Friday, September 25, 2020

నరేష్.... కృష్ణ గారితో మాట్లాడాలని ఉన్నది నంబర్ ఇస్తావా......ఫోన్ కాల్ లో బాల సుబ్రహ్మణ్యం

 

15 comments:

 1. ఏమనుకోకండి గానీ నాకెందుకో ఈ విడియో విచిత్రంగా ఉందనిపిస్తోంది, కొండలరావు గారు.

  బాలు గారి లాంటి ప్రముఖుడు, సీనియర్ వ్యక్తి వద్ద అదే రంగంలోని ఇతర ప్రముఖుల, సీనియర్ల ఫోన్ నెంబర్లు లేకపోవడం ఏమిటి ? ఆ నెంబర్ కోసం అవతలి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుడిని అడగటమేమిటి? ఆశ్చర్యంగా ఉందే. బాలు గారు పోయిన సందర్భంగా ఏదో సెన్సేషనల్ కథ చెప్పాలని చెప్పినట్లుంది.

  విశిష్ట కళాకారుడు బాలు గారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు🙏.

  ReplyDelete
  Replies
  1. it is tv5 video sir. meeru vyaktaparachina anumaaname o comment koodaa unnadi. chuddam nijamemito.

   nenu inta kritam hero krishna ku balu pata padanunnaaraa? ani oka tapaa unchaanu. aayana padatarani anukunnaanu. krishna family movie lo. but unfortunately now Balu is no more.

   This is the link:

   http://blog.palleprapancham.in/2020/09/blog-post_2.html

   Delete
  2. ఓ, అయితే నాకొచ్చిన అనుమానమే మరి కొంత మందికి కూడా వచ్చిందన్నమాట? సహజం.

   పైన మీరిచ్చిన లింకులోని మీ టపాలోని విడియో చూశాను, కొండలరావు గారు. దాంట్లో చివర్లో బాలు గారు అన్నది ... మళ్ళీ కృష్ణ గారు సినిమా తీస్తే ఆయనకు పాటలు పాడేది నేనే ... అని.

   ఇంకా ఈ వయసులో కృష్ణ గారు తనే హీరోగా - అందులోనూ తన పాత్రకు పాటలున్న - సినిమా నిర్మిస్తారని నేను అనుకోను. సరే, ఒకవేళ సినిమా తీసినా కూడా మీరన్నట్లు పాటలు పాడటానికి బాలు గారు లేరు.

   ఇంక వచ్చెయ్ అని బాలు గారు అంటే అమిత ఇష్టమున్న ఏ ప్రముఖులు పైనుండి పిలిచారో గానీ బాలు గారు తొందర పడి వెళ్ళి పోయినట్లున్నారు 🙏.

   Delete
  3. అవునండీ.. మహేష్ బాబు ఘట్టమనేని ఫేమిలీ మెంబర్స్ తో అక్కినేని వారి మనం లాంటి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలు తన యూట్యూబ్ చానల్ (ఈమధ్యనే) లో కూడా అదే ఉద్దేశంతో అని ఉంటారు. ఇది జరుగుతుందా? అని నాకు అనిపించి ఆ టపా ఉంచాను. ఈ రోజు ఈ వీడియో చూశాక దానిని కూడా పోస్ట్ చేశాను. కృష్ణ కూ బాలు కు మొదట్లో మంచి అనుబంధం ఉండేది. మధ్యలో కొంత చెడినా తరువాత కలసి పని చేశారు.

   Delete
  4. విన్నకోటవారికి,
   మా అధ్యక్షుడు కనుక నరేష్ ఫోన్ నంబర్ అందరికీ తెలుస్తుంది. కృష్ణగారి నంబర్ అందరికీ తెలియచేయరు. ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి కదండీ. ఫోన్ నంబర్ ఉంది కదా అని అందరూ ఏవేవో విజ్ఞప్తులతో వస్తే కష్టం అని ఇవ్వరు.

   Delete
  5. అందరికీ నెంబరు ఇవ్వరు అని మీరు చెప్పేది సామాన్య ప్రజానీకం గురించి. బాలు ఆషామాషీ వ్యక్తి కాదు గదా. తనే స్వయంగా ఒక ప్రముఖుడు. పైగా కృష్ణ గారితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. కృష్ణ గారికి అన్ని సినిమాల్లోనూ (మధ్యలో ఓ రెండేళ్ళు మినహాయించి) పాటలు తనే పాడిన గాయకుడు బాలు. ఇవన్నీ చూస్తే కృష్ణ గారి ఫోన్ నెంబర్ తన దగ్గర లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాకు తోస్తున్నది ఒకటే .... బాలు తన ఫోన్ మార్చి ఉండుండాలి. నెంబర్లన్నీ పాత ఫోన్ లో ఉండుండాలి.

   Delete
  6. ఇది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అన్నమాట. ధన్యవాదములు నీహారిక గారు.

   కృష్ణ నంబర్ అందరికీ ఇవ్వడం లేదు. ఆయన వెన్ను పూస ఆరోగ్యం దెబ్బ తిన్న దగ్గరనుండి మహేష్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం.

