(images courtesy : google )


విశ్వానికి సృష్టికర్త ఉన్నారా? విశ్వ రహస్యాలపై ప్రశ్నలకు పిల్లలకు పెద్దలు చెప్పాల్సిన విధానం ఏమిటి?

విశ్వం ఎలా ఏర్పడిందనే దానిపై అనేక వాదనలు వినిపిస్తుంటాయి. పిల్లలు జిజ్ఞాశతో విశ్వ రహస్యాలకు సంబంధించినవి అనేక ప్రశ్నలు అడిగినప్పుడు పెద్దలు తమకు తోచింది చెప్తారు. లేదా వారి పెద్దలు వారికి చెప్పింది పిల్లలకు చెప్తారు. కొందరు మాత్రం విశ్వం ఎలా ఏర్పడింది అనేదానికి శాస్త్రీయ ఋజువులు చూపుతారు. ప్రయోగాలమేరకు ఇప్పటివరకు అందిన సమాచారాన్ని తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తారు.
క్యూరియాసిటీ -  తెలుసుకోవాలనే తత్వం  - జిజ్ఞాశ.... పదమేదైనా కావచ్చు. మనిషి సహజాతమైన అంశమిది. 
మన చుట్టూ ఉండే పరిసరాలపై పుట్టుకొచ్చే ప్రశ్నలకు తొలిగురువైన అమ్మ దగ్గరనుండి నాన్న అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలు స్నేహితులు ...పాఠ్యాంశాలు గురువులు ఇలా ఈ లిస్టు పెరుగుతూ వచ్చినా కొన్ని విషయాలపై అనేక అనుమానాలు మిగిలే ఉంటాయి. పుస్తకాలలో ఉన్నదానికి బయట ఆచరణకూ అనేక విషయాలలో వైరుధ్యాలు ఏర్పడుతుంటాయి.
ప్రతి ఒక్కరికీ బామ్మలు చెప్పిన కథలతో పాటు సైన్స్ చెప్పినవీ ఉంటాయి. ఎవరి ఆలోచనలమేరకు వారు ఏర్పరచుకున్న భావనలూ ఉంటాయి.  ఎప్పటికీ ఈ లిస్టు ఎంతో కొంత మిగిలే ఉంటుంది. సంపూర్ణంగా సైన్స్ సమాజం ఏర్పడినప్పుడు ఈ స్తితిలో మార్పు ఏర్పడుతుంది.
విశ్వం ఎలా ఏర్పడిందనే దానిలో ఎన్ని వాదనలున్నాయి? వాటిలో మీకు తెలిసినవి, మీరు నమ్మేవి ఏమిటి? పిల్లల ప్రశ్నలకు పెద్దలు ఏ సమాధానం చెప్పడం సరయింది?
విశ్వ ఆవిర్భావం గురించి చిన్నప్పటినుండి మీరు విన్న కథలేమిటి? సైన్స్ పాఠాలేమిటి? వీటిలో మీరు దేనిని నమ్ముతారు? మీరు పిల్లలకు వారి ప్రశ్నలకు సమాధానంగా చెప్పాలంటే ఏమి చెపుతారు?
విశ్వ ఆవిర్భావం గురించి ఎన్ని కథలు ఉన్నాయి? ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? జరుగుతున్న పరిశోధనలు ఏమిటి? మీకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవాలని విజ్ఞప్తి.

 పల్లా కొండల రావు.
5-10-2014.
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. ఇక్కడ మీరు చాలా ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలను గూర్చి ఖగోళశాస్త్రజ్ఞులూ, ఖగోళశాస్త్రం అభూసిస్తున్న వారూ, ఖగోళశాస్త్రంలో మంచి పరిజ్ఞానం ఉన్నవారూ చర్చించటం అర్థవంతంగా ఉంటుంది కాని తదితరులు చర్చించటం అసందర్భంగా ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే యీ విశ్వం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని అవగతం చేసుకుందుకు శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి బిగ్‌బ్యాంగ్ సిథ్థాంతం ప్రచారంలో ఉంది. నిన్నమొన్నటివరకూ, కాలం అనేది కూడా ఈ‌ బిగ్‌బ్యాంగ్ తరువాతనే ప్రారంభం అయిందన్న నమ్మకం ఉండేది. ఇప్పుదది మారుతోంది. ఈ‌విశ్వం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉండటం ఈ‌ బిగ్‌బ్యాంగ్ నుండి కావచ్చును కాని అంతకు ముందు వేరే ఏదో స్థితిలో ఉండే తీరాలన్న సిథ్థాంతమూ వ్యాప్తిలోనికి వచ్చింది, విశ్వానికి సంబందించిన లెక్కలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి - ఉదాహరణకు డార్క్ మేటర్ విషయం. నిజంచెప్పాలంటే విశ్వానికి సంబంధించి మనిషి అవగాహన ప్రాథమికస్థాయిని దాటిందా, దాటితే అలా దాటి ఎంత పరిణతి చెందిందీ అన్నది ఇంకా స్పష్టం కాలేదు. నక్షత్రాలకూ, కృష్నబిలాలకూ సంబంధించి ఇంకా అనేక కొత్తకొత్త విషయాలు అనునిత్యం కనుగొంటునే ఉన్నాము,

  ఇదీ‌ నేటి పరిస్థితి. ఒకరి నమ్మికకు విజ్ఞానశాస్త్రంతో‌ పనిలేదు. తద్విలోమం కూడా నిజమే. తెలిసినది అణుమాత్రమే అన్న వినయం ఉంటే మనిషికి అహంకారం కాస్తంతైనా తగ్గవచ్చును. అది ముఖ్యం.

