-ఎంపీ కవిత ప్రశ్న.. బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి తెస్తామని వ్యాఖ్య
-వేయిస్తంభాల గుడిలో వేడుకలు
వరంగల్‌ కల్చరల్‌: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణపై ప్రేముంటే, బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారా అంటూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్‌లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. బతుకమ్మ పండుగకు తెలంగాణ సర్కారు రూ.10 కోట్లు విడుదల చేసిన అంశంపై టీడీపీ చేసిన ఆరోపణలపై ఆమె ఈ సందర్భంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.10కోట్లలో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించి, మిగిలిన రూ.9 కోట్లను ఒక్క హైదరాబాద్‌ ఉత్సవాలకే వెచ్చించనున్నట్లు కవిత వెల్లడించారు. బతుకమ్మ వేడుకలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నామన్నారు. ప్రపంచంలో పువ్వులతో దేవుళ్లను కొలిచే ఆచారం ఉందని, పువ్వులనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణకే పరిమితమన్నారు.
ప్రపంచంలో ఫెస్టివల్‌ ఆఫ్‌ లవర్స్‌ అంటే, బతుకమ్మనే అనేలా ఈ పర్వదినానికి గుర్తింపు తెస్తామన్నారు. తెలంగాణ జాగృతి పేరిట ఎనిమిదేళ్లుగా బతుకమ్మ అస్తిత్వం కోసం ఉద్యమిస్తున్న క్రమంలో ఈసారి సొంత రాష్ట్రంలో బంగారు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. వరంగల్‌లోనే బతుకమ్మ పుట్టిందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడే బతుకమ్మ ఆడుకోవడం, తన పుట్టింటికొచ్చినంత ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీలు సీతారాంనాయక్‌, రాపోలు ఆనందభాస్కర్‌, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ జి.పద్మ, జిల్లా కలెక్టర్‌ జి.కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.
పువ్వే లేదు.. బంగారమెక్కడిది: విమలక్క
మోత్కూరు: ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, చెట్టూచేమతో శ్రమజీవులకే అనుబంధముంటుందని, ప్రకృతిలో లభించే పువ్వులతోనే బతుకమ్మ ఆడుతారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, మోత్కూరు ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక సంస్థ, అనంతుడు ఫౌండేషన్‌ కొండగడప ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. బంగారు బతుకమ్మ నినాదాన్ని ప్రస్తావిస్తూ శ్రమజీవులు బతుకమ్మ పేర్చుకోవడానికి ఉచితంగా, విరివిగా దొరికే తంగేడు, గునుగు, ముత్యాల, కామంచ లాంటి పువ్వులే దొరకడం లేదని, ఇక బంగారమెక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు.

కువైట్‌లో ఉత్సవాలు
(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశాలలో నివాసంఉంటున్న తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, సంస్కృతి పట్ల ఆదరణ పెరిగిందని, గల్ఫ్‌ దేశాలలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలే ఇందుకు నిదర్శనమని గాయకుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. కువైట్‌లో ప్రప్రథమంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రవాసీ సంఘాలు తెలంగాణ సంస్కృతిని ఎన్నడూ గుర్తించలేదని విమర్శించారు.
అస్తిత్వం కోసం సాగిన పోరాటంలో తెలంగాణ కళలు, సంస్కృతి ప్రధాన భూమిక వహించాయ ని, అందులో బతుకమ్మ గల్ఫ్‌కు కూడా పాకిందన్నారు. తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో కార్ప స్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారని రసమయి గుర్తు చేశారు. బతుకమ్మ ఉత్సవాలలో ముత్యాలవినయ్‌, రంజిత్‌, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.
ఆడి అపహాస్యం చేశారు
- కొత్తగూడెం స్టేడియంలో నిమజ్జనానికి నోచని బతుకమ్మలు
కొత్తగూడెం/ఖమ్మం, సెప్టెంబర్‌ 26: ప్రభుత్వం అధికారికంగా, ఆర్భాటంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలను కొత్తగూడెంలో అపహాస్యం చేశారు. ఆడిపాడిన అనంతరం నిమజ్జనం చేయాల్సిన బతుకమ్మలను మైదానంలో వదిలేశారు. బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ప్రకాశం స్టేడియం వేదికగా ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాది మంది మహిళలు తరలి వచ్చారు. బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. రాత్రి 9 గంటల వరకు సంబురాలు జరిగాయి. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయాలి. ఇందుకు స్టేడియంలో తాత్కాలిక కొలనులను కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళలు మాత్రం బతుకమ్మలను ఎక్కడ ఉన్నవి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం మైదానంలో వ్యాయామం చేసేందుకు వచ్చిన వారు బతుకమ్మలను చూసి విస్మయం చెందారు. సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు జరుపుతున్నామని డాంబికాలు పలికిన యంత్రాంగం.. బతుకమ్మలను మైదానంలో వదిలేయడమేంటని ప్రశ్నించారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. రండహో ..రారండహో
  ఈ పనిలేని వాని ప్రశ్నకు జవాబివ్వండహో

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న వార్తకు సంబందిచిన వీడియో
   http://www.youtube.com/watch?v=OzEL1K5EjCg

   Delete
 2. అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించినవాడు బతుకమ్మ పేరు మాత్రం ఎత్తుతాడా?

  ReplyDelete
 3. చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే బతుకమ్మకు శుభాకాంక్షలు చెప్పలేదేం?
  >> బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పకపోతే ఎవరికి ఏమి నష్టం వచ్చింది? పక్కవారిని ఆక్షేపిస్తూ పండుగను చేసుకోవడం కన్నా నిర్మలమైన మనసుతో చేసుకుంటే పుణ్యం!

  ఆడి అపహాస్యం చేశారు
  >> భక్తి తో చాలా మంది జరుపుకున్నారు. వారందరూ నిమజ్జనంతో పండుగను సంపూర్ణంగావించారు. పేరు కోసం జరుపుకున్నవారు ఇలా అమ్మవారిని, అమ్మవారి పండుగను అపహాస్యం చేసారు.

  ఇకపోతే వేరే బ్లాగులో నాకు వచ్చిన ప్రశ్నకు నేను రాసిన సమాధానం:

  ప్రశ్న: ఆనాటి సాయంత్రం తెలంగాణాలోలాగా (ప్రాంతాలకతీతంగా) బతుకమ్మలాడేవారా?
  నా సమాధానం: బతుకమ్మ గురించి విజయనగరం జిల్లాలో పుట్టిన నాకెలా తెలీదో, విజయనగరం జిల్లాలో చేసే మల్లేలమ్మ అమ్మవారి పండగ గురించి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి వుత్సవాల గురించి మిగతా రాష్ట్రమంతటా తెలీదు.

  అమ్మవారికి శతకోటి రూపాలు. అందులో ఒక రూపం బతుకమ్మ, బతుకునిచ్చే అమ్మ. మిగతా ప్రజలకు తెలీనంత మాత్రాన, బతుకునిచ్చే అమ్మవారి పండుగని జరుపుకోనంత మాత్రాన అమ్మవారి వైభవం తరిగిపోదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూనే వుంటారు.

  దయచేసి అమ్మవారిని ఒక ప్రాంతానికి కట్టడి చేయకండి.

  ReplyDelete
  Replies
  1. "విజయనగరం జిల్లాలో చేసే మల్లేలమ్మ అమ్మవారి పండగ గురించి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి వుత్సవాల గురించి మిగతా రాష్ట్రమంతటా తెలీదు"

   తెలంగాణా అంతటా చేసుకునే బతుకమ్మ పండుగను ఒక్క జిల్లాలో చేసే పండుగకు పోలికేమిటి?

   Delete
  2. @Jai
   Read my entire post. I have also written down the below:

   అమ్మవారికి శతకోటి రూపాలు. అందులో ఒక రూపం బతుకమ్మ, బతుకునిచ్చే అమ్మ. మిగతా ప్రజలకు తెలీనంత మాత్రాన, బతుకునిచ్చే అమ్మవారి పండుగని జరుపుకోనంత మాత్రాన అమ్మవారి వైభవం తరిగిపోదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూనే వుంటారు.

   దయచేసి అమ్మవారిని ఒక ప్రాంతానికి కట్టడి చేయకండి.

   //

   అసలు తమరెవరు అమ్మవారి పండుగలను పోల్చడానికి? తమరికున్న అర్హతలేమిటి?

   అవి ముందు సెలవిచ్చి తరువాత పోలికలు చెప్పి పుణ్యం కట్టుకోండి.

   Delete
  3. నేను నాస్తికుణ్ణి కనుక ఎవరికీ ఏ పండగ శుభాకాంక్షలు చెప్పను. చంద్రబాబు నాస్తికుడు కాదు, పైగా తన పార్తీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందనే ఆశ ఉన్నవాడు. అతను తెలంగాణ ప్రజలకి ఫార్మల్‌గా అయినా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పాలి కదా. తెలంగాణా అస్తిత్వాన్ని గుర్తిస్తే ఇంత కాలం అతని పార్తీ తెలంగాణపై కోస్తా ఆంధ్రలో చేసిన విద్వేష ప్రచారం వృధా అవుతుందనా అతని భయం?

   Delete
  4. ఇక్కడ 2 విషయాలున్నాయి.

   కే.సీ.ఆర్ ఎండ్ కంపెనీ కి తెలుగుదేశమే రాజకీయంగా టార్గెట్. అందుకే చంద్రబాబుని అడిగినట్లు జగన్ ని అడగరు.

   వారెందుకడిగినా 2 కళ్ల సిద్ధాంతం వల్లెవేసిన బాబు తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబమైన బ్రతుకమ్మ పట్ల చిన్న చూపు సరయినది కాదు. బతుకమ్మ అనేది కే.సీ.ఆర్ సృష్టించినది కాదు. తెలంగాణా పై ప్రేమ ఉన్నవారికి బతుకమ్మను గౌరవించడం తెలిసి ఉంటుంది. అది చంద్రబాబులో కనపడడం లేదు.ఇటువంటివాటిని అనేకం చెప్పవచ్చు చంద్రబాబుకు తెలంగాణాపై గల కపటనాటకం గురించి. ఆంధ్రాలో పండుగలకు గుళ్లలోని కార్యక్రమాలకు బాబు ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణాలో ఇవ్వడని ఇలాంటివాటిని బట్టి చూస్తే తెలిసిపోతుంది.

   ఇక నిధుల దుర్వినియోగం గురించి చెప్పాలంటే తాను బలపడడం కోసం కే.సీ.ఆర్ వేస్తున్న ఎత్తుగడలలో భాగంగా చూడాలనేది నా అభిప్రాయం.

   తెలంగాణా సెంటిమెట్లను ఉపయోగించుకోవడానికి ఇలా, ముస్లింలను బుట్టలో వేసుకోవడానికి సానియా మీర్జా లాంటివారికి బ్రాండాంబాసిడర్లుగా పెట్టడం చేస్తుంటాడు. విద్యార్ధుల ఫీజు రీ ఎంబెర్స్మెంట్ గురించి మాత్రం నోరు మెదపడు. తెలంగాణా సంస్కృతిని సానియామీర్జా ఏ మేరకు ఫోకస్ చేయగలరు?

   ఆంధ్రాలో బాబు అయినా తెలంగాణాలో కే.సీ.ఆర్ అయినా ప్రజలను వాడుకోవడంలో ఆడుకోవడంలో సిద్ధహస్తులే.

   Delete
  5. @YJs:

   నేను "అమ్మ"లను, గుళ్ళను, పండుగలను పోల్చలేదు. ఎవరి మతం/దైవం/గుడి/పండుగ వారికి గొప్ప అనిపించవచ్చు: ఇందుట్లో నేను తల దూర్చను.

   "అమ్మ" ఒక ప్రాంతానికి చెందదని అనడం పూర్తిగా పాటిస్తే కలకత్తా మహంకాళి, బెజవాడ కనకదుర్గ (లేదా మీరు చెప్పిన ఇద్దరు దేవతలు) ముందు ప్రాంతీయ ఐడీలు తీసేయాలి. ఇది జరిగే పనేనా? ఎవరూ పాటించని ఆదర్శాలు తెలంగాణకే ఎందుకు?

   ఇకపోతే ప్రతి పండుగకు కొంత ప్రాచుర్యం ఉంటుంది. దీనికి మహిమతో కానీ గొప్పదనంతో కానీ సంబంధం ఉండొచ్చు ఉండకపోవొచ్చు. మీరు చెప్పిన ఉత్సవాల కంటే బతుకమ్మ పండుగ పాపులారిటీ ఎన్నో రెట్లు అధికం అని చెప్పడానికి నాకేమీ ప్రత్యెక అర్హతలు అక్కరలేదు. ఇది మీ దేవతలకు అవమానం కాదని మనవి.

   కాలం చెల్లిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను చిన్న చూపు చూసారన్న వాస్తవాన్ని దారి మళ్ళించడానికి ఎందరో శుష్క ప్రయత్నాలు చేసారు. ఇందులో భాగంగా "శ్రీమాను మీకు తెలీదు, బతుకమ్మ మాకు తెలియకపోతే ఏమిటి", అలాగే "దేవుళ్ళకు తెలంగాణా రంగు పూయొద్దు" అంటూ దిక్కు మాలిన సలహాలు వచ్చాయి.

   తెలంగాణా వోటర్ల దయాదాక్షిణ్యాలతో గద్దె నెక్కిన బాబు/వైఎస్ లాంటి వాళ్ళు కనీసం మర్యాద కోసమయినా బతుకమ్మ అక్నాలేజ్ చేయలేదు.

