తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ మరోసారి నిజాం ను మంచి రాజు,గొప్పవాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ అంశమై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల కోసం కే.సీ.ఆర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని విమర్శించాయి. కే.సీ.ఆర్ నిజాం ని పొగడడం వెనుక  జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలలో ఎం.ఐ.ఎం తో పొత్తుకు ప్రయత్నించడమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. కే.సీ.ఆర్ నిజాం ను పొగడ్తలతో ముంచెత్తడం పై మీ అభిప్రాయం ఏమిటి?
*Re-published

Reactions:

Post a Comment

 1. నిజామ్‌ని పొగడడం అంటే జన్మజన్మల బూజుని నెత్తికి ఎక్కించుకోవడమే. మన బ్లాగుల్లోనే నిజామ్‌ని వెనకేసుకొచ్చేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. నిజామ్ తన జాగీర్దార్లని కట్టడి చెయ్యలేకపోయాడు కానీ అతను చెడ్డవాడు కాదు అని వాళ్ళు అంటారు. ఆడవాళ్ళ రొమ్ములు పిండి, వాళ్ళకి పాలొస్తాయో, లేదో పరీక్షించిన జాగీర్దార్ల జాగీర్లని రద్దు చెయ్యలేనివాడు ఒక రాజా? అలాంటి రాజుని పొగడాల్సిన అవసరం అతని భట్రాజులకైతే ఉంటుందేమో కానీ మనం అతన్ని పొగడడం మాత్రం సిగ్గుసిగ్గు.

  ReplyDelete
 2. ఒకప్పుడు దేవీప్రియ గారు ఆంధ్రప్రభ లో "రన్నింగ్ కామెంటరీ" అని రెండు భాగాల చిన్న లయబధ్ధమయిన కవితల్ని రాసేవారు!అవి చాలా పవర్ఫుల్!ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో మొదలయ్యాయి.ఈ విషయం గురించి ఆయనిలా రాశారు:

  కేసీఆర్కెందుకంట
  నిజాం మీద అంత భక్తి
  రాచరికపు గుణమే అది-
  ఆకర్షణ దాని శక్తి!

  అసంఖ్యాక ప్రజలకేమొ
  అతడు తరతరాల బూజు
  అయినా జనహితవరి అట-
  అందుకు కొందరి మోజు!!

  ReplyDelete
 3. కె.సి.ఆర్. గారి వందిమాగధులు (భట్రాజుకే భట్రాజులు) ఇంకా వ్యాఖ్యానించలేదు! దేశానికి స్వాతంత్ర్యం రావడం నిజాం రాజులకి ఇష్టం లేదు. నిజామ్‌కీ, మరాఠాలకీ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆంగ్లేయుల సహాయంతోనే నిజాం రాజులు గెలిచారు. తాము ఆంగ్లేయుల కింద సామంతరాజులుగా ఉంటేనే తమపై శతృవులు ఎవరూ దాడి చెయ్యకుండా ఉంటారని నిజాం రాజులు అనుకున్నారు. నిజాం బూజుని పొగడడం అంటే ఆంగ్లేయుల పాలనని పొగడడమే. ఆంధ్రాలో బొబ్బిలి, విజయనగరం, పిఠాపురం, పెద్దాపురం రాజులు ఆంగ్లేయుల మోచేతి నీళ్ళు ఎలా తాగారో, హైదరాబాద్‌లో నిజాం కుక్కలు కూడా తెల్ల దొరలు పెట్టిన బిస్కత్‌లు అలాగే తిన్నారు. (కుక్కల్ని నిజామ్‌తో పోల్చి వాటిని కించపరిచినందుకు నన్ను క్షమించాలి.)

