నేను నేర్చుకున్నదానిలో బ్లాగర్ల ద్వారా నేర్చుకున్నది చాలా విలువైనది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి మనకు తెలిసినవి వ్రాయడానికి కూడా ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందని చెప్పగలను. నా బ్లాగులలో 'ప్రజ' చర్చల ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చర్చలలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. 


ఈ విజయం నాది కాదు....! 
'జనవిజయం' బ్లాగులో నేను వ్రాసినవి చాలా తక్కువ. 6 లక్షలకు పైగా వీక్షణలు, 66 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కువగా ప్రజాశక్తి దినపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో ఆర్టికల్స్, ఇతర ఎక్కడ మంచి అనిపించినా సేకరించి 'జన విజయం'లో పోస్టులుగా ఉంచాను. నేను చేసిందల్లా వాటిని మంచిగా డిజైన్ చేసి పెట్టడమే. ఆయా సమాచారం ఒరిజినల్‌గా వ్రాసినవారందరూ ఈ ప్రొగ్రెస్ కు కారకులు. నా పాత్ర నామ మాత్రం మాత్రమే.


ctl 'c ' + ctl 'v ' కు పవర్ ఉంది సుమా ....! 
ఎప్పటిలాగే సమాజానికి అవసరమైనవి అనిపించినవి 'కత్తెరింపులు'గా ఉంచుతాను. ఎందుకంటే ఈ సేకరణలలోని అంశాల వల్ల తమకు మేలు జరిగిందని కొందరు నాకు మెయిల్ చేశారు. వాస్తవానికి అవి నేను వ్రాసినవేమో అనుకుని వారు నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సమాజానికి ఉపయోగపడే అంశాలుగా నాకు తారసపడినవి సేకరణలుగా ఉంచి వాటి ఒరిజినల్ లింక్ ఇస్తాను. లేదా వాటి వివరాలు తెలియజేస్తాను.


వినదగు నెవ్వరు చెప్పిన........!
జన విజయం బ్లాగు గురించి జీడిపప్పు బ్లాగులోనూ, కొందరు వ్యక్తులతోనూ జరిగిన చర్చలో నేను నా బ్లాగును సరిచేసుకుంటానని హామీ ఇచ్చాను. మార్క్సిజం గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి నాకు తెలిసిన అంశాలు గతంలో కొన్ని పోస్టులు వ్రాసి వదిలేయడం జరిగింది. ఆ రెండింటి తో పాటు  ఇతర అంశాలపై వీలున్నంతవరకూ స్వంతంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. అయితే నేను బ్లాగును స్వంతంగా వ్రాయగాలనా? అనే సందేహం మాత్రం ఉన్నది.

కేవలం బ్లాగు గురించి తెలుసుకోవడానికీ,  బ్లాగును మంచిగా తయారుచేయాలనే తలంపుతో ఒకింత ఎక్కువ ప్రయోగాలు చేయడంతో ఇంత సమయం పట్టింది. అయినా నా బ్లాగులను ఆదరించారు. వారందరికీ ధన్యవాదములు.  నా ప్రయోగాలవల్ల  చాలామంది విసిగిపోయి ఉంటారు వారికి క్షమాపణలు.  బ్లాగు అగ్రిగేటర్లకు, కొందరి బ్లాగులలో 'జనవిజయం' ను ఉంచిన బ్లాగర్లకు అందరికీ కృతజ్ఞతలు. సమయాభావం వల్ల అన్ని బ్లాగులను కలిపి 'పల్లెప్రపంచం' గా నడపాలని ఆలోచిస్తున్నాను.అందరూ స్పూర్తి ప్రదాతలే....! 
తాతినేని వనజగారు, కప్పగంతు శివరామప్రసాద్ గారు, నీలం రాజ్ కుమార్నల్లమోతు శ్రీధర్ వంటివారు చాలా మంచి విషయాలు తమ బ్లాగుల ద్వారా వ్రాస్తున్నారు. ఇంకా చాలామంది సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు వ్రాస్తున్నారు. వారందరి స్పూర్తితో నేనూ బ్లాగు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. నా బ్లాగు అనుభవాలను, బ్లాగు ప్రపంచంలో స్పూర్తిగా నిలిచినవారి వివరాలను, బ్లాగులు ఎలా వ్రాయాలో తెలియని నాకు వివిధ రకాలుగా సహకరించి వివరాలు తెలిపినవారి గురించి,  నాకు నచ్చిన బ్లాగూల గురించీ 'నా బ్లాగు అనుభవాలు' అనే లేబుల్ క్రింద ఈ బ్లాగులో వ్రాస్తాను.

అనగననగ రాగమతిశయిల్లుచునుండు ....!
నాకు డిస్కషన్స్ పై ఉన్నంత ఆసక్తి వ్రాయడం మీద ఉండదు. అందుకే సహజంగా వ్రాయాలంటే భయం. అందంగా ఆకర్షించేలా వ్రాయడం రాకపోవడమూ ఓ కారణం. ఈ భయం బద్ధకంగా మారి ఎప్పటికప్పుడు బద్ధకంగా వాయిదా వేస్తూ పోతుంటాను. ప్రయత్నిస్తూ పోతే ఈ విషయం లో కూడా మెరుగుదల సాధించవచ్చనే అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Reactions:

Post a Comment

 1. అన్నయ్య మీరు చక్కగా వ్రాయగలరు.శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ శశి చెల్లెమ్మా! నేను బ్లాగు సీరియస్‌గా వ్రాదామనుకుని మొదటి పోస్ట్ వ్రాశాక మొదటి కామెంట్ ఇదే. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను.

   Delete
 2. చక్కగా రాసేసారు ఆల్రెడీ !

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లక్ష్మీ రాఘవ గారు.

   Delete
 3. mee yaatra digvijayamgaa konasaagaalani korukumtunnaanu

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ దుర్గేశ్వర గారు.

   Delete
 4. రావు గారు,
  మీరు చాలా బాగా రాస్తున్నారు,already.
  ఇంకా బాగా రాయగలరు,కొనసాగించండి. గుడ్ లక్

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top