----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------

రాజమండ్రి: ‘హైదరాబాద్‌ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ ఎన్టీఆర్‌ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలు 24 గంటలు పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌వాసులు ఇంకా బాగా పనిచేయాలన్నారు. ‘శారీరక కష్టం అవసరంలేదు. మెదడుకు పదును పెట్టండి’ అని పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా మా జోలికిరావద్దని తెలంగాణా సి.ఎం , అహంకారానికి పరాకాష్ట అని ఇతర నేతలు ఘాటుగా ప్రతిస్పందించారు. 
చంద్రబాబు వ్యాఖ్యానంపై మీ కామెంట్?
Reactions:

Post a Comment

 1. చంద్రబాబు అంత క్లియర్ గా మెదడుకి పని చెప్పమన్న తర్వాత పని చెప్పకుండా ఊరుకుంటారా ?
  ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో వారే కేసీఆర్ !

  ReplyDelete
 2. ఇది చంద్రబాబుకు కొత్త కాదండీ, పాత ఏడుపే. అప్పుడే फज्र का आज़ान तू देता था के तेरी घटिया ससुर (మొదటి ప్రార్తనకు పిలుపు నువ్విచ్చినవా మీ చిల్లర మామనా) అని मूह तोड़ जवाब (కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహా జవాబు) ఇచ్చాం కూడా!

  ఐనా వానికి బుద్ది రాలేదు, వస్తే చంద్రబాబు ఎందుకు అయితడు?

  ReplyDelete
 3. చంద్రబాబు, పెహలా తేరా పీలా దాన్త్ ధోనా సీఖో, తబ్ తెలంగాణా కా సారా జనతా సుబాహ్ చార్ బజే జాగ్‌నా సీక్తే హై!

  ReplyDelete
 4. Secularist Chandrababu doesn't know at what time Muslims hear aadhaan from masjid. Muaddheen reads aadhaan 5 times per day, first aadhaan is heard before sunrise.

  ReplyDelete
 5. ఉన్నమాట ఒప్పుకుని తీరాలి.ఎన్ టీ ఆర్ 3 గంటలకే నిద్రలేస్తారన్నది అందరికీ తెలిసిందే,కానీ ఆంధ్రాలో చాలామంది 6 గంటలకు నిద్రలేస్తారు. మూడు గంటలకే భార్యను లేపి సతాయించడం తారకరాముడు మాత్రమే చేయగలడు :p

  ReplyDelete
 6. NTR మూడు గంటలకు నిద్ర లేచి వ్యాయామం, పూజా ముగించుకుని కచ్చితంగా ఆరుగంటలకు తన ఆబిడ్సు ఇంటిలోని ఆఫీసు గదిలో కూచునే వాడట. అప్పట్లో పార్టీ సెక్రెటరీ గా వున్న చంద్రబాబు ఆ సమయానికి రాకుండా లేటయితే చిరాకు పడేవాడట. అందువల్ల అదివరలో లేటుగా లేచే అలావాటున్న చంద్రబాబు తప్పని సరిగా త్వరగా లేవడం అలవాటు చేసుకోవలసి వచ్చింది. ఈ విషయం చంద్రబాబే ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను TV లో చూశాను. ఈ ఇంటర్వ్యూని ఎవరైనా వెలికి తీస్తే బాగుంటుంది.

  కాబట్టి NTR నిద్ర లేవడం హైదరాబాదుకి కాదు, చంద్రబాబుకి నేర్పాడు!

  ReplyDelete
 7. ఎన్టీఆర్ చీర కట్టుకొని శవాపూజ చేయడం, మూడు ఘంటలకు లేవడం, స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించడం లాంటివి మనకు ముఖ్యం కాదు, ఎవనిష్టం వానిది. ఇట్లాంటి చిల్లర వేషాలు వేయని వాళ్ళందరూ నిద్రపోతులు అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు.

  హైదరాబాదీల మీద నోరు పారేసుకున్నచంద్రబాబుకు అసలు ఈ మహానగరం గురించి ఏమి తెలుసు? కనీసం నాలుగు వాక్యాలు మాట్లాడగలడా? जंगलीकु क्या मालूम ज़ाफरोंका मज़ा అన్నట్టు సంస్కృతి అంటే ఏమిటో తెల్వని వాడు మన తెహ్జీబ్ అర్ధం చేసుకోలేడు.

  ReplyDelete
  Replies
  1. దివంగత రామారావుగారి గురించి ప్రస్తావిస్తూ మిత్రులు శ్రీకాంత్ చారి గారు 'పూజ' అన్నది అందుకొని మిత్రులు జైగారు ఆ మాటను 'శవపూజ' అని సరిదిద్దారు! సముదాచారం కాదు కాబట్టి, ఇది మనస్తాపం కలిగించింది.