  ReplyDelete
 4. యేమి చెస్తాం,కాల మహిమ?సొంత ఆస్తిత్వం కోసం పడే తంటాల్లో ఒక సుడిగాలి లాంటి గందరగోళంలో పడి యేదో ఒక ఆధారం కోసం వెతికితే ఈ జీఎలుగు ముక్క దొరికింది!అదీగాక,వుద్యమం అంత అరిభీకరంగా ప్రజని కదిలించలేకపోవటం వల్ల మొత్తం తెలంగాణాలో యెక్కడా అధ్భుతమైన మెజారిటీ రాకపోగా తామంతా కొలువు దీరిన రాజధాని నగరంలో మరీ యేడిసినట్టుగా వుంది!

  ఈ మహానగరంలో యెలాగయినా కుదురుకోవాలనే అత్రంలో మళ్ళీ ముస్లిముల్లో పలుకుబడి వున్న వొవైసీ కుటుంబ రక్షణ కోసం పడుతున్న పాట్లివి,నాకయితే ఆ వ్యూహం యెదురు తన్నే ప్రమాదముందని జాలిగా వుంది?!వుద్యమాన్నినేను పరిశీలించటం మొదలైన తొలిరోజుల నుంచీ ముందు యేమి జరుగుతుందో అనే నా అంచనాలు ఇంతవరకూ తప్పు కాలేదు మరి?

  ReplyDelete
 5. ఒవైసీ కుటుంబీకులు నిజాం బంధువులు. తెలంగాణా బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించారు. కొంత మంది కె.సి.ఆర్. అభిమానులు ఈ నిజం ఒప్పుకోలేక కమ్మవాళ్ళ మీద పడి ఏడ్చారు. తెలుగు దేశం నాయకుడు నామా నాగేశ్వరరావు వరంగల్ జిల్లాలో పుట్టిన కమ్మవాడు. వరంగల్ జిల్లాలో పుట్టినవాడు ఏ కులస్తుడైనా అతనికి తెలంగాణాపై వ్యతిరేకత ఉంటుందా? హైదరాబాద్ పాతబస్తీలో కర్ణాటక నుంచి వలస వచ్చిన ముస్లింలు ఉన్నారు. వాళ్ళలో తెలంగాణావాదం బలంగా ఉండదు కనుక తాము తెలంగాణాని వ్యతిరేకించినా తమకి వోత్‌లు పడతాయని ఒవైసీలు అనుకున్నారు.

  ReplyDelete
 6. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 7. ఒకప్పుదు నిజాముని వ్యతిరేకించిన షోయబుల్లా ఖాన్ ముస్లిమే కదా!సామాన్య ముస్లిములలఓ నిజాము వ్యతిరేఅక్త వుంతే ఇప్పూదు ఈ ంజాము పాతని యెత్తుకోవదం వల్ల ఆ వ్యతిరేకత ఒవైసీ కుతుంబ రాజకీయ పునాదుల్ని కూడా కదిలిస్తే?

  కాంగెసూ మరియూ లౌకిక పార్టీ లన్నీ మోదీని యే గోద్రా అల్లర్ల పేరుతో బద్నాం చెయ్యాలనుకున్నారో అక్కడి ముస్లిములే మోదీకి వోతు వేసారు,అదీ తను ఇంకా కేంద్ర రాజకీయాలలో ప్రధాని అభ్యర్ధ్హిగా ప్రవేశించక ముందే!అప్పుదే కాంగ్రెసు తమ మాతల్ని ముస్లిములు కూడా నమ్మదం లేదని కనిపెట్టి పెఠాలు కదిలిపోయే ప్రమాద ముందని తెలుసుకోవాల్సింది?సరిగా యెన్నికలకి ముందే రెండు సన్నివేశాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినంత కాకతాళీయంగా జరిగినా భవిష్యత్తుని సూచించాయి!ఒక ముస్లిము మైనారిటీ ట్రస్ట్ లో జరుగుతున్న అవకతవకల గురించి హఠాత్తుగా లేచి నిలబడి యెత్తుకుంటే బుజ్జగించి పక్కకి పంపైంచేశారు.మరో సన్నివేశంలో ఒక కాంగ్రెసు యువ కార్యకర్త స్వయంగా రాహుల్ గాంధీకే డిల్లీలో వాడెవడో పేరు గుతుకి రావడం లేదు,మసీదుల దగ్గిరా దర్గాల దగ్గిరా మీరు దొంగల్ని చేర్చి మేపుతున్నారు - సామాన్య ముస్లిములకి అది కంటగింపుగా వుంది ఆ వ్యతిరేకత పుట్టి ముంచేలా వుంది అని చెప్పాడు.ఫలితం యెలా వచ్చిందో చూశారుగా,నెత్తికి కిరీటం వస్తుందనుకుంటే గూబ గుయ్యి మంది!వీటన్నిటిని బట్టి చూస్తే ముస్లిములు కూడా కాంగ్రెసు నడిపిన రాజకీయం అర్ధమైపోయింది.ఇవ్వాళ యెన్ని క్షమాపనలు చెప్పినా ముస్లిములు మళ్ళీ కాంగ్రెసు వైపు చూడనత కోపంతో వున్న్నారు.ఈ రకమయిన ముఖరక్షణార్ధం వేసుకున్న పునాదులే అంత,ఒకసారి కదలదం మొదలెడితే భళ్ళున కూలిపోవటమే!

