" అని అడగాలని అనిపించలేదు.
   ??????

   Delete
  14. ప్రైవేట్ ఉద్యోగం చేస్తే కట్నం రాదని తెలిసినోళ్ళు ఐ.టి.ఐ.లో చదవడం కంటే పెద్ద పేరడాక్స్ ఏముంది?

   Delete
  15. కోమటోళ్ళు ఏమంత తెలివైనవాళ్ళు కాదు. ఆ కులంలో జెండర్ సెలెక్టివ్ అబార్షన్‌లు ఎక్కువ, ఆడపిల్లల సంఖ్య తక్కువ. విజయనగరం జిల్లాలోని కోమటోళ్ళలో ఆడపిల్లల తల్లితండ్రులందరూ తమ కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నారు, కిరానా వ్యాపారం చేసేవాడు తమకి అక్కరలేదంటున్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం వల్ల కొందరు కిరానా వ్యాపారులు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం దండిగా కట్నం వస్తుంది. అందుకే ఐ.టి.ఐ.లో చదివి పరిశ్రమలో ఆఫర్‌ని వదులుకునేవాళ్ళు తయారవుతున్నారు.

   Delete
 4. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమిక విద్యాలయాలలో ఆంగ్లం బోధనా మాధ్యమం క్రైస్తవ మతమార్పిడులకే అని పచ్చ కామెర్ల అంధ కోతి వెకిలి వేమూరి తేల్చేసాడు!

  ReplyDelete
  Replies
  1. రాధ్రాకృష్ణ కమ్మవాడు. దళితులు చదువుకోవడం కూడా వాడికి ఇష్టం ఉండడు. ఒక రెడ్డి దళితుల పిల్లలకి ఇంగ్లిష్ చదువు నేర్పిస్తాడంటే మాత్రం నమ్మొచ్చా?

   Delete
  2. గవర్నమెంట్ స్కూల్‌లలో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులైనా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లకి పంపించడానికి ఒప్పుకుంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు, ఒక దళితుడి కొడుకు పక్కపక్కన కూర్చుని చదువుకుంటే కొంత వరకైనా అంటరానితనం తగ్గుతుంది. ఇంగ్లిష్ చదువుల వల్ల అంటరానితనం తగ్గదని ఎల్.వి. సుబ్రమణ్యం అనే మనువాద ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ నిరూపించాడు కదా. ఆయన తిరుపతి దేవస్థానం ఇ.ఒ.గా ఉన్నప్పుడు ఆ గుడిలో హిందువులు మాత్రమే ఉద్యోగం చెయ్యాలని రూల్ పెట్టాడు.

   Delete
  3. జగన్ తన మానాన తాను జనంలో తిరుగుతూ ప్రచారం చేసుండుంటే 125-130 సీట్లు వచ్చేవి. పచ్చమీడియా ఓవరాక్షన్ పుణ్యమా అంటూ ఏకంగా 151 సీట్లు గెలిచాడు.

   టీడీపీకి 23 సీట్లు రావడం వెర్రిమొర్రి బాధాకృష్ణకు ఎందుకో నచ్చలేదు. తన తలతిక్క రాతలతో పచ్చ పార్టీని 2-3 సీట్లకు తెచ్చేంతవరకు ఇతగాడికి నిద్ర పట్టేట్టు లేదులాగుంది!

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. ఎన్నికల్లో గెలిచి కూడా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనెయ్యడం లాంటి తెలివితక్కువ పనుల వల్ల కూడా చంద్రబాబు ఓడిపోయాడు. ఈ కమ్మ పత్రికలు ఇంకొక కారణం. ఋణ మాఫీ కింద రైతులకి రెండుమూడు వందలు మాత్రమే అకౌంట్‌లో వేసినా ఋణ మాఫీ పూర్తిగా జరిగిందని ఈ పచ్చ పత్రికలు ప్రచారం చేసినాయి.

   Delete
 5. పవన్ కళ్యాణ్ తను నమ్మేది నిజమనుకుంటే, "ఐస్ బకెట్ చాలెంజ్" లాగా, "తెలుగు మాధ్యమ సవాల్" మొదలుపెట్టాలి. ముందు తన పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించి, తన ప్రియతమ నేత చంద్రబాబుకు, రాధా కృష్ణకు, తన అభిమానులకు సవాల్ విసరాలి. చంద్రబాబు తన మనమడ్ని తెలుగు మీడియంలో చేర్పించి, మిగితా తెలుగుదేశం నాయకులకి, జగన్ కు సవాల్ విసరాలి.

