తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా?

 
 తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా దొంగ ఓట్లతో పోలింగ్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలోనూ, తెలుగుదేశం అనుకూల మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని వై.కా.పా నేతలు అంటున్నారు. 

 తిరుపతిలో ఏ లెక్కలో చూసినా వై.కా.పా గెలుపు ఖాయమని.... అయితే మెజారిటీ ఇంత అని జగన్ ఇచ్చిన టార్గెట్ చేరడం కోసం మంత్రులు, మంత్రి పదవి ఆశిస్తున్న వైకాపా నేతలు విచ్చలవిడిగా దొంగ ఓట్లు చేర్పింపులు .... ఇతర అక్రమాలకు పాల్పడ్డారనేది విశ్లేషకుల అంచనా కూడా.....

దీనివల్ల జగన్ ఇమేజ్ కు ఖచ్చితంగా దెబ్బేనని, వై.కా.పా నేతలు అధినేత అభిమానం పొందడానికి అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి దొంగ ఓట్ల ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top