ఈ వీడియోలో డాన్స్ పెర్మార్మ్ చేస్తున్నది సుకుమారన్ మోహన్ కుమార్. మేమంతా ఆయనను పిలుచుకునే సింపుల్ నేమ్ మోహన్ సర్ కాగా, కేరళ మాష్టారనీ, ఇంగ్లీషు మీడియం సర్ అనీ ఆయనని పేరంట్స్ కూడా ఇష్టంగా పిలుచుకునేవారు. బోనకల్,వత్సవాయి ప్రాంతాలలో ఇంగ్లీషు మీడియంలో ఆయనకు మంచి టీచర్ గా గుర్తింపు ఉంది. నేను కృషి విద్యాలయంలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించాల్సి వచ్చినపుడు పేరంట్స్ ఎక్కువమంది నుండి వచ్చిన సూచన మోహన్ సర్ ని తీసుకురండని. ఆయన అపుడు కృష్ణా జిల్లా వత్సవాయిలో పనిచేస్తున్నారు. నేను వత్సవాయి వెళ్ళి సర్ తో మాట్లాడి ఒప్పించి బోనకల్ తీసుకువచ్చాను. అప్పటి నుండి కృషి మూతబడేవరకు ఆయన మా స్కూల్లో పనిచేశారు. 

బోనకల్ లో కృషి విద్యాలయం టాప్ స్కూల్ గా నిలవడానికి కారణమైన వ్యక్తులలో మోహన్ సర్ ది గణనీయమైన పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఆయనను నమ్ముకుని మాత్రమే తమ పిల్లలను స్కూలుకి పంపిన పేరంట్స్ చాలా మంది ఉన్నారు. ఆయన వత్సవాయి నుండి వస్తే అక్కడ నుండి మా స్కూల్ కు వచ్చిన విద్యార్ధులు ఉన్నారు. ఇంతక్రితం వీడియోలో ప్రేయర్లో వార్తలు చదివిన స్టూడెంట్ పేరు చింతాల శ్రావణ్ కుమార్ అలా వచ్చినవాడే. శ్రావణ్ వత్సవాయి నుండి కేవలం మోహన్ సర్ వచ్చాడు కనుక ఆయన కోసం అక్కడ స్కూల్ మానేసి ఇక్కడకు వచ్చేవాడు. వాళ్ళ డాడీ రోజూ బండిపై తీసుకుని వచ్చేవాడు. ఇలా మరికొందరున్నారు. అంటే అపుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుచోట్ల పనిచేస్తే వత్సవాయి, బోనకల్ అవి రెండూ ఇపుడు రెండు రాష్ట్రాలలో ఉండడం గమనార్హం. బోనకల్, వత్సవాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బోర్డరు మండలాలు.

ఆయన ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. చాలా స్కూల్స్ వారు మోహన్ గారిని తమ స్కూల్లో టీచరుగా పనిచేయించడానికి ప్రయత్నాలు చేసేవారు. ఆయన కేవలం జీతం కోసం పనిచేసేవాడు కాదు. పిల్లలతో కలసి మెలసి పోయేవాడు. వారికి పాఠం వచ్చేలా శ్రద్ధగా విసుగు లేకుండా, విసుక్కోకుండా పాఠాలు చెప్పేవారు. బోధనలో ప్రతీ విద్యార్ధి పట్ల కేర్ తీసుకునేవారు. ఎపుడూ ఏక్టివ్ గా ఉండేవారు. పిల్లలను విసుగుకున్నట్లు నేను చూడలేదు. ఆయనను ఇష్టపడని విద్యార్ధి, పేరంట్, సహోపాధ్యాయులు లేరనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన ఇంగ్లీషు మీడియం టీచర్ అయినా తెలుగు మీడియం విద్యార్ధులందరూ కూడా మోహన్ సర్ తో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయనతో కలసి పనిచేసింది ఐదు సంవత్సరాలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే మనిషి. 

ఆయనకు నాకూ వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉంది. మా ఇంట్లో అందరికీ మోహన్ సర్ అంటే ఇష్టం.అసలాయన్ని ఇష్టపడనివారుండరని ముందే చెప్పాను కదా. కేరళ పండుగలు, సంస్కృతీ సాంప్రదాయాల గురించి చెప్పేవారు. వ్యక్తిగతంగా, స్కూల్ ఇంప్రూవ్ మెంట్ కు కూడా పర్సనల్ గా సలహాలు ఇచ్చేవారు. స్కూల్లో పిల్లలకోసం ఏ ప్రోగ్రాం చేసినా మనస్పూర్తిగా సహకరించేవారు. నాకు ఆయన మలయాళం, ఇంగ్లీషు నేర్పడానికి ప్రయత్నం చేశారు. నేనాయనకు తెలుగు నేర్పడానికి ప్రయత్నం చేశారు. స్కూలు కంటిన్యూ అయి ఉంటే ఆ రెండు భాషలు నాకు వచ్చేయేమో. నన్ను కేరళ రమ్మని రెండు సార్లు పట్టుబట్టి అడిగారు. నేనెపుడూ వివిధ వ్యాపకాలతో బిజీగానే ఉండేవాడిని కనుక వెళ్ళలేకపోయాను. సారీ మోహన్ సర్. స్కూలు కంటిన్యూ అయి ఉంటే మోహన్ సర్ ఖచ్చితంగా బోనకల్ లోనే ఉండేవారని చెప్పగలను. ఉంచేవాడిని కూడా.