   Delete
  6. "తెలంగాణా సంస్కృతిని సానియామీర్జా ఏ మేరకు ఫోకస్ చేయగలరు?"

   గుజరాత్ సంస్కృతిని అమితాభ్ బచ్చన్ ఎలా ఫోకస్ చేయగలడు? అప్పుడు ఈ వెటకారం ఎక్కడ పోయింది? నరేంద్ర మోడీ యూపీ వోట్ల కోసం చేసాడని ఎవరూ అనలేదు ఎందుకు?

   Delete
  7. జై గారు, మీ కామెంట్ నాకాశ్చర్యం కలిగించింది. మీనుండి నేనిది ఆశించలేదు. సరే మీరన్నారు కనుక నా అభిప్రాయం చెప్తాను.
   గుజరాత్ లో అమితాబ్ అయినా తెలంగాణాలో సోనియా అయినా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి పాలకుల పాచికలుగానే పనికివస్తారు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజభక్తులకు ఇది వెటకారంగానే అనిపిస్తుంది. నరేంద్రమోడీని ఎందుకనలేదనా మీ అక్కసు? సానియా మీర్జా నియామకం సరయినదనా మీ ఉద్దేశం? నాకర్ధం కాలేదు. కే.సీ.ఆర్ ప్రభుత్వాన్ని ఎవరేమన్నా తప్పే అనుకుంటే అతి శృతిమించిన రాజభక్తి అవుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడదు. తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడడానికి తెలంగాణా ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడానికీ తేడా ఉంటుంది. చంద్రబాబు సీ.ఎం గా ఉన్నా , మోడీ ఉన్నా కే.సీ.ఆర్ ఉన్నా సీ.పీ.ఎం వారున్నా ప్రజల తరపున మాట్లాడాలి తప్ప, వారినెందుకు అనలేదు? వీరినెందుకు అనలేదు అంటే ఏమి చెప్తాం? నేను తెలంగాణా వాసిని. నాకిక్కడి తప్పిదాలు కనిపించినంతగా ఇతరులవి కనిపించకపోవడం సహజ విషయమే తప్ప కుట్ర కాదు కదా? సానియామీర్జా అపరిమితమైన ప్రతిభతో తెలంగాణాకు చేయగలిగే అద్భుతాలేమిటో చెపితే తెలుసుకుంటాను.

   Delete
  8. గుజరాత్ బ్రాండ్ అంబశడర్ గా పని చేసినందుకు అమితాబచ్చన్ కు ప్రభుత్వం డబ్బులు ఎమీ చెల్లింలేదు.

   Delete
  9. తెలంగాణా సంస్కృతిని సానియామీర్జా ఏ మేరకు ఫోకస్ చేయగలరు?

   అయితే ముందు మీరు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్ అనేది వ్యాపారానికి సంబందించిన ఉద్యోగం. తెలివి తేటలు, జ్ఞానం, సంస్కృతీ లాంటి వాటితో పెద్దగా అవసరం లేదు. బ్రాండ్ అంబాసిడర్ అనే ఉద్యోగం యొక్క లక్ష్యం నెరవేర్చే వారు ఎవరైనా ఆ ఉద్యోగానికి అర్హులే.

   బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక బ్రాండ్ కు ప్రచారం తెచ్చే వాడు. ఆ ప్రచారం తెచ్చే వాడికి ఆ బ్రాండ్ గురించి తెలియాల్సిన అవసరం లేదు, తెలిసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు ఈ బ్రాండ్ అంబాసిడర్ అనే కాసేప్టు కార్పోరేట్ ప్రపంచం నుండి పుట్టినది. అనేక కార్పోరేట్ సంస్థలు కేవలం సెలబ్రిటీస్ ను వాళ్ళ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటారు. ఆ ప్రొడుక్ట్ ప్రచారం కోసం బ్రాండ్ అంబాసిడర్ తో ఆడ్ లు తీసి ప్రచారానికి ఉపయోగించుకుంటారు.

   తెలంగాణా గురించి చాలా తెలిసిన కెసిఆర్ నో, లేక డాక్టర్ సినారె గారినో లేక అలాంటి వారిని ఇంకెవరినో బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం కన్నా సానియా మిర్జానీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం మంచి పలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే కెసిఆర్/సినారె లాంటి వారు రాష్ట్రం లోనే తెలుసు, కాని మిర్జా లాంటి వారు ప్రపంచం మొత్తం తెలుసు. ఉదాహరణకు పారిస్ లో పారిస్ వాడు మాగజీన్ చూస్తూ ఒక ప్రకటనలో హైదరాబాదు టూరిజం గురించి చూస్తే పెద్దగా పట్టించుకోక పోవచ్చు, అదే ప్రకటనలో మిర్జా కనబడితే 'ఓహో ఈవిడ ఆ ప్రాంతం నుండా' అనే ఆసక్తి కలగొచ్చు. ఆ ఆసక్తి కలిగించటమే బ్రాండ్ అంబాసిడర్ ఉంచుకునే ముఖ్య ఉద్దేశం.

   ఈ బ్రాండ్ అంబాసిడర్ ను రాష్ట్ర టూరిజం వారు వారి ప్రకటనలకు వాడుకుంటారు. రాష్ట్రానికి సంబందించిన పెద్ద పెద్ద కార్యక్రమాలకు (ప్రభుత్వం నిర్వహించే జండా వందనం లాంటి కార్యక్రమాలు, పారిశామిక వేత్తల పెట్టుబడులు ఆహ్వానిస్తూ వారితో పెట్టె మీటింగ్ లు లాంటివి ) బ్రాండ్ అంబాసిడర్ ను కూడా పిలిచి ఆ అంబాసిడర్ యొక్క గొరవాన్ని రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు.

   మిర్జా ను నియమించతంలో ఆయన రాజకీయ కారణాలు ఉండొచ్చు. కాని తెలంగాణా గురించి తెలియదనో, బతుకమ్మ ఆడదనో లాంటి కారణాలు అవసరం లేని కారణాలు. గతంలో ఎవ్వరు బ్రాండ్ అంబాసిడర్ ను నియమించినా కూడా చిన్న చర్చ కూడా జరగలేదు(ఆయా ప్రాంతాలలో కూడా), కాని ప్రత్యేకించి ఇప్పుడు ఇంత రబస జరగటం వెనుక అసలు ఉద్దేశాలు అందరికి తెలిసిందే.

   Delete
  10. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటో నాకు తెలుసు కిరణ్ గారు. అంత వివరణ అవసరం లేదు :)) ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలు కావు. అలా దిగజారాల్సిన దుస్తితి ప్రభుత్వాలకు రావడమే ప్రమాదకరమైన అంశం. తెలంగాణాకు కే.సీ.ఆర్ ని మించిన బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు. ఇది పాజిటివ్ గానే చెపుతున్నాను. ఏ ప్రభుత్వానికీ బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదనే అనుకుంటున్నాను నేను. ఇక రభస అనేది ఓ ఫేషన్ గా మారుతున్నదేమోననిపిస్తోంది. కే.సీ.ఆర్ కావాలనే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం. దానిని విమర్శిస్తే అయ్యో కావాలనే తెలంగాణాపై కుట్ర పన్నారనడం కాస్త ఎక్కువగా ఉంటోందనిపిస్తోంది. విద్యార్ధుల ఫీజు రీ ఎంబెర్స్మెంట్ లాంటి ముఖ్యమైన విషయాలను పక్కన బెట్టి పనికిమాలిన పనులు చేసుకుంటూ పోతే ప్రజలే బుద్ధి చెపుతారీ ప్రభుత్వానికి.

   Delete
  11. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటో నాకు తెలుసు కిరణ్ గారు?

   అయితే ఇంకేం, ఆ పోస్ట్ కు కావలసిన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి కదా, అంటే మిర్జాను ఎన్నుకోవటం సబబే అంటారు కదా :)

   తెలంగాణాకు కే.సీ.ఆర్ ని మించిన బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు.

   కెసిఆర్ ను పెట్టి ప్రకటనలు తయారు చేయించి, దేశం మొత్తం ప్రచారం చేస్తే ఎవరు చుస్తారండి? ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వం కోసం కాదండి, రాష్ట్రానికి ఆర్ధిక లాభం చేకూర్చే పనుల కోసం, ముఖ్యంగా టూరిజం కోసం.

   విద్యార్ధుల ఫీజు రీ ఎంబెర్స్మెంట్ లాంటి ముఖ్యమైన విషయాలను పక్కన బెట్టి పనికిమాలిన పనులు చేసుకుంటూ పోతే ప్రజలే బుద్ధి చెపుతారీ ప్రభుత్వానికి.

   అవసరం అయితే బుద్ది చెపుతారు, అందులో అనుమానం లేదు. ఫీజు రీ ఎంబెర్స్మెంట్ విషయంలో మీరు ప్రత్యక్షంగా ఇబ్బంది కలుగుతున్న కారణంగా మీకు అది "ముఖ్యమైన" విషయంగా అనిపిస్తూ ఉండవచ్చు. ఇతరులకు మరొకటి, ఇంకొకరికి ఇంకొకటి ముఖ్యమైన విషయం కావొచ్చు, ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ఆరు వేల పనులు అన్ని సక్రమంగా చెయ్యాలి అని ఆశించటం అత్యాశే, అది కూడా ప్రభుత్వానికి పూర్తీ స్థాయి ప్రభుత్వ అధికారులు అందుబాటులో లేని పరిస్తితులలో.

   కే.సీ.ఆర్ కావాలనే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం. దానిని విమర్శిస్తే అయ్యో కావాలనే తెలంగాణాపై కుట్ర పన్నారనడం కాస్త ఎక్కువగా ఉంటోందనిపిస్తోంది.

   వివాదాస్పదం చెయ్యాలని అనిపిస్తే, దేన్నైనా చేయ్యోచ్చండి. ఉదాహరణకు ఈ సానియా మిర్జా సంగతే. బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేనే లేదు అనటం వేరు. అలా కాకుండా ఆమెకు తెలంగాణా గురించి తెలిదు కాబట్టి ఆమె వద్దు, లేదా ఆమె ముస్లిం కాబట్టి వద్దు, పాకిస్తాన్ కోడలు కాబట్టి వద్దు లాంటి విమర్శలు ఏ కోవకు చెందినవో విజిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టపా కవిత/చంద్ర బాబు ల గురించి అయితే "ముస్లింలను బుట్టలో వేసుకోవటానికి", "సానియా మిర్జా", "ఫీజు రీ ఎంబెర్స్మెంట్" ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు.

   తెలంగాణాపై కుట్ర పన్నారనడం కాస్త ఎక్కువగా ఉంటోందనిపిస్తోంది.

   మెట్రో వివాదం విషయంలో అసలు ఏమి జరిగింది అనేది నేను ఇది వరకు టపాలో స్పష్టంగా రాసాను. చివరికి అదే నిజమని తేలింది. మరి అసలు రాద్దాంతం ఎందుకు మొదలయ్యింది? సరే, రాద్దాంతం మొదలు పెట్టిన ఆ వర్గం మీడియా వారు నిజాలేంటో పరిశీలించి తరువాతా రాసారా? లేదే? ఇటువంటివి ఎన్ని చూడాలేదండి?

   ప్రభుత్వానికి కాస్త ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వండి సార్, కనీసం ఒక సంవత్సరం అయినా కానివ్వండి. అక్కడ మోడీ ఇంత వరకు ఒక్క పెద్ద నిర్ణయం కూడా తీసుకోలేదు. అదే పరిస్తితి తెలంగాణాలో ఉంటె 'పని చెయ్యకుండా కెసిఆర్ తాగి తొంగుటున్నాడు' అని భూమి ఆకాశం ఒక్కటైపోయేవి :-)

   Delete
  12. ఏ ప్రభుత్వానికీ బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఉండకూడదనీ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వారి రాజకీయ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయకూడదనేదే నా అభిప్రాయం. కొందరు అప్పుడలా చేస్తే తప్పు లేదు ఇప్పుడు చేస్తేనే వచ్చిందా అంటే? అప్పుడలా చేశారు కాబట్టి ఇప్పుడూ అలానే చేస్తామంటే వీరి ప్రత్యేకత ఏముంది? తప్పు ఎవరు చేసినా తప్పే.

   బ్రాండ్ అంబాసిడర్ల ద్వారా టూరిజానికి ఆర్ధిక ప్రయోజనం దొరుకుతుందా? నాకైతే అలా అనిపించడంలేదు. ఆచరణలో ఋజువైతే అప్పుడు పునరాలోచిస్తాను.

   నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి .... వేలమందికి ఇబ్బంది కలుగుతున్నది కాబట్టి తుగ్లక్ చర్య అంటున్నాను. 100 రోజులలోనే విద్యార్ధులను ఇబ్బంది పెట్టాల్నా? మన పాలన రుచి చూపించాల్నా? పాత విద్యార్ధులకు ఫీజు ఆపాల్సిన అవసరమేమిటో నాకర్ధం కావడం లేదు. మీ వైఖరేమిటో చెప్పగలరా? ఫాస్ట్ పథకం విషయంలో కోర్టు అక్షింతలు వేసినా దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉంటున్నదీ ప్రభుత్వానికి.

