'నా బ్లాగు అనుభవాలు' మీకూ ఉపయోగపడతాయేమో!

సరిగ్గా డేట్ గుర్తు లేదు కానీ ... 2011 క్రితం వరకూ నాకు బ్లాగుల గురించి అంతగా తెలియదు. ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. మరింత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఇది వ్రాస్తున్నాను. బ్లాగులోకంలో చాలా విషయాలతో పాటు, బ్లాగుల వల్ల ఉపయోగమేమిటో తెలుసుకున్నాను. ఇందుకు కారకులైన బ్లాగర్లకు, గూగుల్ ప్లస్ లో మిత్రులకు ధన్యవాదములు. వీలయినప్పుడల్లా వారి వివరాలను వ్రాస్తుంటాను.

నేను గతంలో 'మదర్‍లాండ్ మార్కెటింగ్ సర్వీసెస్' అనే పేరుతో మా ఊరు (చొప్పకట్లపాలెం) కేంద్రంగా ఓ నెట్‍వర్క్ మార్కెటింగ్ కంపెనీ నడిపాను. అప్పట్లో దానికి వెబ్‍సైట్ డిజైన్ చేయడానికి హైదరాబాద్‍లో ఎపెక్ష్ వెబ్ డిజైనర్స్ వద్ద సైట్ చేయించాము. దానికి అంత ఖర్చు పెట్టేబదులు మనమే ఫ్రీగా వెబ్‍సైట్ డిజైన్ చేసుకోవచ్చని మా ప్రక్క గ్రామం మిత్రుడు పిల్లలమర్రి రాము చెప్పాడు. ఓ సైట్ ని తయారుచేశాడు కూడా. అది ఇప్పటికీ ఉన్నది.  అయితే అది బ్లాగని తరువాత తెలిసింది. ప్రజాశక్తి దినపత్రికలో 2011లో ఓ రోజు బ్లాగుల నిర్వహణపై ఓ ఆర్టికల్ వస్తే దానిలో చెప్పిన ప్రకారం 'జనం-మనం' అని చెప్పి ఓ బ్లాగు అప్పటికపుడు మామూలుగా తయారు చేసి వై.ఎస్.జగన్ ప్రాంతీయ పార్టీ పెడతాడనే ఊహాగానంతో ఓ ఆర్టికల్ వ్రాశాను. అప్పటికి జగన్ పార్టీ పెట్టలేదు. అలాంటి వార్తలూ రాలేదు. అప్పటికి బ్లాగులకు అగ్రిగేటర్లు ఉంటారని, ఇలా బ్లాగర్లు - పాఠకులు - కామెంట్లు .... ఏదీ తెలియదు. తరువాత కొన్ని బ్లాగులు నడిపాను. వాటి వివరాలు తరువాత పోష్టులో వ్రాస్తాను.

బ్లాగులు మీడియాతో పోటీ పడగల స్థాయి ఉన్నవనే అభిప్రాయానికి,  బ్లాగుల ద్వారా చక్కని భావజాలాన్ని వ్యాప్తి చేయవచ్చు అనే నిర్ణయానికొచ్చాను. తెలుగు బ్లాగర్లలో చాలా విషయాలలో చాలా శక్తివంతమైనవారున్నారని తెలుసుకోగలిగాను. కొన్ని బ్లాగులు నిరంతరం చదివేలా, కొన్ని బ్లాగులు అప్పుడప్పుడు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. ఇంటర్నెట్ ను సక్రమంగా ఉపయోగించుకోవడానికి, మంచి భావాలను, అనేక రకాల ఉపయుక్తమైన అంశాలను, ముచ్చట్లను నిష్కల్మషంగా పంచుకోవడానికి బ్లాగులు వేదికగా ఉపయోగ పడుతున్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దేశ దేశాలలో ఉన్న తెలుగు వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం, మాతృభూమి పై మమకారాన్ని పెంచుకోవడం మన సంస్కృతిని వదలుకోలేక పోవడం ఆహ్వానించ దగ్గ  అభినందించ దగ్గ విషయం కదా!

ఓ మారుమూల పల్లెటూల్లో ఉంటున్న నేను ఇలా బ్లాగు ను నడపగలనని అనుకోలేదు. ఇపుడు నేను ఓ రెగ్యులర్ బ్లాగర్‍నే అన్న నమ్మకం కలిగింది. నేను బ్లాగు ప్రపంచం లోకి ఎలా వచ్చాను? నా అనుభావాలు ఏమిటి? బ్లాగును ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను? నాకు నచ్చిన బ్లాగులు, నన్ను ప్రభావితం చేసిన బ్లాగర్లు, ఇబ్బందిపడ్డ సందర్భాలు,చేసిన తప్పులు, నేర్చుకున్న టెక్నికల్ విషయాలు, సహకరించిన మిత్రులు.....ఇలా వివిధ అంశాలపై వీలున్నప్పుడల్లా 'నా బ్లాగు అనుభవాలు' లేబుల్ క్రింద వ్రాయాలనుకుంటున్నాను. ఇలా వ్రాయడం వల్ల బ్లాగును నడపడం లో తప్పులను సరిదిద్దుకుని మరింత సమర్ధవంతం గా బ్లాగును నడపడం ఎలాగో నేర్చుకోవడానికి, సమాజంలో మంచి భావాలను వ్యాప్తి చేసేందుకు నా వంతుగా కృషి చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

నా బ్లాగు అనుభవాలు మీకూ ఉపయోగపడతాయేమో!

- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

 1. very nice!!
  mee anubhavaalu marintamandiki upayogamgaa untaayi. aasaktigaa undi. tappakundaa vraayandi. manchi prayatnam koodaa. ABHINANDANALU>

  ReplyDelete
 2. పట్నాలలో ఉండేవారు ఎలానూ రాస్తారు, పల్లెల నుంచీ వచ్చే మీ అనుభవాలు తెలుగు బ్లాగుల వైవిధ్యాన్ని పెంచాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 3. mee anubhavalu vivarinchandi.maku,kotta vallaku upayoga padathayi.
  thelugu blogs ads icche varunte theliya cheyandi.

  ReplyDelete
 4. కొండల రావు గారూ,
  మీ సైటు ద్వారా , మీ ఆశయాలూ , ఆకాంక్షలు , తెలుసుకున్నాను. పల్లె ప్రజల శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలూ , కృషీ ,చాలా అభినందనీయం.
  '' ఏక దీక్ష తో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారత దేశం అందించునదే శుభ సందేశం '' అన్న ఘంటసాల గారి పాట గుర్తుకు వసున్నది నాకు మీ ఆశయాలు చదువుతుంటే !
  మీ కృషి విజయ వంతం కావాలని ఆశిస్తున్నా !

  Dr . సుధాకర్ ( ఇంగ్లండు లో నివసిస్తున్న ఒక తెలుగు డాక్టర్ )

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సుధాకర్ గారు. మీ అభినందన మరింత ధైర్యాన్నిస్తుంది.

   Delete
 5. Anubhavam nerpina pataalu itharulaku upayogakaramga raasaaru!Abhinandanalu!!

  ReplyDelete
 6. Chala baga chepparandi. Prati blogger yokka modati aalochanalu ilage untayemo?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top