  సరిగ్గా అలాంటి దృష్యమే ఇక్కడా వుంతే మహాంగరాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి భాజపాకి అప్పగించినట్లవుతుంది.

  ReplyDelete
 8. చరిత్రలోకి వెళ్తే ఎంతో ఉంది. దాన్ని ప్రస్తుతానికి వదిలేసి టపాలో వేసిన ప్రశ్నపై మాత్రమె దృష్టి సారిస్తాను.

  జీహెచెమ్సీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఎన్నికల నాటికి కెసిఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యను గుర్తు పెట్టుకొని వోట్లు వేస్తారని ఊహించడం సమంజసమా?

  ReplyDelete
  Replies
  1. @జై
   నేను ఈ కామెంటు వేసాక పేపరు తెస్రిస్తే వరవర రావు గారు రాసిన వ్యాసం చదివాను.ఒకరు అనుకుంటే అది పొరపాతు కావచ్చు,కానీ దాదాపు తెరాసా పరిస్థితి కీ ఒవైసీ తో మైత్రి యొక్క అవసరాన్ని వాస్తవికంగా అంచనా వేసిన వాళ్ళు యెవరయినా అలాగే అనుకుంటారు.ఇందులో చరిత్రలోకి వెళ్ళాల్సీ అవసరమే లేదు.

   వరవర రావు గారు అడుగుతున్న ఒక ప్రశ్నకి కేసీఆర్ గానీ అతని లాగానే నిజాముని మంచివాడు అంటున్న వాళ్ళు గానీ ఆ ప్రస్నకి జవాబు చెప్పాలి."కేసీఆర్ ఘనంగా శతజయంతులు జరిపిన కాళోజీ,దాశరధి,వట్టికోట ఆళ్వారు స్వామి నిజాముకి వ్యతిరేకంగా చేసిన పోరాటం,రాసిన రాతలు అన్నీ అబధ్ధమేనా?నిజామాబాదు జైల్లో దాసరధి కవితా చరణాలు ఆళ్వారు స్వామి మళ్ళీ మళ్ళీ రాసి జైలు అధికారుల కన్నెర్రకు గురయిందంతా అబధ్ధమేనా?వీళ్ళందరు నిజాంకు వ్యతిరేకంగా రాసిన శక్తివంతమయిన గేయాలు నాకన్నా ఎన్నో రెట్లు ఎక్కువే కేసీఆర్ కంఠతా వేలాదిమంది ముందు చక్కటి తెలంగాణ వ్యక్తీకరనతో చదివినవాడే గనక నేను వుదహరించనక్కర్లేదు!" - చెప్పండి మరి?!

