ఇది నా విజన్. ఇక మీదట దీనికోసమే ఎక్కువ సమయం కేటాయించి విధిగా పని చేయాల్సి ఉన్నది. ఈ పనిలో అనుభవాలు, కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత విషయాలు, నాకు అవసరమైన, నచ్చిన అంశాలు, నా జ్ఞాపకాలు, అందరికీ పనికి వస్తాయనుకున్న విషయాలు ఈ బ్లాగులో టపాలుగా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ విజన్ ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు, దీనిని ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నది సమయం దొరికినపుడల్లా టపాలుగా వ్రాస్తూ మీతో  పంచుకునే ప్రయత్నం చేస్తాను.

ఇంతక్రితం కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలతో...... ఆర్ధిక ఇబ్బందుల వలన ఆటంకాలతో సాగిన పల్లెప్రపంచం పనులు కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తున్నాను. పల్లెప్రపంచం విజన్ లో కొన్ని మార్పులు చేసుకుని ఇపుడు కొత్త మార్గంలో ప్రయత్నిస్తున్నాను. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఈ సారి లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తాను. ప్రతిరోజూ పని ప్లానింగ్ చేసుకోవడం వారానికోసారి రివ్యూ చేసుకోవడం చేస్తూ ముందడుగు వేయాలన్న సంకల్పంతో ఉన్నాను. వీలున్నపుడల్లా ఈ పనిలో విజయాలను, అనుభవాలను, గుణపాఠాలను మీతో షేర్ చేసుకుంటాను.

గతంలో నేను ఎన్ని బ్లాగులు నడిపినా అవన్నీ మీ అందరి భాగస్వామ్యంతో నేను నేర్చుకోవడానికి ఉపయోగపడినవి మాత్రమే. నాకు ఎన్నో విషయాలలో అవగాహన నేర్పిన, ధైర్యం చెప్పిన మీకు అభివందనం. అవన్నీ కలిపి ఒకే బ్లాగుగా ఉంచాను. ఎప్పటిలాగే మీ అందరి అభిమానం నాపై కొనసాగుతుందని భావిస్తున్నాను. మీ సూచనలు, సలహాలు నాకు తప్పక ఉపయోగపడతాయి. 

Next
Newer Post
Previous
This is the last post.

Post a Comment

 1. Replies
  1. ధన్యవాదములు జై గారు. మీరెపుడూ ముందే ఉంటున్నందుకు సంతోషం.

   Delete
 2. కొండలరావుగారూ,
  మీ లక్ష్యం ఏమిటి ?

  ReplyDelete
  Replies

  1. మీ అందరికీ కామెంటడానికి పనెట్టేసి బొజ్జోడం‌ :)   నారాయణ

   జిలేబి

   Delete
  2. నీహారిక గారూ.. నా లక్ష్యం = పల్లెప్రపంచం విజన్.

   Delete
  3. జిలేబమ్మో.... వచ్చావా, వామ్మో...

   Delete
 3. ఆల్ ది బెస్ట్ కొండలరావు గారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములండీ. చాలా రోజుల తరువాత కనబడుతున్నారు నా బ్లాగులో. బాగున్నారా లక్ష్మీ'స్ మయూఖ గారూ..

   Delete
 4. బాగున్నానండి.పిల్లల చదువు లవన్య హడావిడిలో బ్లాగులకి కొంచెం విరామమొచ్చిందండి.ధన్యవాదములు.

  ReplyDelete

 
Top