వ్యక్తిగతంగా ఓ బ్లాగు వ్రాసుకుందామనుకుని 'ప్రయాణం' పేరుతో ప్రారంభించిన బ్లాగుని కంటిన్యూ చేయలేకపోయాను. వ్యక్తిగత పని ఒత్తిడి ప్రధాన కారణం. నేను నడిపిన ఇతర బ్లాగులన్నింటినీ కలిపి 'పల్లెప్రపంచం' బ్లాగులోకి బదిలీ చేస్తున్న సందర్భంగా ఈ టపాను మొదటిగా ఇక్కడికి చేర్చాను. ప్రయాణం బ్లాగు ప్రారంభించిన రోజు టపా, దానికి వచ్చిన కామెంట్లు ఈ బ్లాగులోకి బదిలీ చేశాను. నా వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు 'వ్యక్తిగతం' లేబుల్ పేరుతో కొనసాగిస్తాను. ప్రయాణం లో వ్రాయాలనుకున్న విషయాలు వ్యక్తిగతం లేబుల్ క్రింద పల్లెప్రపంచం బ్లాగులో కొనసాగిస్తాను. అందుకే  ప్రయాణం .... ప్రారంభం! అని నాటి టపాకు పెట్టుకున్న శీర్షికకు.... కొనసాగిస్తున్నాను.... అనే పదాన్ని జత చేసి కొత్త శీర్షిక పెట్టాను. 17-9-2014 వ తేదీన ప్రయాణం బ్లాగు ప్రారంభం సందర్భంగా నేను వ్రాసుకున్న మేటర్ క్రింద యథాతధంగా గుర్తుకోసం ఉంచుతున్నాను.
------------------------------
ప్రయాణం............
                                                             My feelings, Learning's and Experiences

               ఇది నా బ్లాగుకు నేను పెట్టుకున్న పేరు. 

బ్లాగు ప్రపంచంలో చాలా రకాల ప్రయోగాలు చేసి కొన్ని విజయాలు, కొన్ని అపజయాలుతో ఈ ప్లాట్ ఫారం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. 2011 లో బ్లాగు ప్రపంచంలోకి వచ్చిన నేను చాలా ప్రయోగాలు చేసినా ఇంతవరకూ నాకు వ్యక్తిగత బ్లాగు లేదు. 

వ్యక్తిగత బ్లాగు లేదు అనేదానికంటే వ్యక్తిగత బ్లాగు వ్రాసుకోవాలన్న ఆలోచన రాలేదంటే సబబుగా ఉంటుంది. ఇంతకు ముందు నేను నడిపిన బ్లాగులలో వ్యక్తిగత విషయాలూ కొన్ని వ్రాసినా పూర్తిగా వ్యక్తిగత భావాలు వ్రాసుకోవాలని ప్రారంభించిన బ్లాగు ఇదే. ఆ పోస్టులను వీలయితే ఇక్కడికి తీసుకొస్తాను.

బ్లాగు అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉందిక్కడ. మన అభిప్రాయాలతో ఏకీభవించే స్నేహితులు. మనకు తెలియినవి ఓర్పుగా నేర్పే సహృదయులూ ఇక్కడున్నారని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఈ బ్లాగు ప్రపంచంలో నాకూ కొందరు మిత్రులున్నారు.

వాస్తవ ప్రపంచంలో ఉండే మంచి - చెడ్డ మనసులన్నీ ఇక్కడి వర్చువల్ ప్రపంచంలోనూ ఉన్నా మంచివారి లిస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మనమో గ్రామంలో ఉంటే మన అభిప్రాయాలతో సన్నిహితంగా ఉండేవారి సంఖ్య చాలా చాలా తక్కువుగా ఉంటుంది. చుట్టుపక్కల ఊళ్ల్లలో చూసుకున్నా ఈ సంఖ్య అంతగా పెరగదు. కానీ బ్లాగులోకంలో ఆ కొరత తీరుతుంది. అయితే తేడా ప్రధానమైనది ఏమిటంటే వారు మనకు ఎదురుగా లేకపోవడమే. మనసులతో మాత్రమే ఇక్కడ సావాసం చేయగలం. మనుషులని చూడకుండా చేస్తున్న ఈ స్నేహం విలువా గొప్పదే కదా?!

