పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం, దీపాలు ఆర్పడం కంటే ప్రకృతికి, సమాజానికి ఉపయోగం కలిగించే మొక్కలు నాటడం మంచి పని. చైతన్య, అరవింద్ పుట్టిన రోజులపుడు, కొంతకాలంగా నా పుట్టినరోజు నాడు, ఏదైనా మంచి కార్యక్రమం చేసే సందర్భంగా మొక్కలు నాటడం అలవాటుగా చేసుకున్నాను. కోటి మొక్కలు నాటాలనే లక్ష్యం కూడా ఉన్నది. ఇది ఇతరులకూ స్పూర్తినిచ్చే అంశమనే నా అభిప్రాయం. ఇది ఒక మంచి ఆచారంగా, సాంప్రదాయంగా చేస్తే  బాగుంటుంది కదా. అందరికీ దీనిని అలవాటుగా మారిస్తే బాగుంటుంది. అలా అందరం ప్రయత్నం చేద్దాం.

నిన్న 23-08-2020 న నా యాభయ్యవ జన్మదినం సందర్భంగా పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యాలయంలో 5 మొక్కలు నాటాము.  మామిడి, కొబ్బరి, జామ మొక్కలు ఒక్కొక్కటి, 2 దానిమ్మ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, కోశాధికారి కొండేటి అప్పారావు, మండెపుడి నరేష్ , గుత్తా శివశంకరప్రసాద్, పొన్నం హర్షవర్ధన్, కొర్లపాటి అనిల్ కుమార్ (కిట్టూ), నల్లమోతు సాయికుమార్ (టింకూ), బాలు సయికృష్ణ, బోయనపల్లి సతీష్ , బోయనపల్లి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కలు అందించిన షేక్ బాజీబాబాకు , సహకిరించిన మిత్రులకు, ఈ అంశాన్ని వార్తగా ప్రచురించిన పత్రికా మిత్రులకు ధన్యవాదములు.Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top