అతడిలో అంత క్రూరత్వం దాగుందా.? 

హైదరాబాద్: ఒంటరి జంటలే... ఆ సైనికుడి లక్ష్యమా? తన భుజబలంతో ప్రేమికుడ్ని బెదిరించడం, అతని ప్రేయసిపై పైశాచికానికి ఒడిగట్టడం... ఆ జవాన్‌కు నిత్యకృత్యమా? హైదరాబాద్ అమ్ముగూడలో జరిగిన యువతిపై అత్యాచారయత్నం కేసులో అరెస్టయిన ఆర్మీ ఉద్యోగి ఖాతాలో మరిన్ని అఘాయిత్యాలు ఉన్నాయా? ఇంతకూ పోలీసులు ఏం చెబుతున్నారు?

ఒక మహిళకు రక్షణ కల్పించలేని సైనికుడు... దేశానికి ఏం రక్షణగా నిలుస్తాడు? హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో జరిగిన అత్యాచారయత్నం కేసులో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టుతో... సగటు వ్యక్తి నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇది. ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి.. యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మీ జవాన్‌ను పోలీసులు సినీఫక్కీలో అరెస్ట్ చేయడంతో... ఈ కేసు సంచలనంగా మారింది. ఈ నెల 23న తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమ్ముగూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా ఉన్న జంటపై బ్రిజేష్‌కుమార్ అనే ఆర్మీ ఉద్యోగి దాడి చేశాడు. సికింద్రాబాద్ పికెట్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన ఓ యువతి... తనతోపాటు ఇంటర్మీడియెట్ చదువుతున్న శేఖర్‌తో కలిసి ఉండగా... ఆమెపై బ్రిజేష్‌కుమార్ కన్నేశాడు. తానో సైనికుడిననే విషయాన్ని విస్మరించి... కీచక చర్యకు పాల్పడ్డాడు. తొలుత యువకుడిపై దాడి చేశాడు. అతను ఎదురుతిరగడంతో... తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు బ్రిజేష్. ఆ యువకుడ్ని తీవ్రంగా చితకబాదాడు. స్పృహ కోల్పోయేలా కొట్టి పడేశాడు. సైనికుడిలోని సైతాన్‌ను చూసిన యువతి... భయంతో పరుగుతీసింది. లేడిని క్రూరమృగం వెంటాడి పట్టుకున్న రీతిలో... ఆమెను చేజిక్కించుకున్నాడు బ్రిజేష్. యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి గింజుకుంటూనే... బాధితురాలు సెల్‌ఫోన్ నుంచి '100'కు డయల్ చేసింది. అదృష్టవశాత్తు అదే ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్... బాధిత యువతి అరుపులు, కేకలు విని పరుగునా ఘటనాస్థలికి వెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడుతున్న జవాన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను కానిస్టేబుల్‌పై దాడిచేసి పారిపోతుండగా... మరో పోలీస్ వెంటాడాడు. చివరకు సినీఫక్కీలో ఛేజింగ్ చేసి నిందితుడ్ని పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుడ్ని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా... తన పేరు బ్రిజేష్‌కుమార్ అని, ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు.

ప్రేమజంట ఏకాంతంగా ఉండటాన్ని గమనించిన ఆర్మీ జవాన్... ఆమె ప్రియుడిపై దాడిచేసి... అతని ముందే ప్రియురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో... వాటికి, నిందితుడు బ్రిజేష్‌కుమార్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి. గతేడాది డిసెంబర్ 27న అమ్ముగూడ ప్రాంతంలోనే ఓ ఆర్మీ అధికారి కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో బాధితురాలు తెలిపిన ఆనవాళ్ల ప్రకారం... నిందితుడు నల్ల రంగు ప్యాంట్ వేసుకున్నారని చెప్పారు. అంతేకాక మెడపై తీవ్రంగా గాయపర్చి తనకు సహకరించేలా చేసుకుంటాడని గుర్తించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు... గతంలో బాధితులపై అత్యాచారం చేసిన సందర్భంగా దొరికిన వీర్యం నమూనాలతో నిందితుడి వీర్యం నమూనాలు పోల్చారు. అవి రెండు సరిపోవడంతో... గతేడాది డిసెంబరులో జరిగిన అత్యాచారం కేసులోనూ బ్రిజేష్ కుమారే నిందితుడని తేలింది. ఇందుకు FSL రిపోర్ట్‌లు కూడా పాజిటివ్‌గా రావడంతో... బ్రిజేష్‌కుమార్‌ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేందుకు... శాస్త్రీయంగా అన్నిరకాల ఆధారాలు సేకరించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. సైతాన్‌లా వ్యవహరించిన బ్రిజేష్‌కుమార్... సైనికుడిగా గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు? అతనికి నేర చరిత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. సినీ ఫక్కీలో నిందితుడ్ని పట్టుకున్న కానిస్టేబుల్, డ్రైవర్, హోంగార్డులను... 'పోలీసుల్లో హీరోలు' అంటూ కమిషనర్ ప్రశంసించారు. ( ఆంధ్రజ్యోతి డిజిటల్ ఎడిషన్ నుండి సేకరణ)
----------------------------
బాధ్యత కలిగిన ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడడం దేనినీ సూచిస్తోంది?
 సైన్యం, పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలు ఏమిటి?
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top