Saturday, August 29, 2020

ఏది అలవాటు? ఏది వ్యసనం? రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి?


 ఏది అలవాటు? ఏది వ్యసనం? 

రెండింటి మధ్య తేడా, సంబంధం ఏమిటి? 

పైన ఇమేజ్ లో కొంత సమాచారం ఉంది. దానిని ఆధారం చేసుకుని ఈ రెండింటిని వివరించడం, రెండింటి మధ్య తేడా మరియు సంబంధం గురించి విపులీకరించే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి.

జంతువులకు అలవాట్లు ఉంటాయా?

 జంతువులకు అలవాట్లు ఉంటాయా?

మనిషి అలవాట్లుకు జంతువు అలవాట్లకు ఉండే తేడా ఏమిటి?

అలవాటు ఎలా ఏర్పడుతుంది?


అలవాటు ఎలా ఏర్పడుతుంది?

మనిషికి 'అలవాటు' ఎలా ఏర్పడుతుంది?

ఇది తెలిస్తే అలవాటుని మా(నే)ర్చుకోవడం ఎలా అనేది సులభం అవుతుంది. 

పై ఇమేజ్ లో కొంత సమాచారం ఉన్నది.

మీకు ఏదైనా ఒక 'అలవాటు' ఎలా ఏర్పడిన అనుభవం గుర్తుకు తెచ్చుకుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారని విజ్ఞప్తి.


Friday, August 28, 2020

అలవాట్లని ఎందుకు? ఎలా? మార్చుకోవాలి?

 

 అలవాట్లని ఎందుకు? ఎలా? మార్చుకోవాలి?

నాకు తెలిసి ఒక మనిషి ఎదుగుదలకు తోడ్పడేది, ఆటంకపరచేది అలవాటు. అలవాట్లలో మంచివి, చెడ్డవి ఉంటాయి. మంచి, చేదు అనేది వ్యక్తి లక్ష్యాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని అలవాట్లు సమాజానికి, ప్రకృతికీ హాని కలిగించేవి అయితే వాటిని అందరూ మార్చుకోవాలి.  ప్రతి వ్యక్తి తాను అనుకున్నది చేయడానికి ఆటంకంగా ఉన్న అలవాట్లను , తన విజయానికి బ్రేక్ వేస్తున్న వాటిని అధిగమించాలి. అధిగమించాలంటే దానిని మార్చుకోవాలి. ఈ సందర్భంలో అలవాట్లను మార్చుకోవడం లేదా అధిగమించడం అనేది చేయాలంటే పాటించాల్సిన టెక్నీక్స్ ఏమిటి? ఈ అంశానికి సంబంధించి మీ అనుభవాలు,సూచనలు తెలియజేయగలరని విజ్ఞప్తి.

అలవాటు మంచిదేనా?

 అలవాటు మంచిదేనా?

మనిషికి 

అలవాటు అనే లక్షణం 

మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? 

అలవాటు కలిగి ఉండడం 

సహజమా? అసహజమా? 

మీ అభిప్రాయం ఏమిటి?

అలవాటు యొక్క శక్తి ఏమిటి?

 

 

అలవాటు యొక్క శక్తి ఏమిటి?

మనిషికీ అలవాటుకూ ఉండాల్సిన సంబంధం ఏమిటి?

'అలవాటు' - ఇది చాలా సందర్భాలలో వాడే మాట.  

ఈ పదం కు మనిషికి ఉండాల్సిన సంబంధం కీలకమైనది.  దీనిని వివరించాలంటే 'అలవాటు' గురించి విస్తృతంగా చర్చించడం మంచిదని అభిప్రాయపడుతున్నాను. ఆ దిశగా మీనుండి వచ్చే సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయి. 

మనిషి మారడంలో లేదా మరకపోవడానికి కారణాలలో అత్యంత కీలకమైనది. మనిషిని ఋషిని చేసినా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చడంలో అలవాటు పాత్ర అద్భుతమైనది. ఇది  తెలిసిందే. అయితే అలవాటు యొక్క శక్తిని వివరంగా చెప్పగలిగితే మానవ వనరులను అద్భుతంగా తీర్చి దిద్దవచ్చనడంలో  ఎలాంటి సందేహం లేదు. 