ఆయనింటికి వెళితే ఎవరినైనా చాలా మర్యాదగా చూస్తారు. సార్ కి వచ్చే ఆదాయంలో మర్యాదలకే ఎక్కువ ఖర్చు చేస్తారనుకుంటాను. ఎక్కడో కేరళలో పుట్టి ఇక్కడకు వచ్చిన మోహన్ సర్ ని పరిచయం ఉన్నవారెవరూ మరచిపోరు. మనిషి కమల్ హాసన్ లా ఉంటారు. మనసు సున్నితం. అందుకే ఆయనను సుకుమార సుందర మోహన్ కుమారుడు అనాలనిపించింది. సార్ కి ఇద్దరు కూతుర్లు. నీతూ మాత్రం మాకు తెలుసు మా స్కూల్ లో చదివింది.  మేడం గారి పేరు గుర్తులేదు. ఇంకో అమ్మాయి పేరు తెలియదు. ప్రస్తుతం ఆయన ఫోటోలను వాట్సాప్లో పంపినవి ఈ టపాలో ఉంచాను.

మోహన్ సర్ తెలుగు చదవలేరు కానీ బాగానే మాట్లాడతారు. అపుడపుడు వాట్సాప్ లో నేను ఆయన టింగ్లీషులో (తెలుగుని ఇంగ్లీషులో వ్రాయడం) మాట్లాడుకుంటాం. మోహన్ సర్ ఇపుడు గుజరాత్ అహ్మదాబాద్ లో హయ్యర్ సెకండరీ స్కూల్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. స్వగ్రామం కేరళలోని తిరువల్లా. ఆయన పూర్తి పేరు సుకుమారన్ మోహన్ కుమార్. 

మోహన్ సర్ ఎక్కడున్నా బాగుండాలని మరింత మంది విద్యార్ధులకు మంచిగా పాఠాలు చెపుతూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎప్పటిలాగే ముందుండాలని కోరుకుంటున్నాను. మోహన్ సర్ కృషి విద్యాలయంలో పనిచేయడానికి ఒప్పించేందుకు సహకరించిన టి.కే.ప్రసాద్ గారికి, రాధా మేడం గారికి కృతజ్ఞతలు.

మోహ సర్ జీ మీరు చేసిన డాన్స్ గుర్తుందా? సర్ ని నేనే బలవంతంగా షూటింగ్ తీయడం లేదని, తీసినా ఎడిటింగ్ లో కట్ చేస్తామని చెప్పి చేయించాము. ఎలా చేసినా 22 సంవత్పరాల తరువాత మీ జ్ఞాపకాలను ఇలా పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇలా వ్రాసుకుంటూ పోతే మోహన్ సర్ గురించి చాలా పేజీలు, చాలా జ్ఞాపకాలు వ్రాయాల్సి ఉంటుంది. వీలున్నపుడు మరోసారి ఆయనతో అనుబంధాలను పంచుకుందాం.

ప్రస్తుతం మోహన్ సర్ మరియు వారి కుటుంబం ఫోటోలు కృషి విద్యాలయం విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కోసం దిగువన ఉంచుతున్నాను.మీరూ సర్ తో మీకున్న అనుబంధాన్ని కామెంట్ ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. 
- పల్లా కొండలరావు,
28-04-2020,
చొప్పకట్లపాలెం.

Post a Comment

 1. Very nice person, Iam very happy having such type of colleague.

  ReplyDelete
 2. Iam happy now because of ur my teacher we learned and
  enjoy each lesson you teach
  Im thankful for all that you have done.
  I admire you each day and I just want to say,
  As a teacher ur number one.
  I like mohan sir hair style he is just like mohanlal.pk sir ur ultimate sir u took us to our golden days.

  ReplyDelete
 3. Iam very happy to see Mohan sir in dance sir.
  22 years back memories padilanga dachukoni share chesthunnaduku tq very much sir.

  ReplyDelete
  Replies
  1. tq prathima. మీ క్లాసులో నువ్వే బెస్ట్ స్టూడెంట్. ఇంత క్రితం వీడియోలో చూసుకున్నావా?