  ReplyDelete
  Replies
  1. వాడు జనసేన పార్టీ ఎందుకు పెట్టాడో, వాడి అన్న ప్రజారాజ్యం ఎందుకు మూసేసాడో వాడికే తెలియదు. మన ఇండియాలో డబ్బున్నవాడు ఎవడూ తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కి పంపడు, అది తెలుగు మీడియమైనా, ఇంగ్లిష్ మీడియమైనా. మన ఇండియాలో ఉన్న ఆర్థిక అసమానతల ప్రభావం అది. తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని పవన్ కల్యాణ్ కూడా తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కి పంపడు. కాకపోతే అతను తెలుగు మీడియం యొక్క అవసరం గురించి ఇంగ్లిష్‌లో వ్రాసిన లేఖ ఒకటి ఫేస్‌బుక్‌లో చూసి నవ్వుకున్నాం, అంతే.

   Delete
 6. ప్రొఫెషనల్ విద్య నేర్చి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆశపడేవారి గురించి జరుగుతున్న ఈ చర్చలో నేను ఒక్క సంగతి మాత్రం చెప్పదలుచుకున్నాను. డాక్టర్ చదువు చదివి (ఆనాటి Dr.జయప్రకాష్ నారాయణ ఉదాహరణ), IIT, BITS(Pilani), IIM ల్లో చదివి IASకు IPS కు, స్టేట్ గ్రూప్-1లో DyCollector ఉద్యోగానికి DySP ఉద్యోగానికి ఎందుకు వెడుతున్నారు? అలాగే ITI చదివినవాళ్ళూ ప్రభుత్వోద్యోగం కావాలనుకుంటున్నారేమో?

  ఎవరి ఆశయాలు వారివి.

  ReplyDelete
  Replies
  1. IIT చదివితే సర్కారీ ఉద్యోగాలు రావని ఎవరు చెపారు? రైల్వేలో, ఆర్టీసీలో ఎన్ని ఉద్యోగాలు లేవు...

   "నేనూ, నాపొలం" అనే సినిమా 24 గంటలూ ఇంట్లో కూర్చోని చూసే వాళ్ళకి ఈ విషయాలు ఎలా అర్ధమౌతాయి?

   Delete
  2. పరిశ్రమలో ఆఫర్ వచ్చినా కూడా దాన్ని వదులుకునేవాళ్ళది ఏ సినిమా? బాబు మోహన్ + కోట శ్రీనివాసరావు కామెడీనా? పైడిభీమవరం దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కానీ అది ఒక పల్లెటూరు. అక్కడ బతకడానికి 13,000 జీతం సరిపోతుంది. హెచ్.ఆర్. మేనేజర్ వాళ్ళకి రెసిడెన్స్ కూడా ఇస్తానన్నాడు. అయినా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం తమకి అక్కరలేదని చెప్పి వెళ్ళిపోయారు.

   Delete
  3. ప్రవీణ్ గారూ! కొంచెం ఆవేశపడకుండా, తీరుబడిగా నేనెమ్మన్నానో అలోచించండి. అప్పుడూ మీ వాదనలో లేక మిమ్మల్ని పుష్పం చేసిన కోమటోల్ల మాటల్లో డొల్లతనం తెలుస్తుంది.

   వాళ్ళకి గవర్నమెంటు జాబు మాత్రమే కావాలనుకుంటే, అస్సలు అరబిందోకి ఇంటర్వూకి ఎందుకెల్తారు అన్నదే ప్రశ్న

   Delete
  4. ప్రభుత్వ ఉద్యోగం మాత్రమె కావాలనుకునేవాళ్ళు అసలు ఐ.టి.ఐ. దాక ఎందుకు వెళ్ళారు అని నేను వాళ్ళని అడిగాను. ఒరిస్సాలో నాకు తెలిసిన ఇంకొక ఐ.టి.ఐ. కుర్రాడు గ్రామసేవక్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను పట్టణంలో ఇల్లు అద్దెకి తీసుకుని వారానికి రెండు సార్లు మాత్రమే గ్రామానికి వచ్చిపోతుంటాడు. పై అధికారులే వాడికి గ్రామంలో పని చెయ్యమని చెప్పకుండా పట్టణంలోని సమితి ఆఫీస్‌లో అతని చేత ఉపాధి హామీ రికార్డులు వ్రాయిస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలనుకునేవాళ్ళు ఐ.టి.ఐ. దాకా వెళ్ళకూడదు. అప్పుడు నిజంగా పరిశ్రమలో పని చెయ్యాలనుకునే నిరుద్యోగికి సీట్ దొరుకుతుంది. వాళ్ళు పని లేకుండా ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి హెచ్.ఆర్. మేనేజర్ టైమ్‌ని కూడా వేస్ట్ చేసారు.