   ఈ టపా కవిత చంద్రబాబుల గురించి కాదు. బతుకమ్మ శుభాకాంక్షలు అనే సందర్భం వచ్చినప్పుడు దానికి అనుబంధంగా జరిగిన వాదోపవాదాలలో వచ్చినది. పైనుండి కామెంట్లు చూడండి. కే.సీ.ఆర్ ప్రభుత్వంపై మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పే ధైర్యం నాకుంది. అలాంటప్పుడు ప్రతీ టపాలో విమర్శిస్తూ కూర్చోవలసిన పని లేదు.

   అవును. దేనినైనా కావాలని విమర్శించవచ్చు. అవసరం ఉన్నా లేకున్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చూడవచ్చు. ఎంత తుగ్లక్ పనులు చేసినా వేచి చూడాలనే సాకూ చెప్పవచ్చు. ఎన్ని పిచ్చి వేశాలు వేసినా కీర్తించవచ్చు. అలా కాక మంచిని మంచిగా చెడుని చెడుగానూ చెప్పవచ్చు. ఎవరెలా చెపుతున్నారో కే.సీ.ఆర్ అనుకూలమైన బేచ్ గానో , వ్యతిరేకమైన బేచ్ గానో ఉన్నవారికి రెండూ కనబడవని చెప్పగలను.

   తెలంగాణా వ్యతిరేక ధోరణికి తెలంగాణా ప్రభుత్వ పోకడలను వ్యతిరేకించడానికీ ఉన్న తేడాను గమనించకపోతే ప్రభుత్వాలకు పాలకులకు వంత పాడడమే సరయినదిగా కనిపిస్తుంది. విమర్శించేవారంతా తెలంగాణా వ్యతిరేకులుగా చూడడమూ జరుగుతుంది. అది సరయినది కాదు.

   మెట్రో విషయంలో ప్రభుత్వపరంగా లోపాలూ ఉన్నాయి. కార్పోరేట్ శక్తులకు లొంగని ఇండికేషన్ మాత్రం బాగుంది.

   ఒక్క సంవత్సరం కాదు. కనీసం 3 సంవత్సరాలు చూడాలి. ఎవరేమనుకున్నా నా అంచనా తెలంగాణాలో అద్భుతాలయినా జరగాలి తుగలక్ పాలనైనా సాగాలి. అయితే ఈ విషయం తేలాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే.

   Delete
  13. >>> నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి .... వేలమందికి ఇబ్బంది కలుగుతున్నది కాబట్టి తుగ్లక్ చర్య అంటున్నాను.

   మీకు వ్యక్తిగతంగా కలుగుతున్న బాధకు నా సానుభూతి తెలియజేస్తున్నా.

   ఏ సంక్షేమ పథకం కూడా ప్రజలకు హక్కు కాదు. వాటిని ఎప్పుడైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయవచ్చు, పథకం లబ్దిదారులకు ఇది తెలిసి వుండాలి. NTR పెట్టిన 2 రూపాయలకు కిలో పథకానికి చంద్రబాబు మంగళం పాడితే, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి తిరిగి పునరుద్ధరించాడు. అంతమాత్రాన చంద్రబాబు తుగ్లక్ అయిపోడు, రాజశేఖర్ రెడ్డి ధర్మరాజూ అయిపోడు.

   ఫీజు - రీ - ఇంబర్సుమెంటు అంటే, ముందు ఫీజు కట్టి, తర్వాత ప్రభుత్వం వద్దనుంచి తిరిగి తీసుకోవడం. కాని మొదటి నుండి అది ఆవిధంగా అమలు కావడం లేదు. విద్యార్థుకలు కాకుండా కాలేజీలకు నేరుగా చెల్లించడం వల్ల అనేక అవకతవకలు జరిగాయి.

   ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతోంది. మధ్యలో కోర్టు కేసుల వల్ల కొంత జాప్యం జరగొచ్చు, కొంతమంది అక్రమంగా లబ్ది పొందుతున్న వారు భంగపడనూ వచ్చు. కొత్త పథకంలో రూల్సు వేరుగా వుండవచ్చు.

   మన వ్యక్తిగత లాభనష్టాల ఆధారంగా చేసే విశ్లేషణ సరైన విశ్లేషన అనిపించుకోదు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వాధినేత పైన మీరు తీవ్రమైన పదాలను ప్రయోగించడానికి గల కారణం అర్థం చేసుకోగలిగాను. మా ఇంట్లో కుళాయి పనిచేయక పోయినా మూణ్ణెల్లుగా పాలన చేస్తున్న కెసీఅరే కారణమని ఆడిపోసుకునే బ్యాచ్ ఒకటి వుంటుంది. ఆ బ్యాచ్ కి ఆయన చేసే ఇతర మంచి పనులు కనపడవని కచ్చితంగా చెప్పగలను.

   KCR పాలన లోని లోపాలను విమర్శించడానికి, అదే మూన్నెళ్ళలో అటు మోదీ కాని, ఇటు బాబు కాని వెలగబెట్టిందేమీపోయినా, వ్యక్తిగత కక్షతో ఒక్కన్నే పట్టుకుని తుగ్లక్, నియంత అని శాపనార్థాలు పెట్టడానికి తేడా వుంటుంది. అలాంటి పిచ్చి వాగుడుకి సమాధానం చెప్పిన వారంతా ఆయన భక్తబృందం అనుకోవడం సరయినది కాదు.

   Delete
  14. సానుభూతులతో సమస్యలు పరిష్కారం కావు. ఇది ఈ ప్రభుత్వపు తుగ్లక్ చర్యవల్ల ఏర్పడిన చిన్న సమస్య. ఓ మూర్ఖుడి పిచ్చి ఆలోచనవల్ల ఏర్పడిన సమస్య. నాకు వ్యక్తిగతంగా నష్టం జరగడంవల్లనే నేను కే.సీ.ఆర్ ను విమర్శించడం లేదు. విధానపరంగానే విమర్శిస్తున్నాను.

   విద్యార్ధుల ఫీజు రీ ఎంబెర్స్మెంటుని కిలో 2 రూపాయల పథకంతో పోల్చి ప్రభుత్వ చర్యను సమర్ధించాలనుకోవడం రాజుని మించిన రాజభక్తి ప్రదర్శన అవుతుంది. ఫీజు రీ ఎంబెర్స్మెంటులో లోపాలను సవరించాల్సిందే. ఆ దిశగా ఆలోచించాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. గత ప్రభుత్వాల తప్పిదాలకు విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడడం అవివేకం. పాత విద్యార్ధులకు ఫీజులు వెంటనే చెల్లించి కొత్తవారికి ఫాస్ట్ పథకం లోపాలు లేకుండా అమలు చేయాలి. అందులోనూ 1956 అంటూ మూర్ఖపు ఆలోచనలు చేయరాదు. కోర్టు అదే హెచ్చరిక చేసిందీ ప్రభుత్వానికి. అయినా చలనమున్నట్లు కనపడడం లేదు. స్థానికత అనేదానికి రెచ్చగొట్టే దుర్మార్గపు ఆలోచనలు కాకుండా శాస్త్రీయ దృక్పథంతో చేసి కార్పొరేట్ కాలేజీల ఆట కట్టిస్తే తెలంగాణా ప్రభుత్వం సాహసోపేతమైన మంచి పని చేసినట్లవుతుంది. అలా చేస్తున్నట్లనిపించడం లేదు ఆచరణలో. 4 ఏండ్లు చదివే విద్యార్ధుల ఆశలపై కిలో 2 రూపాయల బియ్యం పథకంతో పోల్చి చెప్పలేము. ఆ పోలికే తప్పు. ప్రభుత్వమనేది దానికున్న హక్కులతో విర్రవీగడానికి కాదు ప్రజలకు గతంకంటే మేలైన పాలన అందించడానికి. కే.సీ.ఆర్ వైఖరి అలా లేదు. ఫీజు రీ ఎంబెర్స్మెంట్ విషయంలో ప్రస్తుతం చంద్రబాబు మంచి నిర్ణయమే తీసుకున్నాడు. చంద్రబాబైనా- రాజశేఖరరెడ్డి అయినా ఇలా అర్ధం పర్ధంలేని పనులు చేస్తే తుగ్లక్ లే అవుతారు.

   కొత్తపథకం బాగుంటే స్వాగతిద్దాం. పాత విద్యార్ధులపై మూర్ఖపు కక్ష మానుకోవాలని కే.సీ.ఆర్ పై పోరాడదాం. కే.సీ.ఆర్ భజన బృందానికి నాది పిచ్చివాగుడుగానే కనపడడం అత్యంత సహజ విషయం. కే.సీ.ఆర్ ని విమర్శిస్తే ఇసుమంతైనా తట్టుకోలేని మీ రాజభక్తికి నా జోహార్లు. మీ పిచ్చి ముదిరిపాకాన పడకుండా ఉంటే మంచిది. లేదంటే మీ ఇష్టం.

   Delete
  15. కొండలరావు గారు,

   నాకు వ్యక్తిగతంగా KCRని తిట్టడం వల్ల వచ్చే నష్టం గాని, పొగడ్డం వల్ల వచ్చే లాభం గానీ ఏమీ లేవు. ఇక రాజభక్తి ఉండాల్సిన సమస్యే లేదు. కాని మీ పరిస్థితి అలా కాదు, కేవలం మీ అమ్మాయి ఫీజు రీ ఇంబర్సుమెంటు ఆలస్యం అయిందని మూర్ఖుడు, హిట్లర్, తుగ్లక్, నియంత లాంటి పదాలను ఉపయోగించి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. మీరు విధాన పరంగా అందరినీ విమర్శించినట్టు విమర్శిస్తే ఇక్కడ ఆక్షేపణ ఎవరికీ లేదు. కాని మీ వరస అలా లేదు. ఒకే తప్పు ఒకరు చేస్తే ఒకటీ మరొకరు చేస్తే మరొకటీ అన్న ధోరణి కనపడుతుంది మీ మాటల్లో.

   మీ అమ్మాయి ఫీజు చెల్లింపు కేవలం ఆలస్యం అయిందనే వంకతో అన్ని తిట్లు తిడుతున్న మీకు, కోట్ల మంది లబ్దిదారులకు ఒక్క కలం పోటుతో పథకాన్ని రద్దు చేసిన వైనంతో దీనికి పోలిక కనపడ్డం విచారకరం. ఇక్కడ పథకాన్ని రద్దు చేయలేదు, కేవలం మరింత అర్థవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 1956 నిబంధన నాకూ నచ్చలేదు, ఆ విషయం ఇదివరకు కూడా చెప్పాను, కాని మెజారిటీ జనానికి నచ్చింది. కోర్టు కేవలం కౌంటరు దాఖలు చేయమని చెప్పించి, చూద్దాం తుది తీర్పు ఎలా వస్తుందో. కాని ఇలా నాకు అసౌకర్యం కలిగింది కదా అని పబ్లిగ్గా తిట్లదండకం మొదలు పెట్టడం మీకు హుందాగా లేదు. పైగా "రాజభక్తి" అంటూ మాకు బిరుదొకటి.

   శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించారు కాబట్టే 174 బేవార్సు కాలేజీలను రద్దు చేశారు. ఫలితంగా సీట్లు నిండని కాలేజీ తెలంగాణలో ఒకే ఒక్కటి, అదే ఆంధ్రాలో యాభైకి పైగా వున్నాయి. దురదృష్ట వశాత్తూ అలా రద్దైన వాటిలో మీ అమ్మాయి కాలేజీ కూడా వుంది. ఆ అభద్రత భావం తోనే మీ పై కాలేజీ వారు వొత్తిడి తెస్తున్నట్టున్నారు, వేరే కాలేజీల్లో అలా లేదు.

   మనం ఏది సరైంది అనుకుంటామో ఆ పక్షం వైపునుండి వాదించడం సర్వ సాధారణం. అంత మాత్రాన "భక్తి" అని ముక్తాయింపు ఇవ్వడం మొదలు పెడీతే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక భక్తులే అయిపోతారు. "మార్క్సు భక్తి", "మావో భక్తి", "మోడీ భక్తి", "హిందుత్వ భక్తి", ఇలా...

   >>> ఫీజు రీ ఎంబెర్స్మెంట్ విషయంలో ప్రస్తుతం చంద్రబాబు మంచి నిర్ణయమే తీసుకున్నాడు. చంద్రబాబైనా- రాజశేఖరరెడ్డి అయినా ఇలా అర్ధం పర్ధంలేని పనులు చేస్తే తుగ్లక్ లే అవుతారు.

   మీ పద్ధతి ఎలా వుందంటే ఫీజు రీ-ఇంబర్సుమెంటు ఒక్కటే ప్రపంచమైనట్టు, ఇక వేరే విషయాలేమీ లేనట్టూ. శివరామక్రిష్ణ కమిటీ ఒకటి చెపితే తుగ్లక్ లా రాజధానిని తన వర్గానికి మాత్రమే అనుకూలంగా వుండే ప్రాంతానికి మార్చింది ఎవరు? కాని మీరు KCRపై తప్ప ఎవరిమీదా అటువంటి పదప్రయోగం చేయడం నేనయితే చూళ్ళేదు. "అవుతారు" అంటూ సన్నాయి నొక్కడం వేరు, నేరుగా అనేసేయడం వేరు.

   >>> కే.సీ.ఆర్ ని విమర్శిస్తే ఇసుమంతైనా తట్టుకోలేని మీ రాజభక్తికి నా జోహార్లు.