   Delete
 4. Good eveng Sir...Mohan sir mohamaata paduthu dance chala bagha perform chesaru...kondal rao Sir cheppinattu ga Mohan sir gurinchi entha cheppina thakkuvey, Telugu spastam ga matladatam raakunna prathi okka student ki ardham ayyela teach chesey vaaru,sir antey prathi okkariki chala chala abhimaanam,mukyamga English medium students avvatam valla memu ekkuva time spend chesey vallamu,maa andhariki eroju oka manchi position vundataniki kaaranam meeru ichina prochaham..maa andhariki manchi base creat chesi pettadu, prathi okka student tharapuna guruvulandhariki peru peruna dhanyavaadhalu teluputhunnanu😍 Thappulu vuntey Excuse cheyandi😊😊

  ReplyDelete
 5. It's a awesome perfomance sir...Happy to see your video after some many years ... really it's one of the most memorable moments on our life... you are one of the role model and inspiration teacher for us ...

  ReplyDelete
 6. Very nice person, iam very happy having such type of colleague.
  jwalanarasimharao

  ReplyDelete
 7. Nice dance performed by our favorite mohen sir

  Nice person sir

  ReplyDelete
 8. Graceful and well performed dance by Mohan sir....he was talented and most admired teacher of EM students,he was well known for teaching English and used to mingle freely and friendly with children and their parents.....one of the prides of krushi vidyalayam.

  ReplyDelete
 9. Gd evng sir.. mohan sir is an excellent dancer sir.. thanku for this wonderful video.. v all remembered our school days sir.. schools days are memorable for everyone... once again thanku for this video.. from PRIYARANJAN

  ReplyDelete
  Replies
  1. Wow lovely Dance by Mohan Sir &very nice collection by our kondal rao sir never before never after person and we all are very proud to be a part of krushi vidyalayam Sir hat's off DEAR kondal rao sir ��

   Delete
 10. In one word best teacher who knows the pulse of students. According to my experience with mohan sir he is a great teacher, friendly and a good guide who shows a great path to students.
  I am proudly say that i am a student of great mohan sir

  ReplyDelete
 11. Wow lovely Dance by Mohan Sir &very nice collection by our kondal rao sir never before never after person and we all are very proud to be a part of krushi vidyalayam Sir hat's off DEAR kondal rao sir 😀

  ReplyDelete
 12. There is no words express my happy infront of you. Because you all make me that much greatness.Anyway once again saying each and everyone my hearty thanks.

  ReplyDelete
 13. There is no words express my happy infront of you. Because you all make me that much greatness.Anyway once again saying each and everyone my hearty thanks.

  ReplyDelete
  Replies
  1. oh tq sir. how r u? ekkada unnaaru? ipudu kerala lonaa? gujarath lonaa? corona effect elaa unnadi?

   Delete
  2. At present i am in Ahemadabad.Where am in area not much case but in city it is getting too worse.Now i am safe.

   Delete
  3. Thank you so much sir.How are you sir. I would like to visit you all once again.

   Delete
 14. I have seen your dance program i like very much fantastic performance...😍😍😍😍😍😍🥰🥰

  ReplyDelete
 15. Nice dance performance by Mohan sir and he has friendly nature

  ReplyDelete
 16. మోహన్ సర్ గురుంచి వారు మనల్ని వదిలి తిరిగీ రాని లోకలికి వెళ్ళినక ఇలా నేను రాయాల్సి రావాడం చాలా బాధాకరం. గురుబ్రహ్మ స్వరూపులు అయిన మా గురువుగారు ఇప్పుడు ఆ బ్రహ్మ దగరికి ఇంత తొందరగా వెళ్లిపోవడం నా లాంటి వారి శిశులందరికి ఎంతో బాధాకరం. ఈ పల్లె ప్రపంచం నుంచి నాకంటూ ఒక ప్రపంచం సృష్టించుకునే స్థాయికి నను తీర్చిదిదిన నా గురువులో మోహన్ గారిది ఒక ప్రత్యేక స్థానం . ప్రపంచ పటంలో ఎన్నో భాషలు,దేశాలు,రాష్ట్రాలు ఉన్నాయని చదువుకునే వయసులో నాకు నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చి కనీస విద్య,వైద్య సౌకర్యాలు లేని గ్రామంలో విద్య పరంగా తనవంతు విద్యని పంచడమే కాక సంస్కారం నేర్పి ప్రేమను , స్నేహాన్ని పంచారు. మనిషి తలుచుకుంతే ఏ భాష రాకపోయినా చేయాలన సంకలపం,ప్రేమ వుంటే ఎక్కడైనా ఆనందంగా బ్రతగాలం అని మా చిన్న వయసులో మాకు చూపించిన గురువు మా మోహన్ గారు,అందుకే ఆయన అంతే నాకు ప్రత్యకం అయిన అభిమానం ఆదర్శం.
  మా కృషి విద్యాలయం జ్ఞపకాలు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ముందుకు తీసుకుని వచ్చిన మా గురువు గారు కొండల రావు గారికి పదాభి వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటు. తప్పులు వుంటే గురువు గారిని మనించాల్సిందిగా కోరుకుంటూ.
  ఇలాంటి పల్లె ప్రపంచని వదులుకోవడం నా దురదృష్టం,సిటీ ప్రపంచనికి అదృష్టంగా భావిస్తూ.
  ఇట్లు
  ప్రదీప్ కుమార్ సైకం

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top