ప్రియాంక ఘటన పై  నాకు వఛ్చిన ఓ వాట్సాప్ మెసేజ్ యథాతథంగా ఇక్కడ ఉంచాను. ఇందులోని  అంశాలపైనా, మృగాళ్ల అంతానికి సమాజంలో రావలసిన మార్పులపైనా మీ అభిప్రాయం తెలుపగలరు. ఆక్రోశంతోనో,  వ్యవస్థల దారుణ లోపలపైన మాత్రమే కాకుండా, సమస్య పరిష్కారానికి  సమగ్ర దృష్టితో  సూచనలు చేయడానికి ప్రయత్నించాలని మనవి. 

- పల్లా కొండలరావు 
---------------------------

ఆ నలుగురే కాదు...!

 • 26 ఏళ్ల ఓ ఆడ కూతురు చీకటి పడుతువుతున్న వేళ తన బైక్ ను పార్క్ చేసేందుకు వస్తే నిరాకరించిన టోల్ ప్లాజా సిబ్బంది...
 • లారీ బే లో కాకుండా టోల్ ప్లాజా సమీపంలో గంటల తరబడి లారీ ఆపుకుని, మధ్యం సేవిస్తున్నా పట్టించుకోని హైవే పెట్రోలింగ్ సిబ్బంది...
 • రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంతో బిజిగా ఉండే తొండుపల్లి(శంషాబాద్) హైవేపై ఓ యువతిని లాక్కెళుతున్న అటు వైపు దృష్టి పెట్టని వాహనదారులు, స్థానికులు...
 • బాటిల్ లో పెట్రోల్ పొయ్యొద్దని ఉత్తర్వులున్నా అర్ధరాత్రి అనుమాన పడకుండా బాటిల్ లోనే పెట్రోల్ పోసిన బంకు సిబ్బంది...
 • తమ బిడ్డ కనిపిస్త లేదని నిస్సహాయ స్థితిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రియాంక కుటుంబ సభ్యులకు మా పరిధి కాదంటే మాది కాదంటు తిప్పి పంపిన రెండు పోలిస్ స్టేషన్ల సిబ్బంది...
 • పరాయి స్త్రీ మన తల్లి, చెల్లితో సమానం అనే బావన కల్పించకుండా ఆ నలుగురు మృగాలను పెంచి పోషించిన వారి కుటుంబసభ్యులు...
 • సంస్కరం, విలువలు, మంచి, చెడు అనే అంశాల జోలికి వెళ్లకుండా కేవలం డబ్బు సంపాదనే లక్షంగా చదువు నేర్పిస్తున్న విద్యా సంస్థలు...
 • మన రాజ్యాంగం అమలులోకి వచ్చాక కొన్ని వేల సవరణలు చేసినప్పటికి కామాందులను, కర్కోటకులను నడి రోడ్డుపై కాల్చి చంపేలా చట్టాలను మార్పుచేయలేకపోతున్న ప్రభుత్వాలు...
 • ప్రియాంక రెడ్డి లాంటి ఘటనలు జరిగిన నాలుగు రోజులు సోషల్ మిడియాలో హడావిడి చేసి ఆ తర్వాత ఎవరి పనిలో వారు బిజి అయిపోయే నువ్వూ నేను అందరం...
- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.


