మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.

-----------------------------------------------
అంశం : అవినీతి
ప్రశ్న సంఖ్య - 34
ప్రశ్నిస్తున్నవారు :  పల్లా కొండల రావు. 
------------------------------------------------
*republished
Reactions:

Post a Comment

 1. Avi neethi mana janaaniki nara naraana jeerninchuku poyindi.......

  ReplyDelete
 2. అవినీతి నుండి తమ కూడా తాత్కాలికంగా కాగే లాబం మాత్రమే ఇప్పుడు కనపుడుతుంది, కానీ దీర్గ కాలం అది ఎంత నష్టం కలిస్తుంది అనేది అర్తం కావడం లేదు, కొంత సమయం పడుతుంది.

  ReplyDelete
 3. Can workers get high wages if the capitalist definitely pays taxes to the state? In these circumstances, who would mind whether his boss is corrupt or not?

  ReplyDelete
 4. Read this: http://content.janavijayam.in/2013/11/blog-post_27.html

  ReplyDelete
 5. జనం అవినీతిని ఎందుకు పట్టించుకోరు అనేది తెలియాలంటే సలు అవినీతి అంటే ఏమిటో తెలియాలి, కదా!అందరికీ ఆవసరమైనది డబ్బు కనక మనీ/రెవెన్యూ/ప్రాపర్టీ విషయాల్లో జరిగేదాన్నే అవినీతి కింద లెక్కేస్తారు.కానీ ఒక పెళ్ళైన మగాడు కానీ ఆడది కానీ వేరేవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది తప్పు అంటారే కానీ అవినీతి అనరు,ఎందుకని?నీతి కానిది యేదైనా అవినీతియే అవుతుంది,మరి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి?ఇన్ని పేర్లతో ఇన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి?

  ఒక విషయానికి ప్రతిస్పందించటం గురించి, ఒక మనిషితో వ్యవహరించటం గురించి, ఒక వస్తువిశేషాన్ని సాధించటం గురించి సమాజంలో అందరూ ఒపుకుని పాటిస్తున్న నియమాలని తన స్వార్ధం కోసం ఉల్లంఘించటం అనేది అన్ని రకాల అవినీతుల్లోనూ కనిపిస్తుంది, అవునా?


  ఇక్కడ చాలామంది గమనించని విషయం ఏమిటంటే చరిత్రని మలుపు తిప్పిన విప్లవాలు చాలావాటిలో అరాచక వాదులు/తిరుగుబాటు దారులు/అవినీతి పరుల కార్యకలాపాల నుంచే మొదలయ్యాయి!అక్కద ఆఖరి మలుపులో విజయం సాధించిన విప్లవ నాయకులు చేసినది యేమిటంటే ఏ లాభాన్ని ఆశించి కొద్ది మంది అవినీతిపరులు/అరాచక వాదులు సమాజంలో అశాంతిని సృష్టించారో ఆ లాభాన్నీ ప్రయోజనాన్నీ ప్రజలందరికీ దక్కేలా చెయ్యటం - అది పాత నియమాలని బద్దలు కొట్టటం ద్వారా కావచ్చు,కొత్త నియమాల్ని ఏర్పాటు చెయ్యటం ద్వారా కావచ్చు!

  ఆధ్యాత్మిక పరమైన అవినీతి సాంస్కృతిక ప్రశాంతతని శిధిలం చేస్తుంది,అది సామాజికపరమైన ఐకమత్యాన్ని దెబ్బ తీస్తుంది,అది ఆర్ధికరంగంలో ద్రవ్యోలబ్ణాన్ని సృష్టిస్తుంది - అప్పటికి అవినీతి కంటికి కనిపించి ఆందోళన కలుగుతుంది!