   Delete
  5. కోమటోల్ల సీను గురించి మీరు చెప్పేది అతకలేదులేగానీ ఇక ఆటాపిక్ వొదిలేద్దాం.

   రైల్వేలో ఎప్పుడైనా ITI finished Drivers, fitters, electricians, etc కావాలి అంటూ notifications ఇవ్వడం చూశారా? సమాధానం 'YES' ఐతే, మీ వాధనంతా తప్పు అని తేలిపోతుంది. 'NO' అంటే, మీకు నాలేడ్జీ లేదని తేలిపోతుంది

   Delete
  6. This comment has been removed by a blog administrator.

   Delete
  7. ఐ.టి.ఐ.లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివినవాడికి ఆర్.టి.సి.లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఆర్.టి.సి.కో, రైల్వేకో పరిమితం కాదు కదా.

   Delete
  8. ఐ.టి.ఐ.లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివినవాడికి ఇంకా ఎక్కడెక్కడ జాబులిస్తే బాగుంటుంది?

   Delete
  9. ప్రవీణ్ గారూ! వీటన్నిటినీ స్పెషలైజ్డ్ కోర్సులంటారు. మీకు వినడానికి బాధ కలిగినా గానీ ఒక్క వుషయం చెప్పదలుచుకున్నా. మీ వాదనలో పస అస్సలు లేదు. చాలా బోరింగు గా ఉంది. ఇక్కడితో ఆపేద్దం. నమస్తే

   Delete
 7. ఆంధ్రలో కొన్ని గ్రామాల్లో స్కూల్‌లే లేవు. అక్కడ 100% మంది నిరక్షరాస్యులు. అక్షరం ముక్క రానివాళ్ళకి ముందు తెలుగులో చదువు నేర్పిస్తారా లేదా ఇంగ్లిష్‌లోనా? నేను ప్రపంచ బ్యాంక్ విధానాలకి వ్యతిరేకం కానీ ప్రభుత్వ ఉద్యోగులని రీట్రెంచ్ చెయ్యాలని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన సలహాని మాత్రం అంగీకరిస్తాను. ఆంధ్ర, తెలంగాణల్లో వి.ఆర్.ఓ.లకీ, ఒరిస్సాలో గ్రామ రోజ్‌గార్ సేవక్‌లకీ & కృషీ గ్రామ సేవక్‌లకీ పెద్ద పని ఉండదు. వీళ్ళు పట్టణాల్లో ఇళ్ళు అద్దెకి తీసుకుని, తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లలో చదివించుకుంటూ, వారానికి లేదా రెండు వారాలకి ఒకసారి గ్రామానికి వచ్చిపోతుంటారు. పారిశ్రామిక అభివృద్ధికి ఇంగ్లిష్ ప్రొఫిషన్సీ పెద్దగా అవసరం లేదు. ఫార్మా కంపెనీల్లో రెగ్యులర్ వర్కర్స్ కంటే డైలీ వేజ్ వర్కర్సే ఎక్కువగా ఉంటారనీ, డైలీ వేజ్ వర్కర్స్‌కి ఇంగ్లిష్ రాకపోయినా పర్వాలేదనీ ఒక ఫార్మా కంపెనీ మేనేజరే ఫేస్‌బుక్‌లో వ్రాసాడు. మేనెజీరియల్ ఉద్యోగాలు మాత్రం ఇంగ్లిష్ వచ్చినవాళ్ళకే ఇస్తారు. అందరికీ మేనెజీరియల్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఇక ఇంగ్లిష్ కోసం ఇంత వేలాడడం అనవసరం.

  ReplyDelete
  Replies
  1. >>ఆంధ్రలో కొన్ని గ్రామాల్లో స్కూల్‌లే లేవు. అక్కడ 100% మంది నిరక్షరాస్యులు.

