మీకు నచ్చిన పాటలు వినిపించండి!

పాట! 

మనసు ప్రధానమైన మనిషికి ఆహ్లాదాన్ని, ఆనందాన్నీ చాలా సందర్భాలలో చైతన్యాన్నిచ్చే అంశం. 

పల్లెవాసుల జానపదాలనుండి సినిమాల వరకు పాటకున్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. పాటలను అమితంగా ఇష్టపడేవారుంటారు. అప్పుడప్పుడూ ఇష్టపడేవారుంటారు తప్ప, అసలు ఇష్టం లేనివారుండరంటే అతిశయోక్తి కాదనుకుంటాను.

పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి కనుకనే మన దర్శకులు పాటల చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మన నటులు తామే గాయకుల అవతారమూ ఎత్తుతుంటారు. కేవలం పాటల వల్లనే హిట్టయిన సినిమాలూ ఉన్నాయి.

మన బ్లాగు ప్రపంచంలో పాటల కోసమే ప్రత్యేకంగా బ్లాగులు నడుపుతున్నవారున్నారు. పాటల గురించే వివరంగా వ్రాస్తున్నవారున్నాను. అలాంటివారు మీకు వాటిలో అమితంగా నచ్చిన పాటలను మీ అనుభవాలను అందరితో పంచుకోవాలని విజ్ఞప్తి.

అలాంటి వారిలా కాకున్నా మీలో ఆసక్తి ఉన్నవారు వ్రాయగలిగిన శక్తి ఉన్నవారు తీరిక సమయంలో లేదా తీరిక జేసుకుని పాటతో మీకున్న అనుభవాలను పాటపై మీకున్న అభిమానాన్ని లేదా జ్ఞాపకాలను వ్రాసి పంపితే అందరి అభిప్రాయాలూ ఓ చోట చేరితే అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాము.

సంగీతం సాహిత్యం మంచిగా ఉంటే పాట ద్వారా మనిషిలో చాలా మార్పులు తీసుకురావచ్చు. కొన్ని పాటలు వినడానికి మాత్రమే గాక, పాడడానికి మాత్రమే కాక మనిషిలో మార్పుని తీసుకురావడానికీ ఉపయోగపడతాయనేది మీ అందరికీ తెలుసు. 

అలాంటి పాటలను అమితంగా ప్రేమించేవారు మీకు నచ్చిన పాటలను వివరిస్తూ మాకు వ్రాసి పంపితే పల్లె ప్రపంచం బ్లాగులో నాకు నచ్చిన పాట అనే లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము.

దీనివల్ల సమాజానికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము.అన్ని మంచి పాటలూ ఒకే చోట ఉంటే మంచిదని ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ నచ్చిన పాటలను అన్నింటినీ ఒకే చోట ఉంచడం బాగుంటుందని అనుకుంటున్నాను.

మీకు నచ్చిన పాట ఏమిటి? ఎవరు వ్రాశారు? ఏ సందర్భానికి అది ఉపయోగించబడింది? మీకు ఆ పాట ద్వారా కలిగిన ప్రేరణ లేదా స్పూర్తి ఏమిటి? అది సినిమా పాట అయితే వాటి వివరాలు అంటే రచయిత - సంగీతం - చిత్రీకరణ - నటుల నటన ఇలాంటి వివరాలు వ్రాయండి.

ఆ పాట సాహిత్యం మొత్తం అందజేస్తే మంచిది. దానికి సంబంధించిన లింకులు ఉంటే పంపగలరు.

ఈ వివరాలేవీ వ్రాయకున్నా, వ్రాయలేకున్నా కేవలం మీకు నచ్చిన పాట వీడియో లింకు లేదా లిరిక్స్ పంపితే కూడా పల్లె ప్రపంచం బ్లాగులో నాకు నచ్చిన పాట లేబుల్ ద్వారా పాఠకులతో ఆ పాటను పంచుకోవచ్చు. వారి స్పందనను గమనించవచ్చు.

ఈ టపాలు చదివే వారు ఆ పాటతో మీకున్న అనుబంధాన్ని, ఆ పాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని విజ్ఞప్తి.

మీకు నచ్చిన పాట పై మీ అభిప్రాయాలను టపాగా వ్రాసి మాకు పంపాలనుకుంటే ఈ Contact Form ని ఉపయోగించండి.  
పల్లె ప్రపంచం
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top