Friday, September 18, 2020

భారతదేశంలో మూడవ జాతీయపార్టీ ఎదుగుదలకు అవకాశం ఉందా?

 

మన దేశ రాజకీయాలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బి.జె.పి లు మాత్రమే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. కమ్యూనిస్టులు, జనతాదళ్, బి.ఎస్.పి ....వంటి కొన్ని జాతీయ పార్టీలుగా పిలువబడుతున్నాయి. ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి సుస్థిర పాలన సాగించడానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నయంగా ఫ్రంట్ లు వాటి స్టంట్ లూ మనకి అనుభవం ఉంది. కాంగ్రెస్ కూడా బాగా బలహీనంగా ఉంది. ఒక రకంగా ప్రాంతీయపార్టీల స్థాయికి దిగజారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో పొత్తులతో సంబంధం లేకుండా అధికారం చేపట్టగలిగే జాతీయపార్టీ అవతరించడానికి అవకాశం ఉందా?

రాత్రి నిద్ర మంచిగా రావాలంటే?

 


About Vitamin C

  -----


Thursday, September 17, 2020

ఒక వేప మొక్కను నాటడం జరిగింది

ఈ రోజు మా అమ్మాయి చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఒక వేప మొక్కను నాటడం జరిగింది. ఎటువంటి  ఫంక్షన్ చేయలేదు. తనకి ఇష్టం ఉండదు కనుక. ఈ మొక్కను ఉన్నం వెంకటేశ్వర్లు గారి పొలం నుండి తీసుకొచ్చాను. మొక్కను శ్రద్ధగా తవ్వి ఇచ్చిన ఉన్నం గారికి ధన్యవాదములు.

- పల్లా కొండల రావు

Wednesday, September 16, 2020

మెదడుకు మేత - 3 (తెలుగు “తి” పజిల్ )

పొందు పరచిన ఆధారాలతో సరియైన  పదాలు జత చేయండి. ప్రతి జవాబులోనూ 3 అక్షరాలే ఉంటాయి. చివరి అక్షరం ...తి అయి ఉండాలి.

1. పుకారు                      ..........తి
2. సంతానం                    .........తి
3. సౌకర్యం                     .........తి
4. ఆకారం                      .........తి
5. విషయం                     ..........తి
6. హీనస్ధితి                     ..........తి
7. స్త్రీ                             .........తి
8. విధానం.                     ..........తి
9. భవనం.                      ..........తి
10. విజ్ఞాపన.                  ..........తి
11. చట్రం.                      ......... తి
12. ఆజ్ఞ.                       .........తి
13. వేగం.                      ........తి
14. బొబ్బ.                     ........ తి
15. ఆశ్చర్యం.                 .........తి
16. హనుమంతుడు          ........తి
17. చుట్టం.                    ........తి
18. పుష్పము.                 ........తి
19. ప్రవాహం.                  ........తి
20. జన్మదినం.                 .........తి
21. వ్యతిరేకం.                 .........తి
22. దిక్కు.                      ........తి
23. వాతావరణం.             ........తి
24. నాల్గవది.                  .......తి
25. మేలుకొలుపు.             .......తి
26. సంవత్సరీకం.              .........తి
27. కలప దుకాణం.           .........తి
28. యుక్తవయస్కురాలు.     ........ తి
29. లోటు / తక్కువ.           ........తి
30. పురోగమనం.              ........తి

- Thanks to Neeharika garu.

Tuesday, September 15, 2020

కరోనా - ప్రపంచానికి నేర్పిన పాఠాలేమిటి?

 

కరోనా - ప్రపంచానికి నేర్పిన పాఠాలేమిటి?

