మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.

-----------------------------------------------

అంశం :సంప్రదాయం-ఆచారాలు
ప్రశ్న సంఖ్య - 35
ప్రశ్నిస్తున్నవారు : ప్రవీణ్
------------------------------------------------
Name:Praveen 
E-Mail:deleted
Subject:ఆడవాళ్ళకి బొట్టూ, గాజులూ మంగళసూత్రాలూ అవసరమా?  
Message:
రోజా, సుమలు మంగళసూత్రాలు పెట్టుకోకపోవడం పై ఫేస్‌బుక్‌లో కొంత మంది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. "మంగళసూత్రం తీసెయ్యడం మాత్రమే ఎందుకు? సన్నీ లియోన్‌లాగ బికినీ వేసుకోవచ్చు కదా" అనే అర్థం వచ్చేలా వ్రాసారు. రోజా, సుమలు సినిమా & టి.వి. నటులు. వాళ్ళు మంగళసూత్రాలు పెట్టుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు. నేను ఈ విషయం స్పష్టంగానే చెప్పాను. వాళ్ళకి అది అర్థం కాలేదు.

అసలు బొట్టూ, గాజులూ పెట్టుకోవడం కూడా అనవసరమే అని నేను అంటాను. 20 ఏళ్ళ అమ్మాయి బొట్టు పెట్టుకోకపోతే ఆమెకి పెళ్ళి కాలేదనీ, 60 ఏళ్ళ ఆవిడ బొట్టు పెట్టుకోకపోతే ఆమె విధవ అనీ అనుకునే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. భర్తకీ, బొట్టుకీ సంబంధం ఏమిటి అని అడిగే సెన్స్ మాత్రం వాళ్ళకి లేదు. ముస్లింలూ, యూదులూ స్త్రీకి భర్త చనిపోయిన మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. హిందువులు మాత్రం భర్త చనిపోయిన స్త్రీ బొట్టు పెట్టుకోవడాన్ని కూడా హర్షించలేరు. బొట్టు పేరుతో మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ బొట్టు తీసెయ్యడమే మంచిదని నేను అంటాను. 
Reactions:

Post a Comment

  1. రమా సుందరి అనే బ్లాగర్ ఓ సారి ఫేస్‌బుక్‌లో వ్రాసారు, ఆవిడ బొట్టు పెట్టుకోకపోవడం వల్ల ఆవిణ్ణి దళిత క్రిస్టియన్ అనుకుని గుంటూరులో ఆవిడకి ఇల్లు ఎవరూ అద్దెకి ఇవ్వలేదని.

    ReplyDelete
    Replies
    1. అవసరమా? కాదా? అన్నది సామాజిక చైతన్యం పైనా, వ్యక్తిగత ఇష్టాలపైనా ఆధారపడి ఉంటుంది. బలవంతంగా ఆచరిమ్పజేయడమూ, వద్దని అతి విమర్శలు చేయడమూ రెండూ తప్పే.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top