Palla Aravind

నాతోపాటు కంప్యూటర్ నేర్చుకున్న అనుకోని అతిధి !

గత పోస్టులలో కంప్యూటర్, తెలుగు టైపింగ్ నేర్చుకున్న అనుభవాలు మీతో పంచుకున్నాను. నేను కంప్యూటర్ నేర్చుకున్నది నెట్వర్క్ మార్కెటింగ్ కోసమైతే, కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు కలసి నేర్చుకుందాం అనుకున్న 20 మందిలో ఏ ఒక్కరూ నేర్చుకోలేదు కానీ ఓ అతిధి మాత్రం నేర్చుకున్నాడు.

ఆ అతిధి వల్లనే నేను బ్లాగుల్లోకి రావడం జరిగింది. అందుకే  నా బ్లాగు అనుభవాలు వ్రాయడానికి ముందు నేను నా కంప్యూటర్ అనుభవాల గురించి, ఆ అతిధి గురించి వ్రాయడం సమంజసమని భావిస్తున్నాను. పల్లెటూల్లో ఉండి కంప్యూటర్ అద్దెకు తీసుకుని స్వయం సాధనతో NIIT వారి బుక్ సహాయం తో కంప్యూటర్ నేర్చుకున్నాననీ, మొదట అనుకున్న 20 మందిలో ఏ ఒక్కరూ కొనసాగలేదనీ తెలిపాను కదా! ఇక్కడే  ఓ ముఖ్యమైన విషయం జరిగింది.

అందరం కలసి నేర్చుకోవాలని కంప్యూటర్ కోసం మా ఇంటికి కొంచెం దూరం లో ఓ గదిలో ఏర్పాట్లు చేసుకున్నాము. ఓ వారం పాటు సందడిగా ఉన్నా తరువాత మెల్లగా అందరూ జారుకున్నారు. కానీ అనుకోని అతిధిలా మా అబ్బాయి అరవింద్ నాతో పాటు వచ్చి అబ్సర్వ్ చేయడం మొదలెట్టాడు.

అప్పటికి అరవింద్ రెండవ తరగతి చదువుతున్నాడు. అంటే షుమారు ఆరేండ్ల వయసులోనే కంప్యూటర్ నేర్చుకోవడం మొదలెట్టాడు. మాకే కంప్యూటర్ విషయాలు కొత్తగా సంబ్రమాశ్చర్యాలుగా ఉన్న సమయంలో అరవింద్ కంప్యూటర్లో గేమ్స్ ఆడడం మొదలెట్టాడు. బౌ ఎండ్ యారో, డేవ్ గేమ్స్ ఆటలతో మొదలెట్టి నేడు కంప్యూటర్ తో గేమ్స్ ఆడుతున్నాడు.

అరవింద్ గేమ్స్ ఆడడం చూసి  5 నెలల తరువాత, ఆటలాడుతున్నాడు కదా? కంప్యూటర్ నేర్పితే ఎలా ఉంటుందీ? అనిపించి నా అనుభవంతో నేర్చుకున్నవన్నీ అంటే టైపింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్ నాకు తెలిసింది నేర్పించాను. నేననుకున్నదానికంటే స్పీడుగా, నాకంటే స్పీడుగా ఇంగ్లీషు, తెలుగు టైపింగ్ నేర్చుకున్నాడు. తెలుగు టైపింగ్ కేవలం 3 రోజులలో నేర్చుకున్నాడు. తరువాత స్వయంసాధనతో నిరంతరం ఇంప్రూవ్ అవుతున్నాడు.

అప్పటినుండి అన్నీ స్వయంగా సెర్చ్ చేస్తూ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికీ  తెలియనివి సెర్చ్ చేస్తూ నేర్చుకుంటుంటాడు. అలా  సెర్చ్ చేస్తుంటే తెలిసిందే బ్లాగు గురించి.  నాకు బ్లాగు వ్రాయాలని పట్టుబట్టి నేర్పించింది అరవిందే. అంత క్రితం నా మిత్రుడు తయారుచేసినది బ్లాగేనని అపుడు తెలిసింది. mmsparivar.blogspot.in

అలా నా బ్లాగు ప్రయాణం ప్రారంభమయింది !

నా బ్లాగులకు టెక్నికల్ విషయాలన్నీ అరవిందే చూస్తాడు. చాలామంది మొదట్లో నా బ్లాగు టెంప్లేట్లు చూసి నన్ను  మీరు వెబ్ దిజైనరా? అని అడిగినవారు కూడా ఉన్నారు. అప్పటినుండి ఇప్పటివరకూ స్వయంగా సెర్చ్ చేస్తూ అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటూ వస్తున్న 'అరవింద్' ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బ్లాగుల గురించి తెలుసుకునే సందర్భంలో అరవిందూ నేను కలసి చేసిన ప్రయోగాలలో చాలా వింతలు జరిగాయి. అవన్నీ ముందు పోస్టులలో వీలయినప్పుడు మీతో పంచుకుంటాను.
- పల్లా కొండలరావు 
Reactions:

Post a Comment

 1. బాగుందండీ... మీ బ్లాగ్ ప్రయాణం ;)

  ReplyDelete
 2. Bagunnayi mee anubhavalu.
  mee abbayi ila improve avvadam chala great.
  good.
  :venkat

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు వెంకట్ గారు.

   Delete
 3. బాగుందండి, మరిన్ని అనుభవాలు మీరు తొందరలో రాయాలని కోరుకుంటూ ...

  ReplyDelete
 4. Replies
  1. శ్రీహరి బాగున్నావా? 'పల్లెప్రపంచం' కు స్వాగతం! ఆ 20 మందిలో నీవు ఉన్నావా?

   Delete
 5. మీ బ్లాగాయణం బాగుంది- దశరధరావు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు దశరధరావు గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top