   Delete
  2. నిజాము"లు" (బహు వచనం) మంచి "వాళ్ళా" (బ. వ.) కాదా అనే ప్రశ్న ప్రస్తుత టపా అంశం కాదు. మీరు ఎంతమంది గొప్పవారి ఊసు తీసుకొచ్చినా సరే ఇవ్వాళ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనను మెచ్చుకోవడం వల్ల ఎప్పుడో జరగబోయే ఎన్నికలలో వస్తుందో రాదో తెలీని లబ్దికి లింకు నిర్ధారణ కాదు.

   Delete
  3. వరవర రావుకు నా ప్రశ్నలు:
   సుభాష్ చంద్రబోసును ఆనాటి కమ్యూనిస్టులు నాజీ అన్నారు కదా, ఇప్పుడూ మీరు అనగలరా?
   అశోకుడు కళింగను ఊచకోత కోశాడు కాబట్టి అతని మంచి పనులు చెప్పకూడదా?
   ప్రతాప రుద్రుడు సమ్మక్క రాజ్యాన్ని/వంశాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి చరిత్రనుండి తొలగిద్దామా?
   వల్లభాయి పటేల్, JN చౌధరి కలిసి 4000ల మంది మెరికల్లాంటి తెలంగాణా (కమ్యూనిస్టు) పోరాట యోధుల్ని హతం చేశారు కాబట్టి వారి చరిత్రని రూపు మాపుదామా?
   బ్రహ్మానందరెడ్డి చంపించిన 360 మంది తెలంగాణా యోధుల సంగతేమి చేద్దాం?
   అనేక ఎన్‌కౌంటర్లకు, బషీర్‌బాగ్ కాల్పులకు కారణమైన చంద్రబాబు సంగతేమిటి?

   Delete
  4. @sreekaant chaari
   చర్చలకి దూరంగా వుందామనుకున్నా కెలికింది నేను గాబట్టి యే ప్రశ్ననైనా జవాబు లేకుండా వొదిలేస్తే ఒకనాటికి వాయిద అవేసిన యుధ్ధం లాగా చెడు చేస్తుంది గాబట్టి జవాబులు చెప్తున్నాను.

   1.సుభాష్ చంద్రబోసును ఆనాటి కమ్యూనిస్టులు నాజీ అన్నారు కదా, ఇప్పుడూ మీరు అనగలరా?
   ans:చారిత్రక తప్ప్పిదాల సిధ్ధాంతులు ఇటువంటి చారిత్రక తప్పిదాలు చాలా చేశారు,వాటికి క్షమాపణలు కూడా చెప్పారు:-))
   2.అశోకుడు కళింగను ఊచకోత కోశాడు కాబట్టి అతని మంచి పనులు చెప్పకూడదా?
   ans:అశోకుణ్ణి ఈ లిస్టులోకి తీసుకు రావదమే చాలా క్రూరమయిన విషయం.ఒకసారి చేసినందుకు పశ్చాత్తాప పడి "దేవానాం ప్రియుడు ఇక యుధ్ధాలు చెయ్యడు" అని 13వ శాసనంలో అంత ఖచ్చితంగా చెప్పి ఆ మాతకి కట్టుబడ్డాడు!

   3.ప్రతాప రుద్రుడు సమ్మక్క రాజ్యాన్ని/వంశాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి చరిత్రనుండి తొలగిద్దామా?

   ans:ఇవ్వాళ అణిచివెయ్యబడీన వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు గాబట్టి గట్టిగా నేను మాట్లాడీతే మనోభావాలు దెబ్బతినడం దగ్గిర్నుంచి దైవదూషణ వరకు నాకు అంటగట్టే ప్రమాదం వున్న సున్నితమయిన విషయాన్ని ప్రస్తావించారు.కానీ తిరుగుబాట్లని అణచని రాజు వున్నాడా?ఆరునూరయినా సరే నిజాముని పొగిడి తీరాల్సిందే ననే గట్టి పట్టుదలతో అందరు రాజుల్నీ ఒకే గాటన కట్టేస్తే ఒకే కుటుంబంలోని దారా షికో మరియూ ఔరంగజేబు అనే వాళ్ళని యెలా అర్ధం చేసుకోవాలి.ఒక అయిదు నిముషాల కాలంలో మోసం చేసి గెలిచినా ఆ ఔరంగజేబు సాటి ముస్లిములు కూడా వీడు మావాడని గర్వంగా చెప్పుకోలేని విధంగా పాలించాడు.ఓడిపోయిన దారా షికో తారతమ్యాలు తెలిసిన సజ్జనులందరి చేత నతులందుకుంటున్నాడు!