  ReplyDelete
  Replies
  1. నేను చాలాకాలం క్రితమే బేబీ యూనివర్స్ లనే కాన్సెప్ట్ గురించి సైన్స్ రిపొర్టర్ లో చదివాను.మనవాళ్ళు అనంత విశ్వాలు అన్నదానికి దగ్గిరగా వుంటుంది ఇది.జెట్ లీ నటించిన ది వన్ సినిమాలో కధ మల్టివెర్సెస్ అనే అంశం చుట్తూ తిరుగుతుంది.దీనికి మూలం కూడా పైన చెప్పిన థీరీయే.దీని ప్రకారం బ్లాక్ హోల్స్ అనేవి ఒక విశ్వానికీ మరో విశ్వానికీ తలుపుల మాదిరి పని చేస్తాయి.యెందుకంటే శక్తిని సృష్టించలేము, నాశనం చెయ్యలేము అనే సిధ్ధాంతానికి ఇప్పుడు బ్లాక్ హోల్స్ లో జరిగే వింత - ద్రవరాశి పూర్తిగా మాయమైపోయి తనలోకి తను కుంచించుకుని అదృశ్యమైపోవటం - మామూలు భౌతిక నియమాలకు బిన్నంగా వుందటం అనేది అసాధ్యం కదా!

   ప్రస్తుతం మన భూమి వున్న సూర్యమండలం పాలపుంత అనే ఇడ్లీ ఆకారంలో వున్న నక్షత్ర సమూహానికి సంబంధించినది.ఈ ఇడ్లీలో వుడికీ వుడకని ఒక మినప్పప్పు బద్ద అంత వుంటుంది మన సూర్యమండలం.వీటిల్లో సూర్యుది నుంచి మూడో గ్రహమయిన భూమి మీద వున్న మనం సూర్యుడి నుంచి నాలుగో గ్రహం మార్స్ కి జస్ట్ ఇప్పుడే చేరుకున్నాం.ప్లుటో ఆనె తొమ్మిదో గ్రహానికి యెప్పటికి చేరుతామో ఇప్పుడే చెప్పలేం. మన పాలపుంత కేంద్రంలో కూడా ఒక కృష్ణబిలం వుంది.దీని ఆయుషు ముగిసిపోయినప్పుడు మిగతా బృహత్తారల్లాగే ఇది కూడా తనలోకి తను కుంచించుకుపోతుందేమో?

   ప్రస్తుతం మన విశ్వం వ్యాకోచించే దశలో వుందట!కొంతకాలానికి(?) సంకోచిస్తుందట!ఈ విశ్వం కాలపురుషుడి వుచ్వాసనిశ్వాసాలు అని మనవాళ్ళు యెప్పుడో వర్ణించినది కూడా సత్యమే!ఇలాంటి నక్షత్ర సమూహాలూ కృష్ణబిలాలూ అనేకం కలిస్తే మన విశ్వం.ఇలాంతి విశ్వాలు యెన్ని వున్నాయి అనేదానికి నవీనులు చెప్పిన పోలిక సముద్రపొడ్దున నిలబడినప్పుడు మన కాళ్లకి తగిలే నురగలో యెన్ని విడి విడి బుడగలు వుంటాయో అన్ని వుండొచ్చు!

   శైశవదశలో వున్న విశ్వాలు మన అంగుష్ఠమాత్రంలో కూడా వుండొచ్చు.ఇలా బుడగలా వుండే విశ్వశిశువుల్ల్లో అపకేంద్రబలం, అభికేంద్రబలం సమస్థాయిలో వ్యతిరేక దిశలో పని చేస్తూ వుంటాయి.యెప్పుడయినా అపకేంద్రబలం పెరిగితే ఆ విశ్వం వ్యాకోచిస్తూ పెరగడం మొదలవుతుంది.ప్రస్తుతానికి విశ్వం పుట్టుక స్థూలంగా ఇది!

   Delete
 2. ఒక అతి చిన్న గుండు సూది కూడా ఒక తయారీదారుడు లేకపోతే తయారు కాదే... మరి ఇంత పెద్ద బ్రమ్హాండం, ప్రతి ఒక్కటీ ఖచ్చితమైన సూత్రాలతో ఎక్కడా ఏమాత్రమూ అవకతవకలు కాకుండా నిర్ధిష్టంగా ఉందే..మరి దీనికి ఎవ్వరూ సృస్టి కర్తలు లేరంటే వాళ్ళు ఖచ్చితంగా కళ్ళుండి గుడ్డి వాళ్ళే. దీనిని ఒక శక్తి నడిపిస్తోంది. దాని కి ఏ పేరైనా పెట్టుకోవచ్చు.దేవుడు,అల్లాహ్,ఈశ్వర్...ఇది నేను తెలుసుకున్న సత్యం.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top