Post a Comment

 1. అతివినయం ధూర్త లక్షణం అన్నారు. పరాయి ఆడది తల్లితోనూ, చెల్లితోనూ సమానం అని బోధించే సమాజంలోనే రేప్‌కి గురైన స్త్రీని చెడిపోయింది అనుకుంటారు. 1970లు & 1980లలో నిర్మించిన సినిమాల్లో రేప్ సీన్లు ఎక్కువగా ఉండేవి. ఆడపిల్ల రేప్‌కి గురైతే ఆమె శీలం పోతుందని నమ్మేవాళ్ళు రేప్ సీన్లలో నటించిన సినిమా నటీమణులకి మాత్రం శీలం పోదని ఎలా నమ్ముతున్నారు? పైగా వాళ్ళని సెలెబ్రెటీస్‌గా ఎలా గౌరవిస్తున్నారు? ఇండియాలో చాలా మంది ఆడవాళ్ళకి ఆస్తి ఉండదు కనుక ఆస్తి కోసం ఆడవాళ్ళని చంపేవాళ్ళు తక్కువ. రేప్ చేసి లేదా ఒంటి మీద నగలు దొంగిలించి ఎవిడెన్స్ మాయం చెయ్యడానికి ఆడవాళ్ళని చంపేవాళ్ళు మాత్రం ఎక్కువే. కొంత మంది రేప్‌లకి కారణం పోర్న్ అంటున్నారు, మరి కొంత మంది మద్యం అంటున్నారు. అమెరికాలో అందరూ మద్యం తాగుతారు, కొంత మంది పోర్న్ కూడా చూస్తారు. అయినా అమెరికాలో ఇన్ని రేప్‌లు జరగడం లేదు. మరి ఇండియాలోనే ఇన్ని రేప్‌లు ఎందుకు జరుగుతున్నాయి? అమెరికాలో పోర్న్ చట్టబద్దం. ఇండియాలో పోర్న్ నిషిద్ధమైనా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న థియేటర్‌లో కూడా బ్లూఫిల్మ్‌లు ప్రదర్శించడం కనిపించింది. అమెరికాలో నేరం జరిగినప్పుడు పోలీసులు వెంటనే రెస్పాండ్ అవుతారు, ఇండియాలో మాత్రం పోలీసులు ముహూర్తం చూస్తారు. ఇలా ముహూర్తాలు చూసే పోలీసుల్ని వదిలేసి, పోర్న్ వల్ల రేప్‌లు జరుగుతున్నాయనో మద్యం వల్ల రేప్‌లు జరుగుతున్నాయనో జెనెరలైజ్ చేసేస్తున్నవాళ్ళలో కొంత మంది అభ్యుదయ రచయితలు కూడా ఉన్నారు.

  ReplyDelete
 2. మంచి పాయింట్స్.
  టోల్ ప్లాజా వారిది నిస్సందేహంగా insensitive ప్రవర్తన. ఒక మహిళ స్కూటీని పెట్టనివ్వని వాళ్ళు సమీపంలోనే అన్ని గంటలపాటు లారీ ఆపి ఉంటే అభ్యంతర పెట్టలేదే? ఏం, వాళ్ళ నిబంధనలు అప్పుడు గుర్తు రాలేదా? రూల్స్ ఉంటాయి, కానీ విచక్షణ కూడా ఉండాలి. ఆ సిబ్బందికి అది నేర్పించాలి వారి కంపెనీ. మన దేశంలో సోకాల్డ్ కార్పొరేట్ కల్చర్ అంటేనే సిబ్బంది చూపించే అహంకారపు, నిర్లక్ష్యపు, మూర్డపు ప్రవర్తన. వాళ్ళు గ్రహించాల్సింది దైనందిన జీవితంలో పబ్లిక్ కు కనిపించే ఆ కంపెనీ face సిబ్బంది ప్రవర్తనే కానీ ఓనర్ కాదు (అతనెల్లాగూ ఫోన్ లో గానీ, ఇ-మెయిల్ లో గానీ అందుబాటులో ఉండడు లెండి, అది వేరే సంగతి; డబ్బులు లెక్క పెట్టుకోవడంలో బిజీ బిజీ).

  ReplyDelete
  Replies
  1. లారీ ఓనర్ ఫోన్ నంబర్ బండి మీద వ్రాయడం మాండేటరీ ఎందుకు చెయ్యలేదు? లారీ డ్రైవర్ తాగిన మత్తులో ఎవరినో గుద్దేసినా, నిద్రమత్తులో ఎవరినో గుద్దేసినా వాడికి ఉద్యోగం ఇచ్చింది ఎవడో తెలియాలి కదా.

   Delete
  2. ఓనర్ పేరు, ఫోన్ నెంబర్ బండి మీద వ్రాయించాలని రూల్ ఉందేమో బహుశ? కానీ ఈ రోజుల్లో రూల్సుని పట్టించుకునేదెవరు, మనల్ని ఎవరు అడుగుతార్లే అనే ధీమా, అహంకారం కదా అంతటా?
   ---------------------
   ఇంకో సంగతి నాకు అర్ధం కానిది - ఆ పిల్లతో అన్ని రూల్స్ మాట్లాడిన టోల్ ప్లాజా సిబ్బంది కళ్ళకు దగ్గరలోనే లారీ వాళ్ళు ఆ ఆడపిల్లను అల్లరి పెడుతుంటే / లాక్కెడుతుంటే కనబడలేదా మరి? కనిపించినా తమ మామూలు నిర్లక్ష్యపు ధోరణి చూపించారా?

