Saturday, August 22, 2020

నేడు నా 50వ పుట్టిన రోజు

నేడు నా 50వ పుట్టిన రోజు. నాకు పుట్టిన రోజు జరుపుకునే అలవాటు లేదు. ఎందుకంటే నాకా అలవాటు నేర్పబడలేదు కనుక. నా పుట్టిన రోజు ఫలానా అని తెలిసింది కూడా బ్లాగు మిత్రుల ద్వారానే. 1970 కృష్ణాష్టమి రోజున పుట్టాను అని మావాళ్లు చెప్పారు. కరెక్ట్ తేదీ తెలియదు.గూగుల్ ప్లస్ లోనో, బ్లాగులోనో సరిగా గుర్తు లేదు ఏదో సందర్భంలో ఈ విషయమై చర్చ వచ్చినపుడు నీహారిక గారి ద్వారా నా పుట్టినతేదీ తెలుసుకున్నాను. అప్పటినుండి ప్రతి పుట్టిన రోజుకు ఆ ఏడాదికి సంబంధించిన పనులు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ ఏడాది 50 వ పుట్టిన రోజు సందర్బంగా తీసుకున్న నిర్ణయాలలో బ్లాగు కు సంబంధించి పాత సమాచారం అంతా వేరుగా ఉంచి కొత్తగా బ్లాగు వ్రాసుకోవాలనేది ఒకటి. చాలా విషయాలు నేర్చుకునేందుకు సహకరించిన బ్లాగు మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇపుడు కూడా మీనుండి నేర్చుకునేందుకు, పల్లెప్రపంచం విజన్ కోసమే ఈ బ్లాగును వినియోగిస్తాను. ఎప్పటిలాగానే మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.

- పల్లా కొండలరావు,
చొప్పకట్లపాలెం,
23-08-2020.