అలవాటు శక్తిని మనిషి ఉపయోగించుకోవడానికి ఉపయుక్తంగా, ప్రేరణ పెంచేలా ఉదాహరణలు లేదా వివరాలు తెలియజేయగలరని విజ్ఞప్తి. మీ అభిప్రాయాలు చాలామంది యువకులకు లేదా మారాల్సిన అవసరం ఉన్నవారికి ఉపయోగపడతాయని గుర్తించండి. ఇది మీ బాధ్యతగా భావించాలని మనవి.

Thursday, August 27, 2020

'శ్రమకు వందనం` --- చిత్రం చూడగానే అలా అనిపించిందంతే!

 

'శ్రమకు వందనం'

ఈ చిత్రం చూడగానే ఇలా అనాలనిపించింది.

(వాట్సప్ ద్వారా లభించినది)

- పల్లా కొండలరావు,

27-8-2020.

 

Wednesday, August 26, 2020

మీరేమంటారు?

మీరేమంటారు?


బ్లాగు మిత్రులకు నమస్కారం. గతంలో 'ప్రజ' శీర్షికను మీరు బాగా ఆదరించారు. దానినుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రజలో ఎవరైనా ప్రశ్న పంపే అవకాశం ఉన్నందున కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరువాత ఇతరుల ప్రశ్నలను పబ్లిష్ చేయలేదు. గత అనుభవాల ఆధారంగా ఎవరైనా ఏదైనా ప్రశ్నించడం వీలయ్యేలా ప్రజ చర్చావేదిక గా విడిగా తయారుచేయడం జరిగింది. దానితోపాటు ఇపుడీ బ్లాగులో కొత్తగా 'మీరేమంటారు?' అనే శీర్షికను ప్రవేశపెడుతున్నాను. ఈ శీర్షికలో వివిధ ప్రశ్నలను అడగడం జరుగుతుంది. వాటి ఆధారం  వఛ్చిన కామెంట్లలో పనికివచ్ఛే ప్రతి అంశాలను ఉపయోగించుకుని జనవిజయం పత్రిక మరియు వెబ్సైట్ లో వ్యాసాలు, యూట్యూబ్ వీడియోలు తయారుచేయడం జరుగుతుంది. ఈ వ్యాసాలు అందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు కృషి జరపడానికి ఈ శీర్షిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ సలహాలు తెలుపగలరని విజ్ఞప్తి . 

                                                                                    - పల్లా కొండల రావు .

Monday, August 24, 2020

ప్రపంచం చూపు పల్లెవైపు మళ్లాలి


మొక్కలు పెంచే సాంప్రదాయం మంచి ఆచారంగా మారాలి

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం, దీపాలు ఆర్పడం కంటే ప్రకృతికి, సమాజానికి ఉపయోగం కలిగించే మొక్కలు నాటడం మంచి పని. చైతన్య, అరవింద్ పుట్టిన రోజులపుడు, కొంతకాలంగా నా పుట్టినరోజు నాడు, ఏదైనా మంచి కార్యక్రమం చేసే సందర్భంగా మొక్కలు నాటడం అలవాటుగా చేసుకున్నాను. కోటి మొక్కలు నాటాలనే లక్ష్యం కూడా ఉన్నది. ఇది ఇతరులకూ స్పూర్తినిచ్చే అంశమనే నా అభిప్రాయం. ఇది ఒక మంచి ఆచారంగా, సాంప్రదాయంగా చేస్తే  బాగుంటుంది కదా. అందరికీ దీనిని అలవాటుగా మారిస్తే బాగుంటుంది. అలా అందరం ప్రయత్నం చేద్దాం.

నిన్న 23-08-2020 న నా యాభయ్యవ జన్మదినం సందర్భంగా పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యాలయంలో 5 మొక్కలు నాటాము.  మామిడి, కొబ్బరి, జామ మొక్కలు ఒక్కొక్కటి, 2 దానిమ్మ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు పల్లెప్రపంచం సర్వీసెస్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, కోశాధికారి కొండేటి అప్పారావు, మండెపుడి నరేష్ , గుత్తా శివశంకరప్రసాద్, పొన్నం హర్షవర్ధన్, కొర్లపాటి అనిల్ కుమార్ (కిట్టూ), నల్లమోతు సాయికుమార్ (టింకూ), బాలు సయికృష్ణ, బోయనపల్లి సతీష్ , బోయనపల్లి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కలు అందించిన షేక్ బాజీబాబాకు , సహకిరించిన మిత్రులకు, ఈ అంశాన్ని వార్తగా ప్రచురించిన పత్రికా మిత్రులకు ధన్యవాదములు.