   అసలు దేనికీ దేనికీ మధ్య ఎంతెంత దూరం ఉంది, ఒకదానికొకటి కనుచుపు మేరలో ఉన్నాయా, ఆ అమ్మాయి తన స్కూటీని పార్క్ చేసిన చోటు టోల్ కు ఎంత దూరం, లారీ పక్కనే స్కూటీ ఆపిందా (తిరిగి అదే చోటుకు వచ్చుండాలి కదా), లారీ వాళ్ళు స్కూటీ టైరులో గాలి తీసేస్తుంటే టోల్ వాళ్ళకు కనబడలేదా - అన్నది మీడియాలో స్పష్టత రావడం లేదు - ఎంతసేపూ అత్యాచారం హత్యాచారం అని గొంతు చించుకోవడమే తప్ప.

   ఏది ఏమయినా నా అభిప్రాయంలో టోల్ సిబ్బందిని కూడా పోలీస్ రిపోర్ట్ లో పేర్కొనాలి. శిక్ష పడుతుందో లేదో కానీ కనీసం ఈ కేసుతో భవిష్యత్తులోనైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్లక్ష్యం తగ్గించుకుని కొంచెమైనా సామాజిక బాధ్యత చూపిస్తారేమో?

   Delete
 3. ఒకసారి విదేశీ పర్యటనలో .. అక్కడ నివసిస్తున్న ఒక పరిచస్తుడు (పౌరుడు కూడా) "అంకుల్, మన దేశానికి తిరిగి వచ్చేద్దామనే ఆలోచన వస్తోంది. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే - అక్కడ ఆడపిల్లలకు సురక్షితమేనా?" అని అడిగాడు నన్ను (అతనికో కూతురు ఉంది). ఏ దేశమూ 100% సేఫ్ అనలేం గానీ భారతదేశం మాత్రం ఆడపిల్లలకు ఏ మాత్రమూ సురక్షితం కాదు, పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది అని నాకు అనిపిస్తోంది, కాబట్టి ఆడపిల్ల తండ్రివైన నువ్వు, నీలాంటి ఇతరులు ఆడపిల్లలకు సేఫేలే అని ఊహించుకుని మాత్రం తిరిగి వచ్చే ఆలోచన ఉంటే అది మానుకుంటే మీకు మీ అమ్మాయికి మంచిది .. అని జవాబిచ్చాను.

  దేశభక్తులంతా ఏమనుకున్నా సరే ఇప్పటికీ నా అభిప్రాయం అదే, పైగా మరింత బలపడుతోంది.

  ReplyDelete
  Replies
  1. In Visakhapatnam auto rickshaws, even the photograph of the owner is displayed inside the auto.

   Delete
  2. ఫేస్‌బుక్‌లో కొంత మంది స్కూల్‌లలో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల మానభంగాలు తగ్గుతాయని వాళ్ళ అభిప్రాయం. సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసుల వల్ల లింగ వివక్ష తగ్గదు. అది తగ్గకుండా రేప్‌లు తగ్గే అవకాశం లేదు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. అక్కడ తల్లితండ్రులు గొడవ చేసారు "హమారే బచ్చోంకో ఆమ్ శిక్షా చాహియే, యౌన్ శిక్షా నహీ (మా పిల్లలకి మామూలు చదువు కావాలి, సెక్స్ చదువు కాదు)" అని. దాంతో అక్కడి టీచర్లు ఆడపిల్లలకీ, మగపిల్లలకీ వేర్వేరు రూముల్లో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు. సెక్స్ అనేది వినకూడని పదం అని టీచర్లు కూడా అనుకుంటున్నప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు పెడితే ఏమి లాభం?

   Delete
 4. రేప్ అనేది వినకూడని పదం అనుకునే సమాజంలోనే మానభంగాలు ఎక్కువగా జరుగుతాయి.

  ReplyDelete
 5. ఇంకేం! తప్పు అమావాస్యదే... అనవసరంగా ఆనలుగురు అమాయకుల్ని అరెష్టు చేశారు.. ముందు అమావాశ్యమీద కేసు పెట్టాలి. సామాజిక కోణం తర్వాత ఆలోచిద్దాం..

  http://www.teluguyogi.net/2019/12/2019.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top