కరోనా - ప్రపంచానికి చాలా పాఠాలు నేర్పింది. పాలకులనుండి పనివాడి వరకూ అందరికీ ఏదో ఒక కొత్త విషయాన్ని కరోనా అనుభవంలోకి తెచ్చింది. పాజిటివ్ గా ఆలోచిస్తే ఈ వైరస్ వల్ల ప్రస్తుత మనుషుల ప్రవర్తన ఎలా ఉన్నదో, పాలకుల పనితీరు, వారికున్న నాలెజ్ .... ఇలా చాలా చాలా మనకు కళ్ళకు కట్టినట్లు చూపింది. ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహం ఏమిటో తెలిపింది. మనుషులు అనవసర హంగామా, అవసరానికి మించిన వేగవంతమైన జీవితం ఆపితే ఎంత ప్రశాంతత వస్తుందో అనుభవమయింది. సైన్స్ పేరుతో జరిగే భయంకర వ్యాపారం బట్టబయలయ్యింది. ఇంకా దీనిని అర్ధం చేసుకోవలసిన వారూ ఉన్నారు. ...... ఇలా మీకూ కరోనా నేపధ్యంలో అనిపించిన ఎన్నో అంశాలు ఉంటాయి. వాటిలో అవసరమైనవి, ముఖ్యమైనవి అనిపించినవి ఇక్కడ కామెంట్ చేయండి. ఇవి కొత్త జీవితానికి, మార్పుకు దోహదం చేస్తాయి చాలామందికి.

'అగ్నిపర్వతం' సినిమా

 

Monday, September 14, 2020

'అహ నా పెళ్లంట' సినిమా

 

మెదడుకు మేత 2

ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. ఇలాంటి పదాలు మీకు తెలిసినవి అర్ధవంతంగా ఉండేవి కామెంట్ చేయండి. వీటిలో ఏమైనా అర్ధరహితంగా ఉన్నా తెలుపండి. వీటిని ఏ సందర్భాలలో వాడతారో కూడా తెలిస్తే చెప్పండి. (వాట్సాప్ సేకరణ)


1.కలకల 

2.కిలకిల 

3.గలగల

4.విలవిల

5.వలవల

6.మలమల

7.వెలవెల

8.తళతళ

9.గణగణ

10.గునగున

11.ధనధన

12.ఝణఝణ

13.కణకణ

14.గడగడ

15.గుడగుడ

16.దడదడ

17.కిటకిట

18.గటగట

19.కటకట

20.పటపట

21. కితకిత

22.గిలి గిలి

23.కిచకిచ

24.జిబ జిబ

25.చక చక

26.పక పక

27.మెకమెక 

28.బెక బెక

29.నకనక

30.చురచుర

31.చిరచిర

32.బిరబిర

33.బురబుర. 

34.పరపర

35.జరజర

36.కరకర

37.బరబర

38.చరచర

39.గజగజ

40.తపతప

41.టపటప

42.పదపద

43.గబగబ

44.గుసగుస

45.కువకువ

46.ఠవఠవ 

47.చిమచిమ

48.గురగుర

49.కొరకొర 

50.భుగభుగ

51.భగభగ

52.ఘుమఘుమ

53.ఢమఢమ

54.దబదబ

55.కుహుకుహు

మెదడుకు మేత - 1

 "వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.
————————————-
WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ

> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————"

(విన్నకోట నరసింహా రావు గారికి ధన్యవాదములతో)

Sunday, September 13, 2020

బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనమా? మీరేమంటారు?

బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనం

-------------------------------------


ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?
 
ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.

కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో  ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.

రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వై

పు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం

BIG BOSS. BIG BOSS

ఎవడీ BIG BOSS ?
ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?
ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?
ఎవరి కోసం వచ్చాడు ఈ  BIG BOSS ?
మన ఇంటికే  ఎందుకు  వచ్చాడు ఈ  BIG BOSS ?
వీడి విష సంస్కృతి ఏమిటి ?

  ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుం

బ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS .

బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .

మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ  Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి
మీరు ఏ నాడైన ఆలోచించినారా?
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .

ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు .
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ?
ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం .
మరి

భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త  పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , అనుమతిస్తారా ?
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి ఒప్పుకుంటారా?
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు  Big Boss ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు .
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి .
మేలుకోండి
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V.  తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .

విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .

చూస్తారా ?  చూస్తారా ?
 
🚩👨‍👨‍👦‍👦సగటు భారతీయుడు బాధతో..👨‍👨‍👦‍👦🚩.××××××××××××××××××××××××

నాకు వచ్చిన ఓ వాట్సాప్ మెసేజ్. ఆలోచించదగినదనిపించింది. మీరేమంటారు?