   రామారావుగారు సినిమాల్లో వేస్తున్నరోజుల్లో తాను రాత్రి రెండున్నరకే లేచేవారని గొల్లపూడి వారు వ్రాసినది ఈ బ్లాగులోకంలోనే లోగడ చదివాను. గొల్లపూడివారికి ఆ సమయంలో వచ్చి మాట్లాడటానికి ఆయన అవకాశం ఇచ్చారట. ఇంకా చాలా వివరంగా గొల్లపూడివారి వ్యాసంలో విషయాలున్నాయి. క్రమశిక్షణకు రామారావుగారు పెట్టిందిపేరు. ఆ సంగతి దివంగతులు శ్రీగుమ్మడిగారు కూడా తన ఆత్మకథలో ప్రస్తావించారు, మనకు రాబడి ఎంత ఉన్నదో అంతలోనే అప్పులూ సొప్పులూ లేకుండా సర్దుకోవాలి పొదుపుచేయాలి అని గుమ్మడిగారుకి ఆయన హితబోధ చేసారట!

   మిత్రులు జైగారు రామారావుగారివి చిల్లర వేషాలు అనటం బాగుండలేదని నా అభిప్రాయం.

   ఇక నీహారికగారైతే 'మూడు గంటలకే భార్యను లేపి సతాయించడం తారకరాముడు మాత్రమే చేయగలడ'ని చెణుకు విసిరారు. ఆయన తన సతీమణిని సతాయించారని అనుకోవటానికి బదులు ఆయన జీవనశైలి, క్రమశిక్షణలకు ఆవిడ ఇతోధికంగా తోడ్పడ్డారని అనుకోవటం మరింత ఉచితంగా ఉంటుందేమో. వారిరువురి మధ్యా పొరపొచ్చాలున్నాయని నీహారికగారి అభిప్రాయం ఐతే కావచ్చును కానీ ఆధారాలు లేకుండా అలా మనం మాట్లాడకూడదని నా అభిప్రాయం.

   మనస్సుల్లో ఏదో దురభిమానాలో మరొకటో ఉంచుకొని దివంగతులని ఉద్దేశించి తేలిగ్గా మాట్లాడటం ఉచితం అని అనిపించక ఈ మాటలు రెండూ చెప్పవలసి వచ్చింది తప్ప వాదనలో దూరటానికి చెప్పటం కాదు.

   నా అభిప్రాయంగా చెప్పిన పై మాటలు నచ్చకపోతే మిత్రులు మన్నించాలి.

   Delete
  2. మీ అభిప్రాయం మీరు చెప్పారు దానికి మన్నించడం లాంటి పెద్ద మాటలు ఎందుకు లెండి. మీ అభిప్రాయం ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా పెద్దవారిగా మీరు చెప్పడం నా మటుకు నేను స్వాగతిస్తాను.

   రామారావు చీర కట్టుకొని శవాపూజ చేసేవారని నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు, అప్పటిలో ఎవరూ ఖండించినట్టు నాకయితే గుర్తు లేదు. అంచేత దీన్ని నిరాధారం అనలేమని & చిల్లర వేషం అనడం తప్పు కాదని అని నా ఉద్దేశ్యం.

   ఆయన గారు కాషాయ వస్త్రాలు ధరించడం, రోడ్డెమ్మట స్నానాలు చేయడమే కాక ఆ ఫోటోలను పేపరులో వేయించుకోవడం, ఎంత పెద్దవారినయినా తనకు పాదాభివందనం చేయాలని మంకు పట్టడం, ఇతర పార్తీలనే కాదు అల్లుడిని కూడా బండ బూతులు తిట్టడం, సొంత కొడుకు పెళ్ళికి డుమ్మా కొట్టడం, రోడ్డు మీద పడుకోవడం లాంటి ఘనకార్యాలు చేసారని మరిచిపోలేము. ఖర్మ కొద్దీ ఈ డ్రామాలను భరించాల్సి వచ్చిన హైదరాబాదీలు ఈయనకు empty dramarao అనే బిరుదు ఇచ్చారు.

   కారంచేడు దమనకాండ, వంగవీటి రంగా/మల్లెల బాబ్జీ/పింగళి దశరధరాం హత్యలు లాంటి విషయాలు సరేసరి.

   చనిపోయిన వ్యక్తిని కెలికింది చంద్రబాబు. ఇతగాడు షరామామూలుగా రోజుకు రెండు సార్లు పాడే "నేనే హైదరాబాదు ఉద్దరించా, నేను చెప్పినందుకే బిల్ గేట్స్ సత్యా నాదెల్లకు ప్రమోషన్ ఇచ్చాడు" లాంటి పిచ్చిపాటలు పాడుంటే రోజూ వినే గోలే కదాని ఎవరయినా ఇగ్నోర్ చేసేవారు. అనవసరంగా తన శుష్క సొంతదబ్బాలో చనిపోయిన మామను గుంజడం వల్లే నేనూ రామారావు ప్రస్తావన చేయాల్సి వచ్చింది.

   Delete
  3. @శ్యామలీయం గారు,

   నేను సరదాకే అన్నాను emoticon కూడా పెట్టాను కదా ? లక్ష్మీ పార్వతి గారిని మూడు గంటలకు లేపి గంటలకు గంటలు మాట్లాడేవారట,నెలకు 3 లక్షల టెలిఫోన్ బిల్లు వచ్చిందని ఆవిడే స్వయంగా ఆర్ కే గారి ఇంటర్వ్యూ లో చెప్పారు.ఇదంతా పెళ్ళి కాకముందు సంగతి,పెళ్ళి అయిన తరువాత ఇక ఊహించుకోండి,చంద్రబాబు గారి బాధా మీ బాధ ఏమిటో ?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top