----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
source andhrajyothy daily
Reactions:

Post a Comment

 1. ప్రవీణ్ తొగాడియా ఆవుపేడతో చేసిన అగరొత్తులు అమ్ముతారు. ఆధ్యాత్మికులంతా ఇంతే నేను స్వయంగా చూసాను కాబట్టి ఎపుడో చెప్పాను. అపుడు నమ్మలేదు. ఇపుడు తెలుసుకుంటున్నారు. ప్రతీ దానీకీ దేశంతో ముడిపెట్టి వ్యాపారం చేస్తారు. ప్రతి పైసా ఆదాయం దేశానికే ఉపయోగిస్తున్నామని కూడా చెపుతారు. ఇటువంటి వారి వల్లే అధ్యాత్మికత అంటేనే కోపం వస్తోంది. ప్రతి కంపెనీ కూడా ఇన్‌కం టాక్స్ ఎగ్గొట్టడానికి ఇలా దేశ సేవ చేస్తుంటారు.

  ReplyDelete

 2. ఆధ్యాత్మికత వ్యాపించడానికి,వ్యాపారం పెరగటానికి momentum అవసరం. అది వ్యాపారుల వల్ల కలుగుతుంది.

  The best of Baniyas are the best of philanthropists and spiritualists :)


  జిలేబి


  ReplyDelete
 3. ఎన్నో విదేశీ కంపెనీల వస్తువులను వేలం వెర్రిగా కొంటున్నాము. మన దేసీయ సంస్థల వుత్పత్తులను కొనడంలో, ప్రోత్సహించడంలో తప్పేముందో అర్ధం కావడం లేదు?

  ReplyDelete
  Replies
  1. విదేశీ, స్వదేశీ అనేది వేరు సమస్య. ఇక్కడి ప్రశ్న ఉద్దేశం ఆధ్యాత్మికతకు, వ్యాపారంతో పనేమిటి? అన్నది.

   Delete
  2. వ్యాపారంలో ఆద్యాత్మికత నిషిద్దమా..? నిజమైన ఆద్యాత్మిక భావన కలిగిన వ్యాపారంలో లాభాపేక్ష పరిమితమై వినియోగదారుల ప్రయోజనాలు మెరుగయ్యే అవకాశాలు వుంటాయన్నది నా వుద్దేశ్యం. ఒక వేళ ఆ విధమైన సౌలభ్యం లేక పోయినా ప్రపంచ ప్రసిద్ది సంస్థలలో నా దేశ సంస్థ వుండాలన్న ఆశలో భారతీయులు ఆదరిస్తున్నారు. నిజానికి వుత్పత్తులలో సత్తా లేనప్పుడు ఏ అభిమానం ఎక్కువకాలం వాటిని నిలపలేవు. కాదంటారా?

   Delete
  3. < వ్యాపారంలో ఆధ్యాత్మికత నిషిద్ధమా..? >

   అధ్యాత్మికత, వ్యాపారం ఒక ఒరలో ఇమడవనేది నా అభిప్రాయం.


   < నిజమైన ఆధ్యాత్మిక భావన కలిగిన వ్యాపారంలో లాభాపేక్ష పరిమితమై వినియోగదారుల ప్రయోజనాలు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయన్నది నా ఉద్దేశం >

   లాభం అనేది ఉంటేనే అది ఎట్టి పరిస్తితులలోనొ పరిమితం కు పరిమితం కాదు. అందుకే రాందేవ్ బాబాకు , రవిశంకర్ పోటీ వస్తున్నది.


   < వుత్పత్తులలో సత్తా లేనప్పుడు ఏ అభిమానం ఎక్కువకాలం వాటిని నిలపలేవు. కాదంటారా? >

   కాదనను. ఉత్పత్తులలో సత్తా ఉండడానికి, లేకపోవడానికీ అధ్యాత్మికత లింక్ అవసరం లేదు. ఆయా కంపెనీల నిర్వహణను బట్టి ఉంటుంది.

   Delete
  4. ఆధ్యాత్మికతా వ్యాపారమూ ఎందుకు కలవగూడదు?

   ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
   మనిషిని నైతికంగా ఉన్నతుణ్ణి చేసేది అయినప్పుడు ఆ అధ్యాతికత వ్యాపారాన్ని కూడా ఉన్నతం చేస్తుంది కదా!

