మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
అంశం : ముందస్తు ఎన్నికలు
ప్రశ్న సంఖ్య 2
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------

తెలంగాణ సి.ఎం కే.సి.ఆర్ డిల్లీ నుండి వచ్చాక ముందస్తు ఎన్నికల విషయమై కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ ల మధ్య మాటల యుద్ధం మొదలయింది. కేంద్రంలో తన ప్రభ తగ్గుతుందన్న వాస్తవాన్ని గ్రహించిన మోడీ కూడా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు ముందస్తుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. తొందరపడి ముందస్తుకు పోయి నష్టపోయిన సందర్భాలు కొన్ని, లాభపడ్డ సందర్భాలు కొన్ని పాలకపక్షాలకు అనుభవాలున్నాయి. ప్రస్తుతం లోక్ సభతో పాటు చాలా రాష్ట్రాలలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. అందులో 2 తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణలో మరోసారి అధికారం తమదేనని ధీమాతో ఉన్న కే.సి.ఆర్ కూడా తాజా సర్వేతో కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహంలో దిట్ట అయిన కే.సి.ఆర్ ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హల్ చల్ చెస్తున్నారు. అయితే ఆయన వైఖరి బి.జే.పీ కే అనుకూలం అన్నట్లు విమర్శలున్నాయి. పాలనలో ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకుని, గట్టి ప్రతిపక్షమ్ కలిగి మరోవైపు బి.జే.పీ, పవన్ కళ్యాణ్ మద్దతును కోల్పోయిన ఏ.పీ సి.ఎం  చంద్రబాబు హఠాత్తుగా జ్ఞానం తెచ్చుకుని బి.జే.పీకి తానే మొదటి శత్రువునన్నట్లు వాయిస్ పెంచారు. ప్రత్యెక హోదా అంశం ఆధారంగా ఏ.పీ ప్రజల భావాన్ని కేంద్రానికి వ్యతిరేకంగా తీసుకురావడం ద్వారా  తిరిగి గద్దెనెక్కాలని చూస్తున్నారు. ఈ విషయంలో కొంతమేరకు బాబు సక్సెస్ అయ్యాడు. కేంద్రంలో తిరిగి టీ.డీ.పీ చక్రం తిప్పుతుందని తమ్ముల్లకు ధైర్యం చెప్తున్నారు. ఏ.పీలో టీ.డీ.పీ తిరిగి అధికారం చేపట్టడం అంత తేలిక కాకపోవచ్చు. మరోవైపు కేంద్రంలో మోడీని డీకోనేందుకు ప్రాంతీయపార్టీలు కూటమిగా రానున్నాయి. అధికారం తమదేనని కాంగ్రెస్ మద్దతిస్తుందని భావిస్తున్నాయి. అయితే ఈ కప్పల తక్కెడ ప్రయోగంపై ప్రజలకు విశ్వాసం లేదన్న అంచనాలున్నాయి. కేంద్రంలో భా.జా.పాకు గానీ, మోడీకు గానీ కాంగ్రెస్ లేదా రాహుల్ గట్టి ప్రత్యామ్నయమన్నంత భావన రాజకీయవర్గాలలో లేదా విశ్లేషకులలో లేదు. మోడీ పైనా, వివిధ రాష్ట్రాలలో బి.జే.పీ పాలనపైనా ఉన్న వ్యతిరేకత తీవ్రత ను బట్టి రాహుల్ అవకాశాలు ఆధారపడ్డాయనవచ్చు. ఈ నేపధ్యంలో కేంద్రంలోనూ.... వివిధ రాష్ట్రాలలోనూ.... ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? మీ అభిప్రాయం తెలుపగలరని విజ్ఞప్తి.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top