----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
భారీ మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు 

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈనెల 23న జరిగిన ఎన్నికలో 79.13 శాతం పోలింగ్‌ నమోదైంది. నంద్యాల అర్బన్‌లో మొత్తం 1,42,628 ఓట్లకుగాను 1,05,484 ఓట్లు పోలయ్యాయి. నంద్యాల రూరల్‌లో 47,386 ఓట్లకుగాను 41,512 ఓట్లు పోలయ్యాయి. గోస్పాడు మండలంలో మొత్తం 28,844 ఓట్లకుగాను 26,193 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మొత్తం 56శాతం ఓట్లతో గెలుపొందారు.

27,466 ఓట్ల మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు 
వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. మొత్తం మీద టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు.. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్‌‌కు మొత్తం 1382 ఓట్లు పోలయ్యాయి.

ఓట్ల విషయానికొస్తే.. 
నంద్యాల రూరల్ మండలంలో 4750 ఓట్లతో టీడీపీ మెజార్టీ సాధించింది. నంద్యాల రూరల్ మండలంలో టీడీపీకి 26,772 ఓట్లు, వైసీపీ 22,022 ఓట్లు పోలయ్యాయి.
నంద్యాల టౌన్‌లో 20,614 ఓట్లతో టీడీపీ మెజార్టీ సాధించింది. టౌన్‌లో టీడీపీకి 59,494 ఓట్లు, వైసీపీకి 38,880 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీకి పట్టున్న గోస్పాడు మండలంలోనూ టీడీపీకి ఆధిక్యం కనబరిచింది. ఈ మండలంలో టీడీపీకి 1858 ఓట్లు పోలయ్యాయి.
ఆది నుంచి చివరి రౌండ్ వరకూ..
ఆది నుంచి చివరి రౌండ్ వరకూ టీడీపీ ఆధిక్యంతోనే దూసుకెళ్లింది. ఒక్క 16వ రౌండ్‌లో తప్ప వైసీపీ దరిదాపుల్లోకి రాలేకపోయింది. మొదటి ఆరు రౌండ్లలో భారీగా ఆధిక్యం కనబరిచిన టీడీపీ ఏడు నుంచి పది రౌండ్ల వరకూ పెద్దగా ఆధిక్యం కనబరచలేకపోయింది. అనంతరం 11వ రౌండ్ నుంచి భారీ ఆధిక్యతతోనే సైకిల్ దూసుకెళ్లింది. కాగా అప్పటికే దాదాపు టీడీపీకి విజయం ఖరారు కావడంతో 10వ రౌండ్ పూర్తవ్వగానే వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ఇంటి బాట పట్టారు. మూడు రౌండ్లు పూర్తయినప్పట్నుంచీ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఏయే రౌండ్‌లో ఎవరు సత్తా చాటారు.. 
మొదటి రౌండ్‌‌లో.. : టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5474 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4179 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీడీపీకి 1295 ఓట్ల ఆధిక్యం లభించింది.

రెండో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4726 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3945 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీకి 1634 ఓట్ల ఆధిక్యం లభించింది.

మూడో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 7058 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3126 పోలయ్యాయి. దీంతో మూడో రౌండ్‌లో టీడీపీకి 3,113 ఓట్ల ఆధిక్యం లభించింది.

నాలుగో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 6465 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 2859 పోలయ్యాయి. దీంతో నాలుగో రౌండ్‌లో టీడీపీకి 3600 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఐదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 6975 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3563 పోలయ్యాయి. దీంతో ఐదో రౌండ్‌లో టీడీపీకి 3412 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఆరో రౌండ్‌లో.. :టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 6161 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 2858 పోలయ్యాయి. దీంతో ఆరో రౌండ్‌లో టీడీపీకి 3303 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఏడో రౌండ్‌లో.. :టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4859 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4302 పోలయ్యాయి. దీంతో ఏడో రౌండ్‌లో టీడీపీకి 557 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఎనిమిదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4436 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4088 పోలయ్యాయి. దీంతో ఎనిమిదో రౌండ్‌లో టీడీపీకి 348 ఓట్ల ఆధిక్యం లభించింది.

తొమ్మిదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4309 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3430 పోలయ్యాయి. దీంతో తొమ్మిదో రౌండ్‌లో టీడీపీకి 879 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4642 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3156 పోలయ్యాయి. దీంతో పదో రౌండ్‌లో టీడీపీకి 1486 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదకొండో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4326 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3722 పోలయ్యాయి. దీంతో పదకొండో రౌండ్‌లో టీడీపీకి 604 ఓట్ల ఆధిక్యం లభించింది.

పన్నెండో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5629 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4049 పోలయ్యాయి. దీంతో పన్నెండో రౌండ్‌లో టీడీపీకి 1580 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదమూడో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5690 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4230 పోలయ్యాయి. దీంతో పదమూడో రౌండ్‌లో టీడీపీకి 1460 ఓట్ల ఆధిక్యం లభించింది.

పద్నాలుగో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5172 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3868 పోలయ్యాయి. దీంతో పద్నాలుగో రౌండ్‌లో టీడీపీకి 1304 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదిహేనో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5770 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4328 పోలయ్యాయి. దీంతో పదిహేనో రౌండ్‌లో టీడీపీకి 1442 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదహారో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓట్లు 4663 రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 5317 పోలయ్యాయి. దీంతో పదహారో రౌండ్‌లో వైసీపీకి 768 ఓట్ల ఆధిక్యం లభించింది.

పదహేడో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5133 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4148 పోలయ్యాయి. దీంతో పదహేడో రౌండ్‌లో టీడీపీకి 985 ఓట్ల ఆధిక్యం లభించింది.

పద్దెనిమిదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4467 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3961 పోలయ్యాయి. దీంతో పద్దెనిమిదో రౌండ్‌లో టీడీపీకి 506 ఓట్ల ఆధిక్యం లభించింది.

పంతొమ్మిదో రౌండ్‌లో..: టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి పోలయ్యాయి. దీంతో పంతొమ్మిదో రౌండ్‌లో టీడీపీకి ఓట్ల ఆధిక్యం లభించింది.

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో..
హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీపై కంటే సీఎం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని జగన్‌ విమర్శలు చేశారు. హామీలను నెరవేర్చని చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని.. ఉరి తీయాలంటూ జగన్‌ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. జగన్‌ వైఖరికి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సలహానే కారణమని ప్రచారం జరుగుతోంది. 

ఇవన్నీ అటుంచితే..
టీడీపీకి 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే 6శాతం ఎక్కువగానే (56 శాతం) ఓట్లు టీడీపీ సాధించింది. నంద్యాల నగర ప్రాంతం టీడీపీకి బ్రహ్మరథం పడుతుందన్న ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వే అక్షరాలా నిజమైంది.
Reactions:

Post a Comment

 1. జనం తీర్పు చెప్పినా
  వినీ వినదు వైకాపా
  మన కామెం ట్లింకెందుకు
  ఓ కూనలమ్మా

  ReplyDelete
  Replies
  1. చెప్పడమే మన ధర్మం విననివారిది ఖర్మం.... :)

   Delete

 2. నంద్యాల మీ సొంతూరాండి :) ఇంత వివరంగా లెక్కలిచ్చారు :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఎత్తిపోతలేనండీ అన్నీ...

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top