పొందు పరచిన ఆధారాలతో సరియైన  పదాలు జత చేయండి. ప్రతి జవాబులోనూ 3 అక్షరాలే ఉంటాయి. చివరి అక్షరం ...తి అయి ఉండాలి.

1. పుకారు                      ..........తి
2. సంతానం                    .........తి
3. సౌకర్యం                     .........తి
4. ఆకారం                      .........తి
5. విషయం                     ..........తి
6. హీనస్ధితి                     ..........తి
7. స్త్రీ                             .........తి
8. విధానం.                     ..........తి
9. భవనం.                      ..........తి
10. విజ్ఞాపన.                  ..........తి
11. చట్రం.                      ......... తి
12. ఆజ్ఞ.                       .........తి
13. వేగం.                      ........తి
14. బొబ్బ.                     ........ తి
15. ఆశ్చర్యం.                 .........తి
16. హనుమంతుడు          ........తి
17. చుట్టం.                    ........తి
18. పుష్పము.                 ........తి
19. ప్రవాహం.                  ........తి
20. జన్మదినం.                 .........తి
21. వ్యతిరేకం.                 .........తి
22. దిక్కు.                      ........తి
23. వాతావరణం.             ........తి
24. నాల్గవది.                  .......తి
25. మేలుకొలుపు.             .......తి
26. సంవత్సరీకం.              .........తి
27. కలప దుకాణం.           .........తి
28. యుక్తవయస్కురాలు.     ........ తి
29. లోటు / తక్కువ.           ........తి
30. పురోగమనం.              ........తి

- Thanks to Neeharika garu.

Post a Comment

 1. 1-వదంతి
  2-సంతతి
  3-వసతి
  4-ఆకృతి
  5-సంగతి
  6-దుర్గతి
  7-సుదతి
  8-
  9-భవంతి
  10-వినతి
  11-
  12-ఆనతి

  పన్నెండు వరకు ఆలోచించాను. 9 సమాధానాలు వచ్చాయి.

  ReplyDelete
  Replies
  1. 1-వదంతి
   2-సంతతి
   3-వసతి
   4-ఆకృతి
   5-సంగతి
   6-దుర్గతి
   7-సుదతి
   8-
   9-భవంతి
   10-వినతి
   11-
   12-ఆనతి
   13-
   14-
   15-
   16-మారుతి
   17-
   18-మాలతి
   19-ఉధృతి
   20-జయంతి
   21-వికృతి
   22-
   23-
   24-
   25-హారతి
   26-వర్ధంతి
   27-అడితి
   28-యువతి
   29-వెలితి
   30-ప్రగతి

   Delete
 2. నాకు 17 మాత్రమే తెలియలేదు.

  ReplyDelete
 3. 25. మేలుకొలుపు. జాగృతి

  ReplyDelete
 4. 8. విధానం: పద్దతి
  17. చుట్టం: సోపతి
  24. నాల్గవది: చతుర్తి

  ReplyDelete
 5. 24 చతుర్ధి ఉంటుంది చతుర్తి ఉండదు. అలా అయినా చివర తి రావాలి.

  ReplyDelete
 6. Replies
  1. ఇవన్నీ నోట్లో ఆడుతూ బయటకు రావట్లా.....:)

   Delete
  2. నోట్లో ఉంది బయటికి రాని పదం ఒక్కటున్నా కష్టమేనండి. వేరే ధ్యాస రాదు, నిద్ర పట్టదు, తిండి సయించదు.

   24. నాల్గవది గురించి నేను ఎంత బుర్ర కొట్టుకున్నా చతుర్తి యాదికి వచ్చిందే తప్ప చవితి తట్టలేదు. అనుమానపడుతూనే రాసా కానీ మనసు కుదురుగా లేదు. నీహారిక గారు సరి చేసాక ఇప్పుడు ప్రసన్న పడ్డా, థాంక్సు మేడం.

   PS: నాకు తెలిసి సోపతి అంటే సహవాసం, స్నేహం, బంధుత్వం అన్నీ అర్ధాలు వస్తాయి కాంటెక్స్టును బట్టి.

   Delete
  3. చవితి, పద్ధతి తెలిసినవే..... సోపతి ఇప్పుడు తెలుసుకున్నాను.

   Delete
 7. గతి అంటే రెండు అక్షరాలే వస్తున్నాయి. దీనికేమన్నా తగిలించాలా?

  ReplyDelete
 8. విన్నకోట వారి కోసమే 11, 13

  ReplyDelete
  Replies
  1. పొగడ్తా? అయినచో నాకేల ఆ “అగ్రపూజ”, ఇక్కడ సభలో రాజారావు మాస్టారు లాంటి ఉద్దండులుండగా? 🙂

   Delete
  2. సార్,సార్,
   పెద్దలు శ్రీనరసింహరావుగారు మాకు సదా పూజనీయులు,
   నేను అతిసామాన్యుణ్ణి.మన్నించండి.

   Delete
 9. కొండలరావు గారు 15 మీరు చెప్పగలరు.try

  ReplyDelete
 10. 11.ఫ్రేమ్ అనే అర్థంలో ఆకృతి
  వలయం అనే అర్థంలో ఆవృతి

  ReplyDelete
 11. విన్నకోట వారు డిటెక్టివ్ కదా ! మాకు తెలియనివి మీరు కూపీ లాగుతారు అనీ భోగట్టా !

  ReplyDelete
 12. Replies
  1. బాగుంది 👌.
   (3). సౌకర్యం అంటే “విశ్రాంతి” అన్నారు మీరు. వసతి సరైనది.

   Delete
  2. అవును వసతి సరైనది.

   Delete
 13. పదంలో 3 అక్షరములే ఉంటాయి.చివరి అక్షరం ...తి
  1పుకారు.... వదంతి
  2సంతానం ... సంతతి
  3సౌకర్యం... విశ్రాంతి
  4ఆకారం.. ఆవృతి
  5విషయం....సంగతి
  6హీనస్థితి....దుర్గతి
  7స్త్రీ.........పడతి
  8విధానం.......పద్ధతి
  9భవనం........భవంతి
  10విజ్ఞాపన....వినతి
  11చట్రం...... ఆకృతి
  12ఆజ్ఞ........ఆనతి
  13వేగం......గచ్ఛతి
  14.బొబ్బ..... కణితి
  15.ఆశ్చర్యం...దిగ్భ్రాంతి
  16హనుమాన్...మారుతి
  17చుట్టం... సోపతి
  18పుష్పము.... చేమంతి
  19ప్రవాహం.....ఉదృతి
  20జన్మదినం....జయంతి
  21వ్యతిరేకం....వికృతి
  22దిక్కు........నైరుతి
  23 వాతావరణం... ప్రకృతి
  24నాల్గవది..... చవితి
  25మేలుకొలుపు...జాగృతి
  26సంవత్సరీకం ...వర్ధంతి
  27కలప దుకాణం... అడితి
  28యుక్తవయస్సురాలు...యువతి
  29. లోటు / తక్కువ. ....వెలితి
  30. పురోగమనం....ప్రగతి

  ReplyDelete
 14. Replies
  1. అవును డౌటే 🙂.
   వేగము అనే అర్థంలో “జడితి” అని ఒక పదం ఉంది. ఆ పదంతో ఏమన్నా సరిపెట్చుకోవచ్చేమో ఇక్కడ?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top