నాకు నచ్చిన పాటలలో "తోడికోడళ్లు" సినిమాలో ఆత్రేయ వ్రాసిన కారులో షికారు కెళ్లే పాల బుగ్గల చిన్నదానా.. పాట ఒకటి.సినిమా :       తోడికోడళ్లు (1957)
రచన :          ఆచార్య ఆత్రేయ
సంగీతం :      మాష్టర్ వేణు
దర్శకత్వం :   ఆదుర్తి సుబ్బారావు
***   ***   *** 
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా...

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే....
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో...

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు....

చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా...
చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా...

కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచీ
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు ..తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా...
గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా

చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

***     ***     ***  

ఆత్రేయ గారికి రోజూ సాయంకాలం మెరీనా బీచ్ కి వెళ్ళే అలవాటుండేదట. అక్కడికీ రోజూ సాయంత్రం కాలక్షేపానికి చల్లగాలి కోసం వచ్చే క్వీన్ మేరీస్ కాలేజ్ లో చదువుకునే ధనవంతులైన అమ్మాయిలని చూసి స్పందించి ఆత్రేయ రాసుకున్న పాట అది.

తోడికోడళ్లు సినిమాలో కథానాయకుడు ఆదర్శ భావాలున్న యువకుడు. అతనికో ఇంట్రడక్షన్ సాంగ్ అని అనుకున్పపుడు ఆత్రేయ తాను వ్రాసుకున్న ఈ పాటను చూపగా  దుక్కిపాటి మధుసూధనరావు గారు బాగుందని ఈ సినిమాలో పెట్టించారట.

ఆ విధంగా 'తోడికోడళ్లు' సినిమాలో అక్కినేని మీద ఈ పాట చిత్రీకరించారు. గాన గంధర్వుడు ఘంటసాల పాడిన ఈ పాట ఎప్పటికీ అర్ధవంతమైన హిట్ సాంగ్స్‌లో ఒకటని చెప్పవచ్చు.

"ఈ పాటను ఆత్రేయ వ్రాశారు" అని హెడింగ్ ఎందుకు పెట్టానంటే చాలాసార్లు ఈ పాటని శ్రీశ్రీ వ్రాశారని పొరపాటుపడేవాడిని. అదే విధంగా మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాటని ఆత్రేయ వ్రాశారని అనుకుంటుండేవాడిని. అనుకోవడమే కాదు వాదించి దెబ్బతిన్నాను కూడా :))

మనసు అనగానే ఆత్రేయ , శ్రమైక జీవనం అనగానే శ్రీ శ్రీ గుర్తుకు రావడం సహజమే. అయితే ఈ రెండు పాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. కారులో షికారుకెల్లే పాటను ఆత్రేయ వ్రాయగా, మనసున మనసై అనే డాక్టర్ చక్రవర్తి లోని పాటను శ్రీ శ్రీ వ్రాశారు. రెండింటినీ ఘనటసాల పాడగా అక్కినేని పై చిత్రీకరించడం విశేషమనే చెప్పాలి.

***   ***   ***   
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
***   ***   *** 
- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

 1. మంచిపాటను గుర్తుచేసారు. ధన్యవాదాలు. నేను కొన్నాళ్ళు ఈపాటను శ్రీ శ్రీ గారు వ్రాసారని భావించేదాన్ని. చరణాలు అలా అనిపిస్తాయ్. చాలా కాలానికితెలిసింది. ఆత్రేయగారి రచన అని. మీరుచెప్పిన పాటవెనుక కధే నాన్న చెప్పేవారు. అసలు ఈ సినిమానే చాలా బాగుంటుంది.ఉమ్మడికుటుంబంలో ఉత్పన్నమయ్యే చిన్న చిన్న మనస్పర్ధలు,అపోహలు,ప్రేమలు..ఇక వాటికి అంతు అనేది వుండదు అలాంటి ఘట్టాలు చాలా ఉంటాయ్ ఈ సినిమాలో. ఇక ఎస్వీఅర్ గారి నటన చెప్పవలసినదేముంది. అద్భుతం.కన్నాంభ గారి నటన అమోఘం. మంచిచినిమా గుర్తుకుతెచ్చారు. చాన్నాళ్ళైనది చూసి.ఒకసారి మళ్ళీ చూడాలి. ఉంటాను.

  ReplyDelete
  Replies
  1. కామెంటుకు ధన్యవాదములు లక్ష్మీ'స్ మయూఖ గారు. అందుకే వాటిని ఆపాతమధురాలు అంటున్నారు కదండీ. ఈ పాట ఎలా పుట్టిందనేది నేను నెట్ లో వెతికి తెలుసుకున్నానండీ. ఎవరి బ్లాగో గుర్తులేదు. ఆ వివరం కూడా ఇచ్చి వారికి ధన్యవాదాలు చెపితే బాగుండేది.

   Delete
 2. తొలిచరణంలో అసలున్నది "పసిడి చానా" అనుకుంటా. కావ్యభాషలో "చాన" అంటే స్త్రీ.

  ReplyDelete
  Replies
  1. అవునండీ. ఇదే అనుమానం నాకు వచ్చింది. ఎన్ని సార్లు విన్నా నాకూ చానా లాగే వినిపిస్తుంది. నేను అడిగినవారూ దానా అనే అంటున్నారు. కాదని నాకు అనిపిస్తూనే ఉంది. నెట్ లో లిరిక్స్ కోసం వెతికితే అన్నిచోట్లా 'దానా' అనే ఉన్నది. అలాగే కాపీ చేశాను. చానా అనేదే సరైనది. కానీ చానా అంటే స్త్రీ అని మీరు చెప్పేవరకూ తెలీదు. జాణ తెలుసు. మరి ఈ చాన, జాణ నుండి వచ్చినదేనా? వీలు చూసుకుని మరోసారి విని సరి చేస్తాను. వివరణకు ధన్యవాదములు ది ఆంధ్రా హ్యూమనిస్ట్ గారు.

   Delete

 3. ’చానా’ అన్నదే సరయినది చాన అనగా స్త్రీ అని అర్ధం దానా అనిపొరపడిఉంటారు. పలికినవారు కూడా దానిని స్పష్టంగా చానా అని పలకలేదు, అదీ అనుమానానికి కారణం.

  ReplyDelete
  Replies
  1. గురువుగారి (ఘంటసాల) ఉచ్చారణసామర్థ్యం మీద నెపం వెయ్యలేం. ఆ పాట రికార్డయ్యి 57 ఏళ్ళయింది. ఆ రికార్డు ఇప్పటి శ్రవణసాధనాల్లో పూర్తిస్పష్టతతో రాకపోవచ్చు. అదీ గాక ఆనాటి రికార్డింగ్ సాధనాల సామర్థ్యం అంతమాత్రమే అనుకోవాలి.

   Delete

  2. నేను చానా అనుకున్నా మీకేమైనా అభ్యంతరమా!

   Delete
  3. రికార్డింగులో చానా అని స్పష్టంగానే వినిపిస్తుందండీ.

   Delete


 4. చా నో దా నో ఏదో ఒకటి బిరీన తేల్చండి !! మరీ టెన్షన్ ఎక్కువై పోతోంది !

  దాచాల్సిందేదో ఆ కాలం లో దాచేరు . దాచాల్సింది తప్పించి మిగిలిన వన్నీ ఈ కాలం లో దోచేస్తున్నారు !
  జిలేబి

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top