 

Saturday, September 5, 2020

రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నాడు. ప్రాంతీయ పార్టీ పెడితే బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకతాటిపై పనిచేయడానికి, తిరిగి కోదండరాం పొలిటికల్ జేఏసీను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ కాలమే జవాబు చెప్పాల్సింది.

తెలంగాణలో కేసీఆర్ కు ధీటుగా మరో ప్రాంతీయపార్టీ సక్సెస్ అయ్యే అవకాశం వుందా? రేవంత్ రెడ్డి ఆ సాహసం చేస్తాడా? మీరేమంటారు?


Thursday, September 3, 2020

ఇజం గొప్పదా? నిజం గొప్పదా?

 

 

 'ఇజం' గొప్పదా? 'నిజం' గొప్పదా?

నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన అంశం. మనిషి స్వేచ్చగా ఆలోచించడానికీ, ఓ భావజాలం ప్రభావితంతో ఆలోచించేదానికీ తేడా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరించడానికి ఇది ఆటంకంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇజాలలో కొన్ని నిజాలు ఉంటాయి. 

కేపిటలిజం, సోషలిజం, మార్క్షిజం, గాంధీగిరి, హిందూయిజం, క్రిష్టియానిటి, ఇస్లాం, బుద్ధిజం, స్త్రీవాదం, హేతువాదం.... ఇలా చాలా రకాల ఇజాలు ఉన్నాయి. అందులో అందరికీ అంగీకారం అయ్యే నిజాలూ ఉంటాయి. విభేదించే అంశాలూ ఉంటాయి. కొన్ని ఇజాలు మనిషిని ఉన్మాదిగా మార్చేలా కూడా చేస్తున్న సందర్భాలున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

నిజం కూడా ఎపుడూ సాపేక్షమే అయినప్పుడు ఇజం శాశ్వతంగా ఉంటుందా? ఇజం, నిజం లలో ఏది గొప్పది? ఇజానికి, నిజానికీ ఉన్న తేడా ఏమిటి? సంబంధం ఏమిటి? 


Tags :  ఇజం, భావజాలం, ఆలోచన, మనం మారగలం, మార్క్సిజం, రాజకీయం,

Saturday, August 29, 2020

ఏది అలవాటు? ఏది వ్యసనం? రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి?


 ఏది అలవాటు? ఏది వ్యసనం? 

రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి? 

పైన ఇమేజ్ లో కొంత సమాచారం ఉంది. దానిని ఆధారం చేసుకుని ఈ రెండింటిని వివరించడం, రెండింటి మధ్య తేడా మరియు సంబంధం గురించి విపులీకరించే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి.

జంతువులకు అలవాట్లు ఉంటాయా?

 జంతువులకు అలవాట్లు ఉంటాయా?

మనిషి అలవాట్లుకు జంతువు అలవాట్లకు ఉండే తేడా ఏమిటి?

అలవాటు ఎలా ఏర్పడుతుంది?


అలవాటు ఎలా ఏర్పడుతుంది?

మనిషికి 'అలవాటు' ఎలా ఏర్పడుతుంది?

ఇది తెలిస్తే అలవాటుని మా(నే)ర్చుకోవడం ఎలా అనేది సులభం అవుతుంది. 

పై ఇమేజ్ లో కొంత సమాచారం ఉన్నది.

మీకు ఏదైనా ఒక 'అలవాటు' ఎలా ఏర్పడిన అనుభవం గుర్తుకు తెచ్చుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి.


Friday, August 28, 2020

అలవాట్లని ఎందుకు? ఎలా? మార్చుకోవాలి?

 

 అలవాట్లని ఎందుకు? ఎలా? మార్చుకోవాలి?

నాకు తెలిసి ఒక మనిషి ఎదుగుదలకు తోడ్పడేది, ఆటంకపరచేది అలవాటు. అలవాట్లలో మంచివి, చెడ్డవి ఉంటాయి. మంచి, చేదు అనేది వ్యక్తి లక్ష్యాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని అలవాట్లు సమాజానికి, ప్రకృతికీ హాని కలిగించేవి అయితే వాటిని అందరూ మార్చుకోవాలి.  ప్రతి వ్యక్తి తాను అనుకున్నది చేయడానికి ఆటంకంగా ఉన్న అలవాట్లను , తన విజయానికి బ్రేక్ వేస్తున్న వాటిని అధిగమించాలి. అధిగమించాలంటే దానిని మార్చుకోవాలి. ఈ సందర్భంలో అలవాట్లను మార్చుకోవడం లేదా అధిగమించడం అనేది చేయాలంటే పాటించాల్సిన టెక్నీక్స్ ఏమిటి? ఈ అంశానికి సంబంధించి మీ అనుభవాలు,సూచనలు తెలియజేయగలరని విజ్ఞప్తి.

