------------------------------------------------
అంశం :  మతం, రాజకీయం
ప్రశ్నిస్తున్నవారు :  Raghu
------------------------------------------------

ఈ ప్రశ్న పంపినవారు :Raghu 
E-Mail:Deleted
Subject:తిరుమలలో జగన్... సైన్యం హడావుడి  
Message:
తిరుమలలో జగన్... సైన్యం హడావుడి 
క్రిస్టియన్ అయిన జగన్ ఒక పవిత్ర హిందూ దేవాలయంలో ఇలా చెయ్యటం తప్పా కాదా అని నేను చర్చించకొదలచుకొలెదు. ఇలా చెయ్యటం తండ్రి కొడుకులకు మొదటి సారి కాదని గుర్తు చెయ్యదలిచాను. ప్రస్తుతం దీనిపై పెద్దగా రబస కూడా జరగటం లేదు. 


నా ప్రశ్న ఏమిటంటే, ఒక నిబద్దత గల హిందువు ఇతర మైనారిటీ మతాలుగా చెప్పబడే మతాల పవిత్ర ప్రార్థనా మందిరాలలో వారి మనోభావాలను భాద పరిచే విధంగా ప్రవర్తిస్తే దానిని ఇంత తేలిగ్గా తీసుకోగలరా? అలా జరిగి ఉంటె అలా చేసిన వారికి వ్యేతిరేకంగా పెద్ద ఎత్తున రబస జరిగి ఉండే అవకాశం ఉందని చరిత్ర చెపుతుంది. లౌకిక దేశంగా చెప్పబడే భారత దేశంలో మెజారిటి కలిగిన మతాలపై ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి? మైనారిటి మతాలపై ఇలా జరిగినప్పుడు ఉండే ప్రతిస్పందన మెజారిటి మతాలపై జరిగినప్పుడు ఎందుకు ఉండదు? 

*Re-published

కొత్త ప్రశ్నలు అనుమతించడం లేదు. పాతవాటిలో కొన్నింటిని రీ పబ్టిష్ చేస్తున్నాను. 
ఈ శీర్షిక లో అన్ని టపాలకోసం క్రింద నొక్కండి.

Post a Comment

 1. సమాధానం సులభమే.

  సాధారణంగా ఒక సమాజంలో మైనారిటీ వర్గంగా ఉండే జనం ఆ ప్రాతిపదికన కొంత ఐకమత్యం కలిగి ఉంటారు. ఇక్కడ మనలో మనం తన్నుకు చచ్చే భారతీయులమే అమెరికాలో చెప్పుకోదగ్గ ఐకమత్యం చూపిస్తాము కదా అది దీనికి ఒక ఉదాహరణ అనుకోండి.

  అదే సమయంలో జనాభాలో మెజారిటీ వర్గం వారికి అంతర్లీనంగా ఒక భద్రతా భావన ఉంటుంది. అందుచేత ఏఏ విషయాల మీద తమలో తాము పోట్లాడుకున్నా తమ ఉనికికి మౌలికంగా వచ్చిన ముప్పేమీ లేదన్న అమాయకభావన కారణంగా వారు అంత తొందరగా కలిసికట్టుగా స్పందించరు. క్రైస్తవం ముఖ్యమతంగా ఉన్న అమెరికాలో ఏసుక్రీస్తు జీవితంలో చీకటికోణాలు వగైరా అంటూ సినిమాలు తీసినా జనం గగ్గోలు పెట్టలేదు. అదే మనదేశంలో ఐతే ఏ సినిమాలోనో ఏదో చిన్న కేరెక్టర్ నోట ఒక చిన్న విమర్శావాక్యం ఏసుక్రీస్తుమీద వెలువడిందో ఈ‌ దేశంలోని క్రైస్తవులంతా తీవ్రాతితీవ్రంగా స్పందిస్తారు.

  మాస్ సైకాలజీలోని ఈ కోణం కారణంగానే హీందూదేవాలయాలమీదా దైవాలమీదా విమర్శలూ దాడుల పట్ల హిందువులు ఎక్కువగా స్పందించరు.

  మరొక కోణంలో‌ చూస్తే, ఈ‌ దేశపౌరులు హిందువలమని చెప్పుకుందుకు ఎంతో సిగ్గుపడతారు. అలా అంటే మతోన్మాదం ఐపోతుంది మరి. అదే సమయంలో మైనారిటీ మతాల విందులకూ ప్రార్థనలకూ తగినవేషధారణలతో మాత్రం హాజరవుతారు - అది సెక్యులర్ దృక్పధానికి ప్రతీక మరి. ఇది పైన చెప్పిన మాస్ సైకాలజీ కోణానికి రాజకీయ అనువర్తన అన్నమాట.

  ReplyDelete
 2. శ్యామలియం గారు చక్కని సమాధానం చెప్పారు.

  పరాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత సభ్యతగా ఉంటామో, పరాయి మతాల ప్రార్థనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అంతే సభ్యతగా వ్యవహరించాలి. అలా ప్రవర్తించలేని వారు నాట్ వెల్ కం.

  ఇలాంటివి చూసి చూసి ఎవరికో తిక్క రేగి దేశాన్ని హిందూ దేశంగా మార్చి పాడేస్తే ఆ తరువాత ఏడిచి ప్రయోజనం ఉండదు.

  నిజాయితిగా(పచ్చిగా) చెప్పాలంటే, .... దేశంలో క్రిస్టియానిటి ఇస్లాం కంటే చాలా తక్కువ. అయిననూ క్రిస్తియన్ల హడావుడి చాలా ఎక్కువ, సొంత భక్తీ చానాళ్లు, బోలెడు ఫారెన్ ఫండ్స్, మత మార్పిడులు,బహిరంగ సభలు, హిందూ దేవాలయాలలో సైతం ప్రచారాలు వగైరాలు. వీరి టార్గెట్ హిందువులే తప్ప ముస్లింలను పెద్దగా పట్టించుకోరు.

  వీరి అత్యుత్సాహం హిందువుల సహనాన్ని పరిక్షిస్తున్నదని నాకనిపిస్తుంది. ఈ దోరణి ఎటూ దారి తీస్తుందో.

  ReplyDelete
 3. అసలు సమస్యకు మూల కారణం హిందువులలో హిందూ స్పృహ లేకపోవడం . అంటే సగటు హిందువు తనను హిందువుగా కాక ఒక కులంచేత లేక ఆ కులంలోని ఒక శాఖచేత ప్రత్యేకింపబడటానికే మొగ్గుచూపుతాడు . ఆ పరిధులను దాటి తనను హిందువుగా చెప్పుకోడానికి సిగ్గుపడతాడు లేదా భయపడతాడు . ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిని మతతత్వ వాదులుగా ముద్రవేయడానికి దొంగ సెక్యులరిస్టులు ఎలాగో సిద్ధంగా ఉన్నారు . పీఠా ధిపతుల దగ్గర నుండీ ఇదే వరస . మరి మన దేశం ఇలా దౌర్భాగ్యంతో తగలడక ఏం చేస్తుంది ?

  ReplyDelete
 4. మతతత్వం వల్ల మెజారిటీ మతానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆ మతం వందలు లేదా వేల కులాలుగా విడిపోయి ఉన్నా కూడా. పాకిస్తాన్ ఇండియాలోకి ఎంత మంది లస్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదుల్ని పంపిస్తోన్నా ఇండియాలో హిందు మతం చెక్కుచెదరలేదు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top