బ్లాగు మిత్రులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు నా 49వ  పుట్టిన రోజు. నా పుట్టిన తేదీ తెలిపిన బ్లాగు మిత్రులకు, ముఖ్యంగా నీహారిక గారికి ధన్యవాదములు. ఇప్పటిదాకా నేను పుట్టినరోజు వేడుకలు ఎపుడూ చేసుకోలేదు. ఈ రోజు కూడా చేసుకోవడం లేదు. ఇంకా రెండు సంవత్సరాలు 50 పూర్తవుతాయి. అప్పటిదాకా ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తాను. 51 నుండి ప్రతిరోజూ నా విజన్ కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తాను. ఈ రోజు మా ఊళ్లో మొక్కలు నాటుదామనుకుంటున్నాను.
- పల్లా కొండల రావు, 23-08-2019

Post a Comment

 
Top