   Delete
  7. సామాన్యుల ఫోన్ నంబర్లు అందరికీ తెలుస్తాయి లేదా తెలియపరుస్తారు.సెలబ్రిటీలు అలా కాదు. వారికి మేనేజర్లు ఉంటారు. వారు అందరికీ నంబర్లు ఇవ్వరు. సినిమావాళ్ళకి ఇంకా ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళు బిజీ కనుక నంబర్ దొరకడం కష్టం. బాలూ గారు నంబర్ అడిగే విధానంలోనే అది తెలుస్తోంది.ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉండేవారు.

   Delete
  8. నీహారిక గారూ, నీహారిక గారు
   చర్చను పొడిగించడం నా ఉద్దేశం కాదు గానీండి మీరు బాలు గారిని సామాన్యుల్తో లెక్కగడితే ఎలాగండి ?

   బాలు గారు కూడా సెలెబ్రిటీయే కదా, ఎనీ డౌట్? కాకపోయినట్లయితే బాలు మరణం గురించి జరిగిన కవరేజ్ ఎందుకు జరుగుతుంది?

   కృష్ణ నెంబరు కోసమో, చిరంజీవి నెంబరు కోసమో వాళ్ళ పిల్లల్నో మేనేజర్లనో వాకబు చెయ్యవలసిన అవసరం మరో సెలెబ్రిటీ అయిన బాలు గారి కేమిటండి?

   సరే, ఇదంతా కాదు గానీ నాకు తోస్తున్నది ఒకటే .... ఆనాటి హీరోలు దాదాపు రిటైరయ్యారు (చిరంజీవి లాంటి వారు ఇంకా ఏదో పాకులాడుతున్నారనుకోండి, అది వేరే సంగతి). టచ్ లో ఉండడం తగ్గి ఉండచ్చు కాబట్టి క్రమేపీ వాళ్ళ ఫోన్ నెంబర్లు బాలు గారి దగ్గర ఇప్పుడు మిస్ అయ్యుండవచ్చు. మరొకటి అవతలివారు తమ ఫోన్ నెంబర్లు మార్చి ఉండవచ్చు.

   ఇంక వదిలేద్దాం.

   Delete
  9. సర్లెండి వదిలేద్దాం.జిలేబీ గారి ఫోన్ నంబర్ చెప్పండి. ఓసారి మాట్లాడాలని ఉంది.

   Delete
  10. “జిలేబి” గారు బ్లాగులోక సెలెబ్రిటీ. నేనా సామాన్యుడిని. ఇక వారి ఫోన్ నెంబర్ నాకెలా తెలుస్తుందండీ నీహారిక గారు, మీ చమత్కారం కాకపోతే ? 😟

   Delete
 2. విజయ నిర్మల గారు 27 జూన్ 2019 న చనిపోయారు. 31 మేనెల 2020 న కృష్ణగారి పుట్టిన రోజు సందర్భంగా బాలు గారు వాట్స్ ఆప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని ఇపుడు సర్క్యులేట్ చేస్తున్నారు.కృష్ణగారు అంటే బాలు గారికి ప్రత్యేక అభిమానం ఉంది అని చెప్పారు.కృష్ణాగారికి బాలు గారు అంటే అభిమానం ఉందో లేదో తెలియదు. ఎపుడూ చెప్పలేదు.

  ReplyDelete
  Replies
  1. కృష్ణ జనరల్ గానే అందరినీ ప్రోత్సహిస్తారు. అందరు హీరోలు ఘంటసాల గారే పాడాలి అని పట్టుబట్టేవారు. ఆ తరువాత రామకృష్ణను ఎంకరేజ్ చేసారు. అది తెలిసిన హీరో కృష్ణ బాలును ప్రోత్సహించారు. తన సినిమాలలో బాలు చేతనే అన్ని పాటలు పాడించి బాలు ను ఎంకరేజ్ చేశారు. తరువాత అందరూ బాలు చేతనే పాడించారు. బాలు ఇబ్బందులలో ఉన్న సమయంలో కృష్ణ అతనిని ప్రోత్సహించారు. ఆ కృతజ్ఞత బాలు కు ఉన్నది. మధ్యలో ఓ నిర్మాత మాటల వల్ల వీరిద్దరికి చెడింది. కృష్ణ రాజ్ సీతారాం అనే నూతన గాయకుడిని తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నలిగిపోతున్నందున రాజ్-కోటి, వేటూరి చొరవతో బాలు కృష్ణ ఆఫీసుకు వెళ్ళి మాట్లాడారు. అప్పటినుండి వీరిద్దరూ మళ్లీ కలసి పని చేశారు. బాలు గొంతు లేక కృష్ణ సినిమాలు కొన్ని ఆడాల్సినంత రేంజ్ లో ఆడలేదన్నది నిజం. కృష్ణ అందరితో ఉన్నట్లే బాలుతోనూ మంచిగానే ఉండేవారు. ఒకానొక సమయంలో కృష్ణ గారికి బాలు గారే పాడాలి అన్న అభిమానం కృష్ణ అభిమానులాలో ఉండేది. మంచి మిత్రులు సినిమాలో కూడా మొదట కృష్ణకు బాలు, శోభన్ బాబుకు ఘంటసాల అనుకున్నారు. కానీ తరువాత మార్చారు. ఎందుకో తెలియదు.

   Delete