ఇక్కడ చాలామందికి నేనేంటో తెలుసు. కొద్దిమందికి ఎందుకో శత్రువుగా మారాను. వారు పనికట్టుకుని మరీ కువిమర్శలు అబద్దాలు వ్రాస్తుంటారు. అలాంటివారివల్ల కొద్దిగా బాధ అనిపించినా బ్లాగు ప్రపంచంలో నాకు మిత్రులే ఎక్కువ. రాజకీయంగా వివిధ రకాల అభిప్రాయాలున్నవారు సైతం నాకు మిత్రులుగానే ఉండడం విశేషం. ఎప్పటిలాగే వారు ఇకమీదట కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నాను. భిన్నాభిప్రాయాలు అభిప్రాయబేధాలు ఉండడానికి వ్యక్తిగతంగా స్నేహంగా ఉండాడానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు.

మన బ్లాగుకు మనమే యజమానులం గనుక, ఎడిటింగులూ మనవే - పోస్టింగులూ మనవే కనుక ఇష్టపూర్తిగా సంపూర్ణమైన స్వేచ్చతో మన అభిప్రాయాలు ఇక్కడ వ్రాసుకోవచ్చు. హాయిగా మన జ్ఞాపకాలను, అనుభవాలను ఇతరులతో పంచుకోవచ్చు. బ్లాగులోకం లో సీనియర్ బ్లాగర్లకు ఆసక్తి తగ్గుతున్న సమయంలో నాకు ఆసక్తి పెరగడం ఏమిటా? అని ఒక నిమిషం ఆలోచించాను. బ్లాగు అంటే ఓ ఆన్‌లైన్ డైరీ లాంటిది. ప్రతి ఒక్కరి అనుభవాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు చాలామందికి పాఠాలుగా ఉపయోగపడతాయి కనుక ఎప్పటికైనా బ్లాగర్లలో తిరిగి ఆసక్తి పెరుగుతుందని నమ్ముతున్నాను. 

వారితో పాటే నా ప్రయాణం కూడా సాగించాలని ఆశిస్తున్నాను. సహకరిస్తున్న వాందరికీ ధన్యవాదములు.
- పల్లా కొండల రావు.
Reactions:

Post a Comment

 1. Replies
  1. Thank you కిరణ్ కుమార్ కే garu.

   Delete
 2. అభినందనలు కొండలరావు గారూ ! మీ ఈ సరికొత్త ప్రయోగం , మీకు ఆనందం , సంతృప్తి కలిగించాలని ఆశిస్తున్నా !

  ReplyDelete
 3. అభినందనలు కొండలరావు గారూ ! మీ ఈ సరికొత్త ప్రయోగం , మీకు ఆనందం , సంతృప్తి కలిగించాలని ఆశిస్తున్నా !

  ReplyDelete
 4. good start kondalarao garu...all the best, keep blogging.

  ReplyDelete
 5. కొండలరావుగారు.
  మీరు మీ స్వంతబ్లాగు తెఱచినందుకు అభినందనలు.
  మీ‌ టపాలు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను.
  సీనియర్ బ్లాగర్లలో‌మరొకతరం తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నరోజులు.
  నేను కూడా ఇంకెన్నాళ్ళో ఈ‌ బ్లాగులోకంలో ఉంటానని అనుకోవటం లేదు.
  మీరు ఈ రంగంలో ప్రయాణం మొదలు పెదుతున్నారు. మంచిది.

  మీరు బ్లాగులో RSS ఫీడ్ అనేది FULL అనే సెట్టింగ్ మార్చి స్వల్పంగానే అనుమతించాలి. లేకపోతే rssing.com వంటివి మీ‌టపాలన్నింటినీ కాపీచేసుకుంటాయు. తస్మాత్ జాగ్రత. పైగా అది లీగల్ అట.

  వీలు చూసుకొని రోజూ ఒకటి రెండు టపాలు వేయండి.

  శుభం భూయాత్.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top