దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 14 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 11 చోట్ల పరాజయం పాలయింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభలో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. గత నెల 28న ఉప ఎన్నికలు నిర్వహించగా గురువారం ఫలితాలను ప్రకటించారు. మూడు చోట్ల మాత్రమే భాజపా కూటమి విజయం సాధించింది. 2019లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందు జరిగే ప్రతి ఉప ఎన్నికా రాజకీయంగా కీలకమయిన నేపథ్యంలో తాజా ఫలితాలు.. కమలదళానికి మింగుడుపడని అంశమే. భాజపాయేతర పక్షాల ఐక్యతను బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాలు వాటిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నాలుగేళ్ల మోదీ ప్రభుత్వ పాలనకు, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలకు, పునరేకీకరణలకు నాందిగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలను అటు అధికార భాజపా, ఇటు విపక్షాలు ఎంతో కీలకంగా భావించాయి. సర్వశక్తులూ ఒడ్డాయి. నాలుగు లోక్‌సభ స్థానాలు- కైరానా(ఉత్తర్‌ప్రదేశ్‌), భండారా-గోండియా, పాల్‌ఘర్‌(మహారాష్ట్ర), నాగాలాండ్‌లో ఉపఎన్నికలు జరగగా భాజపా సిట్టింగ్‌ స్థానమైన పాల్‌ఘర్‌లో పరువు కాపాడుకుంది. ఇక్కడ భాజపా మిత్రపక్షం శివసేనే ప్రత్యర్థిగా నిలిచింది. విపక్షం గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. భాజపాకు చెందిన రాజేంద్ర గావిట్‌... శివసేన అభ్యర్థి శ్రీనివాస్‌ వనగాపై విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. మరో రెండు సిట్టింగ్‌ స్థానాలు కైరానా, భండారా-గోండియాను కోల్పోవడం భాజపాకు గట్టి దెబ్బే. ముఖ్యంగా కైరానా ఓటమి కమలదళం జీర్ణించుకోలేని అంశం. ఇక్కడ విపక్షాలన్నీ కలిపి భాజపాకు వ్యతిరేకంగా ఆర్‌ఎల్‌డీ నుంచి తబస్సుమ్‌ హసన్‌ను బరిలో నిలిపాయి. విపక్షాల ఐక్యతను చాటుతూ ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలవడంతో కమలదళం పరవు పోయింది. నాగాలాండ్‌లో భాజపా మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) గెలిచింది.
(from eenadu digital)
Reactions:

Post a Comment

 1. బీ.జె.పీకి ఇప్పుడు కూడ అవకాశాలు బాగానే ఉన్నాయి. కైనారా భారత దేశం మొత్తానికి ఉదాహరణ కాదు. అక్కడ గుజ్జర్లను విడదీసి అధికారములోకి రాగలిగారు. ప్రస్తుతం అక్కడి గుజ్జర్లు ఒక్కటిగా కలిసిపోయారు. దానితో బీ.జే.పీకి మూడింది, నాలిగింది.

  రాజకీయల్లో అవసరాల కోసం చేసుకునే సర్దుబాట్లు ఎప్పుడూ ఉంటాయి. శాశ్వత శతృవులు, శాశ్వత మితృలూ ఉండరు. కానీ, కైరానా ఫలితం బీ.జే.పీని హైరానా పెట్టేదే. దక్షిణ భారతములో అనుకున్నంతగా కలిసిరావడం లేదు. చివరకు నార్తులో కూడా దెబ్బ పడేట్టుంది అని సంకేతాలు కనపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా బీ.జే.పీని దెబ్బకొట్టే ఫార్ముల ఇప్పుడు ప్రతిపక్షాలకు దొరికింది. సో, ఆట రసపట్టులో ఉన్నట్టే. ఏకపక్షం మాత్రం అయ్యే చాన్సులేదు. కనీసం అంటే.. బీ.జే.పీ .. ఇప్పుడున్నట్లుగా నిరంకుశంగా ప్రవర్తించే ఛాన్సయితే 2019 తరువాత ఉండదు. ఇది బెస్ట్ కేస్, వరస్ట్ కేస్ అంటే.. బొక్కా బోర్లా పడి ప్రతిపక్షములో కూర్చోవడమే.

  ReplyDelete
 2. చరణ్ సింగ్ వారసత్వం తునాతునకులు అయ్యాక పశ్చిమ యూపీ రాజకీయ పునరీకరణ మొదలయ్యింది. గత కొద్దేళ్లుగా ఈ ప్రాంతం బీజేపీ కంచుకోటగా మారుతూ వచ్చింది. 2013 మతఘర్షణల దరిమిలా కాషాయ జైత్రయాత్ర దద్దరిల్లింది.

  ప్రస్తుత కైరానా ఫలితం ఇందుకు *తాత్కాలికంగా* బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది. ఇది నిలకడగా ఉంటుందని నాకయితే నమ్మకం కావడం లేదు. అజిత్ సింగ్ పట్టూ పొంతన లేని నాయకత్వం & చపలత్వం వలన లోకదళ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం.

  బీజేపీ కాస్త కష్ట పడి క్షేత్ర స్థాయిలో పని చేస్తే పశ్చిమ యూపీ తిరిగి వారికే పట్టం కడుతుందని నా అంచనా.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top