   అది మీ భ్రమ మాత్రమే. మీ బ్లాగులోనే KCRని విమర్షిస్తూ వచ్చిన ఎన్నో పోస్టులకు నేను కనీసం స్పందించను కూడా లేదు. మీ అమ్మాయికి అసౌకర్యం కలిగిందన్న (కేవలం అసౌకర్యమే, ఫీజు రద్దు చేశామని ఎవరూ చెప్పలేదు), కారణంతో అభ్యంతరకరమైన దూషణలు చేయవద్దనే కోరుతున్నా. ఒక తెలంగాణా అస్తిత్వ వాదిగా తెలంగాణా వారిపై వివక్ష చూపడానికి నేను వ్యతిరేకం. ఇతర నాయకులను వదిలేసి కేవలం ఒక వ్యక్తిపై మీ నోరు లేస్తున్న పద్ధతే మీకు ఆయనమీద గల వివక్షకు ప్రతీక. "నేనూ తెలంగాణా వాడినే" అని మీరు ఎంత సర్ది చెప్పుకుందామని చూసినా అది దాగదు. "నా బ్లాగు, నా ఇష్టం" అంటారా, ఇక చెప్పేదేమీ లేదు.

   Delete
  16. నాకు తెలిసి ఈ బ్లాగులో ఏ ఒక్కరినీ నేను వ్యక్తిగతంగా కించపరచలేదు. ఒక్క ప్రవీణ్ ని మాత్రమే అదీ అతడు అన్నాకనే నేను కొన్ని మాటలన్నాను. అనవసర కామెంట్లు ఉంచుతున్న Dare2write అనే ఫాల్త్ ఐ.డీ ఉన్న వ్యక్తి ( వారెవరో నేకు తెలీదు) ని దూషించినట్లు గుర్తు. ఈ రెండు సంఘటనలు లేకుండా ఉంటే మంచిది. అంత సాధుజీవిని మాత్రం కాదు లెండి.

   ఇక పాలకులలో కే.సీ.ఆర్ ని ఏమన్నా మీకు అభ్యంతరం లేకపోతే మీరు నన్ను పిచ్చి వాగుడు అంటూ పెద్ద మాటలతో తిట్టాల్సిన అవసరం ఉండదు. మిమ్ములను నేనెప్పుడూ కించపరచలేదు. మీ పై ఉన్న్ ఓ అంచనాను పున:పరిశీలన చేసుకునేలా మీ వ్యాఖ్య ఉన్నది. మిమ్ములని అంటే తప్పు తప్ప పాలకుడిని అంటే మీరు గింజుకోవడం రాజభక్తి అవుతుందా? కాదా? డెఫినెట్ గా మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

   ఇక నేను కే.సీ.ఆర్ ని మాత్రమే అంటే తప్పు. చంద్రబాబుని, రామోజీని, రాధాకృష్ణ, మోడీని అందరినీ ఏదో ఒక ఊతపదంతో విమర్శించాను. ఆ ఊతపదాలూ లేకుండా విమర్శించగలిగితే డెఫినెట్‌గా నా వ్యాఖ్యలకు మరింత విలువ పెరుగుతుంది. అయితే ఈ బలహీనతని ఇప్పటికిప్పుడే అధిగమించగలనని చెప్పడం లేదు. కానీ అధిగమించడానికి ఈరోజునుండే ప్రయత్నిస్తాను. నా బ్యాఖ్యలన్నింటినీ పరిశీలించి నేను కేవలం కే.సీ.ఆర్ నే అన్నానని మీరు నిరూపిస్తే లేదా మీరు అప్పటికీ అదే అభిప్రాయం చెపితే క్షమించాలని కోరతాను. కానీ కే.సీ.ఆర్ ని మాత్రమే నేను అనలేదు.

   మా అమ్మాయి కాలేజి మీరు చెప్పిన లిస్టులో లేదు. మా అమ్మాయికి ఫీజు నేను కట్టేశాను. ఈ వ్యాఖ్యలు అన్నింటికంటే ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి నాకు. మా అమ్మాయి లేకున్నా నేను దీనిని తుగ్లక్ చర్యే అంటాను. సంక్షేమ పథకాలు కోట్లా లక్షల కోట్లా అని కాదు పోల్చాల్సినది. ఫాస్ట్ పథకం పెడదామనుకున్న ప్రభుత్వం విద్యార్ధులకు మేలు చేద్దామనే కదా? మరి ఇప్పటి విద్యార్ధులకు ఫీజులు చెల్లించాల్నా? వద్దా? పాత విద్యార్ధులకు నష్టం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత పాలకులది. అలా చూసుకోకపోతే పాలకులను తుగ్లక్‌లనే అనాలనేది ఇప్పటికీ నా అభిప్రాయం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆ ప్లేస్ లో మోడీ ఉన్నా చంద్రబాఉ ఉన్నా నా అభిప్రాయం అదే. తుగ్లక్ అన్నా , మూర్ఖుడు అన్నా బూతులు కావనేది నా అభిప్రాయం. తప్పు చేసినప్పుడు పాలకులను తిట్టడం తప్పెలా అవుతుంది? తిట్టకపోతేనే అవసరానికి మించిన రాజభక్తి అవుతుందని నా అభిరాయం. పబ్లిక్ గా తిట్టడమే మంచిది. తిట్లదండకం లేకుంటే హుందాతనం పెరుగుతుందనేది నిజం. ఆ దిశగా మాత్రం ప్రయత్నిస్తాను. అది నాకే మేలు కనుక.

   174 కాదు మొత్తం ప్రైవేటు కాలేజీలపై వేటు వేసి ప్రభుత్వమే నడిపితే సంతోషించేవారిలో మొదటివాడిని నేను. దానికీ విద్యార్ధుల భవిష్యత్తుకీ లింకు పెట్టవద్దంటున్నాను. తెలంగాణాలో 4 సంవత్సరాలుగా చదివే విద్యార్ధులకు ఏ పథకమైనా వర్తింపజేయమంటున్నాను.

   మనం ఏదైతే సరయినది అనుకుంటామో ఆ దిశగా వాదించడం చేస్తాము. 100% ఇది సరయినదే. వాదనలో మనమే గెలవాలనుకోవడం తప్పు. వాదించేవారి నోరు మూయించాలనుకోవడం తప్పు. నేను మీ వాదనను ఎక్కడా దూషించలేదు. పిచ్చివాగుడు వాగుతున్నారనలేదు. నాకేఇజం మీదా భక్తి లేదు. భక్తి ఉండడం ప్రమాదం. ఏ ఇజంలోనైనా నిజాన్ని గ్రహించడం వరకే నేను చేస్తాను. మార్క్సిజంలో చాలా విషయాలపట్ల నాకు అభ్యంతరాలున్నాయి. కమ్యూనిస్టుల ఎత్తుగడలపట్లా అభ్యంతరాలున్నాయి. బెంగాల్ లో సీ.పీ.ఎం తప్పు చేస్తేనే ఓడిపోయిందని మీకేననుకుంటాను చెప్పాను గుర్తుండే ఉంటుంది.

   మీకు కే.సీ.ఆర్ బాగా నచ్చుతున్నాడు కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారంటున్నాను. నెమ్మదిగా ఆలోచించండి. కాదని మీ అంతరాత్మ చెపితే అప్పుడాలోచిద్దాం. మీరు చెపితే ఎదుటివాడు తిట్టడు. ఎదుటివాడికి స్పందన వస్తే తిడతాడు. నేను చంద్రబాబుని మాయలోడన్నాను, ప్రపంచబేంకు జీతగాడన్నాను, అభద్రతా జీవి అన్నాను, మోసగాడన్నాను... ఇలా చాలా అన్నాను అవన్నీ మీకు కనిపించకపోతే అది నా తప్పు కాదు. చంద్రబాగు కంటే కే.సీ.ఆర్ చాలా విషయాలలఒ బెటర్ అనీ చెప్పాను మరి మీకు అదెందుకు కనిపించలేదో తెలీదు. అయినా ఎవరినీ తిట్టకుండా విమర్శిస్తే ఇంకా మంచిది. ఈ విషయంలో నేను మారితే మీకే ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ నేను హామీ ఇవ్వలేను. తిట్టడం రైటని సమర్ధించుకోను. కే.సీ.ఆర్ ని మాత్రమే తిడతాననుకుంటే అంగీకరించను.

   తెలంగాణా పై వివక్ష అనేది పిచ్చి అభిప్రాయం మాత్రమే. ప్రతీ దానిని అలా చూస్తే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి భయపడి నేను నా అభిప్రాయాలను దాచుకోవలసిన అగత్యం లేదు.

   నా బ్లాగు నా ఇష్టమని నేనెప్పుడూ చెప్పలేదు. మీరు పంపిన ఏ ఒక్క ప్రశ్ననూ పబ్లిష్ చేయకుండా ఆపలేదు. మీ కామెంట్లనూ ఆపలేదు. అలాంటప్పుడు ఆవిధంగా ఆరోపించే అవకాశం మీకు లేదు. చంద్రబాబు తుగ్లక్ చర్యలపట్ల మీకనిపించినవి నిరభ్యంతరంగా ప్రశ్నలు పంపించండి. పబ్లిష్ చేస్తాను.

   Delete
  17. @UG SriRam:

   FYVKI సానియా మిర్జాకు తెలంగాణా ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ హోదా కోసం డబ్బులు ఇవ్వలేదు

   Delete
  18. కొండలరావు గారు,

   నా వ్యాఖ్య కొంచెం శృతిమించినట్టు నాకే అనిపిస్తోంది. అవసరమనిపిస్తే దాన్ని తొలగించగలరు. అయితే KCR పట్ల భాష ఒకింత తీవ్రంగా వుందన్న నా అభిప్రాయం పై తేడాలేదు. అయితే అది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు దానికి సమాధానం చెప్ప వలసిన అవసరం లేదు. ధన్యవాదాలు.

   Delete
  19. శ్రీకాంత్ చారి గారు,

   మీ వ్యాఖ్యకు నేను ఈరోజు ఉదయం చాలా బాధపడ్డమాట వాస్తవం. KCR పట్ల కటువైన భాషను వాడుతున్నమాట వాస్తవం. డెఫినెట్‌గా అది నా లోపమే. అలా వాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇకపై కామెంట్లలో ఆ మార్పును మీరు చూస్తారు. కానీ నేను తెలంగాణా పట్ల వివక్ష చూపుతున్నట్లు అనిపిస్తే ఏ సందర్భమో తెలుపుతూ మీకు వీలయితే, అభ్యంతరం లేకపోతే నాకు మెయిల్ చేయగలరు. కే.సీ.ఆర్ భజన బృందం , బాబు ఎండ్ కంపెనీ ... ఇలాంటి పదాలు కూడా రాకుండా చూసుకుంటాను. మిమ్ములను టార్గెట్ చేస్తూ మాత్రం వ్యాఖ్యానించలేదు. మీరన్న మాటలకు కోపంగా బదులిచ్చాను. మీ వాదనవల్ల నాకు మేలు జరిగిందనే అనుకుంటున్నాను. మీ వ్యాఖ్యకు, సంస్కారానికీ ధన్యవాదములు.

   Delete
  20. ఆచరణలో ఋజువైతే అప్పుడు పునరాలోచిస్తాను.

   ఆచరణలో రుజువు కావాలంటే ఆ పోస్టులో ఒకరు ఉండాల్సిందే కదండీ. మరింకేం? ప్రయత్నం అనేదే లేకుంటే పలితం ఎలా తెలుసుతుంది? :)

   పాత విద్యార్ధులకు ఫీజు ఆపాల్సిన అవసరమేమిటో నాకర్ధం కావడం లేదు.

   ఫీజు ఆపారని మీకెవరు చెప్పారు? ఫీజు విధానంలో ప్రభుత్వం ఇంకో విధానాన్ని తీసుకు రావటానికి కసరత్తు చేస్తున్నారని ప్రకటించారు కదా? అదయ్యే వరకు ఆగొచ్చు కదండీ? ఈ ఫీజు కంటే కూడా ముఖ్యమైన నిర్ణయాలు తిసుకోవలసిన విషయాలు లక్షా తొంబై ఉంటాయి, అన్ని ఒకే సారి ఎలా కాగలవు? కనీసం సంవత్సరం అయినాక కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటె అప్పుడు మీరు తీవ్రంగా విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు కాని ఇప్పుడు ఎంత కాలం గడిచిందని?

   ఇక్కడే కాదండి, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఆగిపోయాయి. ఆ ప్రబుత్వం ఫీజీ విషయంలో వారి విధానం ప్రకటించి బహుశా రెండు మూడు రోజులు అయ్యి ఉంటుంది. నేను ఇక్కడ ప్రజలో పెద్దగా రాయక పోయినను తరుచుగా చదువుతూనే ఉన్నాను. ఫీజీ విషయమై కెసిఆర్ విధానం ఏమిటో స్పష్టంగా(దాంట్లో మంచి చెడుల సంగతి వేరే చర్చ) ఎప్పుడో ప్రకటించేసాడు. కాని చంద్ర బాబు తన విధానాన్ని రెండు మూడు రోజుల క్రితం వరకు స్పష్టంగా ప్రకటించలేదు, అంత వరకు రెండు రాష్ట్రాలలో ఆ రాష్ట్ర విద్యార్తులు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే. అయిననూ చంద్రబాబును ఫీజు విషయంలో మీరు(ఇంకెవ్వరు కూడా) విమర్శించినట్లు నేను చదివి ఉండలేదు(ఎప్పుడైనా రాసి ఉంటె అది నా దృష్టిలో పడలేదు). కాని ఏదోక విధానం ప్రకటించిన తరువాత కూడా అనేక సార్లు కెసిఆర్ ను విమర్శించినట్లు(ఫీజు రావట్లేదు అని) మాత్రం చదివాను. కెసిఆర్ రాష్ట్రంలో విద్యార్తులకు ఇంకా ఫీజులు రాలేదు, అలానే చంద్ర బాబు రాష్ట్రం లో కూడా ఇంకా ఫీజులు రాలేదు. కాని ఫీజు ఆలస్యం అయ్యిందని ఒక్క కెసిఆర్ ను మాత్రమె తీవ్రంగా విమర్శించటంను ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు.

