అభిమానించిన - అవమానించిన బ్లాగర్లందరికీ వందనాలు !


నా బ్లాగు అనుభవాలలో భాగంగా నేను బ్లాగులలోకి రావడానికి కారణాన్ని ఇంత క్రితం టపాలలో వివరించాను. బ్లాగుల గురించి ఓ అవగాహన రావడానికి దాదాపు ఓ ఏడాది పాటు సమయం పట్టింది. ఈ అవగాహనకు రావడానికి అరవింద్ తో పాటు కొందరు తెలుగు బ్లాగర్లు, గూగుల్ ప్లస్ లో మిత్రులు చాలా విషయాలలో సహకరించారు. స్పూర్తిగా, ప్రేరణగా నిలిచారు. కొంతమందితో ఘర్షణ జరిగింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినవారున్నారు. వ్యంగ్యంగా మాట్లాడినవారున్నారు. ఇప్పటికీ తెలియనివి అడిగితే మనస్పూర్తిగా తెలియజేసేవారున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వారందరితో మంచి చెడూ విషయాలు పేరు పేరు పేరునా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇలా చేయడం అనేది ఎవరినీ కించపరచడానికీ కాదు. పొగడడానికీ కాదు. కృతజ్ఞతలు చెప్పుకోవడానికీ.  కొత్తగా బ్లాగులు నడపాలనుకునే మరి కొంతమందికి ఉపయోగపడడానికీ మాత్రమేనని విజ్ఞప్తి.  

ఉపయోగపడడం అని ఎందుకంటున్నానంటే :  
ఓ మారుమూల పల్లెలో ఉండి బ్లాగులు వ్రాసుకునే స్థాయికి ఏడాదిన్నరలో నేను తయారయ్యానంటే ఎవరైనా అంతర్జాలాన్ని, సోషల్ నెట్ వర్కులను చక్కగా ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే మంచి భావజాలాన్ని అందించడానికి అవకాశం ఉంది కదా?
  దీనిని మరింతగా మెరుగుపరచడానికి నా వంతుగా సహకరిస్తాను. బిజినెస్ కోసం మారుమూల పల్లెటూల్లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుని, మా అబ్బాయి ద్వారా బ్లాగులలోకి ప్రవేశించిన నేను బ్లాగులలో ఓ ఏడాది పాటి అన్ని రకాల ప్రయోగాలు చేశాను. నేను చేసినన్ని ప్రయోగాలు బహుశా ఎవరూ చేసి ఉండరు.  ఈ ప్రయత్నంలో తెలియని విషయాలు అడిగితే చాలా వివరంగా తెలిపిన గూగుల్ ప్లస్ మిత్రులందరికీ ధన్యవాదములు. బ్లాగులలో స్పూర్తిగా నిలిచినవారున్నారు వారికీ ధన్యవాదాలు. నాకు బాగా నచ్చిన వారున్నారు. ఇబ్బంది పెట్టిన వారున్నారు. రెండూ కూడా నేను బ్లాగును సరిచేసుకోవడానికే ఉపయోగపడ్డాయి. నిజం చెప్పాలంటే ఇబ్బంది పెట్టినవారి వల్లే బ్లాగును సీరియస్ గా తీసుకున్నాను. ఆ వివరాలు వీలుని బట్టి వ్రాస్తాను. నాకు నచ్చిన బ్లాగర్ల వివరాలు, వివిధ సందర్భాలలో సహకరించినవారు, నేర్చుకున్న విషయాలు గుర్తున్నవన్నీ వ్రాయడం ప్రారంభిస్తున్నాను. ఇతర బ్లాగర్లలో నేను గమనించినవి నాకు నచ్చినవి వ్రాస్తుంటాను. ఇవన్నీ నా బ్లాగు అనుభవాలుగా ఉంటాయి. అందరికీ ధన్యవాదములు.
  - పల్లా కొండల రావు.
    Reactions:

    Post a Comment

    1. హర్షదాయకమైన ప్రయత్నం. గోహెడ్ రావుగారు

     ReplyDelete
    2. అనగ అనగ రాగం అతిశయిస్తుంది రాయగారాయగా టపా రాటుదేలి అతిగా అందగిస్తుంది పల్లా కొండలరావుగారి టపాలా!

     ReplyDelete
    3. నిజంగా చాలా చాలా చాలా మంచి విషయాలు వివరిస్తూ కొత్త వారికి దిశానిర్దేశం చేస్తున్నారు .

     ReplyDelete
    4. Replies
     1. ధన్యవాదములు shanti jalasutram గారు.

      Delete

    * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
    * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
    * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
    * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
    * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
    * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
    * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
    * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
    * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
    * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

    vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
     
    Top