అంతా 'ప్రేమ' మయం !  "చిన్ని ఆశ" బ్లాగంతా 'ప్రేమ' మయం !!

చిన్ని ఆశ !  ప్రేమ శ్వాస !!


బరువైన భావాలను అందమైన అక్షరాలలో సుమధురంగా బంధించి చెప్పడం, ఆ భావాలకు అంతే సమానమైన అర్ధాన్నిచే బొమ్మలు మనోహరంగా గీయడం , ప్రకృతిలోని భావోద్వేగాలన్నీకలగలిపి ఉండే అందమైన  'ప్రేమాలయం'  'చిన్ని ఆశ' బ్లాగు.  

ప్రేమే జీవితం , జీవితాంతం ప్రేమతో ఉండాలని 'చిన్ని ఆశ' గా చెప్పే ఈ బ్లాగు చాలా బాగుంటుంది. నేను బ్లాగులను అబ్సర్వ్ చేస్తున్న కొత్తలో ఈ బ్లాగు బాగా ఆకర్షించింది.  ఆ ఆకర్షణకు మొదటి కారణం ఈ బ్లాగులో ఉండే బొమ్మలు. ఎవరబ్బా ఇంత అందంగా చక్కగా బొమ్మలు గీస్తున్నారనిపించేది. ఆ బొమ్మలు బొమ్మలుగా బాగుండడం కాదు పోస్టులోని భావానికి తగినట్లు సరిగ్గ అతికిపోయేలా ఉంటాయి.

'చిట్టి' - 'పండు' పేర్లతో వ్రాసే ఈ బ్లాగు ఎవరిదో తెలీదు. ఓ సారి పింగ్ చేస్తే అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లదని చెప్పినట్లు గుర్తు. ఒకరు భావం వ్రాస్తే మరొకరు బొమ్మలు గీస్తారట. కానీ పోస్టులు చూస్తే ఒక్కరే వ్రాసి గీసినట్లనిపిస్తుంది. అంతగా కలసిపోతాయా భావం - బొమ్మలు.

రాధా కృష్ణుల ప్రేమే కాదు అసలు ప్రేమతో కూడుకుని ఉన్న ప్రతీ భావాన్ని ఎన్నో పోస్టులలో ఎన్నెన్నో సార్లు చెప్పారీ బ్లాగులో. అయినా ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయా పోస్టులు, పోస్టులలోని భావాలకనుగుణంగా ఉండే బొమ్మలు. ఆ 'రాధ', "ఆ'రాధ'నే" అంటూ పదాల పొందిక , భావ ప్రసారం చక్కగా చేయగలరు. 'రాధ' అంటేనే 'ఆరాధన' అని "ఆ'రాధ'న"లో "రాధ" ఉందనీ తెలుపుతుంది కదా ఈ వాక్యం. ఇలాంటి వాక్యాలు ఆ బ్లాగులో ఆకర్షణీయంగా ఉండేవి అర్ధవంతంగా ఉండేవీ చాలా ఉంటాయి. ప్రకృతిలోని ప్రతీ అంశంతో భావాలను పోల్చుతూ వ్రాసే భావ కవితలు నిత్యనూతనంగా అనిపిస్తాయెవరికైనా.

కేవలం ప్రేమే కాదు సమాజం లో జరిగే సంఘటనలపైనా ( టేంక్ బండ్ విగ్ర విధ్వంసం వంటి వాటిపైనా), బాపు శ్రీరామ రాజ్యం వంటి సినిమాలపైనా వారి స్పందన తెలియజేస్తుంటారు. 2010 ఆగస్ట్ 23 న ప్రారంభమయిన ఈ బ్లాగులో షుమారు 150 పోస్టులున్నాయి. ఇటీవలి కాలం లో పెద్దగా పోస్టులు రావడం లేదు. ఈ బ్లాగు మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను.

మొదట్లో ఈ బ్లాగుని ఫాలో అవుతూ వారి భావాలకు స్పందనగా కామెంట్లు చేసేవాడిని. తరువాత ప్రతీ పోస్టు నచ్చడం తో కామెంట్లు చేయడం లేదు. 

వీరిలో ఉండే మంచి గుణం ప్రతిస్పందించే తీరు. వారి బ్లాగులో పోస్టుకు కామెంట్లు వ్రాసిన వారికి వారు రిప్లై ఇచ్చే పద్ధతి చాలా పద్ధతిగా ఉంటుంది.

మరిన్ని మంచి కవితలు బొమ్మల సహితంగా రావాలని నా "చిన్ని ఆశ".  

"చిన్ని ఆశ"కు అభినందనలు !
- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top