  చారిత్రక సన్నివేశాల విశ్లేషణా ఆర్ధిక విషయాల పరిశీలనా బోరు కొడుతుంది కాబట్టి ఒక పిట్టకధ చెబుతాను.పిట్టకధే అయినా పాయింటుని అర్ధం అయ్యేటట్టు చెప్పడం వరకు గట్టికధే!ఒక చోట ఒక లంక ఉందనుకోండి.ఆ లంకలోనివాళ్ళు ఇటువైపుకి రావాలన్నా ఇటువైపువాళ్ళు ఆ లంకకి వెళ్ళాలన్నా ఈదుకుంటూ వెళ్ళాల్సి ఉందనుకోండి.పోనీ పడవలు ఉన్నాయనుకోండి.ఈత అందరికీ రాదు,పడవ మునిగిపోవచ్చు - అయినా వెళ్ళేవాళ్ళూ వచ్చేవాళ్ళూ అలాగే వస్తారు,పోతారు.ప్రభుత్వం ఒక వంతెన కడితే ఈ గొడవలు ఉండవు కదా!కట్టిందని అనుకుందాం.ఒక్కోసారి కాంట్రాక్టర్లకి ఆఖరి బిల్లులు తను ఇవ్వడానికి బదులు టోల్ గేట్ పెట్టుకుని వాళ్ళనే బకాయి వసూలు చేసుకోమంటుంది.అది గవర్నమెంటు నిర్ణయించినదే కదా!ఇప్పుడు ఆ వంతెన ఉపయోగించుకోవడానికి డబ్బులు లేనివాళ్ళలో ఈత వచ్చినవాడు ఈదుకుంటూ పోవచ్చును, అవునా?గవర్నమెంటు టోల్గేట్ పద్ధతిని ఎల్లకాలం ఉంచదు కదా - బిల్లు సెటిలయ్యాక ఎత్తేస్తుంది.అంతవరకు డబ్బులు కట్టకుండా ఈదుకుంటూ వెళ్తున్నవాళ్ళు ఇప్పుడు కూడా ఈదుకుంటూ వెళ్తే వాళ్ళని తెలివితక్కువ దద్దమ్మలు అంటారు - సుబ్బరంగా చేతులూపుకుంటూ పైసా ఖర్చులేకుండా నడిచిపోయే వీలుంటే అది మానేసి రొప్పుకుంటూ రోజుకుంటూ పోయేవాళ్లని ఇంకేమనాలి?అవినీతి ఎట్లా ఉంటుంది,అవినీతిని ఎందుకు సహిస్తారు,అవినీతి ఎట్లా పోతుంది అని అర్ధం కావడానికి ఇచ్చిన ఈ చిన్న ఉదాహరణలో సమస్తాన్నీ చెప్పటం కుదరదు గానీ మరింత ఆదాయం,మరిన్ని సౌకర్యాలు,మరింత భద్రత ప్రతి ఒక్కరికీ సహజమైన కోరికలే కాబట్టి అవినీతి ప్రమాదకరమైన స్థాయికి పెరిగేవరకు వ్యతిరేకత రాకపోవటం సహజమేనని తెలుసుకోవచ్చు!

  టోల్ గేట్ ఉన్నప్పుడు కూడా ఈతకు మళ్ళేవాళ్ళని ఆపి రోడ్డు మీద నడించాలంటే రెండే దారులు - ఒకటి జాలిపడి అప్పటికపుడు టోల్ గేట్ టికెట్ కొనడానికి డబ్బులివ్వటం,రెండు వాడు టోల్ గేట్ టికెట్ కట్టి వెళ్ళే స్థాయిలో ఆదాయాన్ని పెంచటం.మొదటిది ఉదారులైన వ్యక్తులు దానధర్మాల పట్ల ఆసక్తి ఉండి చేస్తారు,మత,ధార్మిక సంస్థలు ఈ పని చెయ్యాలి. రెండవది మాత్రం ప్రభుత్వమే చెయ్యాలి.

  ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా ద్రవ్యోల్బణం ఏదో ఒక స్థాయిలో ఉనికిలో ఉంటూనే ఉంటుందనీ అభివృద్ధి ఆగిపోయినప్పుడే అది ఒక సమస్య అవుతుందనీ అంటున్నారు.ఆర్ధిక చలనం ఆగిపోవడం వల్లనే అవినీతి పుడుతుందని తెలుసుకుంటే ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ కదిలించి వేగం పుంజుకునేటట్టు చేస్తేనే అవినీతి అంతం అవుతుంది.అసలు అవినీతి కనపడకూడదంటే దేశపు ఆర్ధికాభివృద్ధి ఆగిపోకుండా ఎదుగుతూనే ఉండాలి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top