   మీ వైఖరేమిటో చెప్పగలరా?

   నా వైఖరి ప్రజలో ఇదివరకే చెప్పాను, అయినా మళ్ళి రాస్తాను. 1956 నిభందన నాకు నచ్చలేదు అది మంచిది కాదు, అసలు ఈ ఫీజు రీ-ఏంబెస్మేంట్ అనే పథకాన్నే పూర్తిగా తీసేయ్యాలి.

   అనుబంధంగా జరిగిన వాదోపవాదాలలో వచ్చినది. పైనుండి కామెంట్లు చూడండి.

   ఇలా అనుభందం అనుకుంటే ఏ టపాలోనైనా అనుబంధంగా ప్రపంచ చరిత్ర మొత్తాన్ని చర్చించుకోవచ్చండి :-)

   Delete
  21. అనుకూలమైన బేచ్ గానో , వ్యతిరేకమైన బేచ్ గానో ఉన్నవారికి రెండూ కనబడవని చెప్పగలను.

   డిట్టో నేను కూడా చెప్పేది అదేనండి. నేను మంచి అని నమ్మిన దాన్ని నేను చర్చలో రాస్తే నన్ను కెసిఆర్ చెంచ అని డిసైడ్ చేసిన వారు ఉన్నారండి. అలా నన్ను డిసైడ్ చేసే వారిని నేను కూడా ఏదోక వర్గంలోకి డిసైడ్ చేయ్యాలంటారా?

   విమర్శించేవారంతా తెలంగాణా వ్యతిరేకులుగా చూడడమూ జరుగుతుంది. అది సరయినది కాదు.

   మీరు చెప్పిన విధంగా, సమర్దించే వారందరూ కెసిఆర్ అనుకూల బ్యాచ్ ఎందుకు కావాలి? అది సరయినది కాదు.

   నేను వితండ వాదం చేస్తున్నాను అనుకోవచ్చు. నా ప్రొఫైల్ లో నేను కెసిఆర్ పై కూడా సటైర్లు వేసాను.

   మెట్రో విషయంలో ప్రభుత్వపరంగా లోపాలూ ఉన్నాయి.

   ఉండొచ్చు, ప్రతి ప్రభుత్వంలోను లోపాలు ఉంటాయి, కాని..... రాష్ట్ర విభజన పూర్తిగా జరగకుండా, ఒక ప్రభుత్వం ఏర్పడి ఓ మూడు నెలలు కూడా కాకుండానే, ప్రభుత్వ అధికారులు పూర్తీ స్థాయిలో నియామకాలు కాకుండానే, ఆ ప్రభుత్వం జెట్ స్పీడ్ తో పని చెయ్యట్లేదు అని ప్రతి విషయాన్ని రాత్రి పగలు తేడా లేకుండా విమర్శిస్తూ, లేని కళంకాలు కూడా అంట కడుతూ ప్రభుత్వ కాళ్ళకు అడ్డం పడటం అనే విషయాన్ని కూడా గమనించాలి.

   {మెట్రో విషయంలో ప్రభుత్వ లోపాలు ఏంటో మీకు విలైనాపుడు రాయగలరు}

   మొన్న ఆ మావోయిస్టు సభకు అనుమతి ఇవ్వలేదని వారు, వారికి తోడూ ఒక వర్గం మీడియా వారు, ఇంకొందరు చేసిన రభస నేను చూసాను. దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా అలాంటి సభకు అనుమతి ఇవ్వరు, అది మరిచి తెలంగాణా ప్రభుత్వం పైనే పడటం ఎందుకు?

   ఎంసెట్ కౌన్సిలింగ్ సంగతి కూడా చూద్దాం. నేను పరిక్ష రాసినాకా, పేపర్ లీక్ అయ్యిందని తెలిసి, ప్రభుత్వం మళ్ళి పరిక్ష నిర్వహించి, కౌన్సిలింగ్ అయ్యి, నేను కాలేజిలో జాయిన్ అయ్యి క్లాసులు మొదలయ్యే సరికి డిసెంబర్ చివరి వారం వచ్చింది. అయినా కూడా నేను విద్యా సంవత్సరం కోల్పోకుండా బానే చదువుకొని పూర్తీ చేసాను. విభజన పూర్తీ కాక పోవటం వలన పెర్మేనేంట్ స్టాఫ్ లేరు కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ ఒక రెండు నెలలు ఆలస్యంగా జరుపటానికి అనుమతి కోరుతూ కోర్టుకు వెళితే ఎంత రబస చేసారు? విద్యార్తుల జీవితాలతో ఆడుకుంటున్నాడు, వారి విద్యా సంవత్సరం పోతుంది అని ....... చివరికి చంద్ర బాబు ప్రభుత్వం కోర్టులో ఒప్పుకున్న ప్రకారంగా నిర్ణీత సమయంలో ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తీ చెయ్యలేక వేల మంది విద్యార్తుల జీవితంతో ఆడుకొని వారి విద్యా సంవత్సరం పోగోడితే ఎవరైనా విమర్శించారా? కెసిఆర్ ను విమర్శించి బాబును పల్లెత్తు మాట అనని వారిని బాబు అనుకూల బ్యాచ్ అనమని మీరు అంటారా?

   ఇట్లాంటివి చెప్పాలంటే చాల చెప్పగలను కాని, ఇక అవసరం లేదనిపిస్తుంది. ఇక్కడ ఇవి ఎవరి కోసం రాస్తున్నానో వారు తము వినాలనుకున్నదే వింటారు అని అర్థం చేసుకున్నాను.

   Delete
  22. "మొన్న ఆ మావోయిస్టు సభకు అనుమతి ఇవ్వలేదని వారు, వారికి తోడూ ఒక వర్గం మీడియా వారు, ఇంకొందరు చేసిన రభస నేను చూసాను. దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా అలాంటి సభకు అనుమతి ఇవ్వరు, అది మరిచి తెలంగాణా ప్రభుత్వం పైనే పడటం ఎందుకు?"

   ఆ సభ పెట్టాలనుకున్నది వర్గ పోరాటం చేసే మావోయిస్త్ పార్తీ కాదు, వర్గ సహకారం చేసే విరసంవాళ్ళు. నిజమైన మావోయిస్త్‌లు ఎవరూ పాలకవర్గం అనుమతితో సభలు పెట్టాలనుకోరు. ఒకవేళ అందుకు అనుమతి అడిగినా పాలకవర్గంవాళ్ళు తమ శతృవర్గాన్ని నమ్ముతారనుకోలేము.

   Delete
  23. పాత విద్యార్ధులకు అంటే : ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులున్నారు. వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు పెండింగ్ పెడుతున్నారు. కొంతమందికి ఫీజు రీ ఎంబెర్స్మెంట్ అసలు మంజూరు చేయకుండా పెండింగ్ పెట్టారు. అదేమంటే ఆంధ్రా తెలంగాణా సమస్య తేలాలని చెప్తున్నారు. సర్టిఫికెట్లు లేకుండా సంవత్సరం ఎలా ఆగుతారండీ? గేట్ ఎక్సాం కు అప్లై చేయాలంటే సర్టిఫికెట్లు కావాలి. ఫీజుల చెల్లించకుండా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అలాగే మూసేసిన కాలేజీల విద్యార్ధులకు కూడా ఇతర కాలేజీలలో సీట్లు వచ్చేలా వారి విద్యా సంవత్సరాలు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదంతా ప్రభుత్వం తీసుకోవలసిన కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే కొత్త పథకంలో డెఫినెట్ గా సరి చేయొచ్చు. వాటిని ఆహ్వానించాల్సిందే. కానీ ఎవడో చేసిన తప్పుకు విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకోవడం మంచిది కాదు. ఇంజనీరింగ్ చదవాలంటే ఏండ్లు పడితే ఇప్పటికే సంవత్సరాలు పూర్తయినవారికి గతంలోని విద్యార్ధులందరికీ ఫీజు రీ ఎంబర్స్మెంట్ వర్తింపజేయాలి. నిజంగా అనర్హులు ఉంటే వారికి రద్దు చేయాలి. ఒక వేళ యాజమాన్యాలకు కాకుండా విద్యార్ధులకే ఫీజులు చెల్లిస్తే మరీ మంచిది. కానీ ఇంతవరకూ ఏమీ తేల్చకుండా నాంచడం వల్ల చాలామంది విద్యార్ధులు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు.

   కే.సీ.ఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబునేందుకు విమర్శించరనడం సరయినది కాదు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విషయాలపట్ల మనకు ఆసక్తి ఉండదు. మన రాష్ట్రంపై మనకు ఆసక్తి ఎక్కువ. చంద్రబాబు బాగా చేస్తున్నాడు. కే.సీ.ఆర్ ఎందుకు చేయడని ఎవరైనా అంటే అప్పుడాలోచించవచ్చు తప్ప. ప్రతీదానికి చంద్రబాబు ఏమి చేస్తున్నాడో చూసి విమర్శించాలనడం సరి కాదు.

   అనుమతి మావోయిస్టుల సభకు కాదండీ. విరసం సభకు. విరసం సభకు అనుమతి ఇవ్వవచ్చు. మావోయిస్టు సభలకు అనుమతి ఇవ్వరు. ఆ తేడాని మీరు గమనించాలి.

   పాలకులుగా బాబు కే.సీ.ఆర్ ఒకే తప్పు చేసినప్పుడు కే.సీ.ఆర్ ని విమర్శించి బాబుని విమర్శించని వారిని బాబు అనుకూల బేచ్ అనే అనాలి.

   Delete
  24. పాత విద్యార్ధులకు అంటే : ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులున్నారు.

   మిరనది సబబే, ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తీ చేసిన విద్యార్తులకు ఈ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వ పద్దులో ఫీజు చెల్లించాల్సిందే. అయితే గత ప్రభుత్వం సంవత్సర కాలంగా ఎందుకు చెల్లించలేదు అనేది కూడా చర్చలోకి తీసుకోవాలి. గత ప్రభుత్వాల తప్పులను కూడా ఈ ప్రభుత్వం ఖాతాలో కలిపేసే మొత్తం తప్పు వీరిది మాత్రమె అన్నట్లు మాట్లాడితే అది సమంజసం కాదు. మెట్రో విషయంలో జరిగిన రబస కూడా ఇలాంటిదే.

   ఇంజనీరింగ్ చదవాలంటే ఏండ్లు పడితే ఇప్పటికే సంవత్సరాలు పూర్తయినవారికి గతంలోని విద్యార్ధులందరికీ ఫీజు రీ ఎంబర్స్మెంట్ వర్తింపజేయాలి.

   దాని వలన అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాళ్లకు ఇంకా ఇస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వరూ అని ఈ సంవత్సరం ప్రవేశం పొందే విద్యార్తులు ఆందోళనలు చేసే అవకాశం ఉంది. వారి ఆందోళనలలు సబబే అవుతాయి. వారికి ఇస్తే ఇక వచ్చే సంవత్సరం కూడా ఇవ్వాలి, ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూనే పోవాలి. ఇస్తే అందరికి(పాత కొత్త విద్యార్తులకు) ఇవ్వాలి, లేదంటే ఎవ్వరికి ఇవ్వొద్దు.

   ఏమీ తేల్చకుండా నాంచడం వల్ల...

   ప్రభుత్వాలు మారినప్పుడు రాష్ట్రంలో, మేనేజ్మెంట్ మారినప్పుడు వ్యాపారాలలో ఇలాంటి ఒడిదొడుకులు సహజమే. వారు పని మొదలు పెట్టగానే ఒకే సారి సవా లక్షా విషయాలపై ద్రుష్టి పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలని ప్రజలు ఆశిస్తే ఆ ప్రభుత్వం నిలదొక్కుకునే వరకు ఆ ప్రజల సహకారం ప్రభుత్వానికి ఉండాలి. అంతే కాని మొదటి రోజు నుండే కాళ్ళకు అడ్డం పడి, ఆ ప్రభుత్వం పని చెయ్యటం లేదు అనటం సమంజసం కాదు.

   Delete
  25. కే.సీ.ఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబునేందుకు విమర్శించరనడం సరయినది కాదు.

   అది నేను కూడా ఒప్పుకుంటాను. కాని నేను పైన చెప్పిన ఉద్దేశం వేరు. రెండు రాష్ట్రాలలో కలిపి కేవలం కెసిఆర్ నిర్ణయాలపై మాత్రమె ఇంత చర్చ(రచ్చ) జరగటం వెనుక ఎవరికీ వారి ఎజెండాలు ఉన్నాయని మాత్రమె నేను చెప్పటం. ఎవరెవరో పెద్ద వారి వ్యుహ్యంలలో మనం పావులం కావోద్దని చెప్పటం.