   స్కూల్లే లేనప్పుడు, ఏ భాషలో నేర్పుతారు అనే సమశ్యేముంది అసలు..


   >>ఫార్మా కంపెనీల్లో రెగ్యులర్ వర్కర్స్ కంటే డైలీ వేజ్ వర్కర్సే ఎక్కువగా ఉంటారనీ, డైలీ వేజ్ వర్కర్స్‌కి ఇంగ్లిష్ రాకపోయినా పర్వాలేదనీ ఒక ఫార్మా కంపెనీ మేనేజరే ఫేస్‌బుక్‌లో వ్రాసాడు.

   వాళ్ళకి చదువుకూడా అక్కర్లేదు.


   >>మేనెజీరియల్ ఉద్యోగాలు మాత్రం ఇంగ్లిష్ వచ్చినవాళ్ళకే ఇస్తారు. అందరికీ మేనెజీరియల్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఇక ఇంగ్లిష్ కోసం ఇంత వేలాడడం అనవసరం.

   పంటలు పోవడానికే ఎక్కువ అవకాశముందని, మీరు పొలం వెయ్యడం మానేస్తారా? ఎవడైనా చదువుకొనేది ఉన్నత స్థానానికి వెల్లాలనే. ఎవడూకూడా కూలిపని చెయ్యాలనుకోడు. చివరికి మీతోసహా.. ఏం? మీకేమైనా కూలి పని మీదే ఆసక్తి ఉందా?

   Delete
  2. జీరో ఎన్రోల్మెంట్ ఉందని ఉన్న స్కూల్‌లనే మూసేస్తున్న ప్రభుత్వం స్కూల్‌లు లేని గ్రామాల్లో కొత్త స్కూల్‌లు కట్టదులే. కొత్త స్కూల్‌లు కట్టే ఉద్దేశమే లేని ప్రభుత్వానికి ఇంగ్లిష్ మీడియం మీద ఆసక్తి ఎందుకు కలిగింది? వర్షం లేక వరి నాట్లు అవ్వకపోతే జొన్నలో, మినుములో, పొద్దు తిరుగుడో వేసుకుంటాం. ఇంగ్లిష్ వచ్చినవాడికి వైట్ కాలర్ ఉద్యోగం దొరక్కపోతే బ్లూ కాలర్ ఉద్యోగం చెయ్యడానికి ఒప్పుకుంటాడా?

   Delete
 8. బ్రిటిష్‌వాళ్ళు ఇండియాలో ఇంగ్లిష్ విద్యని ప్రవేశపెట్టడం వల్లే మన దేశంలో కుల వ్యవస్థ బలహీనపడిందని కొంతమంది నాస్తికులు & దళితవాదుల అభిప్రాయం. బ్రిటిష్‌వాళ్ళ కింద గుమాస్తాలుగా పని చేసినవాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులే అనే విషయం ఇక్కడ మర్చిపోతున్నారు. పూర్వం సంస్కృతం మాట్లాడిన బ్రాహ్మణులు బ్రిటిష్‌వాళ్ళు వచ్చిన తరువాత ఇంగ్లిష్ నేర్చుకుని వాళ్ళ కింద గుమాస్తా పనిలో చేరారు తప్ప కులం వదులుకోలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణులు, కోమటోళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. పూర్వం కోమటోళ్ళు లెక్కలు వ్రాసుకోవడానికి చదువు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళు స్కూల్ చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులెవరూ సంస్కృతం మాట్లాడడం లేదు. వాళ్ళు మాట్లాడేది తెలుగు, హిందీ లాంటి స్థానిక భాషలే. సంస్కృతం మర్చిపోయినా కుల వ్యవస్థ ఇప్పటికీ బతికే ఉంది. ఇంగ్లిష్ మీడియం చదువుల వల్ల కులం పోతుందనుకోను. మా నాన్న కరీమ్‌నగర్‌లో పని చేసిన రోజుల్లో నేను చదివిన స్కూల్‌లో ఎక్కువ మంది విద్యార్థులు కోమటోళ్ళు & రెడ్లే. గవర్నమెంట్ స్కూల్‌లలో ఇంగ్లిష్ ప్రవేశపెట్టినంతమాత్రాన కోమటోళ్ళు, రెడ్లు తమ పిల్లల్ని అక్కడికి పంపించరు. ఆ స్కూల్‌లలో దళితుల పిల్లల పక్కన తమ్మ పిల్లల్ని కూర్చోబెట్టడానికి వీళ్ళు ఒప్పుకోరు.

