కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు 
రాష్ట్రపతి ప్రణబ్‌కు టీ టీడీపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, జూలై 05: సీఎం కేఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వర్షాకాల విడిది కోసం నగరానికి వచ్చిన రాష్ట్రపతిని టీ టీడీపీ నేతలు ప్రత్యేకంగా కలిశారు. టి.టీడీపీ నేతలు ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల, ఎంపీ మల్లారెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలిసి పార్టీ ఫిరాయింపులపై మెమోరాండం అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా చూడాలని ప్రణబ్‌ను కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్‌ నరసింహన్‌ను కోరినట్లు రాష్ట్రపతికి వివరించారు. మెమోరాండాన్ని పరిశీలించిన రాష్ట్రపతి ఏ పార్టీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ టీడీపీ నేతలు వారి పేర్లు చెప్పడంతో.. తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా? అని రాష్ట్రపతి ప్రత్యేకంగా అడిగినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై... స్పీకర్‌ స్పందన ఏమిటి? అని కూడా రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. మెమోరాండాన్ని కేంద్రంలోని సంబంధిత శాఖకు పంపి... చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తానని టీ టీడీపీ నేతలకు రాష్ట్రపతి హామీ ఇచ్చారు. భేటీ అనంతరం టీ టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగినబుద్ధి చెబుతారని హెచ్చరించారు.
---------------------------------------------------------------
వార్త - పై వార్త ఆంధ్రజ్యోతి లోనిది. సీఎం కేఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా చూడాలని ప్రణబ్‌ను కోరారని  దాని సారాంశం. 
వ్యాఖ్య -  పార్టీ ఫిరాయింపులను ఎలా నిరోధించాలి? ఫిరాయింపుల నిరోధ చట్టం ఎందుకు సక్రమంగా ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణాలో కె.సి.ఆర్ పై ఫిర్యాదు చేసిన తెలుగుదేశం సీమాంధ్రలో చేస్తున్నదేమిటి? మొత్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధం అంశంపై తీసుకోవలసిన చర్యలేమిటి? మీ వ్యాఖ్యలను పంచుకోవాలని విజ్ఞప్తి.
Reactions:

Post a Comment

 1. ఎస్పీవై, గీత, సురేష్ ప్రభు వగైరాల గురించి వీరు ఎందుకు మాట్లాడరు?

  ReplyDelete
  Replies
  1. మి ప్రశ్న వారికి అంటే తెలుగు తమ్ముళ్లకి సరయినదే జై గారు. మొత్తం ఫిరాయింపులపైనా, ఫిరాయింపు నిరోధక చట్టం అమలు పైనా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాని ప్రభావంపైనా మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఒక్క తెలంగాణాకో , తె.రా.స కో మాత్రమే లేదా ఇపుడు కొత్తగా జరుగుతున్న తంతు మాత్రమే కాదు. కానీ ఎక్కడో ఒక చోట ఎపుడో ఒకప్పుడు దీనికి ముగింపు పలకాలి కదా?

   Delete
  2. NTR ముల్కీ నిబంధనలకి వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని సమర్థించాడు, చంద్రబాబు నాయుడు గ్లోబలైజేషన్ పేరుతో చిన్న రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేకించాడు. తెలుగు దేశం తెలంగాణా ద్రోహుల పార్తీయే. మరి కాంగ్రెస్ నాయకుల్ని కూడా తెరాసలో చేర్చుకుని కాంగ్రెస్‌ని దెబ్బతియ్యాలని కె.సి.ఆర్. ఎందుకు అనుకుంటున్నాడు?

   Delete
 2. పార్టీలున్నది అధికారం సంపాదించుకుందుకే కాని ప్రజలకు సేవచేసేటందుకు కాదని ఆబాలగోపవిదితమైన సత్యం. అటువంటి రోజుల్లో పార్టీల్లో సభ్యులుగా ఉండేవాళ్ళంతా తమస్వప్రయోజనాలకోసమే అయా పార్టీల్లో ఉంటారు కాని ప్రజాహితం కోసమూ కాదు పార్టీహితం కోసమూ కాదు అన్నదీ ఆబాలగోపవిదితమైన సత్యం కాకపోదు.

  అందరు నందరే తుదకు నందరు నందరె అందరందరే అన్న సమస్యాపూరణపాదంలాగా అన్నిపార్టీలదే అదే పరిస్థితి, అన్ని పార్టీలలోని సభ్యువరేణ్యులైన వారు అందరిదీ అదేపరిస్థితి.

  పార్టీలు మారటం వలన గందరగోళాలూ, రాజ్యాంగపరమైన అనిశ్చితులూ, పాలనలో అవరోధాలూ వగైరా ఇబ్బందులు వస్తున్నా యనుకుంటే. మార్టీలు మారటాన్ని శిషేధించాలి - మరీ మూక ఉమ్మడి పార్టీమార్పిడులు, కలయికలు తప్ప. (నిజానికి ఈ విషయమూ బాగా ఆలోచించాల్సిందే!). తద్విరుధ్ధంగా పార్టీలు మారినవారికి సభ్యత్వం దానంతట అదే తక్షణం రద్దు అయ్యే శాసనం ఉండాలి. లేకుంటే నిరోధం ఎట్లా? సభాపతి తన విచక్షణ ప్రకారం చర్యతీసుకోవాలి అనటం తింగరి ఆలోచనలా ఉంది. ఆయన సాధారణంగా ఏ పార్టీవాడో ఆపార్టీలోకి విచ్చేసిన మహానుభావులను చల్లగా చూస్తాడన్న ఇంగితం లేకుండా చట్టం చేసుకొని వగచి లాభం లేదు. సభాపతులు పక్షపాతరహితంగా నిర్ణయాలు తీసుకుంతారంటారు, మనం నమ్మాలంటారు. నమ్మగలమా?

  డబ్బులు పుచ్చుకొని పార్టీ మారటం తప్పు. నిజం నిజం. పదవులు పుచ్చుకొవటానికి పార్టీ మారటం తప్పున్నర, నిశ్చయంగా.

  పార్టీలు మారినవారు విశాలజన్యాభ్యుదయం కోసమే మారామంటారు. మనం నమ్మాలంటారు. అలాగే పదవులను ఆశించి మారటం లేదంటారు. మనం నమ్మాలంటారు. ఆ వచ్చిన పదవులు కూడా జనహితంకోసమే నిస్వార్థంగా స్వీకరించామంతారు. మనం నమ్మాలంటారు. నిజంగా మనం నమ్మగలమా?

  ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకటే. కాబట్టి ఫలానాపార్టీ చేస్తే ఒప్పు మరొకరు చేస్తే తప్పు అన్న ఆలోచన మంచిది కాదు.

  ReplyDelete
  Replies
  1. < ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకటే. > అన్ని పార్టీలు ఒకటి కాదని నా అభిప్రాయం.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top