పల్లెల్లో ప్రకృతి అందం-ఆనందం అనేక రూపాలలో కనపడుతుంది. పక్షులుకు సహజాతంగా ఉండే ఇంజనీరింగ్ టెక్నాలజీ గూడు అల్లడం. పొలం గట్లపై పంటకాలువల వద్ద ఉండే చెట్లకు పిట్టల గూడ్లు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. రైతు-కూలీలు వీటిని చూస్తూ తమ శ్రమను మరచి పోతారనడం అతిశయోక్తి కాదేమో. ఇలాంటి ప్రకృతి దృశ్యాలను, ప్రకృతి సహజ అందాలను మనం కాపాడుకోవాలి. లాభాపేక్షతో పంటల ఉత్పత్తిలో అధిక లాభాలకోసం మితిమీరిన పురుగుమందులను వాడడం వల్ల పిచ్చుకలవంటి జీవులు కనుమరుగవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పల్లెను - ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.
![]() |
ఈ ఫోటో కూడలి నుండి గ్రహించబడినది. |
- పల్లా కొండలరావు,
21-02-2013.
21-02-2013.
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.
అబ్బో ......ఎంత ముద్దొస్థున్నయో.......పక్షి దాని ముచ్చటైన గూడు
ReplyDelete