----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
రాజమండ్రి విషాదం పాపం ప్రవచనకర్తలదే!


 • ఆధ్యాత్మికత పేరిట అజ్ఞాన ప్రచారం
 • నదిలో మట్టి వేయడం సముద్ర స్నానానికి సంబంధించింది
 • మంగళవారంనాటి ఘోరంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి స్పందన

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రిలో పుష్కర భక్తులు చనిపోవడం పూర్తిగా ప్రభుత్వం తప్పు కాదని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ ఘోరానికి కారణం ప్రవచనకర్తలదేనని స్పష్టంచేశారు. ఆధ్యాత్మికతకు బదులు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ఇవి మహాపుష్కరాలు అనేది పెద్ద తప్పు. మహా అంటే 1212.. 144 అన్నారు. దీన్ని మహాపుష్కరాలని ఎలా చెప్తారు? పోనీ గోదావరి పుట్టుక నుంచి లెక్కపెట్టారనుకుంటే నది పుట్టుకను ఎలా లెక్కిస్తారు? మహా పుష్కరాలన్నమాట ఎవరు ప్రచారం చేశారో వాళ్లంతా దీనికి బాధ్యులే. పైగా.. ‘‘ఇది 144 ఏళ్లకొకసారి వస్తుంది. మళ్లీ 144 ఏళ్ల వరకూ మనం బతికుంటామో బతికుండమో? ఇప్పుడు మునక్కపోతే పిశాచి జన్మ ఎత్తుతాం. రాక్షస జన్మెత్తుతాం’’.. ఇలా కొందరు ప్రచారం చేశారు. పుష్కరాల్లో స్నానం పుణ్యం వస్తుందని చెబితే సరే! కానీ... చేయకపోతే మహాపాపం చుట్టుకున్నట్టే, జన్మ మొత్తం వ్యర్థం.. అని ప్రవచన చక్రవర్తులు చెప్పడమే దారుణం. జ్ఞానప్రధానమైన మన సంస్కృతిని స్నాన ప్రధానమైన సంస్కృతి చేసేస్తున్నారు. ఉపనిషత్తులు చెప్పిన జాతి చేత ఇవాళ ఉప్పూ ఊరగాయ అమ్మిస్తున్నారు.

నిజంగా మన సంస్కృతిలో ఎలాంటి స్నానం చేయాలో భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. ‘ఆత్మ జ్ఞానం అనే నదిలో స్నానం చేయాలి. ఓపిక, సంయమనం, ఇంద్రియ నిగ్రహం అనే నీటిని మనసులో నింపుకోవాలి. సత్యమే దాన్నుంచి ప్రవహించే మడుగు. అందులో దయాగుణం కెరటాలు. దానికి అటూ ఇటూ ఉండే గట్టులే శీలం. ఇలా మన ప్రవర్తనను మార్చుకోమని సంస్కృతి చెబుతోంది. కానీ... ‘మునుగు - మొత్తం మారిపోతుంది.. తేలు-అంతకంటే మారిపోతుంది’ అంటున్నారు. అవినీతిపరులు, బ్లాక్‌ మార్కెటీర్లు, స్మగ్లర్లు వీళ్లందరినీ పట్టుకెళ్లి ముంచమని ఈ పెద్ద మనుషులకు చెప్పండి! ఎవరైనా మారతారేమో చూస్తాను.

పుష్కరాల్లో స్నానం చేసేవారు ‘పిప్పలాదాత్‌’ అనే పద్యం చదువుతూ మూడు గుప్పిళ్ల మట్టి నదిలో వేయాలని చెబుతున్నట్టు విన్నాను. ఈ అజ్ఞానానికి కారణమైన కథ వేరే ఉంది. అదేంటంటే.. పిప్పలాదుడు దధీచి మహర్షి కుమారుడు. ఆయన తన ఎముకలను దేవతలకు ఆయుధంగా ఇచ్చేస్తాడు. అప్పటికి ఆయన భార్య గర్భిణి. తన గర్భాన్ని తానే మోదుకుని పిండాన్ని బయటకు లాగేసి, దాన్ని పిప్పల వృక్షం దగ్గర పెడుతుంది. ‘నీ తండ్రిని దేవతలు చంపారు. కక్ష తీర్చుకోవడమే నీ లక్ష్యం’ అని చెప్పి అగ్ని ప్రవేశం చేసి చనిపోతుంది. ఆ బిడ్డను రావిచెట్టు చంద్రకిరణాల ఆహారంగా పెంచుతుంది. ఆ శిశువు పెద్దయ్యాక శివుడి గురించి తపస్సు చేసి మెప్పించగా.. శివుడు కృత్య అనే రాక్షసిని సృష్టించాడు. దేవతలను ఆహారంగా తీసుకోమని కృత్యకు అనుమతిస్తాడు. అది దేవతలను చాలామందిని సంహరించింది. కృత్య దేవతలను సంహారం చేస్తుంటే దేవతలు శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు వచ్చి ‘నీ పనైపోయింది కదా, ఇంత క్రోధం వద్దు’ అని పిప్పలాదుడికి చెప్తే ఆయన కృత్యను బంగారు కలశంలో పెట్టి సముద్రంలో స్థాపన చేశాడు. అది ఆకలితో అలమటించడమనే సమస్యే లేదు. ఆ కృత్య ఆహారానికి, పుష్కర స్నానానికీ సంబంధం లేదు. ఇది సముద్రస్నానానికి సంబంధించిన విషయం. జరిగిన ఘట్టానికి గుర్తుగా ఆ శ్లోకం చదువుకుని నమస్కారం పెట్టుకుని స్నానం చేయాలంతే. పైగా ఆ శ్లోకం పుష్కర స్నానానికి సంబంధించింది కాదు. కానీ కథేం ప్రచారం చేస్తున్నారంటే.. ‘అది లేవగానే ఆకలి-ఆకలి అంటుందని... పుష్కర స్నానం చేసేవారిలో మట్టి వేయని వారి పుణ్యఫలాలన్నీ హరిస్తుందని చెబుతున్నారు. ఇది అభూతకల్పన. పురాణాలు చదవకుండా, సంస్కృతం రాకుండా చెబుతున్నమాట.