  ReplyDelete
  Replies
  1. దేశంలో మీలాంటి వెనకబడ్డ అడవులు, కొండలే కాదండీ, కాస్త మార్పు చెంది కుల పిచ్చి ఒదిలించుకుంటున్న ఊర్లు కూడా ఉన్నాయి. కాస్త వాటిని కూడా గమనించండి. ప్రపంచంలో ఏ సమస్య చెప్పినా, దాన్ని "బ్రాహణుల దగ్గరికి" అని కంచెదగ్గరికే లాక్కెల్లే కంచె ఐలయ్య గారిని, దేశంలో అనాది కాలం నుండీ ఏ పనికిమాలిన పని జరిగినా, దాన్ని అప్పటీకింకా పుట్టని ప్రిటీష్ వాల్లమీదా, క్రైస్తవుల మీద రుద్దేసే మన బ్లాగు మేతావి లాంటి వారిని చూసైనా తెలుసుకోండి. మన దగ్గర విషయం ఎంత ఉన్నది అనికాదు, దాన్ని ప్రోపర్గా ప్రెజెంట్ చేసుకుంటూన్నామా, లేదా అని.. ఈ సలహా మీరు తీసుకుంటారో, లేదో మీ ఇష్టం

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
 9. గవర్నమెంట్ స్కూల్‌లలో బెంచిలు ఏర్పాటు చెయ్యాలని ఎవరూ డిమాండ్ చెయ్యడం లేదు, స్కూల్ ఎగ్గొట్టి కోచింగ్ సెంటర్లు నడుపుతున్న టీచర్లని డిస్మిస్ చెయ్యాలని కూడా ఎవరూ డిమాండ్ చెయ్యడం లేదు. జనం తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తే ప్రభుత్వ ఉద్యోగమో తప్పకుండా వస్తుందని నమ్ముతున్నారు. అందుకే అపార్ట్మెంట్ వాచ్‌మేన్ కూడా తన కొడుకుని ప్రైవేట్ స్కూల్‌కే పంపిస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియం అనేది అసలు సమస్యని దాచిపెట్టడానికి వేసే ఎత్తుగడ మాత్రమే.

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 11. This comment has been removed by the author.

  ReplyDelete
 12. చదువులో కొందరు వెనకబడటానికీ కొందరు ముందుకు దూసుకుపోవటానికీ మీడియం అనేది ఒక కారణం కానే కాదు.మొదట పాఠాల్లో చదించే లక్షణం ఉండాలి.దీనికి వాటిలో ఉన్న విషయం పనికి వచ్చేది కావడం, చెప్పిన పద్ధతి బాగుండటం - రెండూ సమానమైన బాధ్యత వహిస్తాయి.

  ప్రభుత్వం బడ్జెట్లో అతి తక్కువ విద్య మీదనే ఖర్చు చేస్తూ తగినంతమంది టీచర్లని రిక్రూట్ చేసుకోవడంలో సోమరితనం చూపిస్తూ కేవలం medium of instruction మారిస్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడం శుద్ధ వెర్రిబాగులతనం!

  చిన్నప్పటినుంచీ తెలిసినవాళ్ళ ద్వారా కొత్త భాషని గానీ కొత్త విషయాల్ని నేర్చుకోవటానికి సంబంధించిన పునాది ఉండి హుషారుగా ఉంటూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడే కుర్రాళ్ళకి మీడియం ఏదైనా ఒకటే.

  నా స్వానుభావం ఇది:పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారినా ఏమాత్రం కంగారు పడలేదు.దానికి కారణం హైస్కూల్లో చదివేటప్పుడు మా ట్యూషన్ మాస్టారు ఇంగ్లీషు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేర్పించడమే!

  ఒక స్కూలు మొత్తం ఒకే medium of instruction ఉండి ఒక క్లాసులో ఒక టీచరు 30 మందికి ఒకే సబ్జెక్టు ఒక సంవత్సరం పాటు చెప్తే పరీక్షల్లో అందరికీ ఒకే 100 మార్కులు రావడం లేదు - దీనికి కారణం ఏమిటి?