   జనాంతికంగా కాకుండా సూటిగా వ్యక్తులని ప్రస్తావించి కూడా జవాబు చెప్పవచ్చు!రాందేవ్ బాబా ఒక సన్యాసి,ఆయన చేస్తున్నది వ్యాపారమే అయినా అందులో ప్రజలకి హాని జరుగుతున్నదా?ఆరోగ్యకరమైన దినుసుల్ని తయారు చేసి అమ్ముతున్నాడు,తప్పేముంది?సన్యాసం అంటే ముక్కు మూసుకుని అడవుల్లో తపస్సు చేఅసెది అనే మూఢనమ్మకం మీకుందా?అల అకానప్పుడు ఒక సన్యాసి సమాజహితం కోసం ఒక వస్తువును తయారుచేసి అమ్మడం తప్పెలా అవుతుంది?

   Delete
 4. కొండలరావు గారూ, వృత్తులలో ఉచ్ఛనీచాలు ఉండవు, అన్ని పనులూ అందరికీ సమ్మతమే. కొందరు పని చేసే పద్దతిలో తప్పొప్పులు చేస్తే వాటిని ఆ వృత్తికే అంటకట్టడం సరి కాదు.

  వ్యాపారం దోపిడీ పర్యాయపదాలన్న ధోరణి వలన దేశం ఇప్పటికే నష్టపోయింది. సన్యాసులకు బంధాలపై మోహము ఉండకూడదు కానీ బంధాలే వద్దంటే ఎలా?

  వ్యాపారం చేసే హక్కు ఇతరులకు ఎంతుందో రాందేవ్ గారికీ అంతే ఉంది. ఉత్పత్తులు నచ్చిన వారు కొంటారు లేకపోతె లేదు, దీనికి రాందేవ్ ఆధిక్యాత్మభావాలకు సంబంధం లేదు. అదేరకంగా ఉద్యోగస్తులు, సప్లయర్లు, డీలర్లు వగైరాలు కూడా ఆలోచిస్తారు. ఎవరో కొందరు సంస్థ యజమాని వాణిజ్యేతర విషయాలపై మీద కోపంతో మంచి ఉత్పత్తులు వాడమని భీష్మిస్తే అది వారికే నష్టం.

  ReplyDelete
  Replies
  1. జై గారు, మీ నుండి మరింత సమాచారం కావాలి. ఆధ్యాత్మికత అంటే మీరేమి నిర్వచనం చెప్తారు?
   ఆధ్యాత్మికత శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో నింపుకోమంటుందా?
   శారీరక సౌందర్యానికి ఆధ్యాత్మికత ఏ విలువ ఇస్తుంది?

   Delete
  2. నేను ఆధ్యాత్మికత గురించి చెప్పేటంత వాడిని కాను.

   ఆధ్యాత్మికత సుగంధ ద్రవ్యాలు వాడమని చెప్పదేమో కానీ వాడొద్దని కూడా చెప్పదనుకుంటా. మనుసులో మంచి భావాలు (లేదా భక్తి) ఉన్నంతవరకు శరీర సౌందర్యం & సౌకర్యాలకు ఆధ్యాత్మిక పరమయిన అభ్యంతరం ఉండదని నా అంచనా.

   ఇకపోతే సౌందర్య ఉత్పత్తులు తయారీ చేయడం & తానే వాడడం ఒకటే కాదు.

   ఒకవేళ (even if) సన్యాసులకు సుగంధద్రవ్యాలు నిషిద్ధమయినా కూడా, ఈ నిబంధన వర్తించని మామూలు ప్రజల కోసం ఉత్పత్తి చేయడం ఏ రకంగానూ తప్పు కాదు.

   Delete
  3. రాం దేవ్ విదేశీ వస్తువులను వాడొద్దని పిలుపునిచ్చాడు, తన సంపాదనలో ప్రతి పైసా దేశానికే అని చెప్పాడు. 90 శాతం బాలకృష్ణ దగ్గర ఉంది.గాయత్రి పేరున రఘు పెట్టినట్లన్నమాట ! దేశం కోసమయితే ఆదాయవ్యయాలు చెప్పడానికి ఏమిటి నష్టం ? జుకెర్ బర్గ్ విరాళం గురించి చెప్పుకోలేదా ? నిజంగా దేశసేవ చేస్తే దాచడం ఎందుకు ?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top