   ఉదాహరణకు........ కెసిఆర్ సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తాడు. ముస్లింల ఓట్ల కోసమే అలా ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు అని ఎవరో ఒక ప్రత్యర్థి నాయకుడు విమర్శిస్తాడు. అది ఒక రాజకీయ విమర్శ అయిననూ దానికి బాగా ప్రాముఖ్యం ఇస్తూ ఆ వర్గం మీడియా వారు బాగా హైలైట్ చేస్తారు. దాన్ని మీడియాలో చర్చకు పెట్డతారు, మీరు ప్రశ్నగా ప్రజలో వేస్తారు :) చర్చలో పాల్గొన్న వారు 'ఆవిడ ముస్లిం', 'పాకిస్తాన్ కోడలు', 'భారత జెండాను అవమానించింది', 'ఆమెకు తెలంగాణా గురించి ఏం తెలుసు', 'ఆమె బతకమ్మ ఆడుతుందా' అంటూ మరి కొన్ని అవసరం లేని మసాలాలు అద్దుతారు. కెసిఆర్ తీసుకున్న ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలలో కూడా ఇంత రాద్దాంతం అవసరమా?

   ఎందుకయ్యా ఇంత రాద్దాంతం అని అడిగితె 'మీరు కెసిఆర్ బ్యాచా?' అని అడిగేస్తున్నారు. ఒప్పు అనిపించింది ఒప్పు అని చెప్పాలంటే ఆయన పంఖాలము కావలసిందేనా?

   విరసం సభకు అనుమతి ఇవ్వవచ్చు. ఆ తేడాని మీరు గమనించాలి.

   విరసం సభలో మావోయిస్టుల అనుకూల ప్రసంగాలు జరుగుతాయనే అనుమానాలతోనే ఆ సభకు అనుమతించలేదు అని జనాల టాక్. ఎంతో దూరంలో లేని విజయవాడలో కూడా వారు ఇలాంటి సభ జరుపుకోలేరు అని నా అభిప్రాయం. అక్కడ కూడా జరుపుకోలేక పొతే విరసం నేతలు ఇదే స్థాయిలో రియాక్ట్ కావొచ్చు, అలా రియాక్ట్ అయిననూ మీడియా వారిని పెద్దగా హైలైట్ చెయ్యదు అని నా నమ్మకం. అలా ఆ విషయం హైలైట్ కాకపొతే ఎవ్వరూ పెద్దగా చర్చిన్చుకోరు.

   కే.సీ.ఆర్ ని విమర్శించి బాబుని విమర్శించని వారిని బాబు అనుకూల బేచ్ అనే అనాలి.

   అయితే ...... ఈ టపా వార్త మీరు బాబు అనుకూల బేచ్ నుండే తెచ్చారు. బాబు అనుకూల బేచ్ మీడియా పని రోజు విషయం ఉన్నా లేకున్నా కెసిఆర్ వ్యేతిరేక వార్తలు రాయటం. వాటిలో చాలా వరకు ప్రజలో పోస్ట్ చెయ్యబడటం..... బాబు అనుకూల బేచ్ వారు ఇష్టం వచ్చినట్లు రాసుకోవటం ....... చూసి చూసి ఎప్పుడో ఒక చర్చలో పాల్గొంటే ఆ మాత్రానికే కెసిఆర్ బేచ్ అని ముద్ర వేసేయ్యటం ..... .... బలేగుంది :-))

   Delete
  26. కొండలరావు గారు,

   >>> కానీ నేను తెలంగాణా పట్ల వివక్ష చూపుతున్నట్లు అనిపిస్తే ఏ సందర్భమో తెలుపుతూ ...

   మీరు తెలంగానా వారే కావచ్చు. తెలంగాణా ముఖ్యమంత్రి మంచి చెడులపై మీకు ఎక్కువ ప్రాధాన్యత వుండవచ్చు. కానీ ఇక్కడ చర్చలో అందరూ పల్గొంటున్నారు, ముఖ్యంగా సీమాంధ్రకు చెందినవారు ఎక్కువగా పాల్గొంటున్నారు. KCR మీద ఒక విమర్శ రావడం మొదలు కాగానే మిడతలదండులా వచ్చి రకరకాలుగా వ్యాఖ్యానించి వెడుతున్నారు. మొన్నొకసారి జై గారు కర్నూలు డేరాల సంగతి ఎత్తగనే వారికి పీకల్లోతు కోపం ముంచుకొచ్చింది. కాని వారు మాత్రం ప్రతిరోజూ తెలంగాణా ప్రభుత్వంపై, ముఖ్యంగా వ్యక్తిగతంగా KCRపై ప్రతిరోజూ విరుచుకు పడడం చూస్తూనే వున్నాం.

   అటువంటి సందర్భంలో ప్ర/జలో కేవలం KCRపైనే తీవ్రమైన పదజాలంతో కూడిన వ్యాఖ్యలు రావడం, వాటికి పక్క రాష్ట్రం వారు వంతపాడుతుండడం, అదే సమయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉదాసీనంగా వుండడం కూడా ఒకరకమైన వివక్ష గానే భావించాను. ఒక అస్తిత్వ వాదిగా అటువంటి వివక్షను ఎత్తి చూపడం నా బాధ్యతగా భావించాను తప్ప మీరు మరో విధంగా వివక్ష చూపుతున్నారని నా ఉద్దేశం కాదు.

   Delete
  27. నేను వర్గ వైరుధ్యాలు బాగా తెలిసిన మావోయిస్త్‌ని. పాలకవర్గంవాళ్ళు విరసం సభకి అనుమతిస్తే పాలకవర్గానికీ, విరసంకీ మధ్య వైరుధ్యం లేనట్టే అవుతుంది. వైరుధ్యం లేనప్పుడు వర్గ పోరాటం ఏముంటుంది? విరసం తాము చేస్తున్నది వర్గ పోరాటమా లేదా వర్గ సహకారమా అనేది స్పష్టంగా చెప్పలేదు. అటువంటి సంస్థని పాలకవర్గం నమ్మదు, ప్రజలు కూడా నమ్మరు. ఆంధ్రాలోనైనా, అమెరికాలోనైనా అటువంటి సభలకి పాలకవర్గంవాళ్ళు అనుమతి ఇవ్వరు అనేది నిజం. మరి దాని పేరు చెప్పి కె.సి.ఆర్. ఒక్కడి మీద పడి ఏడవడం ఎందుకు?

   Delete
  28. ప్రజ అనేది తెలుగువారి చర్చావేదిక తప్ప తెలంగాణావాద చర్చావేదిక కాదు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ బ్లాగు మొదలెట్టాను. తెలంగాణా వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. రావాలని కోరుకోలేదు ఏనాడూ. నేను సమైక్యవాదిని. తెలుగువారందరూ కలసి ఉండాలని కోరుకున్నవాడిని. అలాగని నేను ఏనాడూ తెలంగాణా ఉద్యమాన్ని పల్లెత్తుమాట అనలేదు. తెలంగాణా ఉద్యమం పై నాకు సానుభూతి ఉండేది. ఆంధ్రా పాలకుల విధానాలవల్ల తెలంగాణాకు అన్యాయం జరిగిందనేది నిజం. అయితే అది సమస్యకు పరిష్కారం కాదనేదే నా అభిప్రాయం. ఉత్తరాంధ్రకూ, సీమకూ అన్యాయం జరిగిందీ ఈ పాలకుల వల్లనే. తెలంగాణా మంత్రులు ప్రజాప్రతినిధులు చివరిదశలో ఫోజు పెట్టిన వారితో సహా ఆంధ్రా బాస్ లకు ఊడిగం చేయలేదా? కొద్దిమంది నికరమైన ఉద్యమకారులు, మెజారిటీ తెలంగాణా ప్రజలు మాత్రమే తెలంగాణా పోరాటానికి వారసులని నా అభిప్రాయం.
   అయితే ఇప్పుడు ఈ అభిప్రాయం వల్ల ప్రయోజనం ఉన్నదా? కే.సీ.ఆర్ - చంద్రబాబు ఇద్దరూ గిల్లుకుని చూసేలా ( నా అభిప్రాయం మేరకు వారిద్దరికీ తెలంగాణాపై ప్రేమ లేదు. తెలంగాణా వస్తుందన్న నమ్మకం లేదు) తెలంగాణా ఏర్పడింది. ఎప్పుడైతే తెలంగాణా ఏర్పడిందో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఐకమత్యంతో పరస్పర సహకారంతో ముందడుగు వేయాలని ఆకాంక్షించాను. ప్రజ బ్లాగులో తెలంగాణా పునర్నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అని రెండు లేబుల్స్ ఉంచాను.
   నేను తెలంగాణా వాడిని కనుక తెలంగాణా పునర్నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టాను. ఎక్కువూ ప్రశ్నలు తెలంగాణావి అందుకే ఉంటాయి. కే.సీ.ఆర్ నోటిదూల వ్యాఖ్యానాలే ఆంద్రా ప్రజల ద్వేషానికి కారణం అనేది నా అభిప్రాయం. పలు సందర్భాలలో ఆంధ్రా వారిపై కే.సీ.ఆర్ వ్యాఖ్యలు దారుణంగా దుర్మార్గంగా ఉండేవి. ఆంధ్రా పాలకుల అతి తెలివితేటలు అప్పటికే సాధారణమైనవే కనుక కే.సీ.ఆర్ వ్యాఖ్యలే సహజంగా హాట్ టాపిక్కులయ్యాయి. వీటన్నింటిమధ్యా తెలంగాణా ప్రాంతానికి జరిగిన అన్యాయం పై ఆక్రోషంతో ఉన్న తెలంగాణా ప్రాంతం వారికి అనివార్యంగా కే.సీ.ఆర్ నాయకత్వం అవసరమయింది. ఇక కే.సీ.ఆర్ అదే ఆయుధంగా తెలంగాణా వారిని రెచ్చగొట్టడం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. తెలంగాణాకు అన్యాయం చేసి ఆంధ్రావారికి ఊడిగం చేసిన జాబితాలో కే.సీ.ఆర్ కూడా ఉన్నారనేదే నా అభిప్రాయం. నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాల్సిన పనిలేదు.
   తెలంగాణా ఏర్పడ్డాక తెలంగాణా అస్తిత్వం పై భయం అవసరం లేదు. మన వాదనలో విషయం ఉంటే ఒక్కరమైనా వందమందికి సమాధానం చెప్పవచ్చు. కే.సీ.ఆర్ ను విమర్శించడాన్ని, తెలంగాణాను విమర్శించడాన్ని ఒక్కటిగా చూడకూడదు. నేను తెలంగాణా అస్తిత్వాన్ని ఆంధ్రావారు సవాల్ చేస్తే ఎక్కడా చూస్తూ ఊరుకోలేదు. అలాగే అర్ధం పర్ధం లేకుండా ఆంధ్రా విద్వేషం వెళ్లగక్కినా వ్యతిరేకించాను.
   ప్రజ బ్లాగులో మీరన్నవిధంగా కొంత జరుగున్నమాట నిజమే. కానీ దానికి పరిష్కారం ఎదుటివారిని నిందించడం కంటే గట్టి సమాధానం నిర్మాణాత్మకంగా చేపట్టడమే బాగుంటుంది. చంద్రబాబు పాలనలోని లోపాలను ఎండగడుతూ మీరు ప్రశ్నలు పంపండి. తెలంగాణా సంస్కృతినీ, గొప్పతనాన్ని లేదా మీరనుకుంటున్న తెలంగాణా ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేలాగా ప్రశ్నలు పంపండి. తెలంగాణా వారిని సైతం ఎక్కువమందిని చర్చలలో పాల్గొనేలా చూడండి. తెలంగాణా పునర్నిర్మాణానికి ఏమి చేస్తే బాగుంటుందో చెప్పండి నేనూ సహకరిస్తాను. దానికీ పాలనపై విమర్శలకీ పొంతన వద్దు.
   నాకు చర్చలలో బాగా నచ్చేవారు 1) వెలమకన్ని భరద్వాజ్ 2) గ్రీన్స్టార్ 3) శ్యామలీయం 4) శ్రీకాంత్ అసలు నచ్చని వ్యక్తి ప్రవీణ్. అయినా నేను అందరితో సమానంగానే వ్యవహరిస్తున్నాను. నాకు తెలంగాణా - ఆంధ్రా అనే తేడాలు పట్టవు.
   ఇటీవలి కాలంలో మీతో సహా చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. వీరిలో ఎవరు తెలంగాణా వాసులో ఎవరు ఏ వాదులో తెలీదు. నేను చాలా తక్కువ బ్లాగులు చూస్తాను కనుక బ్లాగర్లలో ఎవరు ఎవరిపై విషం చిమ్ముతున్నారో తెలీదు. తెలంగాణా కవి గుండు మధుసూదన్ రావు గారిని ఇంటర్వ్యూ చేసి బ్లాగుప్రపంచంలో ఉంచబోతున్నాను. దానికి నేను తెలంగాణా వారినే ఇష్టపడుతున్నానికాదు గదా?

   Delete
 4. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 5. లౌకిక రాజ్యమని చెప్పుకొనే మనదేశంలో అధికార పదవుల్లో ఉన్నవారు బతుకమ్మ పండుగను (అలాగే రంజానునూ, క్రిస్‌మస్‌నూ, దసరానూ) పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలని ఎవరైనా ఎందుకు ఆకాంక్షించాలి? అసలు 'శుభ ఆకాంక్షల' విషయానికే వస్తే, పండుగరోజుల్లో మినహా ప్రజలకు శుభాలు కలగడంలేదా? పండగరోజుల్లో అశుభాలు కలుగడంలేదా? రాజకీయనాయకులు ఆకాంక్షిస్తేనే శుభాలు కలుగుతాయా? ఆకాంక్షించకపోతే శుభాలు కలుగవా?

