మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.


----------------------------------------------
అంశం : కమ్యూనిజం
ప్రశ్న సంఖ్య - 39
ప్రశ్నిస్తున్నవారు : ప్రవీణ్.
------------------------------------------------

Name:Praveen 
E-Mail:deleted
Subject:ఇది పోరపాటా లేదా అజ్ఞానమా?  
Message:సి.పి.ఐ., సి.పి.ఎం.ల కార్యకర్తలలో చాలా మందికి కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు. ఇది నా హైపోథీసిస్ కాదు, కళ్ళతో చూసిన వాస్తవం. విజయనగరం జిల్లాలో ఒక వామపక్ష విద్యార్థి సంఘం (సి.పి.ఐ. అనుబంధ సంస్థో, సి.పి.ఎం. అనుబంధ సంస్థో గుర్తు లేదు) వాళ్ళు అంటించిన పోస్టర్లలో మండలానికొక కాలేజ్ పెట్టాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెంచాలనీ వ్రాసి ఉంది. ప్రభుత్వం అనేది ఉన్నదే సొంత ఆస్తి వ్యవస్థని పరిరక్షించడానికి. సొంత ఆస్తిని రద్దు చేస్తే ప్రభుత్వం అవసరం ఉండదు. సొంత ఆస్తి రద్దు అవ్వాలని కోరుకునేవాడు ఎవడూ ప్రభుత్వం బలపడాలని కోరుకోడు. నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమలు పెట్టాలి కానీ దానికి ప్రభుత్వ ఉద్యోగాలు (తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు) పెంచడం మార్గం కాదనుకుంటాను. ఈ వామపక్ష విద్యార్థి సంఘంవాళ్ళకి కమ్యూనిజం అంటే ఏమిటో తెలుసా, లేదా అనే సందేహం వస్తుంది.

కమ్యూనిజమ్‌ని మొదట ప్రతిపాదించినది ఫ్రాన్స్‌కి చెందిన విక్తోర్ దీ'హూపే. కమ్యూన్ అంటే ఉమ్మడి, కమ్యూనిజం అంటే ఉమ్మడి ఆస్తివాదం. కమ్యూనిజం సాధించడానికి గతితార్కిక చారిత్రక భౌతికవాదం అవసరం అని ప్రతిపాదించినది మాత్రం మార్క్స్, ఏంగెల్స్‌లు. సొంత ఆస్తి ఉన్నప్పుడే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసులూ, పోలీస్ స్టేషన్‌లూ, కోర్టులూ అవసరం అవుతాయి కానీ ఉమ్మడి ఆస్తిలో వాటి అవసరం ఉండదు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలిసినవాడు (అతను మార్క్సిస్ట్ అయినా, కాకపోయినా) ఎవడూ ఈ వామపక్ష విద్యార్థి సంఘంవాళ్ళని కమ్యూనిస్టులు అనుకోడు.  


Reactions:

Post a Comment

  1. నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పోస్టర్లు చూసాను. ఈ పోస్టర్లు చూసిన తరువాత నేను డైలెమాలో పడిపోయాను. - ప్రవీణ్

    ReplyDelete
  2. concept:నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమలు పెట్టాలి కానీ దానికి ప్రభుత్వ ఉద్యోగాలు (తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు) పెంచడం మార్గం కాదనుకుంటాను.

    question:పరిశ్రమ పెట్టాలంటే పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టాలి.ఎవడన్నా పెట్టుబడితో వస్తే నీలాంటి రాజీ పడని వాడు కమ్యునిష్టు సిద్ధాంతం ప్రకారం అంత స్థాయిలో వాడి దగ్గిర చేరినది దోపిడీ సొమ్ము కాబట్టి వీలు కుదిరితే చంపో లేకుంటే బొక్కలో తోయించో వాడి సొంత ఆస్తిని అర్జెంటుగా అందరికీ పంచెయ్యాలని అంటాడు.పెట్టుబడీ రాదు,పరిశ్రమలూ రావు,ఉద్యోగాలూ రావు,నినాదాలూ కంఠశోషా మిగుల్తాయి.



    స్వంత ఆస్తి అనేది లేకపోతే పెట్టుబడి పెట్టే స్థాయి డబ్బు ఇప్పటికిప్పుడు ఎవడు ఇస్తాడు?పోనీ విప్లవం వచ్చేవరకు స్వంత ఆస్తిని ఒప్పుకుని అప్పుడు రద్దు చెయ్యాలని రాజీ పడితే ఆ విప్లవం ఎప్పటికి వస్తుంది?రాజీ పడకపోతే పరిశ్రమలు రావు - విప్లవమూ రాదు!రాజీ పడినవాళ్ళని అసలు కమ్యునిష్టులే కాదంటావు!కమ్యునిష్టు సిద్ధాంతం అంటే అన్నిటి మీద క్లారిటీ ఇచ్చేది అని గదా చెప్తారు,మరి నీకీ కన్ఫ్యూజన్ యేంటి తమ్ముడూ?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top