అలవాటు మంచిదేనా?

 అలవాటు మంచిదేనా?

మనిషికి 

అలవాటు అనే లక్షణం 

మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? 

అలవాటు కలిగి ఉండడం 

సహజమా? అసహజమా? 

మీ అభిప్రాయం ఏమిటి?

అలవాటు యొక్క శక్తి ఏమిటి?

 

 

అలవాటు యొక్క శక్తి ఏమిటి?

మనిషికీ అలవాటుకూ ఉండాల్సిన సంబంధం ఏమిటి?

'అలవాటు' - ఇది చాలా సందర్భాలలో వాడే మాట.  

ఈ పదం కు మనిషికి ఉండాల్సిన సంబంధం కీలకమైనది.  దీనిని వివరించాలంటే 'అలవాటు' గురించి విస్తృతంగా చర్చించడం మంచిదని అభిప్రాయపడుతున్నాను. ఆ దిశగా మీనుండి వచ్చే సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయి. 

మనిషి మారడంలో లేదా మరకపోవడానికి కారణాలలో అత్యంత కీలకమైనది. మనిషిని ఋషిని చేసినా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చడంలో అలవాటు పాత్ర అద్భుతమైనది. ఇది  తెలిసిందే. అయితే అలవాటు యొక్క శక్తిని వివరంగా చెప్పగలిగితే మానవ వనరులను అద్భుతంగా తీర్చి దిద్దవచ్చనడంలో  ఎలాంటి సందేహం లేదు. 

అలవాటు శక్తిని మనిషి ఉపయోగించుకోవడానికి ఉపయుక్తంగా, ప్రేరణ పెంచేలా ఉదాహరణలు లేదా వివరాలు తెలియజేయగలరని విజ్ఞప్తి. మీ అభిప్రాయాలు చాలామంది యువకులకు లేదా మారాల్సిన అవసరం ఉన్నవారికి ఉపయోగపడతాయని గుర్తించండి. ఇది మీ బాధ్యతగా భావించాలని మనవి.

Thursday, August 27, 2020

'శ్రమకు వందనం` --- చిత్రం చూడగానే అలా అనిపించిందంతే!

 

'శ్రమకు వందనం'

ఈ చిత్రం చూడగానే ఇలా అనాలనిపించింది.

(వాట్సప్ ద్వారా లభించినది)

- పల్లా కొండలరావు,

27-8-2020.

 

Wednesday, August 26, 2020

మీరేమంటారు?

మీరేమంటారు?


బ్లాగు మిత్రులకు నమస్కారం. గతంలో 'ప్రజ' శీర్షికను మీరు బాగా ఆదరించారు. దానినుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రజలో ఎవరైనా ప్రశ్న పంపే అవకాశం ఉన్నందున కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరువాత ఇతరుల ప్రశ్నలను పబ్లిష్ చేయలేదు. గత అనుభవాల ఆధారంగా ఎవరైనా ఏదైనా ప్రశ్నించడం వీలయ్యేలా ప్రజ చర్చావేదిక గా విడిగా తయారుచేయడం జరిగింది. దానితోపాటు ఇపుడీ బ్లాగులో కొత్తగా 'మీరేమంటారు?' అనే శీర్షికను ప్రవేశపెడుతున్నాను. ఈ శీర్షికలో వివిధ ప్రశ్నలను అడగడం జరుగుతుంది. వాటి ఆధారం  వఛ్చిన కామెంట్లలో పనికివచ్ఛే ప్రతి అంశాలను ఉపయోగించుకుని జనవిజయం పత్రిక మరియు వెబ్సైట్ లో వ్యాసాలు, యూట్యూబ్ వీడియోలు తయారుచేయడం జరుగుతుంది. ఈ వ్యాసాలు అందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు కృషి జరపడానికి ఈ శీర్షిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ సలహాలు తెలుపగలరని విజ్ఞప్తి . 