  ఎవరో ఒఇకరు ఆకాంక్షించినంతమాత్రాననే అందరికీ టోకుగా శుభాలు కలిగితే కర్మసిధ్ధాంతమెందుకు యిసిరిపారెయ్యడానికి గాక? :)

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు ఎలాగూ లౌకికవాది కాదు. అతనికి మతతత్వ భాజపాతో పొత్తు ఉంది. రెండు కళ్ళ సిద్ధాంతం పేరు చెప్పుకుంటూ ఒక ప్రాంత సంస్కృతిని చూడలేని అతని స్వభావంపైనే నా విమర్శ.

   Delete
  2. ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనదేశంలో (లౌకిక పార్టీలుకానివాటితో జట్టుకట్టే పార్టీకూడా లౌకికమైనది కాదు అన్నవిషయాన్ని పరిగణలోకి తీసుకుంటే) లౌకిక పార్టీ అన్నదే లేదు. లౌకిక అన్నపదానికి అర్ధంకూడా మనలో చాలామందికి తెలియదు (చాలామంది secular అంటే మతవ్యతిరేక అనుకుంటారు). లౌకిక అన్నపదానికి practical అని అర్ధంచెప్పుకున్నా, communist పార్టీలుకూడా practicalగా ఆలోచించడంలేదు. ఆపరంగానైతే చంద్రబాబు గారినికూడా విమర్శించాల్సిన అవసరంలేదు.

   లౌకిక విమర్శ non-secular eventను పురస్కరించుకొని చేసే 'అధికారిక' శుభాకాంక్షల గురించి ఉండాలిగానీ, అది లేకపోవడం గురించికాదు.

   Delete
  3. మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కమ్యూనిస్టులు కూడా లౌకికంగా వ్యవహరించడం లేదు. లౌక్యంగా ఓటుబేంక్ విధానాలే అవలంబిస్తున్నాయి. మెజారిటీ మతోన్మాదం ను వ్యతిరేకించడమే లౌకికవాదం కాదు. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం లౌకికవాదం. మతపరమైన ఏ కార్యక్రమాన్నైనా మూఢనమ్మకాలనైనా ప్రభుత్వాల పరంగా చేయరాదు. ప్రజలలోని మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ , రెచ్చగొడుతూ ఓట్లు కోసం కక్కుర్తిపడేవే ఈ కార్యక్రమాలు. ఇలాంటివాటికి ప్రజాధనం దుర్వినియోగం చేసే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేదు.

   Delete
  4. నేనేమీ బతుకమ్మ శుభాకాంక్షలకి తప్పనిసరి చెయ్యాలనలేదు. చంద్రబాబు నాయుడు నాస్తికుడు కాదు, లౌకికవాది కూడా కాదు. అతనేమీ లౌకికవాద పరిరక్షణ కోసం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పడానికి నిరాకరించలేదు. ఒక ప్రాంత అస్తిత్వాన్ని గుర్తించడం ఇష్టం లేకే అతను బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పకూడదనుకున్నాడు.

   Delete
  5. నేను నాస్తికుడిని. అయితే పండుగలను కేవలం మత పరంగా చూడడం సరి కాదని నా అభిప్రాయం.

   మనసులో భక్తి లేని వారు, పర మతస్తులు & నాస్తికులు కూడా కొన్ని పండుగలను ఎంజాయ్ చేయడానికి కారణం వాటి సాంస్కృతిక విశిష్టత. ప్రపంచంలో ప్రతి పర్యాటక కాటలాగులో అక్కడి పండుగల గురించి ఎందుకుందో ఆలోచిస్తే అర్ధం అవుతుంది.

   పండుగలను ప్రభుత్వాలు & పార్టీలు చేయరాదన్న ఆలోచన ఆచరణ సాధ్యం కాదు. సీపీఎం వారు పూజా పండాల్లను స్పాన్సర్ చేస్తున్న రోజులివి. ప్రతి నాయకుడు ప్రతి పండుగకు తన "భక్తి"ని చాటే ప్రయత్నం చేసే కాలం ఇది. స్వయానా రాష్ట్రపతి హోదాలో ఉన్న నాయకుడు ఒక "బాబా" గారి కాళ్ళు పట్టుకున్న దేశం మనది. వీంట్లో కొన్నయినా తగ్గాక తెలంగాణా వారికి నీతులు చెబ్తే బాగుంటుంది.

   Delete
  6. పండుగలకు ప్రభుత్వం నిధులిచ్చి నిర్వహించడం ఇప్పుడే కొత్తగా జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. బహుషా KCR చేసిన ప్రతి పనీ కొత్తగా కనపడుతుందేమో! జనం బయటికి వచ్చి చేసే ప్రతి పండుగా, జాతరా ప్రభుత్వ కర్చులతో నిర్వహించడం ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నదే. కాని తేడా ఏమిటంటే తలంగాణ ప్రజలు మాత్రమే చేసుకొనే బ్రతుకమ్మ పండుగ కాబట్టి ఇన్నాళ్ళు ప్రభుత్వ ఆదరణకు నోచుకోలేక పోయింది. కుంభ మేళాలకు, పుష్కరాలకు పెట్టిన కర్చుతో పోలిస్తే బ్రతుకమ్మకు పెట్టిన పది కోట్లూ గూటి గవ్వతో సమానం. పండగ నిర్వహణకోసం తెలంగాణాలో ఉన్న అన్ని గ్రామాలు, గూడేలు, పట్టణాల్లోని వాడలకు పంచితే ఒక్కొక్క దానికి కనీసం పదివేలు కూడా రాదు.

   Delete
  7. @Jai Gottimukkala గారు :

   మీవ్యాఖ్య నాకు కొంచెంకూడా అర్ధంకాలేదని చెప్పడానికి చింతిస్తున్నాను.

   Vatikanలో జరిగే సంబరాల్లోగానీ, Rio de Janeroలో జరిగే కారివాల్లోగానీ, Oktoberfestలో గానీ, కుంభమేళలోగానీ పాల్గొనే విదేశీయులు ప్రజలు వినోదంకోసం పాల్గొంటున్నారేతప్ప వాటి సాంస్కృతిక విశిష్టతలను ఆసాంతమూ ఆకళింపుచేసుకొని అందులో పాల్గొంటున్నారని నేననుకోవడంలేదు. ప్రభుత్వాలు ధనార్జనకోసం (tourism development అన్న పదం ఇక్కడ మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి) చేసేపనులకు మనం ulterior motives అంటగట్టడం wishful thinking తప్ప మరొకటికాదు.

   ప్రధమపౌరుడు ఒక మోసగాడి కాళ్ళకు మొక్కడం ఒక దుస్సంప్రదాయం. అలాంటి ఒక 'be-waqoof' (ఉరుదూలో 'బుధ్ధిలేని' అని అర్ధం) పనిని గొప్ప సాంప్రదాయంగా నేను భావించడంలేదు. గతంలో జరిగిన ఒక తప్పుడు పనిని తప్పుడుపనిగానే గుర్తించాలితప్ప సాంప్రదాయంగా (అందునా ఆచరణీయమైన సత్సాంప్రదాయంగా) కాదు.

   I don't think the people who call themselves atheists should show any mercy to the divine bastard (also known as god) and their 'donkey'-lickers.

   Delete
  8. @Iconoclast:

   "వాటి సాంస్కృతిక విశిష్టతలను ఆసాంతమూ ఆకళింపుచేసుకొని అందులో పాల్గొంటున్నారని నేననుకోవడంలేదు"

   It may be true for the (carefully selected?) examples you cite. My experience regarding festivals in general based on years of first hand knowledge is otherwise.

   "సాంప్రదాయంగా (అందునా ఆచరణీయమైన సత్సాంప్రదాయంగా) కాదు"

   Agreed.You are missing my point: why is everyone (coincidentally? the same guys who vehemently opposed Telangana all these years) preaching only to Telangana? Let them fix some stuff first.

   Delete
  9. //మెజారిటీ మతోన్మాదం ను వ్యతిరేకించడమే లౌకికవాదం కాదు. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం లౌకికవాదం.//
   బాగా అన్నారు. కాని ఇక్కడా మెజారిటి మైనారిటి అన్న పదాన్ని అనుసరించే లౌకీక వాధం ఉండాలి. బలవంతుడికి బలహీనుడికి వ్యత్యాసం చూడకపోతే ఎలా? మతాన్ని వ్యతిరేకించడమో లేక చేరదీయడమో లౌకీకత్వం కాదు. మతాలకు అతీతంగా ఉండేదే లౌకీక వాదం.ఏ మతానికి పెద్ద పీట వేయక పోవడమే లౌకీక వాధం.నెహ్రూ గారు నాగార్జున సాగర్‌ ఇనాగురేషన్‌ సమయములో ఇలాంటి ఆనకట్టలు, సాకేతిక జ్నానాన్ని ఆదునిక దేవాలయాలుగా భావించాలని చెప్పాడాని ఎక్కడో చదివాను. దేశ స్వాతంత్ర్య మొదటి భాగంలో లౌకీకత్వానికిని సరైన అర్ధమే ఉండేది. మెజారిటి మతమే దాన్ని మసిపూసి మారెడు కాయ చేసింది. నిజమైన లౌకీక వాదులేదాని అర్ధం ఏమిటొ తెలియనంత గందరగోళ పరిచింది. బలమైన మతాలను తెగిడితే. బలqహీన మతాలను పొగిడినట్లా? అన్నీ మతాల పని మత్తును ఎక్కించడమైతే ఏ రాయితో కొట్టుకుంటే నేమి తలపగలడానికి.

   Delete
  10. *దేశ స్వాతంత్ర్య మొదటి భాగంలో లౌకీకత్వానికిని సరైన అర్ధమే ఉండేది*
   చాలా బాగా చెప్పారు. మీరన్న దాంట్లో నిజం ఉంది. నేను చాలా సార్లు మీలాగే అనుకొంటాను. దేశ స్వాతంత్ర్య మొదటి భాగంలో లౌకీకత్వానికిని సరైన అర్ధమే ఉండేది. ఎప్పుడైతే ఎమెర్జెన్సి సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని చేర్చారో, ప్రతి ఎన్నికలకి దాని అర్థం ఒక కొత్త ఇంటర్ప్రెటేషన్ తో చెప్పుకోవటం జరుగుతున్నాది. ఈ పదం మళ్ళీ రాజ్యాగం నుంచి తొలగిస్తే ఎలా ఉంట్టుందంటారు? యురోప్ లో కూడా ఇప్పుడు ఇటువంటి చర్చే జరుగుతున్నాది. మన దేశంలో , ఈ మధ్య సాగరికా గోష్ లాంటి ప్రముఖ సెక్యులర్ వాదులు కూడా సెక్యులర్ తీసి ధర్మ అనే పదం వాడలని చర్చ లేవదీస్తున్నాది.

   Rename secularism. Call it ‘dharma’ or righteous administration

   http://blogs.timesofindia.indiatimes.com/bloody-mary/silly-secularism-to-neutral-dharma-rename-secularism-call-it-dharma-or-righteous-administration/

   Delete
  11. * బలమైన మతాలను తెగిడితే. బలహీన మతాలను పొగిడినట్లా? అన్నీ మతాల పని మత్తును ఎక్కించడమైతే ఏ రాయితో కొట్టుకుంటే నేమి తలపగలడానికి.*

   మత్తేకించేవి పని (అవి మీదృష్టిలో తప్పుకనుక)అన్ని మతాలు చేస్తున్నపుడు అవి బలమైనదా? బలహీనమైన దా అని ఎలా చూస్తారు? బలానికి బలహీనమైనదని ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? బహుశా సంఖ్యా పరంగానేమో! మీవాదన ప్రకారం మతాన్ని మతం గా విమర్శించాలి . మొన్న భగవద్గీత గురించి ఎంతో వివేకంతో విమర్శనాత్మకం గా మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదే విధంగా, అంతే వివేకంతో సంఖ్యా పరంగా నంబర్ 2,3,4,5 ... మతాలలోని లోపాల పై మీరు విమర్శను రాస్తే చాలా బాగుంట్టుంది. ప్రజా బ్లాగు పాఠకులందరికి మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. ఒకవేళ అలా తెలియజేయటం మీకు ఇష్టం లేకపోతే దానికారణాలు కూడా తెలియజేయ గలరు.
   మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ...

   Delete
 6. చంద్రబాబు శుభాకాంక్షలకోసం ఇంతగా మొహంవాచి వున్నారని చంద్రబాబుకు తెలిస్తే తప్పకుండా చెప్పేవాడేమో? తెలిసివుండక పోవచ్చు. క్షమించండి చంద్రబాబు ఆజ్ఞానాన్ని. అయినా రాష్ట్రం విడిపోయాక కూడా, రెండుకళ్ళ సిద్దాంతం లేదా కొబ్బరికాయ సిద్దాంతం అంటూ హేళన చేయించుకోబడినవాడి శుభాకాంక్షలు కోసం ఏదో మొహం వాచినట్లు ఈ విమర్శలు ఎందుకు. మీ పండుగలు మీరు ఆనందంగా చేసుకోక. మీ అసలు వుద్దేశం చంద్రబాబుకు తెలంగాణా మీద ప్రేమ లేదని నిరూపించాలని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అణగదొక్కాలని అర్ధమవుతానే వున్నది. మీరు అవతలి వారిని నానా మాటలు అంటూ కూడా మరల అవతలివారు ఎలా శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తారో అర్ధం కావటంలేదు. మీకు మాత్రం ఏ విషయంలోనైనా తూలనాడే హక్కులు వుంటాయి కానీ అవతల వారికి మాత్రం శుభాకాంక్షలు చెప్పాల్సిన భాధ్యతలు వుంటాయని మీరు భావిస్తారు. హక్కులు మీకు భాధ్యతలు అవతలివారికి, శెభాష్. ఎప్పటికీ మారకుండా ఇలాగే కంటిన్యూ చేయండి.