   4.వల్లభాయి పటేల్, JN చౌధరి కలిసి 4000ల మంది మెరికల్లాంటి తెలంగాణా (కమ్యూనిస్టు) పోరాట యోధుల్ని హతం చేశారు కాబట్టి వారి చరిత్రని రూపు మాపుదామా?
   బ్రహ్మానందరెడ్డి చంపించిన 360 మంది తెలంగాణా యోధుల సంగతేమి చేద్దాం?
   అనేక ఎన్‌కౌంటర్లకు, బషీర్‌బాగ్ కాల్పులకు కారణమైన చంద్రబాబు సంగతేమిటి?

   ans:చరిత్రని రూపుమాపుదామనీ చరిత్రనుంచి తొలగిద్దామనీ యెవరయినా అన్నారా?చరిత్రలో ప్రతి ఒక్కటీ రికార్డు అవుతూనే వుంటుంది,మనమూ నమోదు చెయ్యాల్సిందే.దుర్మార్గుడయిన వాణ్ణి ప్రస్తావించదం తప్పు కాదు ప్రశంసించడమే తప్పు.

   నిజాముని కానీ ఔరంగజేబుని కానీ వాళ్ళు ముస్లిములు కాబట్టి విమర్సించడం లేదు.తాము పాలించాల్సిన ప్రజలనే నలిపేశారు వాళ్ళు!మాలిక్ ఇబ్రహీముని మల్కిభరాముదని కీర్తించారు,అతడూ ముస్లిం ప్రభువేగా?!

   5.నిజాము తన కీళ్ళనొప్పులు బాగుచేయించుకోవడానికి ప్రజల్ని పీడించి సంపాదించిన అపారమయిన ధనం వుంది కాబట్టి ఒక పెద్ద యెముకల ఆస్పత్రినే కట్టించుకుంటే అది ప్రజల కోసం చేసినట్టు అతడికి కృతజ్ఞతలు తెల్పదం భావ్యమా?నేను "రాఘవా స్వస్తి,రాణా సవస్తి" అంటూ గతంలోనే ఒకసారి తమతో వాదననుంచి పలాయనం చిత్తగిస్తూ ఒక పాయింటుని చెప్పాను:ఇంగెలీషు వాళ్ళు ఇక్కడి నుంచి సరుకుల్ని లందనుకి తరలించుకుపోవడానికి వేసుకున్న రైలూమర్గాల్నీ రోడ్డు మార్గాలనీ వుపయోగించుకుంటున్నా వాటిపట్ల మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పనక్కర్లేదనీ అలా యెవరూ ఇవ్వాళ చెప్పటం లేదనీ స్పష్టంగానే చెప్పాను.అయినా మళ్ళీ అదేలాంటి ప్రశ్న వేశారు.

   6.చంద్రబాబు కేవలం హైదరాబాదుని మాత్రమే బాగుచేసాదు,మిగతా తెలంగాణాని నిర్లక్ష్యం చేసాడు అని వంకలు పెడుతున్నారు.నిజాము చేసింది ఇంకా ఘోరం కదా,తన కోసం తన వైభవం కోసమే తప్ప కనీసం హైదరాబాదుని గురించి న్యాయంగా అలోచించి చేశాదనే దాఖలాలు కూడా లేవు గదా?ఒక న్యాయమయిన సిధ్ధాంత నిబధ్ధతతో వ్యక్తుల పట్ల గానీ దేసాల పట్ల గానీ సంస్కృతుల పట్ల గానీ రాగద్వేషాలు యేర్పరచుకుంటే యెతువంటి తప్పూ లేదు(మన దేశానికి మిత్రదేశాలు మనకీ మిత్రదేశాలే మన దేశానికి శతృదేశాలు మనకీ శతృదేశాలే - ఇలాంటివి) - శాత్రవ జన సమూహం మధ్యన నిలబడి కూడా తన పాయింటుకి కట్టుబడి నిలబడగలిగితే విపుల ప్రజానీకం నిజంగానే హర్షిస్తుంది.కానీ మన వ్యక్తిగత రాగద్వేషాల కనుగుణంగా సిధ్ధాంతాల్ని మెలికలు తిప్పుతూ పోతే ఒకనాటికి మన మాటలే మనల్ని వెక్కిరించే సన్నివేశం యెదురయినప్పుడు సిగ్గుపదకుండా వుండగలగాలి.యెందుకొచ్చిన గోల!