                                                                                    - పల్లా కొండల రావు .

Monday, August 24, 2020

ప్రపంచం చూపు పల్లెవైపు మళ్లాలి


మొక్కలు పెంచే సాంప్రదాయం మంచి ఆచారంగా మారాలి

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం, దీపాలు ఆర్పడం కంటే ప్రకృతికి, సమాజానికి ఉపయోగం కలిగించే మొక్కలు నాటడం మంచి పని. చైతన్య, అరవింద్ పుట్టిన రోజులపుడు, కొంతకాలంగా నా పుట్టినరోజు నాడు, ఏదైనా మంచి కార్యక్రమం చేసే సందర్భంగా మొక్కలు నాటడం అలవాటుగా చేసుకున్నాను. కోటి మొక్కలు నాటాలనే లక్ష్యం కూడా ఉన్నది. ఇది ఇతరులకూ స్పూర్తినిచ్చే అంశమనే నా అభిప్రాయం. ఇది ఒక మంచి ఆచారంగా, సాంప్రదాయంగా చేస్తే  బాగుంటుంది కదా. అందరికీ దీనిని అలవాటుగా మారిస్తే బాగుంటుంది. అలా అందరం ప్రయత్నం చేద్దాం.

నిన్న 23-08-2020 న నా యాభయ్యవ జన్మదినం సందర్భంగా పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యాలయంలో 5 మొక్కలు నాటాము.  మామిడి, కొబ్బరి, జామ మొక్కలు ఒక్కొక్కటి, 2 దానిమ్మ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, కోశాధికారి కొండేటి అప్పారావు, మండెపుడి నరేష్ , గుత్తా శివశంకరప్రసాద్, పొన్నం హర్షవర్ధన్, కొర్లపాటి అనిల్ కుమార్ (కిట్టూ), నల్లమోతు సాయికుమార్ (టింకూ), బాలు సయికృష్ణ, బోయనపల్లి సతీష్ , బోయనపల్లి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కలు అందించిన షేక్ బాజీబాబాకు , సహకిరించిన మిత్రులకు, ఈ అంశాన్ని వార్తగా ప్రచురించిన పత్రికా మిత్రులకు ధన్యవాదములు.Saturday, August 22, 2020

నేడు నా 50వ పుట్టిన రోజు

నేడు నా 50వ పుట్టిన రోజు. నాకు పుట్టిన రోజు జరుపుకునే అలవాటు లేదు. ఎందుకంటే నాకా అలవాటు నేర్పబడలేదు కనుక. నా పుట్టిన రోజు ఫలానా అని తెలిసింది కూడా బ్లాగు మిత్రుల ద్వారానే. 1970 కృష్ణాష్టమి రోజున పుట్టాను అని మావాళ్లు చెప్పారు. కరెక్ట్ తేదీ తెలియదు.గూగుల్ ప్లస్ లోనో, బ్లాగులోనో సరిగా గుర్తు లేదు ఏదో సందర్భంలో ఈ విషయమై చర్చ వచ్చినపుడు నీహారిక గారి ద్వారా నా పుట్టినతేదీ తెలుసుకున్నాను. అప్పటినుండి ప్రతి పుట్టిన రోజుకు ఆ ఏడాదికి సంబంధించిన పనులు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది 50 వ పుట్టిన రోజు సందర్బంగా తీసుకున్న నిర్ణయాలలో బ్లాగు కు సంబంధించి పాత సమాచారం అంతా వేరుగా ఉంచి కొత్తగా బ్లాగు వ్రాసుకోవాలనేది ఒకటి. చాలా విషయాలు నేర్చుకునేందుకు సహకరించిన బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇపుడు కూడా మీనుండి నేర్చుకునేందుకు, పల్లెప్రపంచం విజన్ కోసమే ఈ బ్లాగును వినియోగిస్తాను. ఎప్పటిలాగానే మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.

- పల్లా కొండలరావు,
చొప్పకట్లపాలెం,
23-08-2020.