బ్లాగర్ వేణు శ్రీకాంత్ ఇక లేరు. ఫేస్‌బుక్ లో మొన్నటి దాకా పాజిటివిటీని నింపుతూ, అందరి కుశల సమాచారాలు అడిగి తెలుసుకునే బ్లాగ్ లోకపు మిత్రుణ్ణి కోల్పోయానంటే నాకింకా అంతా శూన్యమే కనిపిస్తోంది! ప్చ్. ఆయన ఆఖరుగా పోస్ట్ చేసిన టపా : venusrikanth.blogspot.com/2021/04/blog-p

 
వేణూ శ్రీకాంత్ గారితో నాకు డైరెక్టుగా పరిచయం లేదు. జనవిజయం లో పవన్ కళ్యాణ్ గురించి ఓ వ్యాసం మంచిగా వ్రాసేవారు ఎవరని ఆరా తీసినపుడు ఈయన పేరు సూచించారు.
వేణూ మ్రుతికి సంతాపం. ఆయనకు జోహార్లు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

Post a Comment

  1. మిత్రులు వేణు శ్రీకాంత్ గారికి నివాళి

    ReplyDelete
  2. It’s terrible. My sincere condolences to his family.

    ReplyDelete
  3. వాట్, వాట్, వాట్ 😳?!
    ఏది, నరసారావు పేట (అనుకుంటాను) వేణూశ్రీకాంతే?
    ఏది, “సరగమలగలగలలు” అనే బ్లాగ్-స్పాట్ బ్లాగరే ?

    నాకు కూడా ప్రత్యక్ష పరిచయం లేకపోయినా ఆత్మీయుడిలాగా అనిపించేవాడు. మాట (వ్రాత) చాలా మర్యాదపూర్వకంగా ఉండేది. అతని బ్లాగులు చదువుతుంటే ఆహ్లాదం కలుగుతుండేది.

    ఎంత ఆకస్మికం? ఎంత దారుణం? పెద్ద వయసు కూడా కాదేమో? అప్పుడే దాటిపోవడం నిజంగా చాలా విచారకరం.

    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
    వేణూశ్రీకాంత్ ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

    ReplyDelete
  4. అయ్యో!ఆయన వ్రాతలు, కామెంట్లు చాలా హుందాగా ఉండేవి.వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఏమిటి అసలు ఈ దారుణాలు సెకండ్ వేవులో?

    ReplyDelete
  5. పాటతో నేను అంటూ రోజూ ఒక పోస్టు వ్రాస్తూనే ఉన్నారు. ఆయన మరణం అంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  6. దిగ్భ్రాంతి. ఏమి వ్రాయాలో తెలియటల్లేదు. స్వీయ పరిచయం లేకపోయినా అదేదో మిత్రత్వం. దగ్గరలో వాళ్ళు పోయినంత అనిపిస్తోంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.

    ReplyDelete
  7. మాటలు వెతుక్కోవాల్సి వస్తోంది . ఇది అన్యాయం 😔 అంతే !

    ReplyDelete
  8. "ఏది జీవితమేది మృత్యువు" అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అది గుర్తొస్తోంది. ఇవాళ శ్రీ శ్రీ గారి జయంతి కూడా (April 30th).

    ఏది జీవితమేది మృత్యువు" (శ్రీశ్రీ)

    https://youtu.be/NeHX8wlDNeQ

    ReplyDelete
  9. Sppechless.... I always felt I know him dearly though through his writings only. Really very very sad, hope it is not true

    ReplyDelete
  10. మనసుకు నమ్మశక్యంగా అనిపించని, అగుపించని వార్త. మాలికలో ఇంకా ఆయన లేటెస్ట్ పోస్ట్ (26.04.21) డిస్ప్లేలోనే ఉంది. కేవలం 4 రోజుల్లో ...!! yesterday only i lost my brother in law to Carona and on heels yet another sad news. may God bless peace to their souls _/\_.

    ReplyDelete
    Replies
    1. అయ్యో, మీ బావగారు కూడా కరోనాకు బలయ్యారా, nmrao bandi గారూ? దారుణం. ఒకదాని పై ఒకటి వినాల్సొస్తోంది.

      మీకందరకూ నా ప్రగాఢ సానుభూతి.
      మీ బావగారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

      Delete
  11. దిగ్భ్రాంతి గొలిపే వార్త.వారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేకపోయినా విన్నకోట నరసింహారావు గారన్నట్లు బ్లాగులు చదువుతున్నంతసేపు మనకు బాగా తెలిసిన వ్యక్తిగా, ఆత్మీయంగా అనిపించేది.విధి బలీయమంటే ఇదేనేమో.

    వారి ఆత్మకు శాంతి చేకూరలని,వారి కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ..

    ReplyDelete
  12. వేణు గారి చివరి టపా http://sarigamalagalagalalu.blogspot.com/2021/04/blog-post_26.html?m=1

    ఏమిటో ఇంకా నాకు నమ్మబుధ్ధి కావటంలేదు. చాలా దిగులుగా ఉంది. ఇలాగే చెప్పాపెట్టకుండా జాన్ హైడ్ కూడా వెళ్ళిపోవటం జరిగింది లోగడ.

    ReplyDelete
  13. నాకు కొత్త జీవితాలు సినిమా లోని "తం తననం తం తననం" పాట అంటే చాలా ఇష్టం.ఎక్కడా దొరకదని నిరాశ పడుతూ ఉన్న సమయంలో ఆయన సేకరణలో ఉండడం చూసి అక్కడి నుంచి తీసుకున్నాను.చాలా చక్కని వ్యక్తిత్వం ఉన్న బ్లాగరు!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top