ఏది నిజం?!

ఏది నిజం?!  నిజమేదో అదే నిజం. ఏదైతే ఉన్నదో అదే నిజం. ఉన్నది మాత్రమే నిజం. అయితే, ఉన్నదీ అని ఎలా తెలుస్తుంది? ఒకసారి నిరూపించబడింది - ఎప్పుడైనా నిరూపణకు అదే పద్దతిలో సాధ్యమయ్యేది నిజం. దీన్నే మనం శాస్త్రీయత అంటాం. అయితే, కంటికి కనిపించేవి మాత్రమే నిజాలు అనుకోకూడదు. మనకు కనిపించకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. అవి కూడా నిజాలే. గతంలో మనకు కనిపించకుండా ఉండి, తరువాత కనిపెట్టబడిన వాటిని బట్టి మాత్రమే ఇంకా మనకు తెలియని నిజాలు ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం. అంతే తప్ప, మన విశ్వాసాల ఆధారంగా, మన నమ్మకాల ఆధారంగా నిజాలను గుర్తించకూడదు. మన విశ్వాసాలు, నమ్మకాలు ఒక వేళ భవిష్యత్తులో పైన చెప్పిన పద్దతిలో నిరూపణకు ఋజువైతే అప్పుడవి నిజాలుగా మారుతాయి. ప్రతి విశ్వాసమూ, నమ్మకమూ నిజాలు కావచ్చు, కాకపోవచ్చు. నిజాలుగా నిరూపితం కానంతవరకు విశ్వాసాలూ, నమ్మకాలూ వ్యక్తిగతాలు మాత్రమే. వీటి ఆధారంగా కొన్ని భావాలు ఏర్పరచుకుని వాదించే ధోరణిని స్వీయమానసిక ధోరణి అంటారు. ఇది సరైనది కాదు. విశ్వాసం కలిగి ఉండటం వేరు, నాకున్న విశ్వాసమే నిజమని వాదించడం వేరు. మొదటి దానిని గౌరవించవచ్చు, రెండవది ప్రమాదకరమైనది. నేను నమ్ముతున్నాను కాబట్టి , నేను అన్నాను కాబట్టి అదే నిజమని నేను చెపితే మాత్రమే అది నిజం కాదు. నిజం నిరూపణకు సిద్ధం కావాలి. ముఖ్యంగా అది ఉన్నట్లు కనీసం నీకైనా ఋజువు కావాలి. నీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు. ఏనాటికైనా అందరూ సత్యాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. అది సత్యం. సత్యం గెలుస్తుందన్నమాట నిజం, కానీ గెలిచేదంతా సత్యం కాదు. సత్యమేవ జయతే !
- Palla Kondala Rao,
07-07-2012.

సత్యం పై మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి.

--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

  1. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు..... కంటివెనక దాగివున్నవి కూడా నిజాలవ్వచ్చు..!!
    మంచిపోస్ట్ అండీ...!!చాలా బాగుంది

    ReplyDelete
  2. నీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు.

    అవునండీ !! బాగా చెప్పారు. మంచి పోస్ట్. Thank you very much!!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top