జాతీయ గీతంపై కమల్‌ స్పందన 

చెన్నై: ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవడానికి సినిమాహాళ్లలో జాతీయ గీతం ప్రసారమైనప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్పందించారు. ఈ విషయంలో ఆయన సుప్రీంకోర్టుకే మద్దతు తెలిపారు.
‘రోజూ అర్థరాత్రి సింగపూర్‌ తమ జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తుంది. అదే విధంగా దూర్‌దర్శన్‌లోనూ ప్రసారం చేయండి. అంతేకానీ ఎక్కడపడితే అక్కడ మా దేశభక్తిని రుజువు చేసుకోవాలని బలవంత పెట్టకండి. ఇలాంటి వివాదాస్పద విషయాల్లో సింగపూర్‌ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే.. అది నియంతృత్వం దేశమని కొందరు విమర్శకులవాదన. అది మనకు కూడా కావాలా? వద్దు ప్లీజ్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు కమల్‌.
ఈ జాతీయ గీతం అంశంపై ప్రముఖ నటుడు అరవింద్‌ స్వామి కూడా స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరని ప్రశ్నించారు. జాతీయగీతం వినిపించనప్పుడు తాను లేచి నిలబడటంతో పాటు, తోటివారితో కలిసి ఆలపిస్తానని అన్నారు. అయితే అది సినిమా హాళ్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్థం కావడంలేదని పేర్కొన్నారు.
Reactions:

Post a Comment


 1. కమల హాసనుడు ఇంతకు మునుపు రాజకీయాల లో కి పోనన్నాడు :)
  అమ్మ పోయే ! అయ్య కాటి కి కాళ్ళు చాపుకుని ఉండే !
  ఇప్పటి నించే ఇట్లాంటి కామింట్ల తో కొద్ది గ జన బాహుళ్యం లో కనబడ దా మని అనుకుని ఉంటాడు :)

  మేరా భారత్ 'మగాన్' :)

  జిలేబి

  ReplyDelete
 2. కమలహాసనుడి కన్న అరవిందుడే లెస్సగ పలికినాడు!

  ReplyDelete
 3. కమల్ హాసన్ ఎజెండా ఏమిటో తెలియదు గానీ, 1960 లలో యుద్ధ వాతావరణంలో ప్రజల్ని ఉత్తేజితుల్ని జేయడానికి / ఐక్యతా భావం పెంచడానికీ ఇలా జాతీయగీతం మొదలెట్టారని గుర్తుండే ఉంటుంది. సినిమా హాలే ఎందుకంటే .. ఎక్కువ మంది జనం రోజూ ఒకచోట జేరతారు కాబట్టి (అనుకుంటున్నాను). 1970 వ దశకంలో జన్మించిన అరవింద స్వామి కి ఈ గత వృత్తాతం తెలుసా? సినిమా హల్ అనగానే సినిమాలను మాత్రమే ఏదో సతాయిస్తున్నారని అరవింద స్వామి భావిస్తున్నారేమో?
  అయితే ఒకటి నా అభిప్రాయంలో - జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు మాత్రం లేచి నిలబడడం అనేది పౌరుడి కర్తవ్యం. గర్వ పడుతూ చెయ్యాలి. దేనిపట్ల చూపించవలసిన మర్యాద దానిపట్ల చూపించాలి. ఏ దేశస్థులైనా చేసే పనే అది. మనకి ఈ రోజున అభ్యంతరం ఏం కనిపించిందో మరి?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top