  అందరికీ 100/100 రావడం అసంభవమేనని నాకు తెలుసు.అందరికీ 90/100 కూడా అసాధ్యమే కదా!స్కూళ్ళూ కాలేజిలూ యూనివర్సిటీలూ చెయ్యాల్సింది మొదటి క్లాసు టెస్టు నుంచీ అన్ని సబ్జెక్టుల్లోనూ 90/100 తెచ్చుకుంటున్నవాళ్ళని పోస్టర్ కిడ్స్ కింద పేపర్లలో ఫొటోలు వేసుకుని సంతోషించడం కాదు, మొదటి టెస్టులో 10/100తో వెనకబడి ఉన్నవాళ్ళని ఫైనల్ టెస్టుకి వచ్చేసరికి కనీసం 60/100 వరకు లాగటం, అవునా?

  ఆ మొదటి టెస్టులో 10/100తో వెనకబడి ఉన్నవాళ్ళు అలా ఉండటానికీ టీచర్లు ఎంత కృషి చేసినా ఫైనల్ టెస్టుకి వచ్చేసరికి కనీసం 60/100 వరకు రాలేకపోవటానికీ కొత్త భాషలో పునాది లేకపోవడం కారణమయితే దాన్ని అధిగమించటానికి ఏమి చర్యల్ని ప్రతిపాదిస్తున్నది ప్రస్తుత ప్రభుత్వం?ఏ మీడియం అయినా విద్యాప్రమాణాలు మెరుగుపడటంలో నూటికి నూరుశాతం రిజల్ట్ ఇవ్వదు - మిగిలిన అంశాలు కూడా కలిస్తేనే దాని ఎఫెక్ట్ అది చూపిస్తుంది, అంతే!


  ఇలా విద్యాబోధన పట్ల శాస్త్రీయమైన ప్రణాళిక వేసుకోకుండా ఎన్ని తరాలు గడిచినా చదువుల్లో క్వాలిటీ పెరగదు.మన చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ ఏమో వ్యాపార పారిశ్రామిక రంగాల మీద ఆధారపడుతూ ఉత్పత్తి జరిగే చోట Designing,Marketing and exploration లాంటివాటిల్లో క్రియేటివిటీ చూపించాల్సిన చురకత్తుల వంటి కుర్రాళ్ళు అవసరమయితే మన చదువులు మాత్రం ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకి మాత్రమే పనికివచ్చేటట్టు ఉంటున్నాయి - అదే అసలైన దరిద్రం!

  ReplyDelete
  Replies
  1. మన ప్రభుత్వం పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రాన్ని నమ్ముతోంది. మొదటి పాయింట్ ఏమిటంటే, ప్రభుత్వ స్కూల్‌లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినంతమాత్రాన తహసీల్దార్‌లూ, కలెక్టర్లూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లకి పంపరు. ప్రభుత్వ స్కూల్‌లలో బెంచిలు ఉంటే ఎస్.ఐ. ర్యాంక్ ప్రభుత్వ అధికారులైనా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌లకి పంపుతారు. రెండో పాయింట్ ఏమిటంటే, పేద కుటుంబాలలో ఆడపిల్లకి తల్లి చనిపోతే ఇంటి పనులు చూసుకోవడానికి ఆమె స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిపోతుంది, మగపిల్లవాడికి తండ్రి చనిపోతే అతను కుటుంబ వ్యాపారం చూసుకోవడానికి డ్రాపౌట్ అయిపోతాడు. కొంత మంది టీచర్లు పాఠాలు సరిగా చెప్పకుండా క్లాస్ బయటకి వెళ్ళి సిగరెట్లు తాగుతుంటారు. ఇలాంటి టీచర్లు ఉన్నప్పుడు ఏ మీడియం ఉన్నా విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెరగదు, తత్ఫలితంగా డ్రాపౌట్లే పెరుగుతాయి. డ్రాపౌట్లు లాంటి ముఖ్యమైన సమస్య వదిలేసి కేవలం మీడియం మీద దృష్టి పెడుతోంది ప్రభుత్వం. The government must also initiate necessary action against those teachers who run private schools and coaching centers.

   Delete
 13. టీచర్ల జీతం పెంచడానికి ఎక్కడా లేని ఆసక్తి చూపే ప్రభుత్వం దగ్గర టీచర్ల సంఖ్యని పెంచడానికి డబ్బులు ఎందుకు లేవు?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top