  Note: నేను పైన వ్రాసిన ఈ వ్యాఖ్యలు సామాన్య తెలంగాణా సోదరుల నుద్దేశించి కాదు. రాజును మించి రాజభక్తిని చూపిస్తూ రాజే తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా దానిని తప్పని అంగీకరించకుండా పిడి వాదనలకు దిగే వాళ్ళకోసం.

  ReplyDelete
  Replies
  1. సమైక్యవాదం విభజనవాదం అంటూ ఎవడికీ అర్ధం కాని పిచ్చీ మాటలతో చంద్రబాబుని మాత్రమే విమర్శించే మూర్ఖులు పిడివాదుల గురించి పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ రెండు చోట్లా బలంగానే ఉన్నది. అటువంటప్పుడు శతృవులకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షడుగా ఉన్న బాబుకు లేదా? బతుకమ్మ అనేది TRS పుట్టకముందే ఉన్నది. అదేమీ కే.సీ.ఆర్ కో కవితకో స్వంతమయినది కాదు కదా?

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు. అది బతుకమ్మ పండుగ అయినా భద్రకాళి పండుగ అయినా రంజాను అయినా ఈదు అయినా అధికారికంగా ప్రభుత్వంలో వున్నవారు చెయ్యడమే తప్పు! ఆ తప్పు అంత ఆర్భాటంగా చేస్తూ కూడా యెవరో శుభాకాంక్షలు చెప్పలేదని విమర్సించడం, నాకు గొంగళిలో తింటూ వెంట్రుక వచ్చిందని కంగారు పడటం లా కనిపిస్తున్నది సుమండీ?!

   Delete
 7. ఆంధ్రాతో తిరిగి కలిసే అవకాశం లేని తెలంగాణని తిట్టడానికి లేని సెక్యులరిజం ఉన్నట్టు చెప్పుకోనక్కరలేదులే.

  ReplyDelete
  Replies
  1. రెండూ ఒక్కలాంటి మతాలే అయినా నాకు ముస్లిము మత సాంప్రదాయాలు నచ్చుతాయి గానీ హిందూ మత సాంప్రదాయాలు నచ్చవనే మూర్ఖిష్టుల నుంచి సెక్యులరిజం పాఠాలు నేర్చుకోనక్కర్లేదులే!

   Delete
 8. కొండలరావు గారు,

  మీరు చెప్పింది నిజమే. బతుకమ్మ అనేది TRS పుట్టకముందే ఉన్నది. అదేమీ కే.సీ.ఆర్ కో కవితకో స్వంతమయినది కాదు. రాజనీతిజ్ఞుడు,సంస్కారి, విజన్ కలిగిన చంద్రబాబు ఆ అవకాశం వీళ్ళకు ఇవ్వకుండా వుండాల్సింది. కానీ నాకర్ధం కానిదేమిటంటే వీళ్ళేందుకు వాళ్ళలో లేని సంస్కారాన్ని ఇతరులలో ఆసిస్తారు.

  Note:- కామెంట్స్ లో రిప్లై, డెలిట్ తో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా పెట్టండి.

  ReplyDelete
  Replies
  1. ఎవరి సంస్కారం మేరకు వారు ఆలోచిస్తారు. వాదిస్తారు. వాదనలద్వారా నేర్చుకుని అతి తక్కువ మంది మాత్రం సంస్కారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. తమ వాదనే నెగ్గాలనుకునేవారు సంస్కారాన్ని కోల్పోవడమో దిగజార్చుకోవడమో చేస్తారు. అది రాజకీయనాయకులకూ వర్తిస్తుంది.

   edit option ఎలా పెట్టాలో నాకు తెలీదండి. పరిశీలించి ప్రయత్నిస్తాను.

   Delete
 9. రాజ్యం లౌకికమైతే సరిపోదు, వ్యక్తులు లౌకికం కావాలి. చంద్రబాబు ప్రభుత్వ ఖర్చుతో తన కార్యాలయానికి వాస్తు మార్పులు చేసినప్పుడు "వ్యక్తిగత విశ్వాసాల పేరుతో ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టకూడదు" అని గుర్తు రాలేదా? చంద్రబాబు వ్యక్తిగతంగా లౌకికవాది కానప్పుడు పండగ శుభాకాంక్షలు చెప్పడానికి అతను సంకోచించకూడదు కదా!

  ReplyDelete
  Replies
  1. I'm afraid dear friend, the criticism should have been about Babu spending the tax payers money on this nonsensical వాస్తు rather than about he not greeting people on the eve of any stupid festival.

   Even if were to wish, that would have made two mistakes on his part rather than cancelling out the former.

   Delete
 10. ఈ విమర్శలకు సమాధానమిచ్చేదానికే అనుకుంటా చంద్రబాబు నిన్న కూకట్ పల్లిలో బూట్లు తొడుక్కొని మరీ బతుకమ్మ ఆడారు. ఆ సందర్భంలో శుభాకాంక్షలు కూడా చెప్పినట్టుంది! కాబట్టి ఆయన శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అన్న విషయానికి తెరపడ్డట్టే.

  ReplyDelete
  Replies
  1. అతని ప్రాంతానికి చెందని సంస్కృతి గురించి అతనికి తెలియకపోవడం విచిత్రం కాదు కదా. I don't mind if Chandrababu plays Batukamma without removing his footwear. ఇప్పటి వరకు ఏ సీమాంధ్రుడు పట్టించుకోని తెలంగాణ సంస్కృతి గురించి చంద్రబాబుకి మాత్రం ఎలా తెలుస్తుంది?

   Delete
 11. @JaiGottimukkala
  తెలంగాణా అంతటా చేసుకునే బతుకమ్మ పండుగను ఒక్క జిల్లాలో చేసే పండుగకు పోలికేమిటి?
  నేను "అమ్మ"లను, గుళ్ళను, పండుగలను పోల్చలేదు.
  >> ఇవి పరస్పర విరుద్దమైన వ్యాఖ్యలు కావా?

  "అమ్మ" ఒక ప్రాంతానికి చెందదని అనడం పూర్తిగా పాటిస్తే కలకత్తా మహంకాళి, బెజవాడ కనకదుర్గ (లేదా మీరు చెప్పిన ఇద్దరు దేవతలు) ముందు ప్రాంతీయ ఐడీలు తీసేయాలి. ఇది జరిగే పనేనా?
  >> అక్కడ బతుకమ్మ ఐతే ఇక్కడ మల్లెలమ్మ. అక్కడ కనక దుర్గ ఐతే ఇక్కడ కన్యకా పరమేశ్వరి. "దయచేసి అమ్మవారిని ఒక ప్రాంతానికి కట్టడి చేయకండి." అని నేను రాస్తే, మీరు ఒక ప్రాంతానికి చెందదు అనే అర్ధం తీసారు.
  "అమ్మవారికి శతకోటి రూపాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూనే వుంటారు." అని కూడా రాసాను. మీరేమో ప్రాంతీయ ఐడీలు తీసేద్దామన్న మహత్తరమైన ఆలోచన వైపు మళ్ళారు. ఇక మీరెటెల్తారో మీ ఇష్టం.

  ఎవరూ పాటించని ఆదర్శాలు తెలంగాణకే ఎందుకు?
  >> మరి తెలంగాణలో పాటించే ఆదర్శాలు మిగాతావాల్లకెందుకు అంటే మీకెలా వుంటుంది?

  ఇకపోతే ప్రతి పండుగకు కొంత ప్రాచుర్యం ఉంటుంది. దీనికి మహిమతో కానీ గొప్పదనంతో కానీ సంబంధం ఉండొచ్చు ఉండకపోవొచ్చు. మీరు చెప్పిన ఉత్సవాల కంటే బతుకమ్మ పండుగ పాపులారిటీ ఎన్నో రెట్లు అధికం అని చెప్పడానికి నాకేమీ ప్రత్యెక అర్హతలు అక్కరలేదు. ఇది మీ దేవతలకు అవమానం కాదని మనవి.
  >> నాకు పాపులారిటీతో సంబంధం లేదు. అమ్మవారి గుడి ఎక్కడ కనపడినా ఒక్క క్షణం మ్రొక్కుకుంటాను. రాజస్తాన్ అజ్మీర్ దర్గాలో, గోవాలోని చర్చిలోకూడా మొక్కుకున్నాను. పాపులారిటీ బట్టి మనం పండుగలు జరుపుకోవాలి అని నేను అనుకోవడం లేదు, భక్తి వుంటే చాలు. నాకు బతుకమ్మ పండుగ గురించి తెలీదు. అంత మాత్రాన, నాకు తెలిసిన తరువాత నేనేమీ ఆ పండుగను, వేడుకను కించ పరుస్తూ వ్రాయలేదు. నా అబిప్రాయం : అలా రాయడానికి ఎవరికీ హక్కు లేదు.

  కాలం చెల్లిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను చిన్న చూపు చూసారన్న వాస్తవాన్ని దారి మళ్ళించడానికి ఎందరో శుష్క ప్రయత్నాలు చేసారు. ఇందులో భాగంగా "శ్రీమాను మీకు తెలీదు, బతుకమ్మ మాకు తెలియకపోతే ఏమిటి", అలాగే "దేవుళ్ళకు తెలంగాణా రంగు పూయొద్దు" అంటూ దిక్కు మాలిన సలహాలు వచ్చాయి.
  తెలంగాణా వోటర్ల దయాదాక్షిణ్యాలతో గద్దె నెక్కిన బాబు/వైఎస్ లాంటి వాళ్ళు కనీసం మర్యాద కోసమయినా బతుకమ్మ అక్నాలేజ్ చేయలేదు.
  >> శుభాకాంక్షలు చెప్పి వుండాల్సింది అనే మీ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను. అలాగే, శుభాకాంక్షలు చెప్పకపోతే జరిగే నష్టం కూడా లేదు. బతుకమ్మ గురించి తెలిసిన తరువాత కూడా 'ఆ.. అదీ ఒక పండగేనా...' అనుకునే మూర్ఖులు ఉండనే వుంటారు. వారి గురించి మీకు అవసరమా? అలాంటి మూర్ఖులలో ఒకడు చంద్రబాబు అనుకోవచ్చు కదా? అలాంటి చంద్రబాబు కూడా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నాడు [బూట్లు వేసుకుని మరీ - కొద్ది రోజుల క్రితం తెలంగాణా వాళ్ళు కూడా ఇలాగే పాల్గొన్నారనుకోండి, అది వేరే విషయం]

  చివరగా ఒక్క మాట: దిక్కుమాలిన వ్యాఖ్యలకి మంచి సలహాలు రావు అని మీరు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.

  ReplyDelete
  Replies
  1. "పాపులారిటీ బట్టి మనం పండుగలు జరుపుకోవాలి అని నేను అనుకోవడం లేదు"

   పాపులారిటీ గుర్తించమని (అదీ తెలంగాణాలో ఉన్న వారిని, ఎక్కడో ఉన్న మిమ్మల్ని కాదు) అంటే మీకు జరుపుకోమని అనిపించిందా!

   "నేనేమీ ఆ పండుగను, వేడుకను కించ పరుస్తూ వ్రాయలేదు. నా అబిప్రాయం : అలా రాయడానికి ఎవరికీ హక్కు లేదు"

   నేను అలా అన్నట్టు మీకెందుకు అనిపించిందో?

   "అలాంటి మూర్ఖులలో ఒకడు చంద్రబాబు"

   అబ్బో ఆయన మూర్ఖుడు ఎలా అవుతాడండీ, ఆయన మాట నమ్మిన మేము మూర్ఖులం కానీ! ద్రోహాన్ని మూర్ఖత్వం (లేదా అజ్ఞానం) ముసుగులో వదిలేయడం బాలేదు.

   "దిక్కుమాలిన వ్యాఖ్యలకి మంచి సలహాలు రావు అని మీరు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది"

   ఏది దిక్కు మాలిన వ్యాక్యో మీ ఇష్టం.

   Delete
 12. "ఆయన మాట నమ్మిన మేము మూర్ఖులం కానీ..."
  నాకింకా రాయడానికేమీ లేదు :) స్వస్తి

  ReplyDelete
 13. నేను నాస్తికుణ్ణి కాబట్టి ఈ రోజు నేను ఎవరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పలేదు కానీ మీరు బతుకమ్మకీ, సెక్యులరిజంకీ లింక్ పెట్టడం అవసరమా, కాదా అనేది ఆలోచించండి. నాస్తికత్వమైనా, సెక్యులరిజమైనా అవి వ్యక్తిగత చైతన్యపు స్థాయిని బట్టి ఉంటాయి. ప్రభుత్వం సెక్యులర్ అయినంతమాత్రాన వ్యక్తులు సెక్యులర్ అవ్వరు. చంద్రబాబు నాస్తికుడు కాదు, సెక్యులరిస్త్ కూడా కాదు. గతంలో అతని పుట్టపర్తి సాయిబాబా కాళ్ళు పట్టుకునేవాడు. సెక్యులర్ ప్రభుత్వంలో నాయకులు వ్యక్తిగత విశ్వాసాలని ప్రోత్సహించకూడదనుకుంటే వాళ్ళు బాబాల దగ్గరకి వెళ్ళకూడదని కూడా రూల్ ఉంటుంది. ఇక్కడ కేవలం ఒక నాయకుడు బతుకమ్మ పండగకి శుభాకాంక్షలు చెప్పాలా, వద్దా అనే చర్చ ఎందుకు?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top