                   రాజమండ్రి  ఘటన ఎలా జరిగిందన్న అంశంపై ఆంధ్రజ్యోతిలో వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
---------------------------------------

వార్త - ఈ వార్త ఆంధ్రజ్యోతి లోనిది. రాజమండ్రిలో పుష్కర భక్తులు చనిపోవడం పూర్తిగా ప్రభుత్వం తప్పు కాదని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ ఘోరానికి కారణం ప్రవచనకర్తలదేనని స్పష్టంచేశారు. ఆధ్యాత్మికతకు బదులు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వ్యాఖ్య - నిన్న కొన్ని పత్రికలలో రాజమండ్రి విషాదంపై వచ్చిన వార్తలలో ఈ తప్పు ప్రభుత్వందేనని ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబుని జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. చిరంజీవి కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా, వెంకయ్యనాయుడు, రోశయ్య వంటి నేతలు ధిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులని సహాయ కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పారు. పవన్ ని చూసి చిరంజీవి నేర్చుకోవాలని తెలుగు తమ్ముళ్లు సెలవిచ్చారు. ఘటనను పరిశీలించిన ఎ.పి సి.ఎం చంద్రబాబు ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన తప్పు ఉంటే క్షమించాలని భక్తులను కోరారు. ఇక్కడి వార్తలోనేమో ప్రవచకులు అబద్దాలు చెప్పబట్టే ఈ ఘోరం జరిగిందని గరికపాటి వారు సెలవిస్తున్నారు.  రాజకీయ నేతల విమర్శలు బాబు ఏడుపు పక్కన పెడితే నాకొచ్చే అనుమానం ప్రవచకులు అబద్ధం చెపితే వారు కుక్క చావు చావాలి కానీ, అమాయక భక్తులు చావడం ఏమిటి? పాపం చేసేవారికి దేవుడు శిక్ష వేయడా? రాజమండ్ర ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలు నేర్చుకోవలసింది ఏమిటి? ప్రభుత్వాలు నేర్చుకోవలసింది ఏమిటి? తప్పుడు ప్రచారంతో ప్రజలను ఊదరగొట్టి మాస్ గేంబ్లింగ్ కు పాల్పడిన దొంగ  ప్రవచకుల పాపానికి శిక్ష వేయాల్సింది ఎవరు? ఆధ్యాత్మికత పేరుతో అజ్ఞానం ప్రచారం చేస్తున్నారన్న గరికపాటి వ్యాఖ్యలు సరయినవేనా?  మీ అభిప్రాయం పంచుకోవలసిందిగా విజ్ఞప్తి.

Reactions:

Post a Comment

 1. The CM who diverted the police for his personal security is the main defaulter here.

  ReplyDelete
 2. వినఁదగు నెవ్వరు సెప్పిన
  వినినంతనె వేగపడక వివరింపఁదగున్‌
  గని కల్ల నిజముఁ దెలిసిన
  మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ!

  ReplyDelete
 3. యధా ప్రకారం చంద్రబాబును నేరం నుండి తప్పించడానికే ఆంధ్రజ్యోతి కథనాన్ని వండి వార్చింది!

  http://telangaanaa.blogspot.in/2015/07/blog-post.html

  ప్రవచకుల తప్పు ఉంటే ఉండు గాక. మరి చంద్రబాబు ఏం చెప్పాడు? అందరూ తరలి రావాలి, సెల్ఫీలు తీసి ఇతరులకు షేర్ చేసి ప్రచారాలు చెయ్యమని చెప్పలేదా? అదంతా చిన్న విషయం.

  అసలు విషయం ఏమంటే ...

  తానే VIPలకోసం ఒక గట్టు నిర్మించాడు.
  మరి పూజకు అక్కడికి వెళ్ళకుండా పుష్కర గట్టుకు ఎందుకు వచ్చినట్టు?
  లక్షలాది మందిని పోలీసుల చేత అదుపు చేయిస్తూ మూడున్నర గంటల పాటు ఎందుకు సమయం తీసుకున్నట్టు?
  తను అక్కడ వుండి ఏర్పాట్లను చిందర వందర చేయక పోతే ఆ మూడు గంటల్లో భక్తుల రద్దీ కొంచెం తగ్గేది కదా?
  అధిక మొత్తం బందోబస్తును తన సేవలోనే నియోగించే పని తప్పేది కదా?

  27గురి మరణంలో ముమ్మాటికి చంద్రబాబే నేరస్తుడు. దురదృష్ట వశాత్తు ఇటువంటి నేరాలు కోర్టుల్లో నిరూపణ కావు. బాధ్యతా రహితంగా కారు తోలి మనుషులను చంపిన సల్మాన్ నేరం కంటే ఇది 27 రెట్లు పెద్ద నేరం.


  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top