   శ్రీకాంత్ చారి గారూ, పదో తరగతి ప్రశ్నా పత్రంలో లాగా అడిగిన ప్రశ్నలనె మార్చి మార్చి అడుగుతున్నారు కాస్త వోపిక చేసుకుని కొత్త ప్రశ్నలు అదగడి!ఆంధ్రావాళ్ళు ముఖ్యంగా ఈ హరిబాబు అనేవాడు యేది తప్పు పట్టినా దాన్ని వ్యతిరేకించటమే లక్ష్యంగా వాదించకుండా యేది చేయందగు నేది చేయందగదు అనే విషయంలో స్పష్తత తెచ్చుకోండి!పై ప్రశ్నలకి జాబు ఇస్తూ ఇక చర్చలో కొనసాగే వుద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాను.అంటే పలాయనం చిత్తగిస్తున్నాను అన్నమాట.మీ లెక్కా నా లెక్కా కలిపితే ఇది మూడో పలాయనం:-<>)నాకీ శాస్తి జరగాల్సిందే,లేకపోతే మీతో పెట్టుకుంటానా?!

   Delete
 9. ఆంధ్రా పాలకుల్ని చీకొట్టినవాళ్ళు అంత కంటే నీచులైన నిజాం రాజుల్ని పొగడడం ఎందుకు? 1850 నుండి నిజాం రాజులు హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగితా ప్రాంతాలు వ్యవసాయంపైనే ఆధారపడేలా చేసారు. అదే పని ఆంధ్రా పాలకులు చేస్తే తప్పా? హైదరాబాద్ తప్ప ఏదీ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదని నాకు కూడా అనిపించి ఉంటే నేను సమైక్యాంధ్రకి అనుకూలంగానే బ్లాగుల్లో వ్రాసేవాణ్ణి. నన్ను నా ప్రాంతంవాళ్ళే బూతులు తిట్టినా నేను తెలంగాణాకి అనుకూలంగా వ్యాఖ్యలు వ్రాసినది నిజాం బూజుని వదులుకోలేనివాళ్ళ కోసమా?

  ReplyDelete
 10. అలాగే, కె.సి.ఆర్. నిజామ్‌ని పొగిడినందుకు సమైక్యవాదులు బాధపడక్కరలేదు. నాలుగేళ్ళ తరువార TRS ఓడిపోతే కాంగ్రెస్ తెలంగాణాలో గెలుస్తుంది కానీ సమైక్యవాద పార్తీ అయిన తెలుగు దేశం తెలంగాణాలో పొరపాటున కూడా గెలవదు.

  ReplyDelete
 11. కే.సీ.ఆర్ నిజాముని పొగడడం అనేది తలా తోకా లేని వ్యవహారంగా ఉన్నది.

  ReplyDelete
 12. నరసింహారావు గారు, మీది బోనకల్లు అని వ్రాసారు కదా. కాజీపేట-విజయవాడ రైలుమార్గం పక్కన ఎర్రుపాలెం వరకు నిజాం పాలిత ప్రాంతమే ఉండేది. నిజాం పాలన ఎంత ఆటవికంగా ఉండేదో మీ తాతలకి కూడా తెలిసే ఉంటుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top